ఘాట్లలో క్లోరిన్ శాతం తగ్గకుండా చూడండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశం
విజయవాడ(మొగల్రాజపురం) :
పుష్కరఘాట్ల నీటిలో క్లోరిన్ శాతం తగ్గకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. కృష్ణవేణి ఘాట్‌ను సోమవారం ఆయన పరిశీలించి భక్తులతో మాట్లాడారు. నదిలో నీరు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో నీటిని అదనంగా విడుదల చేశామన్నారు.
కృష్ణవేణి ఘాట్ తనిఖీ
పుష్కరాలు జరిగే సమయంలో శానిటేషన్ పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని నగర మేయర్ కోనేరు శ్రీధర్ హెచ్చరించా. కృష్ణవేణి ఘాట్‌ను శనివారం పరిశీలించారు. ఘాట్‌ల్లో పేరుకున్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కోసూరి శైలజ, సుకాసి సరిత, కె.వెంకటేశ్వరరావు, కొండపల్లి అనసూయ, కొటిబోయిన దుర్గాభవాని, బుగతా ఉమామహేశ్వరి ఉన్నారు.