majority votes
-
గట్టిపోరులో గట్టెక్కారు
ఏకంగా 27 ఏళ్ల తర్వాత రాజధాని ఎన్నికల కొలనులో చీపురును నిండా ముంచేస్తూ కమల వికసించింది. అందుకోసం రెండు పార్టిల మధ్య హోరాహోరీ పోరే సాగినట్టు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఫలితాల సరళిని విశ్లేషిస్తే అర్థమవుతోంది. తక్కువ మెజారిటీ నమోదైన అసెంబ్లీ స్థానాల సంఖ్య 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. ఏకంగా 24 స్థానాల్లో మెజారిటీ 10,000 లోపే నమోదైంది. 2020 ఎన్నికల్లో వీటి సంఖ్య 15 మాత్రమే! సదరు 24 స్థానాల్లో 16 బీజేపీ సొంతం కాగా ఆప్‌కు 8 మాత్రమే దక్కాయి. అంతేకాదు, 2020లో 33 స్థానాల్లో 10 వేలకు మించి మెజారిటీ రాగా ఈసారి అది 29 స్థానాలకు తగ్గింది. 13 చోట్ల 5,000 లోపే ఈసారి 13 అసెంబ్లీ స్థానాల్లో 5,000 ఓట్ల లోపు మెజారిటీ నమోదైంది. అదే సమయంలో మరోవైపు భారీ మెజారిటీతో గెలిచిన స్థానాల సంఖ్య కూడా తగ్గింది. 2020లో 22 చోట్ల 25,000కు పైగా మెజారిటీ నమోదైతే ఈసారి అది 17 స్థానాలకు పరిమితమైంది. అతి తక్కువగా సంగం విహార్ స్థానంలో బీజేపీ నేత చందన్ కుమార్ చౌదరి కేవలం 344 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. త్రిలోక్పురీలో 392, జంగ్‌పురాలో 675 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు సీట్లూ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. మాటియా మహల్లో మొహమ్మద్ ఇక్బాల్ (ఆప్) 42, 724 ఓట్ల మెజారిటీ సాధించారు. వేయిలోపు మెజారిటీలు 2020లో రెండే నమోదు కాగా ఈసారి మూడుకు పెరిగాయి. 5,000 లోపు మెజారిటీలు 20 20లో 7 కాగా 10కి పెరిగాయి. 5,000 నుంచి 10,000 మెజారిటీ విజయాలు 6 నుంచి 11కు పెరిగాయి. మార్జిన్లలో కమలనాథుల హవా అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో బీజేపీ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 10వేలకు మించి మెజారిటీతో ఆప్ ఏకంగా 51 చోట్ల విజయం సాధించగా ఈసారి ఏకంగా 14కు పరిమితమైంది. 2020లో బీజేపీ 10వేల మెజారిటీతో కేవలం 4 స్థానాలను దక్కించుకోగా ఆ సంఖ్య ఈసారి ఏకంగా 32కు పెరిగింది! 2020 ఎన్నికల్లో ఆప్ ఆరు చోట్ల 1,000–5,000 మెజారిటీ సాధిస్తే ఈసారి బీజేపీ ఆ ఫీట్ సాధించింది. ఆప్ మాత్రం 4 స్థానాలకు పరిమితమైంది. ఇక 5,000–10,000 మధ్య మెజారిటీతో ఆప్ కేవలం 4 చోట్ల గెలిస్తే బీజేపీ 7 చోట్ల గెలిచింది. ఆప్ 2020లో ఏకంగా 30 చోట్ల 10,000–25 వేల మధ్య మెజారిటీ సాధించగా ఈసారి కేవలం 3 చోట్ల మాత్రమే ఆ ఘనత సాధించగలిగింది. 2020లో కేవలం 9 చోట్ల 10,000–25 వేల మధ్య మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 20 చోట్ల ఆ ఘనత సాధించింది. ఆప్ 2020లో ఏకంగా 21 స్థానాల్లో పాతిక వేల పైగా మెజారిటీ సాధించిన ఆప్ ఈసారి కేవలం 5 నియోజకవర్గాల్లోనే ఆ ఫీట్ సాధించింది. 2020లో కేవలం 5 చోట్ల పాతిక వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గిన బీజేపీ ఈసారి 12 చోట్ల ఆ ఘనత సాధించింది. అన్ని వర్గాల్లోనూ ఆప్ డీలా... అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆప్‌తో పోలిస్తే బీజేపీకే ఆదరణ కనిపించడం మరో విశేషం. 2020తో పోలిస్తే బీజేపీకి నిరుపేదలు 3.5 శాతం ఎక్కువగా, పేదలు 10.1 శాతం, మధ్య తరగతి 7.3 శాతం, సంపన్నులు 9.3 శాతం ఎక్కువగా బీజేపీకే ఓటేశారు. ఆప్‌కు అన్ని వర్గాల్లోనూ ఓట్లు తగ్గాయి. 2020తో పోలిస్తే నిరుపేదలు 8.2 శాతం తక్కువగా, పేదలు 11.1 శాతం, మధ్య తరగతి 6.6 శాతం, సంపన్నులు ఏకంగా 12 శాతం తక్కువగా ఓటేశారు. ముస్లిముల్లోనూ బీజేపీకే ఆదరణ ఈసారి ముస్లింలు ఆప్ కంటే బీజేపీని ఎక్కువగా ఆదరించడం విశేషం. చూస్తే 25 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32.9 శాతం ఓట్లు పడ్డాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.3 శాతం ఎక్కువ. వారి జనాభా 10 నుంచి 25 % ఉన్నచోట్ల 44.7% ఓట్లు పడటం విశేషం. ఇది 2020 కంటే ఏకంగా 8.1 శాతం ఎక్కువ. ముస్లింలు 10 శాతం లోపున్న నియోజకవర్గాల్లో 49.7 శాతం ఓట్లొచ్చాయి. ఇది గతం కంటే 8.5 శాతం ఎక్కువ. ఆప్‌కు వస్తే ముస్లింలు 25 శాతానికి పైగా ఉన్న స్థానాల్లో 12.3 శాతం తక్కువగా 49.5 శాతం ఓట్లు పడ్డాయి. 10 నుంచి 25% ముస్లిం జనాభా ఉన్న చోట్ల కూడా గతంతో పోలిస్తే 7.5 శాతం తగ్గి 45 శాతం పడ్డాయి. వారు 10 శాతం లోపున్న చోట్ల మాత్రం ఏకంగా 10.3 శాతం తగ్గి 42.4 శాతం పడ్డాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
US Election Results 2024: ట్రంప్‌కు 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్‌లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు. మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్‌లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు. జూలైలో మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి. ఎవరికి ఓటేస్తారు?: బైడెన్ మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్‌ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు జో బైడెన్ 2,099 ఇతరులు 20 జేసన్ పామర్ 3 రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు ట్రంప్ 1,228 నిక్కీ హేలీ 91 రాన్ డీశాంటిస్ 9 వివేక్ రామస్వామి 3 -
USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలిచిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీ, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగుచూసినా.. రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉన్నారని రుజువైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రాలవారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్ బోణీ కొట్టడం రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్‌కు 21.2 శాతం ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, సౌత్ కరోలీనా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు పడ్డాయి. సగానికిపైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థి తానేనని ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. అయోవా రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి. ఓట్ల పరంగా చూస్తే మరో అభ్యర్థి అసా హుచిన్సన్కు కేవలం 191 ఓట్లు, ఇంకో అభ్యర్థి క్రిస్ క్రిస్టీకి 35 ఓట్లు పడ్డాయి. అత్యల్ప ఓట్లు సాధించడంతో తాను ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రకటించారు. ఈసారి మొత్తంగా 1,10,000 మంది ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఇంత తక్కువగా ఓటింగ్ జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక ట్రంప్‌కే నా మద్దతు: వివేక్ రామస్వామి అయోవా ప్రైమరీ ఎన్నికల్లో తక్కువ ఓట్లలో నాలుగో స్థానానికి పరిమితమైన భారతీయవ్యాపారి వివేక్ రామస్వామి ఇక ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ రాష్ట్ర ప్రైమరీలో ఆశ్చర్యకర ఫలితాలను ఆశించి భంగపడ్డా. ఇక ప్రచారానికి స్వస్తి పలుకుతున్నా. అధ్యక్షుడినయ్యే మార్గమే లేదు. ఇక నా మద్దతు ట్రంప్‌కే’’ అని తన మద్దతుదారుల సమక్షంలో వివేక్ మాట్లాడారు. -
మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే
-
మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే
న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి అత్యధిక ఓట్లు వస్తే ఆమె గెలిచినట్టుగా ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అలాంటి సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఈవీఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. గత బుధవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ శోభా నాగిరెడ్డిని తొలుత నంద్యాలలో చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్ తరలించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కాగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థి ఎవరైనా మరణిస్తే అక్కడి ఎన్నికలను వాయిదా వేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ఆళ్లగడ్డ ఎన్నికలను వాయిదా వేయబోమని, శోభానాగిరెడ్డికి ఓట్లు వేసినా ఆ ఓట్లు లెక్కలోకి రావని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఇంతకుముందు ప్రకటించారు. ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓట్లకు విలువ ఉండదని, నోటాగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తరువాత పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే గెలిచినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది. -
బోయలు.. టీడీపీ కరివేపాకులు
వాల్మీకులను మోసగించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లో వీరిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం జరుగుతోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మెజార్టీ ఓట్లు కలిగిన ఈ కులస్తులను పల్లకీలు మోసేందుకే పరిమితం చేస్తోంది. సీటు ఇచ్చినట్లే ఇచ్చి కుర్చీ లాగేసుకోవడంతో బోయలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్టీ అధినేత సమక్షంలోనే బోయ పార్థసారధిపై దాడి జరగడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.