Manipur boxer
-
బాక్సర్ షాహిద్
బాలీవుడ్లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్స్‌కు బాగా గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ రన్నర్ మిల్కాసింగ్, లేడీ బాక్సర్ మేరి కోమ్, క్రికెటర్ ధోనీ, రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, హాకీ ప్లేయర్స్ సందీప్‌సింగ్, బల్బీర్‌సింగ్ బయోపిక్‌లు వెండితెరపైకి వచ్చాయి. క్రికెటర్ కపిల్‌దేవ్, ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్, బ్యాడ్మింట¯Œ ప్లేయర్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్స్ రానున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మణిపూర్ బాక్సర్ డింగ్కో సింగ్ బయోపిక్ చేరనుంది. రాజ కృష్ణమీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ‘‘1998 బ్యాంకాక్ ఆసియన్ గేమ్స్‌లో బాటమ్ వెయిట్ కేటగిరీలో డింగ్కో గోల్డ్ మెడల్ సాధించారు. పద్మశ్రీ అవార్డు కూడా సాధించారు. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. ఇలా ఆయన జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల చరిత్ర అందరికీ తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈ పతకం నాకొద్దు
కాంస్యాన్ని నిరాకరించిన భారత బాక్సర్ సరితా దేవి ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ఓడిపోయింది. అయితే ఈ బౌట్లో తాను పూర్తి ఆధిపత్యం కనబరిచినా బౌట్ నిర్ణేతలు పక్షపాతంగా వ్యవహరించి కొరియా బాక్సర్‌కు అనుకూల నిర్ణయం ఇచ్చారని సరితా దేవి ఆరోపించింది. బుధవారం 60 కేజీల విభాగం పతకాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సరితా దేవి ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. కాంస్య పతకాన్ని తన మెడలో వేసేందుకు వచ్చిన అతిథి నుంచి ఆమె పతకం స్వీకరించేందుకు నిరాకరించింది. చేతిలో ఆ పతకాన్ని తీసుకొని ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న కొరియా బాక్సర్ పార్క్ జీనా వద్దకు వెళ్లి ఆమె మెడలో తన కాంస్య పతకాన్ని వేసింది. కాసేపటి తర్వాత పార్క్ తన మెడలో వేసిన కాంస్య పతకాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా సరిత తీసుకోకుండా పోడియం దగ్గర్నించి వెళ్లిపోయింది. దీంతో ఆ కాంస్య పతకాన్ని నిర్వాహకులు తమ వద్దే ఉంచుకున్నారు. ‘ఐబా’ విచారణ: సరితా దేవి సంఘటనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) విచారణ చేపట్టింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని ‘ఐబా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడలు ముగిశాక సరితా దేవిపై నిర్ణయం తీసుకుంటామని ‘ఐబా’ వివరించింది.