మర్రి చెన్నారెడ్డికి పలువురు నేతల నివాళి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో శుక్రవారం ఆయన సమాధిని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిలు మాజీ సీఎం చెన్నారెడ్డికి నివాళులర్పించి ఆయన సేవల్ని కొనియాడారు.