టాటా మోటార్స్‌కు రూ.375 కోట్ల ఆర్డర్ !
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డర్‌ను సాధించింది. ఈ ఆర్డర్లో భాగంగా భారత పదాతి, నావికా దళాలకు ప్రత్యేకంగా తయారు చేసిన 3,192 టాటా సఫారీ స్టార్మ్‌లను సరఫరా చేయనున్నామని టాటా మోటార్స్ తెలిపింది. మారుతీ జిప్సీల స్థానంలో ఈ సఫారీ వాహనాలను భారత సైన్యం వినియోగించనున్నదని వివరించింది. ఈ ఆర్డర్ విలువను కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ విలువ రూ.375 కోట్లుగా ఉంటుందని అంచనా. రక్షణ దళాలకు వాహన సంబంధిత సరఫరాలు సంబంధించి అతి పెద్ద కంపెనీగా ఈ ఆర్డర్... టాటా మోటార్స్ స్థానాన్ని మరింత పదిలం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.