గణితంలో ఘనాపాటి తోటకూర
150 గణితావధానాలు సంపూర్ణం
భానుగుడి (కాకినాడ):
లెక్కల్లో లెక్కలేనన్ని చిక్కుప్రశ్నలు.. చదువులోనే కాదు.. నిజజీవితంలోనూ గణితానికి పెద్ద పాత్రే. అలాంటి గణితాన్ని సులభంగా నేర్చుకోవడం కోసం పదుల పుస్తకాలను రాసి సమాజానికి అందించిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ గణితావధానిగా విఖ్యాతులు. సామర్లకోట బచ్చుఫౌండేష¯ŒS ఉన్నతపాఠశాలలో ప్ర«ధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన 2010 నుంచి ఇంతవరకూ రాష్ట్ర వ్యాప్తంగా 150 గణితావధానాలను చేశారు. ఆయన శనివారం ఉదయం కాజులూరు మండలం మంజేరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు గణితంలో మెళకువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మండలంలో గణితంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులతో అవధాన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆయన 150వ అవధాన కార్యక్రమం. తొలుత అవగాహన సదస్సులో ఇప్పటినుంచే పదిలో పదిలంగా మార్కులు సాధించేందుకు చేయవలసిన కృషిని వివరించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గణితంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గణిత మేధావులను తయారుచేయాలని నిర్ణయించుకున్నట్లు శనివారం కాకినాడలో విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం గణితంలో పది సూత్రాల ప్రణాళికను తయారుచేసినట్టు సాయిరామకృష్ణ తెలిపారు.