అమరజీవి ఆశయాలను కొనసాగిద్దాం
అధ్యక్షుడు ద్వారకానాథ్
నెల్లూరు (సెంట్రల్) : రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దామని అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. పొట్టి శ్రీరాములు 115వ జయంతిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ఆత్మకూ రు బస్టాండు సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ తెలుగుప్రజలందరూ ఒకే దగ్గర ఉండాలనే ఆకాంక్షతో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించారన్నారు. అమరజీవి జయంతిని అధికారులు పట్టించుకోకపోవడంతో సొంత ఖర్చు తో పూల అలంకరణ చేయించానన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాసులు, సుబ్రమణ్యం, సురేష్, ప్రసాద్, భాస్కర్, కామేశ్వరరావు, డి.సురేష్, భాస్కర్, కామేశ్వరరావు, సురేష్, ప్రకాశ్‌రావు, కేవీ చలమయ్య, గోపాల్, చరణ్, మురళి, బాలాజీ, రవి పాల్గొన్నారు.
అమరిజీవి బాటలో పయనిద్దాం
తెలుగు ప్రజల కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ అన్నారు. పొట్టిశ్రీరాములు ఆశయాలను గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ పాల్గొన్నారు.
జేసీఐ ఆధ్వర్యంలో
జేసీఐ, ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న పొట్టి శ్రీ రాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శరణ్‌కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్‌లో
నెల్లూరు(రెవెన్యూ): అమరజీవి జయంతి వేడుకలను సోమవారం జిల్లా పరిషత్ నూతన భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర పొట్టిశ్రీరాములు చిత్ర పటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి తెలుగుజాతికి గౌరవాన్ని తీసుకువచ్చారన్నారు.
కలెక్టరేట్లో..
కలెక్టరేట్లో డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి అమరజీవి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.