హోమీ బాబా ‘మెహ్రాన్‌గిర్’ వేలం
రూ. 372 కోట్లు పలికిన భవనం
సాక్షి, ముంబై: భారత అణు ఇంధన కార్యక్రమ పితామహుడు హోమీ జే బాబాకు చెందిన మూడంతస్తుల భవనం ‘మెహ్రాన్‌గిర్’ను బుధవారం నాడిక్కడ వేలం వేశారు. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన మల్బార్ హిల్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా విశాలమైన స్థలంలో ఉన్న ఈ బంగళా రూ.372 కోట్లకు అమ్ముడుపోరుుంది. అరుుతే ఎవరు కొన్నారనే విషయూన్ని కొనుగోలుదారుడి విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచారు. ఈ స్థల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగులు కాగా.. 17,550 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మితమైంది.
దీనికి ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న ఎన్సీపీఏ (నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్) ఈ వేలాన్ని నిర్వహించింది. ‘మెహ్రాన్‌గిర్’ను మ్యూజియంగా తీర్చిదిద్దాలని సీఎన్ఆర్ రావు వంటి శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్)కు చెందిన కొందరు ఉద్యోగులు ఇదే డిమాండ్‌తో బోంబే హైకోర్టును ఆశ్రరుుంచారు. వేలంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వారుుదా వేసింది. అవసరమైతే అప్పుడు వేలాన్ని రద్దు చేస్తామని తెలిపింది.
1966లో బాబా విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత సాంస్కృతిక, కళా రంగ ప్రముఖుడైన ఆయన సోదరుడు జంషెడ్ బాబా ‘మెహ్రాన్‌గిర్’కు కస్టోడియన్ అయ్యూరు. 2007లో జంషెడ్ మరణానంతరం ఈ ఆస్తిని ఎన్సీపీఏకి బదలారుుంచారు. ఆయన విల్లు ప్రకారమే భవనాన్ని విక్రరుుంచినట్టు ఎన్సీపీఏ చైర్మన్ ఖుస్రూ సంటూక్ తెలిపారు. ఇలావుండగా ‘మెహ్రాన్‌గిర్’ను కేంద్రం స్వాధీనం చేసుకుని జాతీయ కట్టడంగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి బుధవారం లేఖ రాశారు.