Mindset
-
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
ఓవర్ థింకింగ్ నుంచి తప్పించే ఏడు జపనీస్ టెక్నిక్స్...
మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు. 2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. 3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. 4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి. 6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. 7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ఎంత పని చేశావు తల్లీ..!
సాక్షి, రాయచోటి: కడుపులో పెరుగుతున్నప్పటి నుంచే తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. భూమి పైకి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుంది. కట్టుకున్న భర్త పట్టించుకోకపోయినా.. నా అన్న వారు పలకరించకపోయినా.. చివరికి తాను ఏకాకైనా సరే సర్వం ధారపోసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతోనే కర్కోటకంగా గొంతు నులిమి చంపిన సంఘటన రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె గ్రామం పొలాల వద్ద ఉన్న నక్కలగుట్టలో జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనవసర భయంతో ఆమె ఈ దుర్ఘటనకు పాల్పడింది. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరులోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా సంబేపల్లె మండలం చౌటపల్లె గ్రామం షేక్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా (10 నెలల) కుమార్తె ఉంది. ఫాతిమా మానసిక స్థితి సరిగా లేదు. ఆమె భర్త ఇంటి నుంచి అప్పుడప్పుడూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేది. తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరగా చనిపోతానని భావించింది. తాను చనిపోతే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు అనే అనుమాన పడింది. ఎవరూ చూసుకోరనే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లేందుకు మనసు నచ్చక రాయచోటిలోనే ఆగిపోయింది. రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె సమీపాన ముళ్ల పొదల వద్ద ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కుమార్తె గొంతు నులిమి చంపేసింది. కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చి, అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో పీలేరు నుంచి భర్త బంధువులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. బంధువులు పాప శవాన్ని తీసుకొని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి ఉత్తరాఖండ్(హరిద్వార్): హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఇక లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు. ‘దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసింది. దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసింది. ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసింది. దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోంది’ అని అన్నారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలన్నారు. మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. (చదవండి: అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!) -
కోవిడ్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బీమాపై ప్రజల మైండ్‌సెట్ నెమ్మదిగా మారుతోందని, ఇన్సూరెన్స్ అవసరం గురించి అవగాహన పెరుగుతోందని వెల్లడించారు ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఏజియాస్ ఫెడరల్ ఎండీ, సీఈవో విఘ్నేష్ షహాణే. టర్మ్, హెల్త్ పాలసీలకు డిమాండ్ కనిపిస్తోందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్ పరిణామాల కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరగడంతో.. టర్మ్ ప్లాన్ ప్రీమియంలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు.. కోవిడ్ నేపథ్యంలో బీమాపై ప్రజల ధోరణి ఎలా ఉంటోంది? సాధారణంగా భారతీయుల మైండ్ సెట్ బట్టి చూస్తే.. జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేసిన దానిలో ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశిస్తారు. దీంతో టర్మ్ ప్లాన్లు తక్కువ ప్రీమియంకే అధిక కవరేజీ ఇచ్చేవి అయినప్పటికీ.. క్లెయిమ్ ఉంటే తప్ప ఆర్థిక ప్రయోజనం అందించవు కాబట్టి వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే, అనిశ్చితిలో ఆర్థికంగా రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లు, హెల్త్ ప్లాన్లపై అవగాహన పెరుగుతోంది. పొదుపు పథకాలు, రిటైర్మెంట్, యాన్యుటీ ప్లాన్లపైనా ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మంచి ఏదైనా జరిగిందంటే అది ఇదే. ఈ విషయంలో మైండ్‌సెట్ మెరుగుపడటం నెమ్మదిగా మొదలైంది. ఇది గణనీయంగా మారడానికి ఇంకాస్త సమయం పడుతుంది. పొదుపు సాధనంగా కూడా బీమా పథకాలకు ఆదరణ ఎలా ఉంది? మహమ్మారి సమయంలో ఉద్యోగాలు పోయి, జీతాల్లో కోత పడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో కష్టకాలంలో ఆదుకోవడానికి పొదుపు అవసరం కూడా పెరుగుతోంది. ఇటు పొదుపు అటు ఆర్థిక భరోసా పొందడానికి జీవిత బీమా మెరుగైన సాధనంగా ఉపయోగపడగలదు. పదేళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల ఆర్థిక సన్నద్ధత, పెట్టుబడుల నిర్ణయాలను అంచనా వేసేందుకు మేను ఇటీవల యూగవ్ ఇండియా సంస్థతో కలిసి ఫ్యూచర్ఫియర్లెస్ సర్వే నిర్వహించాము. ఇతరత్రా పిల్లల పెళ్లి, వ్యాపారాల కోసం పొదుపు చేయడం వంటి జీవిత లక్ష్యాలకన్నా తమ పిల్లల విద్య అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇందులో పేరెంట్స్ తెలిపారు. ఇందుకోసం యూలిప్‌లు, మనీబ్యాక్, ఎండోమెంట్ ప్లాన్స్ వంటి జీవిత బీమా సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని మూడింట రెండొంతుల మంది చెప్పడం గమనార్హం. భవిష్యత్‌లో అనిశ్చితి నుంచి కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు తక్కువ రిస్కుతో దీర్ఘకాలానికి సురక్షిత పెట్టుబడి సాధనంగా జీవిత బీమాను ఎంచుకుంటున్నారు. జీవిత బీమా పాలసీలను కొనసాగించేందుకు, రెన్యూ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండటంతో బీమా ప్రీమియం వసూళ్లు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరగడానికి ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు బా గా రాణిస్తుండటం కూడా కొంత దోహదపడింది. కోవిడ్ క్లెయిముల పరిస్థితి ఎలా ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 116 కోట్ల క్లెయిములు వచ్చాయి. ఈసారి స్థూలంగా 2–2.5 రెట్లు పెరగవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం మొత్తం క్లెయిముల్లో.. కోవిడ్ క్లెయిములు 25 శాతం ఉన్నాయి. ఈసారి తొలి త్రైమాసికంలో మొత్తం క్లెయిముల్లో వీటి వాటా 75 శాతంగా ఉన్నప్పటికీ, తర్వాత త్రైమాసికాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో తగ్గాయి. అయితే, ఇవి తగ్గినప్పటికీ కోవిడ్ వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తి కోవిడ్–యేతర కారణాలతో మరణించే వారి సంఖ్య గతంలో కన్నా పెరిగింది. జీవిత బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అవును. కోవిడ్ క్లెయిములు.. ముఖ్యంగా రెండో వేవ్‌లో.. గణనీయంగా ఎగియడం వల్ల రీఇన్సూరెన్స్ సంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అవి టర్మ్ ప్లాన్ రేట్లను పెంచే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 20–40 శాతం మేర రేట్లు పెరగవచ్చని అంచనా. అయితే, రీఇన్సూరెన్స్ సంస్థ .. జీవిత బీమా సంస్థను బట్టి, అలాగే ఆయా రీఇన్సూరెన్స్ సంస్థలతో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న వ్యాపార పరిమాణం బట్టి పెంపు ఆధారపడి ఉంటుంది. దక్షిణాదిలో మీ వ్యాపార ప్రణాళికలు ఏమిటి? ఫెడరల్ బ్యాంకుకు విస్తృతమైన నెట్వర్క్ ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై మేము ముందు నుంచీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో దక్షిణాదిలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయిదు ఏజెన్సీ శాఖలు, 1,000 పైచిలుకు అడ్వైజర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ, డిజిటల్, డైరెక్ట్ సేల్స్ మొదలైన మాధ్యమాల ద్వారా పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోబోతున్నాం. వ్యాపార వృద్ధి అంచనాలేమిటి? గత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ అనిశ్చితి కారణంగా తొలి మూడు నెలలు లాక్‌డౌన్‌లోనే గడిచిపోయినప్పటికీ మేము ఊహించిన దానికన్నా మెరుగ్గానే రాణించాం. మొత్తం ప్రీమియం వసూళ్లు 6 శాతం పెరిగాయి. వరుసగా తొమ్మిదో ఏడాది లాభాలు ప్రకటించగలిగాం, వరుసగా మూడో ఏడాది 13 శాతం మేర డివిడెండ్ ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెకండ్ వేవ్, లాక్డౌన్ లాంటి వాటితో అనిశ్చితిలోనే మొదలైనప్పటికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రీమియం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30–35 శాతం వృద్ధి సాధించగలమని ఆశిస్తున్నాం. -
క్రేజీ కేజ్రీవాల్
లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఖరి ఆయన చెప్పే మాటలకు అనుగుణంగా లేదు. బీజేపీని ఓడించడమే నిజంగా ఆయన లక్ష్యమైతే కాంగ్రెస్‌తో ఏదో ఒక రకంగా సీట్ల సర్దుబాటుకు ఆప్ అంగీకరించాలి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు హరియాణా, చండీగఢ్‌లో సీట్ల సర్దుబాటుకు ఆయన ముడి పెడతున్నారు. ఈ రెండుచోట్లా తమకు కాంగ్రెస్ సీట్లు వదలకపోతే ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముందే కేజ్రీవాల్ చెప్పేశారు. పొత్తులు పలు విధాలు.. పార్టీల మధ్య పొత్తులు రాష్ట్రాల వారీగా ఉంటాయనేది ఇప్పటికీ వర్తించే సూత్రం. ఈ లెక్కన బీజేపీని బలహీనం చేయాలన్న తన వైఖరికి అనుగుణంగా ఆయన వ్యవహరించడం లేదని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. హరియాణాలో కాంగ్రెస్, జన నాయక్ జనతా పార్టీ (జేపీపీ), ఆప్ చేతులు కలిపి పోటీ చేస్తే బీజేపీని సునాయాసంగా ఓడించవచ్చన్న కేజ్రీవాల్ మాట నిజమే. అయితే, ఎన్నికల్లో పొత్తులు గరిష్ట స్థాయిలో కుదరవు. పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటు జరగలేదు. బీజేపీ ఉమ్మడి శత్రువు అయినా కేరళలో అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇంత జరిగినా ఈ పార్టీలు తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని కూటమిలో చక్కగా భాగస్వాములయ్యాయి. బిహార్, ఝార్ఖండ్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరింది. కాని, ఝార్ఖండ్‌లోని ఒక్క చాత్రా సీటు విషయంలో పేచీ వచ్చి రెండు పార్టీలూ అభ్యర్థులను నిలిపాయి. యూపీలో మహాగఠ్ బంధన్‌తో కాంగ్రెస్ ‘అవగాహన’ ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ తమ మహాగఠ్ బంధన్‌లో కాంగ్రెస్‌కు స్థానం కల్పించలేదు. అయితే, కాంగ్రెస్‌పై ఈ కూటమి రెండు సీట్లలో పోటీ పెట్టలేదు. కూటమికి చెందిన బడా నేతలు పోటీ చేస్తున్న ఏడు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. ఈ రకంగా కాంగ్రెస్‌తో మహాగఠ్ బంధన్‌కు అవగాహన కుదిరింది. అంటే వివిధ రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఎప్పుడు, ఎక్కడ కుదురుతాయన్న విషయం ఆ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకచోట కుదిరిన సీట్ల సర్దుబాటు మరోచోట సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు అవసరంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నచ్చచెప్పగలిగారు. కాని, హరియాణాలో ఆప్ మిత్రపక్షమైన చౌటాలాల పార్టీ జేపీపీకి మూడు సీట్లు ఇప్పించడం ఆయనకు అంత తేలిక కాదు. కాంగ్రెస్‌తో పొత్తు కోరుకుంటున్నామంటూనే ఆప్ ఎందుకు రోజుకో రకంగా షరతులు పెడుతోంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ కేజ్రీవాల్ కోరినట్టే సీట్లు ఇవ్వాలని ఎందుకు అనుకుంటుంది? వాస్తవానికి ఈ ఏడాది ఆఖరులో లేదా 2020 జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల్లో మరోసారి విజయం సాధించడానికి ఏం చేయాలో ఆప్ అదే చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్ల కన్నా మళ్లీ రాజధాని ప్రాంతంలో గద్దెనెక్కడానికే ఆప్ ప్రా«ధాన్యం ఇస్తోంది. ఢిల్లీలో తమ మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడానికి కాంగ్రెసే కారణం కానీ, తాను కాదని ఇతరులను నమ్మించడానికి ఆప్ గట్టి కృషే చేస్తోంది. దేశ రాజధానిలోని ఏడు సీట్లనూ వీలైతే గెలుచుకోవడం ద్వారా బీజేపీని కొంత వరకైనా నిలువరించడమే కాంగ్రెస్ ఉద్దేశం. అందుకే చివరి క్షణం వరకూ ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. -
‘చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలి’
రాజంపేట : పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని చెబుతున్న ముఖ్యమంత్రి.. అవి ఏర్పాటయ్యే వాతావరణం కల్పించలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం లేదని, 2002లో సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను ప్రజలకు చెప్పని చంద్రబాబు తొలుత మైండ్‌సెట్ మార్చుకోవాలని హితవుపలికారు. 'ప్రోత్సాహకాలు లేకుంటే పరిశ్రమలు రావు. అలాంటివేవీ ప్రకటించకుండా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు వెర్రోళ్లలా కనిపిస్తున్నారా? ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజ్యంగా భావించి.. తమ అనుమతి లేకుండా ఏవీ రాకుడదని, తాము చెప్పిందే జరిగాలనే నియంతత్వపోకడలకు పోతుంటే పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరు ముందుకు వస్తారు?' అని సోమవారం వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం తొగురుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య అన్నారు. కృష్ణా జిల్లా నూజీవీడు వద్ద డీనోటిఫికేషన్ అంశంలో ఫారెస్టు నుంచి రెవిన్యూకు మార్చేందుకు వైఎస్ఆర్ జిల్లాలో ప్రత్యామ్నాయంగా 25 వేల హెక్టార్ల భూమలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, అలా చేస్తే వైఎస్ఆర్ జిల్లా వాసులు చూస్తూ ఊరుకోరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సొంతప్రాంతమైన రాయలసీమను విస్మరించి అత్తింటి ప్రాంత అభివద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ఎద్దేవాచేశారు. రాజధాని నిర్మాణం కోసం అంటూ చివరకు విద్యార్థులనూ వదలకుండా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బహిరంగంగా తిరుగుతున్నా అరెస్టు చేయలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. -
మా దుస్తుల సంగతి మీకెందుకు?
న్యూఢిల్లీ: కురచ దుస్తులు, జీన్స్, టీ షర్ట్స్ ధరించడం వల్ల, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా రోడ్లపై తిరగడం వల్ల, క్లబ్బులు, పబ్బుల పట్ల మోజు చూపించడం వల్ల, స్మార్ట్ ఫోన్లలో ఛాటింగ్ వల్ల ఆడవాళ్లపై రేప్‌లు పెరుగుతున్నాయని కొంత మంది పురుష పుంగవులు రకరకాలుగా తీర్మానించేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ మరో అడుగు ముందుకేసి ఓ అమ్మాయిని నలుగురు ఎలా రేప్ చేయగలరని ప్రశ్నించారు. ఇలాంటి ధోరణికి తెరపడాలంటూ ‘నోకంట్రీ ఫర్ విమెన్’ అనే సంస్థ మగవారి మైండ్‌సెట్‌ను మార్చేందుకు సామాజిక వెబ్సైట్లో ఫేస్బుక్లో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘నా దుస్తుల వైపు ఎందుకు చూస్తావ్. నీ ఆలోచనలేమిటో ముందు గమనించు’ అనే నినాదంగల పోస్టర్ పట్టుకున్న ఓ అమ్మాయి ఫొటోతో పాటు మగవాళ్లపై పలు సెటైర్లు వేస్తూ ప్రచారానికి రక్తికట్టిస్తోంది. ‘భార్య, బామ్మ, తల్లి, చెల్లి, కూతురు ఇలా ఎవరో ఒకరు తోడు లేకుండా ఎందుకు వీధిలోకి వస్తున్నావు?...ఆ సమయంలో మగవాడు అక్కడేం చేస్తున్నాడు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లగలననుకుంటున్నాడా, ఏంది?...అందుకనే మేము మగవాళ్లు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నాం. అదీ వారి రక్షణ కోసమే....మగవాళ్లు ఇంటి నుంచి బయల్దేరే ముందు ఎందుకు అగ్నిమాపక పరికరాన్ని వెంట తీసుకెళ్లడం లేదు. ఈ రోజుల్లో బయటకొచ్చే ఏ మగాడికి భద్రతా లేదనే విషయం తెలియదా?....మగాడు ఎందుకు బస్సులో పక్కావిడ భుజంపై తలాన్చి నిద్రపోతున్నాడు, జరగబోయే పరిణామం గురించి తెలియదా?....ఎన్నో వీధి కుక్కలు మహిళలను గౌరవిస్తాయి. అన్ని కాదు సుమా!....బస్సుల్లో, రైళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, మరి వీధి కుక్కలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు? అనే సెటైర్లు ఆ ప్రచారంలో హల్చల్ చేస్తున్నాయి. మగవాళ్ల మనస్థత్వంలో, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నదే తమ ప్రచార ఉద్దేశమని ‘నో కంట్రీ ఫర్ విమెన్’ సంస్థ ప్రకటించింది. -
హిందూ, ముస్లింల మైండ్‌సెట్ మారాలి: కట్జూ
న్యూఢిల్లీ: హిందువులు, ముస్లింలు నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే ముందువారి మైండ్‌సెట్ మారాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆదివారం వ్యాఖ్యానించారు. ఎస్సీలను చిన్నచూపు చూడటం మానేసినప్పుడే హిందువులు నిజమైన భారతీయులు అనిపించుకుంటారని, ఎస్సీలు, ఎస్సీయేతరుల మధ్య పెద్ద సంఖ్యలో వివాహాలు జరగాలని చెప్పారు. ముస్లింలలోనూ అగ్రకులాలు-తక్కువ కులాలు అనే తారతమ్యం పోవాలని ఆకాంక్షించారు. మహిళలను తక్కువగా చూసే ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలని ముస్లింలంతా డిమాండ్ చేయాలని కట్జూ తన బ్లాగ్‌లో సూచించారు.