Minister Eknath khadse
-
మీ చరిత్ర అందరికీ తెలుసు
♦ రాజ్‌ఠాక్రేపై మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ఫైర్ ♦ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేస్తారో ప్రజలకు ♦ తెలుసని ఎద్దేవా ‘అవినీతి’ పై ఆధారాలుంటే ♦ విచారణకు సిద్ధమని వ్యాఖ్య ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై విమర్శలు చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే చరిత్ర ఎవరికుందో రాష్ట్ర ప్రజలకందిరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ‘వివాదాలు ృసష్టించే చరిత్ర ఎవరికుందో రాష్ట్ర ప్రజలకందిరికీ తెలుసు. బీజేపీ ఎన్నడూ ఇలాంటి వాటికి మద్దతునివ్వలేదు. ఎందుకంటే మా పార్టీ శాంతిని కోరుకుంటుంది కాబట్టి’ అని ఖడ్సే అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకపోవడం, అలా చేసే వారిని ప్రోత్సహించకపోవడమే బీజేపీ వైఖరికి నిదర్శనం అని అన్నారు. కొద్ది రోజుల కిందట థానేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ, ‘కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వం.. యాకూబ్ మెమన్ ఉరితీతను డ్రామా చేసింది. మలుపులు తిప్పుతూ చివరికి ఉరితీశారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ దేశంలో అలర్లు జరగాలని కోరుకుంటుందేమో’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అవినీతిలో కూరుకుపోయిందని, గత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఖడ్సే, ‘ఎమ్మెన్నెస్‌ను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే అవినీతి జరిగిందని ఆధారాలు చూపించండి. అంతేగాని చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోం. ఒక బాధ్యత గల పౌరుడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తుల పేర్లను ఆధారాలతో సహా రాజ్ ఠాక్రే వెల్లడించాలి. మేం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఘాటుగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు ఆయన ఇలా చౌకబారు ఆరోపణలు చేస్నే తామేం చేయలేమని ఏక్నాథ్ ఖడ్సే ఎద్దేవా చేశారు. -
రూ.12,000 కోట్లు ఇవ్వండి
♦ మరాఠ్వాడాకు నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ♦ సమర్థించిన మిత్రపక్షం శివసేన ♦ అధికారంలో ఉన్నప్పుడు మరాఠ్వాడాకు ఏం చేశారు? ♦ కాంగ్రెస్-ఎన్సీపీని ప్రశ్నించిన మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ♦ చేయాల్సిందల్లా చేశాం: ఎన్సీపీ నేత అజిత్ పవార్ సాక్షి, ముంబై : కరవుతో అల్లాడుతున్న మరాఠ్వాడాలో రైతులను ఆదుకోడానికి రూ. 12,000 కోట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్, ఎన్సీపీ డిమాండ్‌కు బీజేపీ మిత్రపక్షం శివసేన మద్దతు తెలిపింది. మరాఠ్వాడాను ఆదుకోడానికి ప్రభుత్వం ఏవిధమైన సాయం ప్రకటించలేదని జల్నా నియోజకవర్గం శివసేన నేత అర్జున్ ఖోట్కర్ మండిపడ్డారు. పుండుపై కారం చల్లినట్లు ప్రభుత్వం రూ. 900 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుందని ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ నిప్పులు చెరిగారు. కరవు పరిస్థితులను తట్టుకోడానికి రూ. 12,000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరవు సమస్యపై అసెంబ్లీలో మంత్రి మహాజన్ సమాధానమిస్తూ.. ఔరంగాబాద్‌కు చెందిన శాసనసభ్యులతో వచ్చే వారంలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. 70-75 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మరాఠ్వాడా అభివృద్ధికి ఏమీ చేయలేదన్న మంత్రి ఆరోపణపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేయాల్సిందల్లా చేసిందన్నారు. కొన్ని తప్పిదాలు జరిగాయని అందుకే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారన్నారు. జల్నాలో మానసిక ఆరోగ్య ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ పేర్కొన్నారు. నగరాల వివరాలు పంపాం ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు వివరాలు కేంద్రానికి పంపినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ముంబై, ఠాణే, పుణే, నవీముంబై, కళ్యాణ్, అమరావతి, షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, పింప్రి చించ్వడ్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరాల ఎంపికకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటి రూపొందించిన ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్)ను కేంద్రానికి పంపించినట్టు ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న 100 నగరాలను స్మార్ట్ సిటీ తీర్చి దిద్దనున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మిగిలిన నగరాలను అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పథకంలో భాగంగా కేంద్రం అభివృద్ధి చేయనుంది. స్మార్ట్‌సిటీలకు రూ. 48,000 కోట్లు, ‘అమృత్’ కోసం రూ. 50,000 కోట్లు కలిపి మొత్తం ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. గడువు పెంపునకు కంపెనీలు ససేమీరా పంటల బీమాపై ప్రీమియం గడువును పెంచాలన్న విజ్ఞప్తిని బీమా కంపెనీలు ఒప్పుకోలేదని ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలో ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే లేవనెత్తిన ప్రశ్నకు వ్యవసాయ మంత్రి ఖడ్సే సమాధానమిస్తూ.. రాత్రి వరకు బీమా కంపెనీలతో చర్చించినా ఫలితం లేద న్నారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి, సెక్రెటరీకి తెలిపామన్నారు. ‘జల్నా’ బాధ్యులను వదలం: సీఎం జాల్నా రేప్ ఘటనపై విచారణకు అడిషనల్ డెరైక్టర్ జనరల్ ర్యాంకు అధికారిని నియమిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఘటనపై శుక్రవారం అసెంబ్లీలో సీఎం సమాధానమిస్తూ.. బాధితురాలికి పునరావాసం కల్పిస్తామన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. జల్నాకు చెందిన 17 ఏళ్ల యువతిని జూలై 6 న ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి సెల్‌ఫోన్‌తో అత్యాచార ఘటనను చిత్రీకరించారు. సెల్‌ఫోన్ తిరిగివ్వడానికి రూ. 2,000 డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు బాధితురాలి సాయం తీసుకున్నారు. అయితే నిందితులను పట్టుకునే సమయంలో జూలై 9న బాధితురాలు మరోసారి అత్యాచారానికి గురైంది. అయితే బాధ్యులను పట్టుకునేందుకే బాధితురాలి సాయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ముంబై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్పందిస్తూ.. నగరంలో 40 లోతట్టు ప్రాంతాలను గుర్తించి పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రైనేజీ శుభ్రపరిచేందుకు విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టడంపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 7 నుంచి శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఏడు నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. శీతాకాల సమావేశాలు నాగ్‌పూర్ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విధానసభ, మండలిలో ప్రిసీడింగ్ అధికారులు వెల్లడించారు. జూలై 13న మొదలైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. -
‘విత్తన’ ప్రతిపాదన పంపించాం
- విత్తన చట్ట సవరణపై వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే - ప్రస్తుత చట్టంతో బోగస్ కంపెనీలపై చర్యలు తీసుకోలేమని వివరణ - ఈ సమావేశాల్లోనే బిల్లుపై లోక్‌సభలో చర్చ ఉంటుందని వెల్లడి ముంబై: బోగస్ విత్తన కంపెనీలను నిరోధించేందుకు విత్తన చట్టాన్ని మరింత సమర్థంగా చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపామని రాష్ట్రప్రభుత్వం విధానమండలిలో తెలిపింది. ‘సోయాబీన్ విత్తన శాంపుల్స్‌ను పరిశోధన శాల పంపి పరీక్షలు జరపగా, వాటికి మొలకెత్తే సామర్థ్యం 50 శాతం కన్నా తక్కువగా ఉందని వెల్లడైనట్లు నివేదిక వచ్చింది. ఒక వేళ ఆ నివేదిక నిజమే అయితే బోగస్ విత్తన కంపెనీలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది. చర్యలేవీ తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు ’ అని ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేంద్ర ములాక్ ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, ‘విత్తన చట్టం-1966 ను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కంపెనీలు నేరం చేసినట్లు మొదటి సారి రుజువైతే రూ. 500 జరిమానా, రెండో సారి అదే నేరాన్ని పునరావృతం చేస్తే 6 నెలలు జైలు శిక్ష. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సమర్థంగా తీర్చిదిద్దాలని కోరుతూ కేంద్రానికి గత ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లుపై చర్చించనున్నట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది’ అని తెలిపారు. ఒకే ఒక్కటి.. ‘విత్తన నాణ్యత తెలుసుకునేందుకు ప్రస్తుతం వారణాసిలో ఒకే ఒక్క పరిశోధన శాల ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షలకు విత్తన శాంపుల్స్ అక్కడికే వెళ్తాయి. కేంద్ర నిబంధనల ప్రకారం ఒక నెలలోపు పరీక్షల ఫలితాలను సిద్ధం చేయాలి. కాని 6 నుంచి 8 నెలల సమయం పడుతోంది’ అని ఖడ్సే వివరించారు. ‘బిల్లును సవరించే వరకు బోగస్ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉండవు. బోగస్ విత్తనాల బాధితులు వినియోగదారుని కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చు’ అని అన్నారు. -
ఆయన కూడా అన్నారు
- రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారం కారణమన్న శరద్ పవార్ మాటలను ఉటంకించిన ఖడ్సే - 2013లో పార్లమెంటులో మూడు సార్లు చెప్పారని వెల్లడి - ఖడ్సే వ్యాఖ్యలపై సభలో గందరగోళం సృష్టించిన ఎన్సీపీ - రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్.. సభ 20 నిమిషాలు వాయిదా ముంబై: అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడివేడిగా సాగాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమని 2013లోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారని బీజేపీ నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. లోక్ సభలో ఫిబ్రవరి 26, ఆగస్టు 6న, రాజ్యసభలో ఆగస్టు 16న పవార్ మూడు సార్లు ఈ వ్యాఖ్యలు చేశారని ఖడ్సే అసెంబ్లీలో చెప్పారు. దీంతో సభలో గందరగోళం ఎన్సీపీ సృష్టించింది. ఖడ్సే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఎన్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ హరిభావ్ బాడ్గే సభను ఇరవై నిమిషాలు వాయిదా వేశారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై జాతీయ నేర పరిశోధన సంస్థ అందించిన వివరాల మేరకు అనారోగ్యం, మాదక ద్రవ్యాలకు బానిస అవడం, కుటుంబ సమస్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారాలు, పేదరికం, వృత్తి సమస్యలు, నపుంసకత్వం, వరకట్న సమస్యలు తదితర ఇతర అంశాలు కారణమని పవార్ చెప్పారని ఖడ్సే పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్లో వ్యాఖ్యలు చేసే సమయంలో సింగ్ గణాంకాలకు సంబంధించిన ఎన్సీఆర్బీ పత్రాలు చూపించారు. కాగా, స్పీకర్ అనుమతి లేకుండానే పవార్ పార ్లమెంటు వ్యాఖ్యలకు సంబంధించిన పత్రాన్ని పంచారంటూ ఎన్సీపీ నేత జైదత్ శిర్సాగర్ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జైదత్ వ్యాఖ్యలను పృథ్విరాజ్ చవాన్ సమర్థించారు. అయితే దీనిపై ఖడ్సే స్పందిస్తూ.. తాను స్పీకర్ అనుమతి తీసుకున్నానని అయితే సంబంధిత పత్రం ఎలా పంపిణీ అయిందో విచారించాలన్నారు. ఖడ్సే స్పీకర్ అనుమతి తీసుకోలేదని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎన్సీపీ నేతలు ఛగన్ భుజబల్, శశికాంత్ షిండే డిమాండ్ చేశారు. కరువుతో రైతులు తల్లడిల్లుతున్న సమయంలో పవార్ రూ. 76,000 కోట్ల మేర రుణాన్ని మాఫీ చేశారని భుజబల్ గుర్తు చేశారు. సింగ్ రూ. 76 కూడా మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు గమ్యస్థానం మహారాష్ట్ర ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర పరిశ్రమల విధానంపై ఆ శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు మహారాష్ట్ర గమ్యస్థానమన్నారు. ఆటోమోబైల్ సంస్థ జనరల్ మోటార్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం, పొరుగు రాష్ట్రం గుజరాత్లో కంపెనీ మూసేస్తున్నట్లు తెలపడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో పెట్టుబడి విధానాన్ని జనరల్ మోటార్స్ ప్రకటించిందని చెప్పారు. పుణేలోని తాలేగావ్‌లో ఉన్న కంపెనీని విస్తరించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. పాక్‌తో ద్వైపాక్షి చర్చలు వద్దు: అజిత్ పవార్ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరపకూడదని, క్రికెట్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో టైస్టుల దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో గురువారం అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శాసనసభ్యులపై వాట్సాప్‌లో పోస్ట్ చేస్తున్న ద్వేశపూరిత వార్తలను, తన సెల్‌ఫోన్‌లోని పోస్టులను కూడా అసెంబ్లీలో ఇతర సభ్యులకు పవార్ చూపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పీకర్ హరిభావ్ బాగ్డేను కోరారు. పేదల కడుపుకొట్టే సంస్కృతి కాదు నాది: పంకజ ‘చిక్కి’ల కుంభకోణం అంశంపై అసెంబ్లీ రభస జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే చిక్కి కుంభకోణం విషయంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాణ్యత లేని చిక్కీలను పంపిణీ చేశారని, పంకజ ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పంకజ ముండే ఆరోపణలు తిప్పకొట్టారు. పేదల కడుపుకొట్టే సంస్కృతి తనది కాదన్నారు. చిక్కిని కొనుగోలు నిర్ణయాన్ని కళ్లు మూసుకుని తీసుకోలేదని, అన్ని విభాగాలతోపాటు అనేక మందితో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యర్థులు ఆరోపణలతో గందరగోళం సృష్టించిన అనంతరం సీఎం కూడా తనదైన శైలిలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆరోపణలు చేసేవారికి వాటికి సమాధానాలు వినేంత ఓర్పు ఉండాలని చురకలంటించారు. రాష్ట్రంలో జనరల్ మోటార్స్ రూ. 6,400 కోట్ల పెట్టుబడి ఆటోమోబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) పుణేలో ఉన్న కంపెనీని విస్తరించేందుకు నిర్ణయించిందని, ఇందుకుగాను రూ. 6,400 కోట్లు పెట్టుబడి పెట్టనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. రెండేళ్లలో కంపెనీలో ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. గురువారం మధ్యాహ్నం జనరల్ మోటార్స్ అధికారులతో సీఎం ఫడ్నవీస్ సమావేశమయ్యారు. యూఎస్‌కు చెందిన మరో ఆటోమోబైల్ సంస్థ క్రిస్లర్ కూడా రాష్ట్రంలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జీఎం కంపెనీ 10 కొత్త చెర్వొలెట్ మోడళ్లను ఉత్పత్తి చేయనుందని వెల్లడించారు. గుజరాత్‌లోని కంపెనీని మూసెస్తున్నట్లు ప్రకటించిందని జీఎం తెలిపింది. -
అవ్హాడ్ భద్రత ప్రభుత్వానిదే..
♦ స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ♦ అవ్హాడ్‌పై దాడి సిగ్గుచేటన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ♦ ‘చిక్కీ’ కుంభకోణం విషయంలో జాతీయ పత్రికకు నోటీసు ♦ ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు ♦ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యార్థులు ముంబై : ఎన్సీపీకి చెందిన శాసన సభ్యుడు జితేంద్ర అవ్హాడ్ భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీలో స్పష్టం చేశారు. అవ్హాడ్‌పై జరగుతున్న దాడి గురించి బుధవారం సభలో ఎన్సీపీ సభ్యుడు దిలీప్ వల్సే పాటిల్ లేవనెత్తారు. సాంగ్లీలో అవ్హాడ్‌పై దాడి జరిగిందని, ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అవ్హాడ్‌పై దాడిపై ఆందోళన చెందుతూ సీఎం ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ లేఖ కూడా రాశారని తెలిపారు. ‘కార్యసాధక, ప్రగతిశీల భావాలున్న వ్యక్తులపైనే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారిపై దాడులు జరగడం సిగ్గుచేటు. అవ్హాడ్‌పై జరుగుతున్న దాడిపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఆయనకు భద్రత ఏర్పాటు చేయాలి. ఒక సీఎంగా, హోంశాఖ మంత్రిగా అవ్హాడ్‌కు భద్రత కల్పించడం మీ కర్తవ్యం. మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తారనే అనుకుంటున్నాను’ అని పవార్ లేఖలో పేర్కొన్నారు. దాడి చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని దిలీప్ వల్సే పాటిల్ డిమాండు చేశారు. స్పందించిన స్పీకర్ హరిబావ్ బగ్డే, మొత్తం వ్యవహారంపై ఓ ప్రకటన చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఏర్పాటు చేయడం మా బాధ్యత. అవ్హాడ్‌కు భ ద్రత కల్పిస్తాం. బెదిరింపుల విషయంపై విచారణకు ఆదేశిస్తాం’ అని ఖడ్సే సభలో చెప్పారు. ఆ పత్రికపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ‘చిక్కీ’ కుంభకోణానికి సంబంధించిన నివేదికను విధానసభలో చర్చించక ముందే ప్రచురించిన ఓ జాతీయ పత్రికపై బీజేపీ శాసనసభ్యుడు ప్రశాంత్ బాంబ్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. ‘చిక్కీ’ కొనుగోలు విషయంలో రూ.206 కోట్ల కుంభకోణం జరిగిందంటూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘అసెంబ్లీలో వార్తా నివేదిక గురించి ఇంకా చర్చ జరగలేదు. సంబంధిత శాఖ నుంచి నిజానిజాలు బేరీజు వేసుకున్న తర్వాత వార్తను ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఆ పత్రిక అవేమీ చేయలేదు. మంత్రి వివరణను ప్రచురించినప్పటికీ పాత విషయాలపై మాత్రమే కేంద్రీక ృతమై ఉంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే’ అని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రశ్నోత్తరాల సమయంలో రాతపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చిందని, రేట్ కాంట్రాక్ట్ బేసిస్ మీదే చిక్కీ, కిచిడీ కొనుగోళ్లు జరిపామని, అయితే ఆ పద్దతిలో రూ. కోటి ఆపైన కొనుగోళ్లపై రాష్ట్రంలో నిషేధం ఉందని ఒప్పుకున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. దీనికి వివరణ ఇచ్చిన పంకజ ముండే, ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం నిజమే. ఈ పద్దతి ప్రకారం వస్తువు ధర, కాంట్రాక్టర్ వంటి విషయాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. టెండర్ల ప్రక్రియను పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖలు చూసుకుంటాయి. ఇక్కడ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్ పైనే వస్తువులు అమ్మకం జరుగుతుందనే విషయం తెలుస్తోంది. మళ్లీ టెండర్లు పిలవాల్సిన పనిలేదు’ అని వివరించారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ విధించేందుకు కొత్త చట్ట తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే విధాన సభలో తెలిపారు. కొత్త చట్టానికి న్యాయ శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపిందని, అడ్వొకేట్ జనరల్ నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు 100 శాతం ఫలితాలు తీసుకొస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయని, దీనిపై ప్రభుత ్వం తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా బీజేపీ సభ్యుడు సర్దార్ తారా సింగ్ మంత్రిని ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చిన తావడే, ‘ప్రైవేటు కోచింగ్ క్లాసులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ అనే ప్రతిపాదన గతంలో సభ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే చట్టం రూపుదిద్దుకోలేదు’ అని చెప్పారు. ‘శౌర్య’కు కాల్బాదేవీ మృతుల పేర్లు కాల్బాదేవీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురు అగ్నిమాపక శాఖ అధికారుల పేర్లను శౌర్య పతకాలకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన మండలిలో ఎన్సీపీ ఎమ్మెల్సీ సునీల్ తట్కరే ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్లో మాట్లాడుతూ మంత్రి రంజత్ పాటిల్ తెలిపారు. ఆ అధికారులకు అమరవీరులుగా గుర్తింపు ఇస్తారా అని ప్రశ్నించిన కపిల్ పాటిల్‌కు సమాధానమిస్తూ, సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వారికే ఆ గుర్తింపు ఇస్తారని రంజిత్ వివరించారు. అయితే వారందరి పేర్లను శౌర్య పథకాలకు రాష్ట్రపతికి సిఫారసు చేశామని చెప్పారు. సీఎంవోకు ధన్యవాదాలు: సీఎం ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎంవోకు ధన్యవాదాలు. అంతకంటే ముందుగా జల్యుక్త్ శివార్ పథకానికి ఒక రోజు జీతాన్ని విరాళమిచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జలసంరక్షణ పథకానికి సీఎం కార్యాలయ ఉద్యోగులు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేవారు. జల్ యుక్త్ శివార్‌కు రూ.25 వేలు చొప్పున విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ శేలర్, అమిత్ సతామ్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాపుట్టిన రోజును జరుపుకోవద్దు. ప్రకటనలు, బానర్లు కట్టొద్దు. ఆ డబ్బును జలయుక్త్ శివార్‌కు విరాళమివ్వండి’ అని సందేశమిచ్చారు.