రంజీ సెమీస్ లో అస్సాం, ముంబై
వాల్సాద్: పేసర్ అరూప్ దాస్ (8/83) సంచలన బౌలింగ్‌తో రంజీ ట్రోఫీలో పటిష్టమైన పంజాబ్‌కు షాకిచ్చాడు. నాలుగు రోజుల్లోనే ముగిసిన క్వార్టర్ఫైనల్లో అస్సాం జట్టు 51 పరుగులతో పంజాబ్‌పై నెగ్గి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 236 పరుగులకు ఆలౌటైంది. మరో క్వార్టర్స్‌లో ముంబై... 395 పరుగుల భారీ తేడాతో జార్ఖండ్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్ఖండ్ 94 పరుగులకే కుప్పకూలింది.