Monarchy
-
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం దాకా...
కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించని ఉత్తర, దక్షిణ భారత ప్రసిద్ధ రాజవంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుపూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర రాజుల పాలన ఈ ప్రాంతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తరువాత ముస్లిం పాలకులు: బీజాపుర్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, కర్నూలు నవాబులు దాదాపు 275 ఏళ్లు పాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై మొదట 1801లో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో తెర్నేకల్ గ్రామం పన్నులు కట్టడానికి నిరాకరించింది. బ్రిటీష్ సైనికుల ముట్టడిలో అనేకమంది గ్రామస్థులు మరణించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన మొదటి గ్రామంగా తెర్నేకల్ను చెప్పవచ్చు.ప్రసిద్ధి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అతి త్వరగా 66 గ్రామాలకు వ్యాపించింది. 1846–1847 మధ్య కాలంలో ఈయన సాహసోపేతమైన ప్రతిఘటన జనరల్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని ఆంగ్లేయ దళాలను గడగడ లాడించింది. అయితే అపారమైన బ్రిటిష్ సైన్యం ముందు ఓటమి తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి ఉరితీసింది కంపెనీ ప్రభుత్వం. 1800వ సంవత్సరంలో నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల కోసం ఇవ్వవలసిన సొమ్ముకు బదులుగా బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ; కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ తాలూకాలను ఇచ్చాడు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో ఈ ప్రాంతాలకు ‘దత్త మండలాలు’ అనే పేరు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో కర్నూలు ప్రాంతం 1800వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు కొనసాగింది.దత్తమండలాలకు ప్రధాన కలెక్టరుగా థామస్ మన్రో 1800–1807 వరకు సేవలను అందిచాడు. కర్నూలు ప్రాంతాన్ని పాలించిన మొదటి కలెక్టరు ఆయనే. రైత్వారీ భూవిధానం వంటి వ్యవస్థాగతమైన మార్పులతో ఉత్తమ పాలన సాగింది. మన్రో నివేదికను అమలుచేస్తూ రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం 1808వ సంవత్సరంలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. అవి కడప, బళ్ళారి జిల్లాలు. అనంతపురం ప్రాంతం బళ్ళారి జిల్లాలో, కర్నూలు ప్రాంతం కడప జిల్లాలో భాగంగా ఉండేవి. కర్నూలు పరిధిలోని రామళ్లకోట, నంద్యాల, సిరివెల్, నందికొట్కూరు తాలూకాలతో పాటు కడప జిల్లా నుంచి దూపాడు (మార్కాపురం), కంభం, కోయిలకుంట్ల; బళ్లారి జిల్లా నుంచి పత్తికొండ తాలూకాను కలిపి మొత్తం 8 తాలూకాలతో 1858 జూలై 1న కర్నూలు జిల్లా అవతరించినది. స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ జిల్లాలో ఎలాంటి మార్పులూ సంభవించలేదు. అయితే 2022 ఏప్రిల్ 4న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కర్నూలు జిల్లా రెండుగా... అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజితమయ్యింది.ప్రస్తుతం జనాభా విషయంలో నంద్యాల జిల్లా కంటే ఎక్కువగా, వైశాల్యం, రెవిన్యూ విషయంలో నంద్యాల జిల్లా కంటే తక్కువ స్థాయితో కర్నూలు మారిన పరిస్థితిని గమనించగలం.– ఆచార్య మన్సూర్ రహ్మాన్ సామాజిక – ఆర్థిక విశ్లేషకులు ‘ 9441067984(కర్నూలు జిల్లా 166వ అవతరణ దినోత్సవం నేడు) -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇక్కడ పార్లమెంట్ ఉన్నా అధికారం రాజరికానిదే!
బహ్రెయిన్ నేను సందర్శించడానికి ఎంపిక చేసుకున్న గమ్యస్థానం కాదు. దాన్ని ఎమిరేట్స్, ఖతర్‌కు చెందిన పేద బంధువులాగా భావించేవాడిని. కానీ నాకు తెలిసిన వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలీదు. నా అభిప్రాయం నా అజ్ఞానానికి ప్రతిబింబంగా ఉండేది. గత వారాంతంలో నాదెంత తప్పుడు అభిప్రాయమో నేను కనిపెట్టాను. బహ్రెయిన్ వెచ్చని, సంతోషకరమైన, ఆకర్షణీయమైన దేశం. నమ్మలేనంత శుభ్రంగానూ, దుబాయ్, అబుదాబీ, ఖతార్ లాగే ఆధునికంగానూ ఉంది. కానీ బహ్రెయిన్ చాలా చిన్నదేశం. కేవలం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న దేశం. వాస్తవానికి ‘బహ్రెయిన్ ద్వీపం’ అనే పేరు కలిగి ఉన్న ద్వీప సమూహం. కొద్ది కాలం క్రితం ఈ ద్వీపం 40 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగంగా మాత్రమే ఉండేది. సముద్రం నుంచి ఏర్పడుతూ వచ్చిన ఈ దేశం (ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది) తన సైజును బహుశా రెట్టింపు చేసుకోగలిగింది. కానీ మాల్దీవులు, సింగపూర్ తర్వాత ఇది ఇప్పటికీ ఆసియాలో మూడో అతి చిన్న దేశంగా ఉంది. బహ్రెయిన్ జనాభా 16 లక్షలు మాత్రమే. భారత దేశం నుంచే 4 లక్షల మంది ప్రవాసులు ఈ దేశానికి వచ్చారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది కేరళకు చెందిన వారే. ఈ దేశ జనాభాలో 43 శాతం మంది అరబ్ యేతర ఆసియన్లే అని వికీపీడియా పేర్కొంటోంది. వీరంతా ప్రవాసం వచ్చిన కార్మికులే అని నా అంచనా. స్థానిక జనాభా 47 శాతం మాత్రమే. ఈ చిన్న ద్వీపం గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1931లో ఇక్కడే బయటపడింది. ఈరోజు బహ్రెయిన్ ప్రముఖ చమురు ఉత్పత్తిదారు కాదు. కానీ ఈ చమురు బావి నిరుపయోగకరంగా ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం గర్వంగా తన్ను తాను ప్రదర్శించుకుంటోంది. బహ్రెయిన్ దీనార్ ప్రపంచంలోనే రెండో అతి శక్తిమంతమైన కరెన్సీ. ఒక దీనార్కి మీరు 2.65 అమెరికన్ డాలర్లు పొందవచ్చు. కాబట్టి బహ్రెయిన్ మరీ అల్లాటప్పా దేశం కాక పోవచ్చు. బహ్రెయిన్‌లోని కేరళీయ సమాజం ఆహ్వానం మేరకు నేను ఆ దేశాన్ని సందర్శించాను. ఇది ఉజ్జ్వలమైన, అంకిత భావం కలిగిన సామాజిక సంస్థ. అలాగే డీసీ బుక్స్‌కి కూడా ఇది పేరుపొందింది. ద్వీపంలో జరిగే బుక్ ఫెస్టివల్లో కేరళీయులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శనశాల జాతీయ ఎన్నికలతో ముడిపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. మనదేశంతో పోలిస్తే ఇక్కడి ఎన్నికలు చాలా చాలా చిన్నవే కావచ్చు కానీ వాటిని వీరు నిర్వహించే తీరు మాత్రం నన్ను పరవశింపజేసింది. బహ్రెయిన్‌లో ఉన్నది రాచరిక వ్యవస్థే. అది స్వభావ రీత్యా రాజ్యాంగబద్ధమైనదే కావచ్చు కానీ అధికారం మాత్రం రాజు హమీద్, అల్ ఖలీఫా రాజకుటుంబం చేతిలో మాత్రమే ఉంటుంది. అయితే 2002 నుంచి ప్రతి అయిదేళ్ల కోసారి పార్లమెంటును ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది 40 సీట్ల సింగిల్ ఛాంబర్ హౌస్. ఎగువ, దిగువ సభల్లాంటివి ఉండవు. బహ్రెయిన్ రాజ్యంలో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంటుకు అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్లాగే, ఇక్కడా ఎన్నికలు రెండు దశలలో ఉంటాయి. తొలివిడత ఎన్నికలు నేను రావడానికి ముందే నవంబర్ 12న జరిగాయి. 40 పోలింగ్ బూత్‌లలో 344 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి 3,44,713 మంది బహ్రెయిన్ పౌరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ 344 మంది అభ్యర్థుల్లో 40 మందిని ఎన్ను కోవడానికి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ విస్తరించి ఉన్న సీఫ్ మాల్లో విహారయాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. నేను ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఓటు వేయడానికి తమ వంతు సమయం కోసం ఎదురు చూస్తున్న ఓటర్లు స్టార్‌బక్స్ కాఫీలు సేవిస్తూ, హాగెన్–దాస్ ఐస్‌క్రీములను లాగించేస్తూ కనిపించారు. ఇక్కడ అన్నీ ఎయిర్ కండిషన్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి! ప్రవాసం వచ్చినవారు, గల్ఫ్ సహకార దేశాలకు చెందిన పౌరులు దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండి ఇక్కడే జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఓటు వేసేందుకు బహ్రెయిన్ అనుమతిస్తుంది. నేను ఇక్కడ పర్యటించిన ప్పుడు జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది చాలా అధిక శాతమట. ఇక రెండో విడత పోలింగ్ 13వ తేదీన ముగిసింది తొలి రౌండ్ ఓటింగ్ తర్వాత, ‘ది వాయిస్ ఆఫ్ బహ్రెయిన్’ అని తనను తాను పిలుచుకునే గల్ఫ్ డైలీ న్యూస్ పత్రిక, పోలింగ్‌ను విజయవంతం చేసినందుకు ఓటర్లకు రాజు అభినందనలు తెలిపారని రాసింది. ఇది 16 పేజీల ట్యాబ్లాయిడ్. రాజు తన సంతోషాన్ని రాజరికపు హుందా తనంతో ప్రకటించారు. ‘మన ప్రియతమ రాజరికం కోసం సాధించిన ఈ ఘన విజయం పట్ల మమ్ము మేమూ, మా విశ్వసనీయ ప్రజలనూ అభినందించుకుంటున్నాము’ అని రాజు పేర్కొన్నారు. యువరాజు, ప్రధానమంత్రి రాజును అభినందనలతో ముంచెత్తారని పత్రికలు నివేదించాయి. అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ఈ ద్వీపంలో సామరస్యం పొంగిపొరలుతోందన్న మాట. బహ్రెయిన్‌లో రెండు అమెరికా స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది ‘నాటో’ కూటమిలో ప్రముఖ మిత్ర దేశం కూడా! అయితే ఎంత గాలించినా ఒక్కరంటే ఒక్క అమెరికన్ సైనికుడు కూడా కనిపించలేదు. సౌదీ అరేబియన్లు తరచుగా కనిపిస్తుంటారు. 1980లలో చిత్తడినేలపై నిర్మించిన దారిలో అరగంట ప్రయాణిస్తే చాలు సౌదీ పౌరులు ఇక్కడికి చేరు కోవచ్చు. వారాంతపు సందర్శకులుగా వారు తరచూ ఇక్క డికి వస్తుంటారు. సౌదీ రాజరికం తమకు నిరాకరించిన ఆల్కహాల్‌ని బహ్రెయిన్ రాజు అనుమతించారు మరి! చివరగా, ఫోర్ సీజన్స్ షాపులో నేను గత కొన్ని సంవత్సరాలుగా దొరకని చక్కటి బర్గర్‌ని రుచి చూశాను. గతంలో మీరు ఎమిరేట్స్ని సందర్శించి ఉన్నప్పటికీ షాపింగ్, సముద్ర క్రీడలు, ఎడారి, ఆధునిక నగరం వంటి వాటిని ఇంకా ఇష్టపడుతున్నట్లయితే మీ తదుపరి వారాం తపు సెలవుల్లో బహ్రెయిన్ రావడానికి ఎందుకు ప్రయత్నిం చకూడదు? కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ (బహ్రెయిన్ నుంచి రాసిన వ్యాసం) -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్‌గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్‌ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్‌ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్‌లో షమన్ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్‌కేర్ గ్రూప్‌లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?
ఎలిజెబెత్ రాణి మృతి, వారసుడిగా కింగ్ ఛార్లెస్ ప్రవేశం అనేవి మరోసారి గ్రేట్ బ్రిటన్ గురించి మనం తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా చేశాయి. యూరప్ తీర ప్రాంతంలోని ఒక చిన్న దీవి అయిన బ్రిటన్ రాజకీయాధికారం క్షీణిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతూ ఉండ వచ్చుగాక... కానీ ఇప్పటికీ పెర్త్, ఫీనిక్స్, ముంబై, మాసే లేదా కేప్ టౌన్, కోపెన్హాగన్ వంటి సుదూర ప్రాంతాల్లోని ప్రజలను కూడా కట్టిపడేస్తూ ఈ రోజుకీ ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఏకకాలంలో ప్రహస నంగానూ, బ్రిటన్ ప్రభావానికి తిరుగులేని సూచికగానూ ఉంటోందని చెప్పవచ్చు. రాణి తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఆమె అర్థవంతమైన శక్తిగా లేరు. కానీ ఆమె ప్రపంచం దృష్టిని ఇప్పటికీ తనవైపు తిప్పుకోగలరు. కాబట్టి ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న ఈ రాజదండాన్ని కలిగిన ద్వీపం లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణం నిస్సందేహంగా దాని రాచరికమే అని చెప్పాలి. ఈజిప్ట్ రాజు ఫారూఖ్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు, ఓ సుప్రసిద్ధమైన మాట చెప్పారు: ఏదో ఒక రోజు ప్రపంచంలో అయిదుగురు చక్రవర్తులు మాత్రమే ఉంటారనీ, వారు స్పేడ్, క్లబ్, హార్ట్స్, డైమండ్స్తోపాటు ఇంగ్లండ్ చక్రవర్తి అనీ అన్నారు. తొలి నాలుగు పేకాటలో ముఖ్యమైన ముక్కలు అని తెలిసిందే. ఈ ప్రపంచం బ్రిటిష్ రాచరికాన్ని విశిష్టమైనదిగా పరిగణి స్తుందనే సత్యాన్ని ఈజిప్టు రాజు పేర్కొన్నారు. బ్రిటన్ రాచరికానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే నా వద్ద కచ్చితమైన సమాధానం లేదు. కానీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ‘ది క్రౌన్’ వెబ్ సిరీస్‌కి ఉన్న ప్రజాదరణే దానికి రుజువుగా నిలుస్తుంది. బహుశా బ్రిటన్ ప్రదర్శనా సామర్థ్యం, దాని పురాతన సంప్రదాయాలు, ఆచారాలను ఆ సిరీస్ చక్కగా చూపించింది కాబోలు. అవి మనం కోల్పోయిన, మర్చి పోయిన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయి. లేదా బహుశా రాజులు, రాణులు ఆకర్షణీయంగా మనలో శృంగార భావనలను వెలిగించి ఉండవచ్చు. కానీ, డచ్, స్కాండినే వియన్ లేదా జపనీస్ రాచరికం మనల్ని ఉద్వేగపర్చని కాలంలో బ్రిటిష్ రాచరికం పట్ల మనం ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నట్లు? వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ రాచరికాన్నే కాదు... ఎలిజెబెత్ రాణిని ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుండటమే. బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటిష్ ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. ‘‘మీకు ఆమె ‘మీ రాణి’గా ఉండేవారు. మాకు మాత్రం ఆమె ‘రాణి’గా(‘ద క్వీన్’– రాణి అంటే ఆమె మాత్రమే గుర్తొస్తుంది అన్న అర్థంలో) ఉండేవారు అన్నారాయన. బ్రిటిష్ రాణి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలా మాట్లాడటమే అద్భుతమైన విషయం. మెక్రాన్ చాలా నిజాయతీగా ఆ మాటలన్నారు. దానికి ఫ్రాన్స్‌లో ఎవరూ ఆయన్ని తప్పుపట్టలేదు. ఇక రెండో లక్షణం ఏమిటంటే, బ్రిటన్ తన భాష ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించింది. చాలామందికి ఇంగ్లిష్ అందరూ ఆకాంక్షించే ఒక భాష మాత్రమే కాదు, అది సెకండ్ లాంగ్వేజిగా అందరూ ప్రాధాన్యం ఇచ్చే భాషగా ఉంటోంది. అది బ్రిటిష్ సామ్రాజ్యం కారణంగానా? సరిగ్గా ఉచ్చరించకపోయినా అమెరికా ఆ భాషను పంచు కుంటున్నందునా? లేదా ఏ ఇతర భాషకూ లేని గుణాలు ఇంగ్లిష్‌కి ఉండటం మూలంగానా? ఇది కూడా నాకు తెలీదు. కానీ షేక్స్పియర్ని ప్రపంచమంతా సుప్రసిద్ధుడైన రచయితగా ఎందుకు గుర్తి స్తోంది అనే అంశాన్ని ఇంగ్లిష్ భాషలోని పటుత్వం, దాని సమ్మోహన శక్తి స్పష్టంగా చెబుతాయి. డాంటే, హోమర్, పుష్కిన్, కాళిదాసు వంటి మహా రచయితలు, కవుల గురించి మీరు ఆలోచించవచ్చు. కానీ ‘గాయక కవి’ అని మనం పిలుచుకునే షేక్స్పియర్ ముందు వీరంతా తేలిపోతారు. బ్రిటన్ ప్రభావం బీబీసీ అంత అతి విస్తృతమైన ప్రభావంతో ఎందుకుందో మూడో కారణం కూడా చెబుతాను. సీఎన్ఎన్ అంత వనరులు బీబీసీకి లేకపోవచ్చు. బ్రిటిష్ ప్రజలే దాన్ని విమర్శిస్తూ ఉండవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వాలే బీబీసీని మూసివేయాలని తరచుగా ప్రయత్నించాయి. కానీ బయటి ప్రపంచంలో సమగ్రత, నిర్దిష్టత రీత్యా బీబీసీకి ఎనలేని గుర్తింపు ఉంది. 1984లో తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఆమె ప్రభుత్వమే రాజీవ్‌గాంధీకి తెలియ జేసినప్పటికీ, దాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆయన బీబీసీని చూశారు. (క్లిక్ చేయండి: మన నిశ్శబ్దం చేసిన గాయం) బ్రిటిష్ ఆకర్షణ శక్తిని వివరించడానికి నేను మరో కారణాన్ని జత చేస్తాను. అదేమిటంటే బ్రిటిష్ వారి హాస్య చతురత. అది కేవలం సున్నితమైంది మాత్రమే కాదు, దాన్ని తక్కువ చేసి చెప్పలేం. మరోలా చెప్పాలంటే బ్రిటిష్ హాస్యచతురత తనను చూసి తానే నవ్వుకుంటుంది. బ్రిటిష్ జోక్స్‌కి తరచుగా రాచకుటుంబమే బలవుతూ ఉంటుంది. ప్రత్యేకించి అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ చార్లెస్ కూజా చెవులు, విపరీతమైన అభిరుచులు, చాదస్తపు పద్ధతులపై మరింత ఎక్కువగా జోకులు ఉండేవి. అదే భారతదేశంలో అయితే ప్రధానమంత్రిపై లేక రాష్ట్రపతిపై మీరు పేరడీలు కడితే మీ మీద రాజద్రోహ ఆరోపణలు తప్పవు. హాస్యం లోనే ప్రజాదరణ, దాంతోపాటు అభిమానం కూడా పుట్టుకొస్తాయని బ్రిటిష్ వారు గుర్తించారు మరి. ‘ఎస్, ప్రైమ్ మినిస్టర్’, ‘ది టూ రోనీస్’ వంటి కామెడీ షోలు, లేదా ఇంకా వెనక్కువెళ్లి ‘లారెల్ అండ్ హార్డీ’లను తల్చుకోండి. బ్రిటిష్ వారి హాస్య చతురత తక్కిన ప్రపం చాన్నే నవ్వించింది అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండ లేరు. ఫ్రెంచ్ ప్రజలు, జర్మన్లు, ఆస్ట్రేలియన్లు లేదా అమెరికన్ల గురించి మీరు ఇలా చెప్పలేరు. (క్లిక్ చేయండి: ప్రజాస్వామ్యంలో రాజరికమా?) విక్టోరియా మహారాణిని మననం చేసుకోవడం ద్వారా నన్ను ఇక సెలవు తీసుకోనివ్వండి. పైకి గంభీరంగా కనిపించే విక్టోరియా రాణికి హాస్యపు నరం లోపించింది. ఎప్పుడూ ఆమె ఉల్లాస రహితంగా, వినోదం అంటే పట్టని వ్యక్తిగా ఉండేవారు. ‘మేం నవ్వడం లేదు’ అనే జాలిగొలిపే పదబంధాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాను అనే విషయం కూడా విక్టోరియా బహుశా గుర్తించకపోయి ఉండ వచ్చు. ఈ పదబంధం ఇవాళ వ్యంగ్య ప్రధాన చతురతకు మారుపేరుగా ఉంటోది మరి! - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
ప్రజాస్వామ్యంలో రాజరికమా?
‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. మరి ఇంకా అక్కడ రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయారయ్యాడు– అని ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళబెడతారు. అరవై ఏళ్ళ పాటు బ్రిటన్ ‘రాణి’ పదవిలో వున్న ఎలిజెబెత్, 96 ఏళ్ళ వయసులో ఈ మధ్య పోయింది. ఆ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు కొన్ని. ‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. ఫ్రాన్స్ కంటే ఎన్నో ఏళ్ళ ముందే ‘రాజరికానికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారి బ్రిటన్‌లోనే విప్లవం’ జరిగింది అంటారు. మరి ఇంకా రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? నిన్నటి దాకా, రాణీ రూపంలో వుంది. ఇప్పుడేమో ఆమె కొడుకు రాజయ్యాడు. మనుమలు యువ రాజులయ్యారు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించడానికి మార్క్స్ బ్రిటన్‌లో భాగమైన ఇంగ్లండునే ఉదాహరణగా తీసు కున్నాడు. అందరూ బ్రిటన్‌ని ‘గొప్ప ప్రజాస్వామ్య దేశం’ అంటారు. మరి అక్కడ ఇంకా రాజకుటుంబం వాళ్ళు పరిపాలనలో వున్నారే? అంతా వింతగా వుంది! దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి?’అని అనేక ప్రశ్నలు గతంలోవే మళ్ళీ మళ్ళీ లేస్తున్నాయి. ఇవన్నీ మంచి సందేహాలే. కానీ, ఈ సందేహాలు, బయటి దేశాల ప్రజలలో కంటే, బ్రిటన్ ప్రజలలోనే సహజంగా రావాలి. కానీ, అక్కడి ప్రజలకి, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఈ ప్రశ్నలు రానేలేదు. అక్కడ కొన్ని కమ్యూనిస్టు గ్రూపులవాళ్ళు ‘రాజరికం నశించాలి, కార్మికవర్గ రిపబ్లిక్ రావాలి’ అనే నినాదాలు ఇస్తూనే వుంటారు. ఇప్పటికీ ఇస్తూనే వున్నారు. కానీ, అక్కడ దాదాపు 400 ఏళ్ళ కిందట రాజరికానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి, ఒక రాజుని ఉరితీసి, కొన్నాళ్ళ తర్వాత ఇంకో రాజుని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారో వివరించే పని జరగలేదు. అందుకే, అక్కడి ప్రజలకి చిన్నప్పటినించీ చూస్తూవున్న విషయాలను చూడడానికి మించి ఏ కొత్త ఆలోచనా పుట్టలేదా? అక్కడ చిన్నతనం నించీ, స్కూళ్ళల్లో జాతీయ గీతంలోనే రాజు పట్లా, రాణీ పట్లా గౌరవాన్ని బోధిస్తారని చదివాం. ‘‘గాడ్ సేవ్ ది కింగ్’’ (దేవుడు రాజుని రక్షించుగాక!) అని మొదలవుతుంది వాళ్ళ జాతీయ గీతం. రాజు పోయాక, అతని కూతురు రాణీగా సింహాసనం ఎక్కాక, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనడం మొదలెట్టారట. స్కూలు పిల్లల్ని రాజప్రాసాదాలకూ; విహార యాత్రలలో రాణీ కుటుంబీకులు విడిది చేసే భవనాలకూ తీసికెళ్ళి చూపించడం చేస్తారు. రాజసం ఉట్టిపడేలా, రాణీ ధరించే నగలూ, రకరకాలైన టోపీలూ, ధగ ధగ మెరిసే పెద్ద గౌనులూ... ఇలా రాణీ గారి ఆడంబరాలన్నిటినీ అక్కడి పత్రికలూ, టీవీలూ, నిరంతరం చూపిస్తూనే వుంటాయి. లండన్‌లోని ఒక కార్మిక నాయకురాలు 4 ఏళ్ళ కిందట రాసిన ఒక వ్యాసంలో, శ్రామిక వర్గ స్త్రీలలో కూడా రాణీ అంటే, ఎంత గ్లామరో (ఆకర్షణో) చెప్పడానికి ఒక సంఘటన చెప్పింది. కార్మికురాలైన తన తల్లి, రాణీని ఒక పెరేడ్లో చాలా దగ్గరగా చూసి, ‘‘రాణీ గారు ఎంత అందంగా, ఎంత గొప్పగా వుంటుందో?’’ అని అన్నదట. తల్లి మెచ్చు కోళ్ళకి జవాబుగా, మన కార్మిక నాయకురాలు తల్లితో ఇలా అన్నదట: ‘‘అవును అమ్మా! 24 గంటలూ, వైద్యులూ, బ్యూటీషియన్లూ, సేవ కులూ, వంటవాళ్ళూ అందుబాటులో వుంటే, అలా వుండక ఎలా వుంటారులే’’ అని. పనీ, పాటా వుండదు రాణీ గారికి, రిబ్బన్లు కత్తిరిం చడం తప్ప– అని కూడా అందట. దానికి వాళ్ళమ్మ ‘ఏమిటా మొరటు మాటలు?’ అనేదట. ‘వాళ్ళ రాజసాలూ, ఠీవీలూ, విలాసాలూ అన్నీ ప్రభుత్వానికి ప్రజలు కట్టే పన్నుల నించే గదా తగలేసేది’ అని కూడా కూతురు అనేదట. ఇవన్నీ నిజమే. అంతే కాదు, రాణీ ఆస్తుల విలువ 3 వేల కోట్ల పైనే అని పత్రికలు రాశాయి. అనేక భవనాలూ, అనేక వ్యాపార సంస్థలూ, వ్యవసాయ ఎస్టేట్లూ, షేర్లూ, ఇదనీ అదనీ లేదు. ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేని రాణీకి కుప్పలు కుప్పల ఆస్తులు! రాజరికం ఇప్పటికీ ఎందుకు వుందో అర్థం కావాలంటే, చరిత్రలో రెండు, మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అదంతా క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1625లో ఇంగ్లండుకు రాజు మొదటి ఛార్లెస్ అనేవాడు. రాజూ, మతాధిపతులూ, ఫ్యూడల్ భూస్వాములూ, ఒక వర్గం. జీతం పద్ధతి మీద కూలీలను పెట్టుకుని, తయారు చేయించిన సరుకులను పట్టణాలలో అమ్మించే వర్తక భూస్వాములు ఒక వర్గం. వీళ్ళలో చిన్న చిన్న కర్మాగారాల (ఫ్యాక్టరీలకు మొదటి రూపాలు) యజమానులు కూడా వున్నారు. కౌలు రైతులూ, చేతి వృత్తుల వాళ్ళూ, సొంత శ్రమల మీద బ్రతికే ఇతర శ్రామికులూ, ఒక వర్గం. రాజూ, మతాధికారులూ, ఫ్యూడల్ ప్రభువులూ చేసే పనులు శ్రామిక వర్గాల మీద పెత్తనం చెయ్యడం! రాజు ఏర్పర్చిన పార్లమెంటులో, భూమి మీదేగాక వర్తక సరుకుల మీద లాభాలు తినే వర్తక భూస్వాములు ఎక్కువ సంఖ్యలో వున్నారు. (అప్పటి కొత్త రకం ప్రభువర్గం వాళ్ళే. వీళ్ళలో ముఖ్యుడు క్రాంవెల్ అనే పార్లమెంటు సభ్యుడు.) పెత్తనం అంతా రాజుదే. అందుకని, ఆ పెత్తనానికి వ్యతి రేకంగా, మెజారిటీగా వున్న రైతుల్నీ, చేతి వృత్తుల వారినీ కలుపుకొని, సరుకుల ద్వారా లాభాల్ని పొందే వర్తక భూస్వాములూ, పెట్టుబడి దారులూ, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఎన్నో జరిగాక రాజుని ఓడించి, రాజుని బహిరంగంగా ఉరితీశారు. కానీ, రాజు లేనంత మాత్రాన ప్రజల సమస్యలు తీరతాయా? ప్రజల వైపు నించీ ఉద్యమాలు మొదలయ్యాయి. అలాంటి ఉద్యమాలలో, ‘లెవెలర్లు’ (సమానత్వవాదులు) నడిపిన ఉద్యమం ఒకటి. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభువర్గమూ, వర్తక భూస్వా ములూ, ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడం మొదలు పెట్టారు. అంతేకాదు. ప్రజల ఉద్యమాన్ని మరింతగా అణచడానికి మళ్ళీ ఇంకో రాజుని (విలియం) తీసుకొచ్చి కూర్చోపెట్టారు. బ్రిటన్‌లో అధికారం అంతా, పెట్టుబడిదారులతో నిండిన పార్ల మెంటుదే అయినా, పేరుకి మాత్రం రాజే దేశాధినేత. అందుకే మార్క్స్, 1855లో, ‘బ్రిటన్ రాజ్యాంగం’ అనే వ్యాసంలో, ఆ రాజ్యాంగం అధికారికంగా (అధికారం అనే పేరుకి) పాలించే భూస్వామ్య ప్రభువులకూ (లాండెడ్ అరిస్టోక్రసీ), అసలు (యాక్చు వల్లీ) పాలించే బూర్జువా వర్గానికీ మధ్య, ఒక రాజీ– అని అంటాడు. రాజు అనేవాడు కూడా ఒక పెద్ద భూస్వామే. భూస్వామ్య వర్గానికి ప్రతినిధి కూడా. ఆ రాజుని ఒక పెద్ద దేవుణ్ణి చేసి పారేశారు. అందుకే, ఏంగెల్స్ ఇంగ్లండ్ గురించి 1844లో రాసిన ఒక వ్యాసంలో, రాజు పట్ల ఆరాధన పరమ అసహ్యకరంగా (డిస్గస్టింగ్ కల్ట్) ఉంది – అని అన్నాడు. ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే, అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయార య్యాడు– అని కూడా ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళ బెడతారు. ఒక పక్క రాజో, రాణీయో ఉంటే, ఇంకో పక్క ‘ప్రజా స్వామ్యబద్ధంగా’ ప్రజలు ఓట్లువేసి పంపిన ‘ప్రజా ప్రతినిధులు’ ఉంటారు. ఆ రకంగా బ్రిటన్‌లో ఈనాడు కూడా ఉన్నది, రాజరికపు ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగాన్ని చూస్తే, రాజుతో పోల్చదగ్గ భారత రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించడానికి వచ్చేటప్పుడు, రాష్ట్రపతి అంగరక్షక దళంలో అన్నీ గుర్రాలే! అంతా పాత రాజరిక సంస్కృతే! రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో కూచుని వుంటే, ఆ బగ్గీకి ముందూ, వెనకా, రెండు పక్కలా, ఎనభై ఆరు గుర్రాలూ, వాటిని నడిపే సైనికులూ వుంటారు. ఆ దృశ్యాల్ని చూస్తే జనానికి మతి పోతుంది. అంత రాజరిక ఆర్భాటం లేకపోతే, ఆ పదవి మీద జనాలకి లక్ష్యం వుండదని పాలకులకు భయం! శ్రామిక వర్గపు అమాయకత్వాలూ, అజ్ఞానాలూ ఇవన్నీ! ఈ శ్రామికవర్గం ఇలా వుంటే, ధనిక పాలకవర్గం అలా వుండదా? రంగనాయకమ్మ (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి) -
క్వీన్ ఎలిజబెత్-2 ప్రస్థానంలో కీలక ఘట్టాలివే!
ఒక్కవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. తాజాగా.. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె రాణి ప్రస్థానం గమనిస్తే.. కీలక పరిణామాలకు మౌనసాక్షి 70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్–2 రాణి ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్–3గా పదవిలో కొనసాగుతారు. నిరాడంబర జీవితం క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు. ► ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. ► తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్ ► గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ► 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్మిన్స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ► క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. ► 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు. ► యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ► ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. ► 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ► భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ► ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ► అనారోగ్యంతో ఆమె మరణించిన క్రమంలో ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ► ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
రాజవంశం అసలు ‘రంగు’
ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒరవడినందించిన బ్రిటన్... ఫ్యూడల్ ధోరణులకు ప్రతీకగా వుండే రాచరిక వ్యవస్థను ఇప్పటికీ భద్రంగా పరిరక్షించుకుంటూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటుంది. రాజ కుటుంబమంటే ఆ దేశ పౌరుల్లో ఇప్పటికీ అంతో ఇంతో భక్తిప్రపత్తులుంటాయి. అక్కడ ఏం జరిగినా అది పెద్ద వార్తే. ఆ కుటుంబంలో చోటుచేసుకునే ఏ ఘటనైనా పతాకశీర్షికే. ఎందుకంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆ దేశాధినేత. కామన్వెల్త్ దేశాల్లోని చాలా దేశాలకు సైతం ఇప్పటికీ ఆమె అధిపతి. అలాగని ప్రభుత్వ వ్యవహారాల్లో ఆ కుటుంబం పాత్రేమీ వుండదు. వారిని సంప్రదించే వారూ వుండరు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన రాజకుటుంబం ప్రస్తుతం గత కాలపు అవశేషం మాత్రమే. ఇన్నాళ్లూ ఆ కుటుంబంలోని ప్రేమ పురాణాలు, కోపతాపాలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఆ రాజకుటుంబంలోని వ్యక్తుల నేలబారు తనం బజారునపడింది. ఆ కుటుంబంలో తనకెదురైన వేధింపుల పర్యవసానంగా ఆత్మహత్య ఆలోచనలు సైతం తనను చుట్టుముట్టాయని రాజకుటుంబంలోని చిన్న కోడలు మేఘన్ ఒక టీవీ ఇంటర్వూ్యలో చెప్పడం బ్రిటన్‌లో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసూయ, ద్వేషం వగైరాలకు బ్రిటన్ రాజకుటుంబం సైతం మినహాయింపు కాదని గతంలో చాలాసార్లు రుజువైంది. కానీ ఇప్పుడు మేఘన్ అంతకన్నా దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడించారు. రాణి ఎలిజబెత్-2 తనతో బాగానే వ్యవహరించినా రాజకుటుంబంలోని ఇతరులు ఎప్పుడూ తనతో సక్రమంగా లేరని ఆమె చెప్పటం, ముఖ్యంగా తాను ఆఫ్రికన్-అమెరికన్‌ను గనుక తన రంగు గురించి, పుట్టబోయే బిడ్డ రంగు గురించి చర్చించుకోవటం... ఆ బిడ్డకు రాచరిక హోదా ఇవ్వాలా వద్దా అంటూ తర్కించుకోవటం తనను తీవ్రంగా కుంగదీశాయని ఆమె చెప్పటం సంచలనమైంది. వాస్తవానికి రాజవంశంలో అంతర్లీనంగావుండే అహంభావ ధోరణి, వర్ణ వివక్ష ప్రపంచానికి తెలియనివేమీ కాదు. మేఘన్‌కు ముందు ఆ కుటుంబంలో ప్రేమ వివాహాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ శ్వేతజాతేతరుల్ని పెళ్లాడలేదు. అందుకే ప్రిన్స్ హ్యారీ మేఘన్‌ను వివాహం చేసుకోబోతున్న సంగతి వెల్లడైనప్పుడు అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయంలో వచ్చిన కలతల గురించి బ్రిటన్ టాబ్లాయిడ్లలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం తప్ప ఎవరూ తమకై తాము ధ్రువీకరించలేదు. అందుకే కొందరు ఆ కుటుంబం మారిందనుకున్నారు. కానీ అదంతా ఉత్త భ్రమగా తేలిపోయింది. మేఘన్ తమలో ఒకరిగా మారినా ఆ కుటుంబం దాన్ని జీర్ణించుకోలేక పోయిందని తాజాగా వెల్లడైన అంశాలు చెబుతున్నాయి. రాజకుటుంబం పట్ల సాధారణ పౌరుల్లో వుండే వినయవిధేయతలు, గౌరవప్రపత్తులకు తగినట్టు వారి వ్యవహార శైలి వుండటం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి. హ్యారీ తల్లి లేడీ డయానా, తండ్రి ప్రిన్స్ చార్లెస్‌ల మధ్య కలతలు ఏర్పడినప్పుడు, వారు విడిపోయినప్పుడు అందరూ నోళ్లు నొక్కుకున్నారు. ఆదర్శప్రాయంగా వుండాల్సిన కుటుంబం ఇలా సమస్యల్లో చిక్కుకున్నదని నొచ్చుకున్నవారు కూడా వున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఆ కుటుంబం మారిందని, కాలానుగుణంగా పద్ధతులు మార్చుకుందని భావించారు. అదంతా నిజంకాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. వర్తమానంలో జీవిస్తూ గతం చూరుపట్టుకు వేలాడేవారు ఎంతటి ఉన్నత స్థానాల్లో వున్నా భంగపాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. రాజకుటుంబ సభ్యుల్లో ఎవరూ దీన్ని గ్రహించిన దాఖలాలు లేవు. తమకు ఇకపై రాచరిక హోదాలు వద్దని హ్యారీ, మేఘన్ దంపతులు ప్రకటించినప్పుడే ఆ కుటుంబంలో ఏదో అవుతున్నదని అందరూ అనుకున్నారు. ఏం జరిగివుంటుందన్న ఊహాగానాలు అప్పటినుంచీ జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా నామమాత్రావశిష్టంగా మారినా... బ్రిటన్ రాజకుటుంబానికి వుండే సౌకర్యాలు, ఆ హోదా వల్ల లభించే గౌరవ ప్రతిష్టలూ సామాన్యమైనవి కాదు. వాటిని వదులు కోవటం చిన్న విషయం కాదు. ప్రజాస్వామ్య భావజాలం శరవేగంతో ప్రపంచమంతా విస్తరించడంతో రాజులు పోయారు... రాజరికాలూ అంతరించాయి. కానీ వాటి తాలూకు అవశేషాలు మానవాళిని ఇంకా పట్టిపీడిస్తున్నాయి. మన దేశంలో వున్న కుల వ్యవస్థలాంటిదే పాశ్చాత్య దేశాల్లో అడుగడుగునా కనబడే వర్ణ వివక్ష. ఇక్కడ అణగారిన వర్గాలవారు జీవితపర్యంతమూ నిత్యం ఎదుర్కొనవలసి వచ్చే కుల వివక్షవంటిది అక్కడ జాత్యహంకారం రూపంలో నల్లజాతివారిని బాధిస్తుంటుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకునే రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ వంటివారు ఈ వివక్ష భరించలేక ప్రాణాలు పోగొట్టుకుంటే... అక్కడ రాజ కుటుంబీకుణ్ణి పెళ్లాడిన మేఘన్ సైతం అదే కోవలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వివక్ష ఒక మనిషిని మానసికంగా ఎంత కుంగ దీస్తుందో, ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుందో మేఘన్ ఉదంతం మరోసారి చాటింది. ప్రేమాభిమానాలు అడుగంటి, రంగు తప్ప మరేమీ ముఖ్యం కాదనుకుంటున్న రాజకుటుంబం నుంచి నిష్క్రమించి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఆ కుటుంబానికి ఒకరకంగా మేలు చేశారని చెప్పాలి. రాచరిక దర్పం కనీసం నామమాత్రంగానైనా మిగలాలంటే ముందు మనుషులుగా ప్రవర్తించటం నేర్చుకోవాలని వారు తెలియజెప్పారు. అది గ్రహించగలిగితే బ్రిటన్ రాజకుటుంబానికే మేలు చేకూరుతుంది. -
చేతివాటం మారాజు..
రాచరికంలో దోపిడీ అంతా పరోక్షంగానే సాగేది. రాజాధి రాజులు, మహా మహా చక్రవర్తులు యథాశక్తి ప్రజలపై పన్నులు వడ్డిస్తూ ఆ విధంగా ముందుకుపోయేవారు. అలాగని వారు నేరుగా ఏనాడూ జేబులు కత్తిరించిన పాపాన పోలేదు. ఈజిప్టును పరిపాలించిన చిట్టచివరి రాజు ఫరూక్ మిగిలిన రాజుల కంటే భిన్నమైన పిచ్చిమారాజు. ఇతగాడు ఏకంగా జేబులు కత్తిరించే రకం. కంటికి నదరుగా కనిపించిన వస్తువు ఎంత చిన్నదైనా, పనికిమాలినదైనా కొట్టేయకుంటే అతగాడికి నిద్రపట్టేది కాదు. ఇదోరకం జబ్బు. దీనినే ‘క్లెప్టోమానియా’ అంటారు మానసిక వైద్యులు. అది సరే! జేబులు కొట్టేసిన వాడికి అవసరమైన సమయాల్లో పిక్కబలం చూపి పరుగెత్తే సత్తా ఉండాలి. ఫరూక్ మహారాజా వారికి అలాంటిదేమీ లేదు. సుష్టుగా ముప్పూటలా భోంచేసి పెంచిన 136 కిలోల భారీ శరీరంతో గజగమనుడై అలరారేవాడు. అడుగుతీసి అడుగు వేయడమే గగనంగా ఉండేది. ఇంతటి మహాకాయుడైన మహారాజా ఫరూక్వారు ఒకసారి ఏకంగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ చేతిగడియారాన్నే కొట్టేసి చరిత్రలో నిలిచిపోయాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు