Moscow airport
-
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత
మాస్కో: ఆదివారం ఉదయం మాస్కో నగరంలో మొత్తం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడగా ఒకదాన్ని నగరం శివార్లలోనే కూల్చేశాయి రష్యా బాలగాలు. రెండిటిని మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బతీశాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు తగల్లేదని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. దీంతో కొద్దిసేపు మాస్కో విమానాశ్రయాన్ని మూసివేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 500 కి.మీ(310 మైళ్ళు) మేర ఆ దేశం అప్పుడప్పుడు దాడులకు పాల్పడింది. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ క్రెమ్లిన్, సరిహద్దులోని రష్యా పట్టణాల మీద దాడి చేసింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ దాడులపై స్పందిస్తూ.. ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత వరకు దెబ్బతిన్నాయని.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడుల్లో ఒకదాన్ని మాస్కో ఒడింట్సోవ్ జిల్లాలోని రక్షణ బలగాలు మట్టుబెట్టాయని మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ధ్వంసం చేసిందని.. వాటి శకలాలు నిర్మానుష్య ప్రాంతంలో నేలకూలాయని అన్నారు. ఈ కారణంగానే కొద్దిసేపు వ్నుకోవో విమానాశ్రయానికి రాకపోకలను నిలిపివేసినట్లు చెబుతూ దీన్ని మేము తీవ్రవాదుల చర్యగానే పరిగణిస్తున్నామని తెలిపింది రష్యా రక్షణ శాఖ. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు -
విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి
మాస్కో : అకస్మాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్లో దాదాపు 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. -
తేనెటీగలా మజాకానా?
మాస్కో: మన దేశంలో వీఐపీ కల్చర్ విమానాల ఆలస్యానికి కారణమవుతోంటే. రష్యాలో మాత్రం అనుకోని అతిథుల వల్ల విమానం సుమారు గంటసేపు నిలిచిపోయింది. అవును.. మాస్కో విమానాశ్రయంలో తేనెటీగలు హల్చల్ చేశాయి. ఒక్కసారి సమూహంగా విమానంపై విరుచుకుపడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఎయిర్ బస్-319 మరికొద్ది సేపట్లో గాల్లోకి ఎగురుతుందనగా గుంపులు గుంపులుగా తేనెటీగలు వచ్చిపడ్డాయి. వేలాదిగా వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా విమానాన్ని చుట్టుముట్టి విమాన రెక్కలను పూర్తిగా కవర్ చేసేశాయి. ప్రయాణికులపై దాడికి దిగాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెండు అంబులెన్స్‌లను రంగంలోకి దించారు. ఊహించని ఈ పరిణామంతో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లాల్సిన విమానం గంటసేపు నిలిచిపోయింది. ఇంకా ఎక్కడైనా తేనెటీగలు దాక్కున్నాయేమోననే భయంతో క్యాబిన్ లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాగా గత నెలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. యూకే నుంచి డబ్లిన్‌కు పయనమై విమానమొకటి తేనెటీగల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.