Mother and Son Murder
-
Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్‌లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్‌లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..?
పెదగంట్యాడ (విశాఖపట్నం): మండలంలోని మదీనాబాగ్‌లో తల్లీకుమారుడు దారుణహత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 77వ వార్డు పరిధి మదీనాబాగ్ ప్రాంతంలో జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మంగి గౌరమ్మ (55), ఆమె కుమారుడు మంగి పోలిరెడ్డి (35) నివసిస్తున్నారు. వీరిద్దరూ మదీనాబాగ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా.. గౌరమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు నగరంలో ఉంటున్నాడు. రెండో కుమారుడు పోలిరెడ్డి తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇతనికి వివాహం కాలేదు. మూడో కుమారుడు అదే బ్లాక్‌లో ఓ ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె దుబాయ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ బ్లాక్ నంబర్ 3లో ఎండీ 3ఎస్ – 1లోని బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వారిద్దరూ ఇందులోనే నివసిస్తున్నారు. అయితే వారి మృతదేహాలు మాత్రం అదే బ్లాక్‌లో ఎదురుగా ఉన్న ఎండీ 4 – 1ఎస్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. అదే బ్లాక్‌లో నివసిస్తున్న గౌరమ్మ మనవడు (చిన్న కుమారుడు కొడుకు) గురువారం మధ్యాహ్నం మృతదేహాలను చూసి డయల్ 100కి సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో ముగ్గురు..! తల్లీకుమారుడిని ఎవరు హత్య చేశారనే విషయంలో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. హత్యల సమాచారం తెలిసిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్‌తోపాటు డీసీపీ సుమిత్ సునీల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలి చిన్న కుమారుడితోపాటు, అతని భార్యను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వీరితోపాటు సాయి అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో కొంత మంది యువకులు గంజాయి సేవిస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతుంటారని.. ఈ హత్యలతో వారికేమైనా సంబంధం ఉందా..? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం,తల్లీకొడుకు హత్య
-
తల్లీకొడుకు దారుణ హత్య
అమీర్‌పేట: తల్లీ,కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంతి. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ (27) రాజేష్ దంపతులు తమ కుమారుడు కిషన్(4)తో పాటు, ఊర్మిళ సోదరి చంద, దీపక్ దంపతులు 15 రోజుల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సనత్‌నగర్ జింకల వాడలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. దీపక్ ఆటో నడుపుకుంటుండగా, చంద ప్రైయివేటు కంపెనీలో పనిలో చేరింది. రాజేష్, ఊర్మిళ దంపతులు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం దీపక్, చంద దంపతులు పనికి వెళ్లగా ఊర్మిళ, రాజేష్ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన ఊర్మిళ సోదరి చంద ఇంటికి తాళం వేసి ఉండటాన్ని చూసి అక్కా, బావ పని వెతుక్కునేందుకు బయటికి వెళ్లి ఉంటారని భావించి తిరిగి పనిలోకి వెళ్లింది. సాయంత్రం భర్త దీపక్ తో కలిసి ఇంటికి రాగా తాళాలు వేసి ఉండటంతో వారికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో తాళాలు పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఊర్మిళ, కిషన్ విగతజీవులై కనిపించారు. ఊర్మిళ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో పడి ఉంది. బాలుడు కిషన్ నీళ్ల బకెట్లో తలకిందులుగా పడి ఉన్నాడు. ముందుగా ఊర్మిళను ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేసి అనంతరం బాలుడ్ని బకెట్లో ముంచి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే చంద, దీపక్ దంపతులు భయంతో సాయంత్రం వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. స్థానికుల సాయంతో సాయంత్రం సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. రాజేష్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో అతడే ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాగా నిందితుడు రాజేష్‌కు ఏడేళ్ల క్రితం వివాహం జరగ్గా అతడి వేధింపులు తాళలేక మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఊర్మిళను రెండో వివాహం చేసుకున్న అతను అనుమానం తో హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పక్కింటి యువకుడే కాలయముడు
తమిళనాడు, తిరుత్తణి: తల్లీబిడ్డ హత్య కేసులో పక్కింటి యువకుడే కాలయముడయ్యాడు. అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి శివారులోని పీటీ పుధూర్ బాలాజీ నగర్‌కు చెందిన వనపెరుమాళ్(45) ప్రైవేట్ కర్మాగారంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా భార్య వీరలక్ష్మి(40), కుమారుడు పోతిరాజు(10) హత్యకు గురయ్యారు. ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించాడు. హత్యకు సంబంధించి తిరువళ్లూరు జిల్లా ఎస్పీ పొన్ని మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో వేలిముద్రలను సేకరించి విచారణ చేపట్టారు. వేలిముద్ర ఆధారంతో చిక్కిన నిందితుడు.. హత్య జరిగిన ఇంట్లో వేలిముద్రలు సేకరించిన నిపుణులు వాటి ద్వారా విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వనపెరుమాళ్ ఇంటి పక్కింట్లో ఉంటున్న సత్యరాజు కుమారుడు వెంకట్(23)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్య చేసినట్టు అంగీకారం.. పోలీసులు వెంకట్‌ను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. పాల వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు.. దీంతో అప్పులు తీర్చడానికి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. పక్కింటిలోని వనపెరుమాళ్ ఇంట్లో నగలు ఉన్నట్లు తెలిసిందన్నాడు. చోరీ చేయడానికి పథకం వేశాడు. ఈ నెల 8న వేకువజామున 4 గంటలకు ఇంట్లో చొరబడ్డాడు. అయితే శబ్దం రావడంతో ఇంటి ముందు శుభ్రం చేస్తున్న వీరలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. మొహానికి మాస్కు ధరించిన వ్యక్తిని చూసి ఆమె కేకలు వేసింది. దీంతో ఇంటి తలుపులు మూసివేసి నగలు ఇవ్వాలని బెదిరించాడు. అతన్ని వీరలక్ష్మి గుర్తించడంతో పాటు చోరీ విషయం అందరికీ చెబుతానని అరిచింది. ఆగ్రహానికి గురైన వెంకట్ ఇనుప రాడ్డుతో ఆమె తలపై దాడి చేసి హత్య చేశాడు. తల్లి కేకలు విన్న పోతురాజు తండ్రికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని పసిగట్టిన దుండగుడు కేబుల్ వైర్‌తో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం 21 సవర్ల నగలను తీసుకుని పరారైనట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తిరుత్తణి పోలీసులు హంతకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. -
సోదరిని కాపురానికి తీసుకెళ్లలేదని...
-
నంద్యాలలో ఆస్తికోసం తల్లికొడుకుల దారుణ హత్య
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో తల్లికొడుకులను హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికొడుకులు ఇద్దరినీ దారుణంగా నరికి చంపారు. ఆస్తి కోసమే వారిని హత్య చేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు.