mukesh singh
-
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ తాజా విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరిన అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం మిగల్లేదు. నీకు క్షమాభిక్ష అడిగే అవకాశం లభించింది. అది తిరస్కరించబడింది. వారెంట్లు జారీ అయ్యాయి. క్యూరేటివ్ పిటిషన్ కూడా కొట్టివేశాం. ఇంకా ఏం మిగిలి ఉంది’’అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఉరిశిక్షను నిలుపుదల చేసే అవకాశాలు లేవని పేర్కొంది. (శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి) ఈ సందర్భంగా తన పట్ల నేరపూరిత కుట్ర పన్నారంటూ తన మాజీ లాయర్ వృందా గ్రోవర్‌పై చర్యలు తీసుకోవాలన్న ముఖేశ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత తేదీ నుంచి మూడేళ్లలోపు మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని తన లాయర్ ఎంఎల్ శర్మ ద్వారా ముఖేశ్ గత వారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు ఉన్న అన్ని హక్కులను పునరుద్ధరించాలని, మరోసారి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు, క్షమాభిక్ష అడిగేందుకు జూలై 2021 నాటి వరకు అనుమతినివ్వాలని కోరాడు. ‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్తో పాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’’ అని ముఖేష్ తన పిటిషన్లో ఆరోపణలు గుప్పించాడు. కాగా నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్‌వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మరణశిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.(మళ్లీ న్యాయ హక్కులు ఇవ్వండి) -
మళ్లీ న్యాయ హక్కులు ఇవ్వండి
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. న్యాయవాదులు తప్పుదోవ పట్టించిన కారణంగా న్యాయపరంగా తనకు ఉన్న హక్కులన్నింటినీ మళ్లీ దఖలుపరచాలని కోరుతూ ఎం.ఎల్ శర్మ అనే న్యాయవాది ద్వారా శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కోర్టు సహాయకారిగా వ్యవహరించిన న్యాయవాది వృందా గ్రోవర్లు తనపై నేరపూరిత కుట్ర పన్నారని, మోసానికి పాల్పడ్డారని ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ముఖేష్ తన తాజా పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు తన క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన నాటి నుంచి న్యాయస్థానాలు ఇప్పటివరకూ జారీ చేసిన అన్ని ఉత్తర్వులను కొట్టివేయాలని, రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని కూడా రద్దు చేయాలని కోరాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశముంది. సంతకాల కోసం బెదిరించారు ‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్‌తోపాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’ అని ముఖేష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సంతకాలు పెట్టించాలని సెషన్స్ కోర్టు ఆదేశించినట్లు ప్రతివాదులు ముఖేష్ సింగ్‌తో చెప్పారని వివరించారు. -
ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు వ్యతిరేకంగా నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘జైల్లో పడిన బాధలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవు’ అని కోర్టు తేల్చిచెప్పింది. జైలులో పడిన కష్టాలు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయలేవంటూ జడ్జీలు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్న వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయసమీక్షకు అవకాశం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ముకేశ్‌ను 8నెలలకు పైగా జైలులో ఉంచారన్న పిటిషనర్ తరపు లాయర్ వాదనలను కోర్టు అంగీకరించలేదు. రాష్ట్రపతి వేగంగా పిటిషన్‌ను తిరస్కరించారన్న ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌ను వేగంగా తిరస్కరించారన్న ముకేశ్ అభియోగాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పు పట్టారు. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయాల్లో ఆలస్యాన్ని విమర్శిస్తూ గతంలో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. క్షమాభిక్ష కేసుల్లో ఆలస్యం అమానవీయమైనదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, హోం శాఖ ముకేశ్ తిరస్కరణకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ 4రోజుల్లో పూర్తిచేసినట్టు కోర్టు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్ ఇంత వేగంగా తిరస్కరణకు గురవడంలో ఇది రికార్డు అని కోర్టు తెలిపింది. రాష్ట్రపతికి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్.. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. వినయ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నారు. వినయ్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్.. వినయ్ పిటిషన్‌ను తానే స్వయంగా అందజేసినట్టు వెల్లడించారు. -
జైల్లో లైంగికంగా వేధించారు
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, విపరీతంగా కొట్టారని, లైంగికంగా వేధించారని నిర్భయపై అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష ఇవ్వడంలో మనసు పెట్టి ఆలోచించలేదని అన్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సుప్రీంకోర్టుకెక్కారు. దీనిపై సుప్రీం కోర్టులో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. జైల్లో ముఖేష్‌ను కొట్టేవారని, లైంగికంగా వేధించారని అతని తరఫు లాయర్ అంజనా ప్రకాశ్ చెప్పారు. అందరూ కలిసి ఒక వ్యక్తి జీవితంతో చెలగాటమాడుతున్నారని, క్షమాభిక్ష అంశంలో రాష్ట్రపతి మనసుపెట్టి ఆలోచించలేదని వాదించారు. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ స్పందించారు. రాష్ట్రపతి కోవింద్ అన్ని కోణాల నుంచి ఆలోచించలేదని, క్షమాభిక్ష సమయంలో కరుణ చూపలేదని మీరెలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. క్షమాభిక్ష పిటిషన్ సమయంలో కేంద్రం వాస్తవాలన్నీ రాష్ట్రపతికి సమర్పించలేదని, ఆయన క్షమాభిక్ష నిరాకరించడానికి ముందే ముఖేష్‌ని ఏకాకిని చేసి ఒక గదిలో బంధించారని, అది జైలు నిబంధనలకు విరుద్ధమని, ఆమె తన వాదనలు వినిపించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జైల్లో ఉండే వారు అనుభవించే బాధలు క్షమాభిక్ష ఇవ్వడానికి ప్రాతిపదిక కాదన్నారు. కేంద్రం అన్ని డాక్యుమెంట్లు రాష్ట్రపతికి సమర్పించిందని, అంత ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి ఎవరైనా క్షమాభిక్ష ఇస్తారా అని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెంచ్ తీర్పుని బుధవారానికి వాయిదా వేసింది. -
నిర్భయ దోషి ముఖేష్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : తనపై లైంగిక దాడి జరిగిందని నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ముందు ముఖేష్ సింగ్ సంచలన విషయాలను వెల్లడించాడు. తీహార్ జైల్లో తననై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సహ దోషి అక్షయ్ సింగ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయస్థానంలో పేర్కొన్నాడు. తీహార్ జైలు అధికారుల సహకారంతోనే ఈ ఘటన జరిగిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చాడు. రాష్ట్రపతికి పెట్టిన క్షమాభిక్ష పిటిషన్లో ఈ విషయాలు వెల్లడించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని వాపోయాడు. ఈ మేరకు ముఖేష్ సింగ్ తరఫున న్యాయవాది అంజనా ప్రకాశ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. బుధవారం దీనిపై తుది తీర్పును వెల్లడించనుంది. (ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి) కాగా ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులను ఉరితీయాలని న్యాయస్థానం ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం ఇప్పటికే తోసిపుచ్చింది. చివరి ప్రయత్నంగా దోషి ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌కు కూడా ఆయన తిరస్కరించారు. దీంతో దోషులను ఉరి తీసేందుకు తీహార్జైలు అధికారులు మరోసారి ట్రయల్స్ నిర్వహించారు. అయితే ఫిబ్రవరి 1న దోషులను ఉరితీస్తారా? లేదా అనేదానిపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. తాజా పరిణామాలపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే దోషులు ఇలా నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
నిర్భయ దోషుల్ని 22న ఉరితీస్తారా?
న్యూఢిల్లీ: నిర్భయ మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులను ఈ నెల 22న ఉరి తీసే అవకాశాలపై సందిగ్ధం నెలకొంది. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు. అది పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలును వాయిదా వేయాలంటూ ముఖేష్ సింగ్ తరఫు లాయర్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించించి కోర్టు, తాము జారీ చేసిన డెత్ వారెంట్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో లాయర్ గురువారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ అరోరా ఉరి అమలుపై సమగ్ర నివేదికను శుక్రవారానికల్లా సమర్పించాలని ఆదేశించారు. వ్యవస్థలకు కేన్సర్ సోకింది నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందు వల్ల ఉరిశిక్ష అమలు కోర్టు ఆదేశించినట్టుగా 22న సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక కేసులో ఉన్న దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుందని, ముఖేష్ క్షమాభిక్ష పెట్టుకోవడంతో మిగిలిన వారి ఉరినీ వాయిదా వేయాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘నిబంధనల్ని రూపొందించే సమయంలో ఎవరూ బుర్ర ఉపయోగించలేదా ? ఈ లెక్కన దోషులందరూ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నంత వరకు వేచి చూస్తారా? దేశంలో వ్యవస్థలకి కేన్సర్ సోకింది’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఎందుకు ఉరి అమలును ఆలస్యం చేస్తున్నారు ? ఎవరు మిమ్మల్ని నియంత్రిస్తున్నారు ? ఒకసారి డెత్ వారెంట్లు జారీ అయ్యాక ఉరి అమలులో తాత్సారం జరగకూడదంటూ వ్యాఖ్యానించింది. ఇలాగైతే దేశంలో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరి అమలు వాయిదా వేయాలన్న ముఖేష్ సింగ్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఢిల్లీ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించి క్షమాభిక్షను తిరస్కరించాలని నిర్ణయించింది. కాగా,నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలో ఆప్ సర్కార్ కావాలనే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావేద్కర్ ప్రశ్నించారు. వెంటాడుతున్న ప్రాణభయం నిర్భయ దోషుల్లో ప్రాణభయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దోషుల్లో అతి చిన్నవాడైన 26 ఏళ్ల వయసున్న వినయ్ శర్మ అందరికంటే ఎక్కువగా ఆందోళనకు లోనవుతున్నాడు. ఢిల్లీ హైకోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన దగ్గర నుంచి దోషులు నలుగురు ముఖేష్‌సింగ్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ రాథోడ్, పవన్ గుప్తాలను తీహార్ జైలు అధికారులు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. రేయింబగళ్లు వారి కదలికల్ని సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తున్నారు. వారి మానసిక స్థితి దెబ్బ తినకుండా ప్రతీ రోజూ వారితో మాట్లాడుతున్నారు. సైక్రియాటిస్టులు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. వీరిలో వినయ్ శర్మ తన సెల్లో ఒకేచోట ఉండకుండా అసహనంగా తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ
చండీగఢ్: ఎన్నికలపై ఓటర్లకు అవగహన కల్పించేందుకు పంజాబ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో ప్రధాన దోషిగా ఉన్న ముఖేష్ సింగ్ ఫోటోను ఆ ఫ్లెక్సీలో వేయడమే దీనికి కారణం. పంజాబ్‌లోని హోస్లాపూర్ జిల్లా కార్యాలయం సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ పంజాబ్ గాయకుడు గురుదాస్ మాన్, ఆటగాడు అభినవ్ బీంద్రాతో పాటు ముఖేష్ చిత్రం కూడా ఫ్లెక్సీలో ఉంది. దీనిని గమనించిన కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో స్పందించిన మంత్రి శ్యామ్ ఆరోరా.. ఘటనపై విచారణకు ఆదేశించామని, అధికారుల తప్పిదం కారణంగా ఇది జరిగిందని వివరించే ప్రయత్నం చేశారు. దీనికి కారణమయిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న రాత్రి తన స్నేహితుడితో బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మరణించారు. నిర్భయగా పేరుపొందిన ఈ కేసులో ఒక్క మైనర్ మినహా మిగిలిన ఐదుగురికి ఉరి శిక్ష పడింది. అందులో ఒకరైన ముఖేష్ తనకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. అంతేకాక అత్యాచారాలకు మహిళలే కారకులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్దదుమారమే సృష్టించాయి. దీంతో ముఖేష్‌ను వెంటనే ఉరి తీయాలని చాలామంది డిమాండ్ చేశారు. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
కోవెంట్రీ (ఇంగ్లండ్): ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు లభించారుు. పోటీల తొలి రోజు 125 కిలోల విభాగంలో ముకేశ్ సింగ్, 140 ప్లస్ కేజీల విభాగంలో గౌరవ్ శర్మ స్వర్ణాలు సాధించారు. 125 కేజీల విభాగంలో వైభవ్ రాణా, 110 కేజీల విభాగంలో కన్వర్దీప్ సింగ్ రజతాలు గెలుచుకున్నారు. -
బాలికను జవాను కిడ్నాప్ చేయబోయి..
బల్లియా: రక్షణగా నిలవాల్సిన జవాను ఓ కిడ్నాపర్ అవతారమెత్తాడు. చుట్టుపక్కలవారి కళ్లుగప్పి 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లేందుకు ఓ సీఆర్పీఎఫ్ కుట్ర చేశాడు. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని రాజేంద్రనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిగిరిసర్ అనే గ్రామానికి చెందిన ముఖేశ్ అనే వ్యక్తి ఛత్తీస్ గఢ్ లో సీఆర్ పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ఇతడు గత రాత్రి ఎవరూ లేనిది చూసి పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. పోస్కో చట్టం ప్రకారం అతడిపై పలు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. -
ఆ రాత్రి... ఇంకా తెల్లారలేదు!
దృశ్యం ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీపై ఒకవైపు చర్చోపచర్చలు, వాదవివాదాలు జరుగుతుండగానే, మరోవైపు నాగలాండ్‌లోని దిమాపూర్‌లో సంచలనాత్మక సంఘటన జరిగింది. అత్యాచారం కేసుకు సంబంధించిన నిందితుడిని వందలాదిమంది జైల్లో నుంచి వీధుల్లోకి లాక్కొచ్చి విపరీతంగా కొట్టి చంపేశారు. శవాన్ని మోటర్‌బైక్‌కు కట్టి తిప్పారు. క్లాక్‌టవర్ దగ్గర కంచెకు వేలాడదీశారు. ఆ తరువాత శవాన్ని తగలేసారు. ‘‘ఇదెక్కడి ఆటవిక రాజ్యం? వాళ్లు మనుషులా? రక్తం తాగే రాక్షసులా?’’ అని జరిగిన సంఘటనపై బాధ పడిన వాళ్లూ ఉన్నారు. ‘‘జై ళ్లు ఉన్నది ఎందుకు? నేరాన్ని కాదు, నేరమనస్తత్వాన్ని శిక్షించాలి’’ అన్న ప్రజాస్వామిక వాదులు, హక్కుల ప్రేమికులూ ఉన్నారు. జైలు అంటే గుర్తుకొచ్చింది... తీహార్ జైలు! ఇప్పుడు మనం తీహార్ జైల్లోకి వెళొద్దాం. ఇతడి పేరు ముఖేష్‌సింగ్. డిసెంబర్ 16 సంచలనాత్మక దుర్మార్గపు ఘటనలో బస్సు డ్రైవరు ఇతడే. ‘ఎన్ని జన్మలెత్తినా... మేము చేసిన పాపానికి పరిహారం లేదు’, ‘మేము అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించామో అర్థం కావడం లేదు’, ‘ఒకవేళ ఊరిశిక్ష ఖరారైతే... దేవుడు నాకు సరియైన శిక్ష విధించాడు అనుకుంటా. ఒకవేళ క్షమాభిక్ష ప్రసాదిస్తే... కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా... ఆ ముఖేష్ వీడేనా... అని ఆశ్చర్యపోయేలా... మంచి పనులు ఎన్నో చేస్తా’ సారీ... పై మాటలు కల్పిత మాటలు. ‘ఇలా మాట్లాడితే బాగుణ్ణు’ అని రాసుకున్న మాటలు. అతని గొంతులో పశ్చాత్తాపంప్రతిధ్వనించాలని ఆశించి రాసుకున్న ఆశావహ మాటలు. మరి నిజమైన మాటలు ఎలా ఉన్నాయి? అవి వినేముందు ముఖేష్‌సింగ్ వైపు ఒకసారి పరిశీలనగా చూడండి. మాటవరుసకు కూడా అతని గొంతులో, కళ్లలో పశ్చాత్తాపం అనేది కనిపించదు. గుండె అనేది క్రూరత్వంతో, పైశాచికానందం అనే విషంతో నిండిపోయినప్పుడు, కళ్లలో మాత్రం పశ్చాత్తాపం ఎలా కనిపిస్తుంది? ‘‘ఆ సంఘటన ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నాను’’ అని ఒకటికి రెండుసార్లు అంటూనే ‘ఎలా జరిగిందో తెలుసా? ‘ఎందుకు జరిగిందో తెలుసా?’ అని చెప్పకనే చెబుతాడు ముఖేష్. ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించినప్పటికీ బి.బి.సి. యూట్యూబ్ పుణ్యమా అని ముఖేష్‌సింగ్ మాటలు ఆనోటా, ఈనోటా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని... ‘ఎందుకు జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి వల్లే’ ‘అబ్బాయిల వల్ల కాదు... అమ్మాయి వల్లే రేప్‌లు జరుగుతాయి’ (లడ్కీ జ్యాదా జిమ్మేదారి హై రేప్ కే లియే) ‘మంచి అమ్మాయిలు ఎవరూ అంత రాత్రివేళ ఇల్లు దాటి బయటికి రారు’ ‘ఒక్కసారి మా ఊళ్లో తప్ప... ఏ అమ్మాయితోనూ పడుకోలేదు’ ‘మా తమ్ముడు మాత్రం ఇలాంటివెన్నో చేశాడు. ఈసారి మాత్రం (ఢిల్లీ) అతని ఉద్దేశం రేప్ గానీ, దాడి గానీ కాదు. ‘ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లొస్తున్నారు?’ అని తమ్ముడు ఆ అమ్మాయితో పాటు ఉన్న యువకుడిని అడిగాడు. ‘నీకు అనవసరం’ అన్నాడు అతను. దాంతో ఆ యువకుడి చెంప చెళ్లుమంది. అలా ఘర్షణ మొదలైంది. లైట్లు స్విచ్ఆఫ్ అయ్యాయి. అమ్మాయిని బస్సు వెనక్కి లాక్కెళ్లారు. రేప్ మొదలైంది’ ‘రేప్ జరిగినా ఇంకేది జరిగినా ఆ ఇద్దరూ సిగ్గుతో బయటికి చెప్పుకోలేరు అనేది ధీమా. ఒక వేళ పోలీసులకు ఎవరు దొరికినా, ఇతరుల గురించి చెప్పొద్దు అనుకున్నాం’ ‘చచ్చింది. బయటికి లాగి పారేయండి... అరుపులు వినిపిస్తున్నాయి. స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను’ ‘ఆమెను లాగి బయట పారేయడానికి బ్యాక్‌డోర్ ఓపెన్ చేద్దామనుకున్నారు. ఓపెన్ కాలేదు. రక్తం... రక్తం... రక్తం... సీట్లకు, ఫ్లోర్‌కు... అక్షయ్, చిన్న కుర్రాడు బస్సు క్లీన్ చేశాడు. వినయ్ చేతులు రక్తంతో తడిసాయి...’ ఇప్పుడు మనం... డిఫెన్స్ లాయర్ ఫర్ ది రేపిస్ట్స్ ‘యం.ఎల్.శర్మ’ దగ్గరికి వచ్చాం. ఆయన చెబుతున్న ‘డైమండ్ థియరీ’ గురించి విందాం... ‘ఆడపిల్ల అనేది డైమండ్లాంటిది. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వీధుల్లో ఉంటే ఏమవుతుంది? కుక్కల పాలవుతుంది!’ ముఖేష్ మాటల్లో పశ్చాత్తాపం కనిపించకపోవడానికి ‘నిరక్షరాస్యత’ ‘అజ్ఞానం’ ‘వెనకబాటుతనం’ కారణం అనుకుందాం. మరి శర్మకు ఏమైంది? బాగా చదువుకున్నాడు. పేరు పొందిన లాయర్. మరి ఆయన కూడా మూర్ఖుడు ముఖేష్లాగే... మాట్లాడుతున్నాడు. అందుకే నిర్భయ తల్లి కళ్లనీళ్లతో అంటుంది ఇలా... ‘‘ఏ నేరం జరిగినా అమ్మాయిదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. నువ్విలా ఎందుకు చేశావు? అని నేరస్తుడిని ఎవరూ అడగరు’’. ఈ డాక్యుమెంటరీలో చాలామంది ప్రముఖులు మాట్లాడారట. జైల్ సైకియాట్రిస్ట్ ఆఫ్ ది రేపిస్ట్ డా. సందీప్ గోవిల్ మాటల్లో నుంచి నేరస్వభావాన్ని చూస్తామా? ‘మా వాడికేపాపమూ తెలియదు’ అనే ముఖేష్, రామ్‌సింగ్‌ల తల్లిదండ్రులు మంగిలాల్, కళ్యాణి మాటలు నమ్ముతామా? మెంబర్ ఆఫ్ రేప్ రివ్యూ కమిటీ మాజీ చీఫ్ జస్టిస్ లీలా సేథ్ మాటల్లో ఎలాంటి న్యాయాన్ని, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చరిత్రకారిణి, రచయిత్రి డా. మారియ మిశ్రా మాటల్లో ఏ చరిత్రను వెదుక్కుంటాము? సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా.రష్మీ అహుజా, పెట్రోలింగ్ మాన్ రాజ్‌కుమార్ మాటల్లో వినిపించే భయానకత్వానికి ఒళ్లు ఎలా జలదరిస్తుంది అనేది పక్కనపెడితే... ఈ హారిఫిక్ రియాలిటి హైయెస్ట్ రేటింగ్ డాక్యుమెంటరీ అనగానే గుర్తుకొచ్చేవి మాత్రం... ఆ రెండు కళ్లే. పశ్చాత్తాపం కనిపించని ఆ నెత్తుటి కళ్లే! - యాకుబ్ పాషా యం.డి -
ఆ డాక్యుమెంటరీని ప్రసారం కానివ్వం!
న్యూఢిల్లీ: నిర్భయపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా, ఏ విధంగానూ.. ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఏ విధంగా కూడా ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు. దీనిపై దేశమంతా సిగ్గుపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూకు అనుమతి ఎలా లభించిందనే విషయంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ అలోక్ కుమార్ వర్మను రాజ్‌నాథ్ పిలిపించి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ లఘుచిత్రాన్ని ఈ నెల 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా ప్రసారం చేయాలనుకున్న బీబీసీ.. అంతకన్నా ముందుగానే బుధవారం రాత్రి 10 గంటలకు బ్రిటన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమపై చర్య తీసుకునే ముందు ప్రధాని మోదీ ఆ లఘు చిత్రాన్ని ఒకసారి చూడాలని కోరింది. మహిళాసభ్యుల వాకౌట్ ఈ ఉదంతంపై బుధవారం పార్లమెంటు అట్టుడికింది. ముఖ్యంగా మహిళా సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లో ఉన్న గ్యాంగ్ రేప్ దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి లభించడానికి కారణమైన వారిపైచర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఆ డాక్యుమెంటరీలో అశ్లీల పదజాలం వాడటాన్ని బార్‌కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన మహ ళా సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. -
ముఖేష్ వ్యాఖ్యల పై మహిళాలోకం ఆగ్రహం
-
తప్పంతా ఆమెదే: ‘నిర్భయ’ దోషి ముఖేశ్
న్యూఢిల్లీ: ‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు’. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు’ పేరుతో మార్చి 8న ఎన్డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. ఉరిశిక్ష అమలుకానున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేని ముఖేశ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేప్ జరగడానికి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ బాధ్యులన్నాడు. నిర్భయ ఉదంతం యాదృచ్ఛికంగా జరిగిందని, ఆమె ఎదురు తిరగకపోయి ఉంటే అత్యాచారం చేశాక మామూలుగా వదిలేసి పోయేవారన్నాడు. ఇంతకుముందు అత్యాచారం చేసి బెదిరించి వదిలేసేవారని, ఉరిశిక్ష వల్ల ఇక ముందు బాధితురాలిని చంపేస్తారన్నాడు.