Multi National Company
-
క్యాంపస్ సెలక్షన్స్‌లో టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థినీ గ్లోబల్ ఉద్యోగిగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యోగ నైపుణ్య ఆధారిత విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. విద్యార్థి చదువు సమయంలోనే వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.ఇంటర్న్‌షిప్, ఫ్యూచర్ స్కిల్స్‌లో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలిచింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇంజనీరింగ్, డిగ్రీలోనే కాకుండా డిప్లొమా విద్యార్థులూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పేదింటి బిడ్డల విద్యకు ఆరి్థక భరోసా లభిస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ ఈ ఐదేళ్లలో రూ.18,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పెరిగిన క్యాంపస్ కొలువులు చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ కొలువులు సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది (2022–23లో) ఏకంగా 1.80 లక్షల మందికి పైగా ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 1.20 లక్షల మందికి పైగా సాంకేతిక విద్యనభ్యసించిన వారు కాగా, సాధారణ డిగ్రీ అభ్యసించి ఉద్యోగాలు పొందిన వారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు రూ.8.60 లక్షల వరకు ప్యాకేజీని అందుకున్నారు. ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగ నైపుణ్యంఉన్నత విద్యలో 30కి పైగా గ్లోబల్ సర్విసు ప్రొవైడర్ల ద్వారా వర్చువల్, మరో 27 వేలకు పైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసి ఎక్స్పీరియన్స్ ఇంటర్న్‌షిప్‌లకు వైఎస్ జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో 52.80 శాతం ఐటీ, 13.43 శాతం అకౌంటింగ్, 8.45 శాతం విద్యా, 5.47 శాతం ఫార్మా, 8.68 శాతం మార్కెటింగ్, 4.39 శాతం గవర్నమెంట్ సెక్టర్, 2.01 శాతం ఉత్పత్తి, 1.78 శాతం వ్యవసాయం, 1.36 శాతం ఆతిథ్యం, 0.9 శాతం అడ్వరై్టజింగ్, 0.7 శాతం బయోటెక్నాలజీ రంగంలో పేరు గడించిన సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందించింది. తద్వారా చదువు సమయంలోనే విద్యార్థులు సంపాదనను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్ సర్టీఫికేషన్, మరో 1.50 లక్షల మంది ఇతర సర్టిఫికేషన్లు సాధించారు. ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టీఫికేషన్ కోర్సులు పూర్తి చేసి 1.73 లక్షలకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. వీటన్నింటి ఫలితంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. నైపుణ్యాన్ని పెంచే సర్టీఫికేషన్ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్‌లో భాగంగా డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 37 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ద్వారా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పైథాన్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. నాస్కామ్ ప్యూచర్ స్కిల్స్ పేరినేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజుకి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బీఎఫ్ఎస్ఐ అనలిస్ట్ తదితర అంశాల్లో శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్ ఇంటర్న్‌షిప్ అందించింది. 281మంది ఏయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 281 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఏపీఎండీసీలో రూ 8.4 లక్షల వార్షిక వేతనంతో ఐదుగురు, ప్రధాన్ ఎన్జీఓలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో పదిమంది, శ్రీ చైతన్య కళాశాలల్లో 60 మంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌లో 58 మంది, హెటిరో డ్రగ్స్‌లో 109 మంది, సింధు సంస్థలో 39 మంది మొత్తం 281 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కొంతమందికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. విశ్వవిద్యాలయం నుంచి వెళ్లే సమయంలో విద్యార్థి చేతిలో ఉద్యోగ నియామక పత్రం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి పాల్గొన్నారు. రూ.16.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది మా స్వస్థలం ఒంగోలు. నాన్న రైతు. రాష్ట్రంలో సాంకేతిక విద్య కరిక్యులమ్‌లో తెచ్చిన మార్పులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదువు సమయంలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను క్యాంపస్‌లోనే నేర్చుకున్నాం. సాధారణ పాఠ్యాంశాలతో విషయ పరిజ్ఞానం వస్తుంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాం. కంప్యూటర్ సైన్స్ చివరి ఏడాదిలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. డారి్వన్బాక్స్ డిజిటల్ సొల్యూషన్స్‌లో రూ.16.30 లక్షల ప్యాకేజీతో లభించింది. – అల్లాడి సంధ్య, జేఎన్టీయూ కాకినాడ మా ఫ్యామిలీ ఫుల్ ఖుష్మాది విశాఖపట్నం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఇప్పుడు థాట్ వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. అక్కడ ఉద్యోగం చేసేవారికి ఉన్నత చదువులకు ఆ కంపెనీ సహకారం అందిస్తుంది. ప్రత్యేకంగా మార్కెట్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్‌పై మాకు తరగతి గదిలోనే నేరి్పంచారు. ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ కోర్సులతో సిలబస్‌ను దాటి చాలా విషయాలు నేర్చుకున్నాం. గడిచిన రెండేళ్లుగా మా కాలేజీలో క్యాంపస్ ఎంపికలు బాగున్నాయి. – ఆర్.అజయ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనకాపల్లి -
ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం
సాక్షి, అమరావతి: ఓ వైపు పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, మరోవైపు కోర్సుల్లో చేరాక ప్రముఖ సంస్థలతో ఉచితంగా ఇప్పిస్తున్న నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్.. వెరసి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి పే ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేలా కార్యాచరణ అమలు చేస్తోంది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. వీటికి తోడు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఫ్యూచర్ స్కిల్స్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. నైపుణ్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ.. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో గణనీయ ప్రగతి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య కేవలం 37 వేలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఇందులో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో ఉద్యోగాలు పొందినవారు 60 వేల మంది వరకు ఉన్నారు. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే 12వేలకు పైగా ప్లేస్మెంట్లు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. సర్టీఫికెట్లను సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి గరిష్టంగా రూ.35వేలలోపు ఇస్తే.. జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థి తల్లులు ఖాతాల్లోనే క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తోంది. లక్షన్నర మందికి శిక్షణ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ఎనలిస్ట్ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లించి.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లించడం విశేషం. గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతికి చెల్లింపులు ఏడాదికి సగటున కేవలం రూ.2,428 కోట్లు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లను చెల్లిస్తోంది. భోజన, వసతి ఖర్చు కింద ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కేవలం రూ.4 నుంచి రూ.10 వేల వరకే ఇచ్చేది. ఈ పథకం అమలుకు గత ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని బీసీ, ఈబీసీ, కాపు, మైనారీ్టలకు రూ.లక్షకు, ఎస్సీ, ఎస్టీ, పీడీబ్ల్యూలకు రూ.2 లక్షలకు పరిమితం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి లబ్ధి చేకూర్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది.. మాది పేద రైతు కుటుంబం. గతంలో సాగుకే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 2017లో అన్న వరుణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగిలిన ఫీజు అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. దీంతో నేను 2019లో వడ్లమూడిలోని విజ్ఞాన్ లారాలో బీటెక్ సీఎస్ఈలో చేరాను. జగనన్న సాయంతో ఏటా రూ.85 వేల ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండానే నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు బెంగళూరులోని టీసీఎస్‌లో రూ.3.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. – బోరెడ్డి పవన్ కుమార్‌రెడ్డి, సొలస గ్రామం, పల్నాడు జిల్లా జగనన్న విద్యాదీవెన గొప్ప పథకం.. నాన్న హరనాథ్ నిర్వహించే ఫ్యాన్సీ షాపు మాకు జీవనాధారం. నన్ను, అన్నయ్యను చదివించడానికి చాలా కష్టపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రావడంతో నేను దిగులు లేకుండా టెక్కలిలో బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాను. ఏడాదికి రూ.80వేల చొప్పున కోర్సు నాలుగేళ్లపాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. కాలేజీలో ఉండగానే ఉచితంగా సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ అందించడంతో డెలాయిట్‌లో ఉద్యోగం సాధించగలిగాను. జగనన్న విద్యాదీవెన కచ్చితంగా గొప్ప పథకం. – సత్యవరపు మహాలక్ష్మి, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు మా నాన్న నగేశ్ సామాన్య కూరగాయల వ్యాపారి. నేను విద్యా దీవెన సాయంతో గతేడాది బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశా. ఉన్నత విద్యా మండలి ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు అందించింది. ఫలితంగా సాధారణ డిగ్రీ చేసిన నాకు హెచ్‌సీఎల్‌లో రూ.2.40 లక్షల ప్యాకేజీతో ఫైనాన్స్ ఎనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి నాలుగు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యాను. ఎడ్యుటెక్ సంస్థలో 6.50 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేశారు. కంప్యూటర్స్ కెరీర్లో ఎదగాలని హెచ్సీఎల్ను ఎంపిక చేసుకున్నా. – ముదిలి నాగకార్తీక్, విజయవాడ విద్యాదీవెన ఆదుకుంది మా నాన్న రామచంద్రరావు ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా చేస్తున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం. నాన్న ఏడాది సంపాదన లెక్కేస్తే మా ఇద్దరి చదువులకే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ అందడంతో నేను బీఎస్సీ (ఐవోటీ) పూర్తి చేశాను. తమ్ముడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తున్నాడు. నాకు మూడేళ్లు రూ.30 వేల చొప్పున పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. – పట్నియక్ శ్రీనివాసరావు, విజయవాడ -
లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!
అన్ని రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఫ్రెంచ్కు చెందిన మల్టీ నేషన్ కంపెనీ థేల్స్ గ్రూప్ సంచలన విషయం వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ, భద్రత, డిజిటల్ ఐడెంటిటీ, సెక్యూరిటీ రంగాల్లో ఈ ఏడాదిలో 12 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని నియమించుకోనుండగా ప్రత్యేకంగా ఫ్రాన్స్‌లో 5,500, భారత్‌లో 550, యునైటెడ్ కింగ్డమ్లో 1,050, ఆస్ట్రేలియాలో 600, అమెరికాలో 540 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఇంజినీరింగ్ ఆపరేషన్స్ కోసం ఉద్యోగులను నియమించుకుంటోంది. (ఇదీ చదవండి: Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!) థేల్స్ గ్రూప్ తన అన్ని వ్యాపార విభాగాల్లోనూ నియామకాలు చేపడుతోంది. భారత్‌లోని నోయిడా, బెంగళూరులో ఉన్న సైట్ల కోసం శాశ్వత, ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌లు, డిజిటల్ టెక్నాలజీ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం చూస్తోంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
సిగరెట్లు తాగినా... ఆ విషయం దాచొద్దు
మల్టీ నేషనల్ కంపనీలో పనిచేసే రమేష్... వారాంతాల్లో పార్టీలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తుంటాడు. తాను రెగ్యులర్‌గా సిగరెట్లు తాగడు కనక అదేమీ పెద్ద విషయం కాదనుకుని, ఆ వివరాల్ని బీమా పాలసీ తీసుకున్నప్పుడు పేర్కొనలేదు. ఇలా అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చే చాలామంది ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది. కానీ బీమా పాలసీ తీసుకునేటప్పుడు మాత్రం సిగరెట్ కాల్చే అలవాటు గురించి మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు బీమా కంపెనీలు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీన్ని బట్టే మీరు చెల్లించే ప్రీమియాన్ని కూడా నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో టర్మ్ పాలసీలను పోటీ పడి మరీ తక్కువ ప్రీమియంకే అందిస్తుండటంతో కంపెనీలు ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. సిగరెట్ కాల్చేవారు ఆ అలవాటు లేని వారితో పోలిస్తే 1.5 నుంచి 2 రెట్లు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. మూడు రకాలు.. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిని స్మోకర్, నాన్ స్మోకర్, ప్రిఫర్డ్ నాన్ స్మోకర్ అనే మూడు రకాలుగా విభజించి దాని ప్రకారం ప్రీమియంను లెక్కిస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేని వారికి ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. గత మూడేళ్లుగా నికోటిన్‌ను వినియోగించని వాళ్ళను నాన్ స్మోకర్లుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనలు ఒక్కో కంపెనీకీ ఒకొక్క విధంగా ఉంటాయి. మీరు సిగరెట్లు అప్పుడప్పుడు కాలుస్తున్నా లేక, అలవాటు ఉన్నా.. వీరందరినీ స్మోకర్లుగానే కంపెనీలు భావించి ప్రీమియం నిర్ణయిస్తాయి. అప్పుడప్పుడు అలవాటు ఉన్న వారు కూడా పాలసీ తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని పేర్కొనండి. లేకపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆన్లైన్ టర్మ్ ప్లాన్ తీసుకుంటున్న వారు నాన్ స్మోకర్ అని పేర్కొంటున్న వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. ఇలా అనుమానం వచ్చిన వారి మూత్ర, రక్త పరీక్షలను బీమా కంపెనీలు తీసుకుంటున్నాయి. తర్వాత కూడా చెప్పాలి.. ఈ అలవాట్లు అనేవి ఎప్పుడు మొదలవుతాయో ఎప్పుడు ఆగిపోతాయో చెప్పడం కష్టం. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మొదలైతే ఆ విషయాన్ని బీమా కంపెనీకి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అలా కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మానేస్తే ఆ విషయాన్ని కూడా చెప్పండి. సిగరెట్ మానేసి ఏడాది దాటితే అప్పుడు మిమల్ని నాన్ స్మోకర్గా గుర్తిస్తారు. అప్పుడు మీకు తక్కువ ప్రీమియం రేట్లే వర్తిస్తాయి. ఇలా అలవాట్లు, ఆరోగ్య విషయాలను దాచకుండా వివరిస్తే క్లెయిమ్‌ల సమయంలో మీపై ఆధారపడిన వారికి ఇబ్బందులు ఉండవు. - మునీష్ షర్దా, ఎండీ,సీఈవో, ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ -
కోవిద్... లక్ష్యాన్ని చేరుకో ఇలా
కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమయ్యింది. మనలో చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గతేడాదిలా కాకుండా ఈ ఏడాది నుంచి చక్కటి ఆర్థికప్రణాళికతో వెళ్ళాలనుకుంటారు. అదే విధంగా ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే కోవిద్‌కు కూడా చక్కటి ఆర్థిక ప్రణాళికతో తన లక్ష్యాలను చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని సంప్రదించాడు . కోవిద్ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి సూచించిన ఆర్థిక ప్రణాళిక వివరాలను రైట్ హొరెజైన్స్ సీఈవో అనిల్ రెగో మాటల్లోనే తెలుసుకుందాం.. ముపైయవ పడిలో ఉన్న కోవిద్ నెల జీతం రూ. 55,000. ఇందులో ఇంటి అవసరాలకు రూ. 35,000 పోగా నెలకు రూ. 20,000 వరకు దాచుకోగలడు. ఇంటి బాధ్యతలు దృష్ట్యా భారీ స్థాయిలో రిస్క్ చేసే సామర్థ్యం లేదు. ప్రస్తుతం కోవిద్‌కు ప్రధానంగా మూడు లక్ష్యాలున్నాయి. అవి.. అతిపెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీ కొన డం, యూరప్ దేశాలకు విహార యాత్రలకు వెళ్ళడం, సొంతింటిని నిర్మించుకోవడం. ఈ లక్ష్యాలను వరుసగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలుగా పేర్కొనవచ్చు. ఇలా చేద్దాం.. ఇక కోవిద్ ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి ప్రణాళికలు సూచించే ముందు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మధ్య స్థాయి రిస్క్ మాత్రమే చేసే సామర్థ్యం ఉండటంతో అధిక రిస్క్ ఉండే షేర్లను కొనడాన్ని సూచించలేము. మరో అంశం వయస్సు. ఇతని వయస్సు ఇంకా ముఫ్పై మధ్యలో ఉండటంతో మ్యూచువల్ ఫండ్ వంటి వాటిని సూచించవచ్చు. ఈ అంశాలన్నీ పరిగణనలోనికి తీసుకొని కోవిద్ ప్రతి నెలా సేవింగ్ చేసే మొత్తంలో 25 శాతం డెట్ పథకాలు, 10 శాతం గోల్డ్ ఫండ్స్‌కి కేటాయించి మిగిలిన 65 శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నా. ఈ పోర్ట్‌ఫోలియో ద్వారా కోవిద్.. తన లక్ష్యాలన్నింటినీ సులభంగా చేరుకోవచ్చు. ‘సిప్’ మార్గమే బెస్ట్ పైన సూచించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) మార్గం బాగుంటుంది. రూ. 20,000ను ప్రతి నెలా డెట్ పథకాల్లో రూ. 5,000, గోల్డ్ ఫండ్‌లో రూ. 2,000, ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 13,000 సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతీ విభాగంలోను అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి పనితీరు కనపరుస్తున్న వాటిని ఎంచుకొని వాటిలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మొదటి సంవత్సరం కోవిద్ రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. 3 రకాల విభిన్నమైన అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయ డంతో ఏటా 15% రాబడిని ఆశించవచ్చు. దీంతో మొదటి ఏడాదిలోనే తొలి లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలడు. ఆ తర్వాత రెండు మూడేళ్లకే విదేశీ యాత్ర కలను నిజం చేసుకోవచ్చు. కోవిద్.. ఇదే విధంగా 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ.. దీనిపై 15% వార్షిక రాబడిని అంచనా వేస్తే కోవిద్ సంపద విలువ రూ. 66 లక్షలు దాటుతుంది. బీమా ముఖ్యమే.. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు, వైద్య ఖర్చులు పెరుగుతాయి... కాబట్టి బీమా రక్షణ అనేది చాలా కీలకం. చిన్న వయసులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమాను తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే వీటిని పొందవచ్చు. వార్షిక జీతానికి కనీసం 10 రెట్లు అధికంగా ఉండే విధంగా జీవిత బీమా తీసుకోండి. ఇక్కడ కోవిద్ విషయానికి వస్తే కనీసం రూ. 60 లక్షలు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. జీవితంలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అతని కుటుంబానికి బీమా ఆర్థిక రక్షణను ఇస్తుంది. లోన్‌తో కట్టుకుందాం.. ఇక మూడవ లక్ష్యం సొంతింటి నిర్మాణం విషయానికి వస్తే.. ఈ కలను గృహరుణం ద్వారా తీర్చుకోమని సూచిస్తాను. మొత్తం డబ్బులు సమకూర్చుకొని ఇంటిని కొనుగోలు చేసే బదులు, రుణం తీసుకొని నిర్మించుకోవడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. సెక్షన్ 24 కింద చెల్లించే వడ్డీపై ఏటా రెండు లక్షలు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఇప్పటికే పన్ను పరిధిలో ఉన్న కోవిద్‌కు ఇది ఊరటనిస్తుంది. ఫ్యామిలీ బడ్జెట్ బడ్జెట్తయారు చేసుకొని దాని ప్రకారం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పన్ను ప్రయోజనాలుండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి. మొత్తం సొమ్మును ఒకేసారిగా కాకుండా సిప్ విధానాన్ని ఎంచుకోండి. పన్ను భారం తగ్గించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను సాధ్యమైనంతగా వినియోగించుకోండి. -
అద్దెకు ఆఫీసు!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ప్రాంతాల్లో ఆఫీసు తెరవాలంటే అక్కడి స్థిరాస్తి ధరలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న కంపెనీలు భరించలేనంతగా ఉంటాయన్నది నిజం. ఈ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కోట్లలో పెట్టుబడి, ఆఫీసు ఫర్నీచర్, ఉద్యోగులకు వేతనాలు ఇలా అన్నింటి భారాన్ని మోస్తూ బిజినెస్‌ను నడపడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి కష్టాలకే చెక్ చెబుతాయి వర్చువల్ ఆఫీసులు. ఆఫీసు స్థలం నుంచి ఫర్నీచర్, ఉద్యోగుల వరకు అన్నీ అద్దెకు లభించడమే వీటి ప్రత్యేకత. దీంతో వ్యాపారం చేద్దామనుకున్న 3 గంటల్లోనే ప్రారంభించొచ్చు. వీటి లాభాలు చూసి చిన్న కంపెనీలే కాదు మల్టినేషనల్ కంపెనీలూ ఆసక్తి చూపిస్తున్నాయి. స్థలం నుంచి ఉద్యోగుల వరకు.. వర్చువల్ ఆఫీసు అంటే కార్యాలయానికి అవసరమైన స్థలం నుంచి ఫర్నీచర్, ఫోన్, ఫ్యాక్స్ నెంబర్లు, బిజినెస్ కార్డులు, లెటర్ హెడ్స్, సమావేశాల కోసం ప్రత్యేక గదులు, ఆడియో, వీడియో సౌకర్యం, ఇంటర్నెట్ సేవలు.. ఇలా ప్రతి ఒక్కటీ అద్దెకిస్తారు. అంతేకాకుండా అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్ కూడా ఉంటుంది. ఈ రిసెప్షనిస్ట్ సంబంధిత కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని యజమానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆఫీసుకొచ్చే లెటర్లను కంపెనీ యజమానికి కొరియర్ చేస్తారు. కంపెనీలెన్నో.. దశాబ్ధకాలంగా బాగా ప్రాచుర్యం పొందిన సర్వీస్, వర్చువల్ ఆఫీసు సేవలను నగరంలో చాలా కంపెనీలందిస్తున్నాయి. ఇంపీరియల్ సర్వ్కార్ప్ హైదరాబాద్, ముంబై నగరాల్లో 50 వేల చ.అ. విస్తీర్ణంలో సర్వీస్, వర్చువల్ ఆఫీసు సేవలనందిస్తోంది. గచ్చిబౌలిలోని ఐటీ పార్క్, ముంబయిలో అయితే బంద్రకుర్లా కాంప్లెక్స్‌లో ఈ ఆఫీసులున్నాయి. ఐకేవా అనే మరో సంస్థ బంజారాహిల్స్‌లోని ఎంబీ టవర్స్‌లో, బెంగళూరులో అయితే కేస్నా బిజినెస్ పార్క్‌లోని ఉమియా బిజినెస్ బేలో ఈరకమైన సేవలనందిస్తోంది. ప్రయోజనాలెన్నో.. కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టే వారు ఆ బిజినెస్‌ను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? ఎలాంటి మార్పులవసరం వంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు వర్చువల్ ఆఫీసులు ఉపయోగపడతాయి. కంపెనీకి ప్రొఫెషనల్ బిజినెస్ అడ్రస్ వస్తుంది. అందరూ సులువుగా గుర్తు పట్టే ప్రాంతంలో ఆఫీసు అడ్రస్ ఉండటంతో కంపెనీపై నమ్మకం ఏర్పడుతుంది. వర్చువల్ ఆఫీసైతే యజమాని రోజూ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధన వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం. వర్చువల్ ఆఫీసు సేవలు రెండు రకాలు. 1. వర్చువల్ ఆఫీసు 2. సర్వీస్ ఆఫీసు. వర్చువల్ ఆఫీసు: ఆఫీసుకు చిరునామా, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ సేవలుంటాయి. క్లయింట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునేందుకు ఓ రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆఫీసుకొచ్చే ఫోన్లు స్వీకరించి సంబంధింత యాజమాన్యానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక ధర విషయానికొస్తే.. ఫోన్ నంబర్, అడ్రస్, ఫ్యాక్స్ సేవలకైతే నెలకు ఒక్కో దానికి రూ.2,500 చెల్లించాలి. అందరికి తెలిసిన బిజినెస్ అడ్రస్ ఉంటుంది కాబట్టి కస్టమర్లకూ నమ్మకముంటుంది. సర్వీస్ ఆఫీసు: వీటిలో ఆఫీసును పెట్టుకునేందుకు వీలుగా అద్దెకు స్థలం కేటాయిస్తారు. చ.అ.లను బట్టి ధరలుంటాయి. సుమారుగా రూ.40 వేలు నుంచి లక్షకు పైగానే ధరలున్నాయి. అలాగే సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ప్రత్యేక గది ఉంటుంది. దీనికి 10 నిమిషాలకు రూ.85 చెల్లించాలి. మరో 7 నగరాలకు విస్తరిస్తున్నాం ప్రస్తుతం హైదరాబాద్, ముంబై నగరాల్లో మాత్రమే ఇంపీరియల్ సర్వ్కార్ప్ సేవలున్నాయి. రెండేళ్లలో బెంగళూరు, గుర్గావ్, చెన్నై, పుణె, ముంబైలోని మరో మూడు ప్రాంతాల్లో ఈ సేవలన్ని విస్తరిస్తాం. ఒక్కో నగరంలో 15 వేలు- 25 వేలు చ.అ. విస్తీర్ణాన్ని అందుబాటులోకి తెస్తాం. - తన్విర్ ఎస్ కౌర్, ఇంపీరియల్ సర్వ్కార్ప్ కంట్రీ హెడ్