విదేశాంగ మంత్రిగా సూచీ
నేపిడా: మయన్మార్ విదేశాంగ శాఖ మంత్రిగా ఆంగ్ సాన్ సూచీ బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవి చేపట్టకుండా ఆర్మీ రూపొందించిన కొత్త రాజ్యాంగం అడ్డుకోవడంతో విదేశాంగ శాఖను సూచీ చేపడతారని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చేవారం టిన్ క్వా మయన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆ సమయంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి వివరాలను పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. సూచీ ఏ శాఖ నిర్వహిస్తారన్నది మాత్రం చెప్పలేదు. సూచీ విదేశాంగ శాఖతో పాటు విద్య, విద్యుత్, అధ్యక్ష కార్యాలయ శాఖల్నీ నిర్వహిస్తారని భావిస్తున్నారు.