'పిల్లలందరూ చదుకోవాలన్నదే లక్ష్యం'
ఒంగోలు: పిల్లల భవిష్యత్ ను బంగారు భవిష్యత్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలందరూ చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రకాశం జిల్లాలో నాగులపాలెంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగారని తెలిపారు.
అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల... మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరారని చెప్పారు. నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాని స్థాయికి వచ్చారని చంద్రబాబు అన్నారు. రాష్టాభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు.