new record high
-
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్‌పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్‌తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
లగ్జరీ కార్లు రయ్.. రయ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ నేపథ్యంలో 2019 సంవత్సరాన్ని మించి అమ్మకాలు నమోదవుతాయని ధీమాగా ఉన్నాయి. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున విక్రయాలు ఉంటాయని చెబుతున్నాయి. 2019లో దేశంలో 40,000 లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారి. ‘పరిశ్రమ మరింత స్థితిస్థాపకంగా మారింది. కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేకపోవడంతో స్థిరమైన పునరుద్ధరణ ఉంది. లగ్జరీ కస్టమర్ల తీరులో మార్పు, స్టార్టప్‌లు విజయవంతం కావడం, యువ సంపన్న వినియోగదారులు, దేశీయంగా కార్ల తయారీ.. వెరశి అధిక అమ్మకాలకు దారి తీస్తుంది. విక్రయాలు 2019 స్థాయిని దాటతాయి’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. జూలైలో కంపెనీ అత్యధిక యూనిట్లను సాధించింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన ఉత్తమ అమ్మకాలతో పోలిస్తే పండుగల సీజన్లో మూడు రెట్ల వృద్ధి ఆశిస్తున్నామని వివరించారు. సెంటిమెంట్ సానుకూలం.. వినియోగదార్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రెండవ త్రైమాసికం నుంచి పండుగల సీజన్ వరకు బలమైన డిమాండ్ ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘సరఫరా సవాళ్లు ఉన్నాయి. పండుగల సీజన్లో సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం. ఏఎంజీ, ఇతర వర్షన్స్‌లో ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ ఈ పండుగలకు రానుంది’ అన్నారు. కొన్ని నెలలుగా డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. కంపెనీ కార్లకు డిమాండ్ తీవ్రం కావడంతో వెయిటింగ్ పీరియడ్ అధికమైందని చెప్పారు. ప్రపంచ సవాళ్లు కొత్త కార్ల సరఫరాను ప్రభావితం చేయడమే కాకుండా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. దేశంలో మొత్తం కార్ల పరిశ్రమలో లగ్జరీ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది. ఈ విభాగం దశాబ్ద కాలంగా అదే స్థాయిలో కొనసాగుతోంది. లగ్జరీ కార్లపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. సెడాన్స్పై 20, ఎస్‌యూవీలపై 22 శాతం సెస్ అదనం. -
Corona Cases in India: కరోనా కేసులు మళ్లీ పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా సంక్రమణతో దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,12,262 కొత్త కరోనా రోగులను గుర్తించారు. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో కేసులు నమోదుకాలేదు. కాగా, 24 గంటల్లో ఇంతటి భారీస్థాయిలో కొత్త కేసులు భారత్‌లో నమోదవడం ఇది రెండోసారి. గతంలో ఏప్రిల్ 30న 4,02,351 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షలాది కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కు చేరింది. కోవిడ్ బారిన పడి గత 24 గంటల్లో మరో 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,30,168కు పెరిగింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 353 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 81.99 శాతానికి చేరుకుంది. పాజిటివిటీ రేటు 21.43గా నమోదైంది. 35.66 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య సైతం వేగంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 3,29,113 మంది కరోనాను ఓడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 1,72,80,844కు చేరింది. రోజూ నమోదైన కొత్త కరోనా కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398 కు పెరిగింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, రాజస్తాన్, బిహార్‌సహా 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 6.43 లక్షలు, కర్ణాటకలో 4.87 లక్షలు, కేరళలో 3.76 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 2.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 81.05% యాక్టివ్ కేసులు 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా 16,25,13,339 కోవిడ్ టీకాలిచ్చారు. బుధవారం వరకు మొత్తంగా 29,67,75,209 కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. వీటిలో 19,23,131 శాంపిల్స్‌ను బుధవారం ఒక్కరోజులోనే పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. -
పెట్రో ధరలు భగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో శుక్రవారం ఆకాశాన్ని తాకిన పెట్రో ధరలు దేశీయంగా సరికొత్త రికార్డును తాకాయి. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. తాజా పెంపుతో పెట్రోలు ధర రికార్డు స్థాయికి చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో పెట్రో 92 రూపాయల వద్ద రికార్డు హైకి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45 వద్ద రికార్డును సృష్టించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 75.63గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.04 డీజిల్ ధర రూ. 82.40 చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.07 డీజిల్ ధర రూ.80.90 కోలకతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.87 డీజిల్ ధర రూ.79.23 అమరావతి పెట్రోలు ధర లీటరుకు రూ. 91.68, డీజిల్ ధర రూ.84.84. హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.89, డీజిల్ ధర రూ.82.53 -
నిఫ్టీ భళా- 2020కు రికార్డ్స్‌తో వీడ్కోలు
ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్‌కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్‌డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్‌చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్‌యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ) నేటి ట్రేడింగ్ ఇలా డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి. 2020లో జోష్ ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్‌తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్‌లో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్‌కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) రికవరీ ఆశలు కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్‌నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. -
రికార్డులే హద్దుగా మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 322 పాయింట్లు జంప్‌చేసి 47,676కు చేరగా.. నిఫ్టీ 88 పాయింట్లు ఎగసి 13,961 వద్ద ట్రేడవుతోంది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. (19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్) మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, విప్రో, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, గ్రాసిమ్, యాక్సిస్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే, హిందాల్కో, అల్ట్రాటెక్, ఐషర్, ఆర్ఐఎల్, సిప్లా 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఆర్బీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో ఆర్బీఎల్ బ్యాంక్, పీఎన్బీ, బంధన్ బ్యాంక్, టాటా కెమ్, శ్రీరామ్ ట్రాన్స్, బీవోబీ 4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్, టొరంట్ ఫార్మా, బాటా, ఐబీ హౌసింగ్, ఎస్కార్ట్స్, కాల్గేట్ పామోలివ్, నాల్కో, క్యాడిలా 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,558 లాభపడగా.. 673 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఆర్బీఐ ఎఫెక్ట్- 45,000 దాటిన సెన్సెక్స్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు జంప్‌చేసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్లను అధిగమించింది. 45,023కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా ఎగసింది. 13,248ను దాటింది. తద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. ఈ ఏడాది క్యూ3లో జీడీపీ 5.6 శాతం క్షీణతను చవిచూడనుందన్న అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. లాభాల్లో ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, హిందాల్కో, గ్రాసిమ్, ఎయిర్టెల్, గెయిల్, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ 5-1.6 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో ఆర్ఐఎల్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. -
హెచ్‌సీఎల్, ఇన్ఫీ పుష్- ఐటీ షేర్ల దూకుడు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అభిప్రాయపడింది. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాల(గైడెన్స్)ను అందుకోనున్నట్లు పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.5 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 20.5-21 శాతం స్థాయిలో నమోదుకావచ్చని తెలియజేసింది. దీంతో ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోవైపు యూరోపియన్ సంస్థ గైడ్‌విజన్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలందించే ఈ యూరోపియన్ కంపెనీ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తోపాటు.. సాఫ్ట్వేర్ సేవల ఇతర కంపెనీలకూ డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం ఎగసింది. టీసీఎస్ రికార్డ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 9.6 శాతం దూసుకెళ్లింది. రూ. 789 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. టీసీఎస్ 3 శాతం ఎగసింది. రూ. 2,447 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతేకాకుండా టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి ఆర్ఐఎల్ తదుపరి అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా రికార్డు సాధించింది. జోరుగా హుషారుగా ఐటీ సేవల ఇతర కంపెనీలలో ఎంఫసిస్ 8.4 శాతం జంప్‌చేసి రూ. 1251ను తాకింది. తొలుత రూ. 1,270 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ బాటలో మైండ్‌ట్రీ 3.7 శాతం ఎగసి రూ. 1227 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇన్ఫోసిస్ 4 శాతం దూసుకెళ్లి రూ. 983కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా కోఫోర్జ్ 3.25 శాతం లాభపడి రూ. 2158 వద్ద కదులుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. టెక్ మహీంద్రా 3.5 శాతం పెరిగి రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.6 శాతం బలపడి రూ. 2564 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2564 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఐటీ దిగ్గజం విప్రో సైతం 2.75 శాతం పుంజుకుంది. రూ. 302 సమీపంలో ఏడాది గరిష్టం వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో తొలుత రూ. 1331 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన టాటా ఎలక్సీ 2 శాతం లాభంతో రూ. 1314 వద్ద ట్రేడవుతోంది. -
రికార్డు్ల వారం...
స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. చివర్లో అమ్మకాలు జోరుగా సాగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. అయినప్పటికీ.. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించాయి. వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం ఒక దశలో ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 41,682 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,272 వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు హోరెత్తిపోయాయి. మొత్తం 5 ట్రేడింగ్ రోజుల్లో 4 రోజులు సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. ఈ వారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. బడ్జెట్లో మరిన్ని ఉద్దీపన చర్యలు ఉంటాయన్న అంచనాలతో ఆరంభంలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. లిక్విడిటీ కొరతను పూడ్చటానికి ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.10,000 కోట్ల బాండ్ల క్రయ, విక్రయాలను నిర్వహించడం, ట్రెజరీ లాభాలు పెరుగుతాయనే అంచనాలతో ప్రభుత్వ రంగ షేర్లు పెరగడం, క్రిస్మిస్ సెలవులకు ముందు ప్రపంచ మార్కెట్లు ‘బుల్లిష్ మూడ్’లో ఉండటం సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. 2.2 రెట్లు సబ్‌స్క్రైబయిన ప్రిన్స్ పైప్స్ ఐపీఓ ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ కంపెనీ ఐపీఓ 2.2 రెట్లు సబ్‌స్క్రైబయింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.177–178గా ఉంది. ఈ నెల 31న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్: సరికొత్త రికార్డు గరిష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుల్‌రన్‌ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయి. గతరెండు సెషన్స్‌గా కన్సాలిడేషన్ బాటలో సాగినా తిరిగి వారాంతంలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఆరంభంలోనే కీలక సూచీలు ఆల్‌టైం గరిష్టాలను మోదు చేశాయి. సెన్సెక్స్ సెంచరీ లాభాలతో 34, 600 పాయింట్లను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స 92 పాయింట్లు ఎగిసి34, 595వద్ద,నిప్టీ 28 పాయింట్ల లాభంతో 10,679 వద్ద కొనసాగుతున్నాయి. స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ దాదాపు అన్ని రంగాల్లోకు లాభాలే. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఆటో సెక్టార్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. అటు గురువారం డోజోన్స్, ఎస్అండ్పీ, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను తాకడం దేశీయ మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. వేదాంతా, ఐవోసీ, ఐబీ హౌసింగ్, హిందాల్కో, ఐసీఐసీఐ, యాక్సిస్, ఆర్ఐఎల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ లాభాల్లోనూ, క్యూ3 ఫలితాలతో టీసీఎస్ నష్టపోతోంది. అలాగే భారతీ, ఐషర్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డులు: ఫ్లాట్ ట్రేడింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైం హై వద్ద మొదలయ్యాయి. వెంటనే ఫ్లాట్‌గా స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా అంతర్జాతీయమార్కెట్ల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 33, 851వద్ద, నిఫ్టీ చాలా స్వల్పంగా క్షీణించి 10,450కిపైన ట్రేడ్ అవుతోంది. అమర్‌రాజా, గెయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హీరో మోటో లాభాల్లో ఉండగా , సన్ టీవీ, వేదాంతా, అదానీ , బ్యాంకింగ్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు మారుతి మరో ఆల్‌టైం హైని టచ్ చేసింది. -
24వేల మార్కు దాటిన సెన్సెక్స్
ముంబయి : స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 24వేల పాయింట్ల మార్కును దాటింది. మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. తొలిసారిగా సెన్సెక్స్ 24 వేల పాయింట్లు దాటగా, 7,100 పాయింట్లు నిఫ్టీ దాటింది. 500 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 150 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా మూడో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. -
సెన్సెక్స్.... పోర్ట్ వాల్
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా రెండో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారి 23,551వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 155 పాయింట్ల హైజంప్‌తో అతి సులువుగా 7,000 పాయింట్లను అధిగమించింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా 14,090 పాయింట్ల సరికొత్త రికార్డును చేరుకోవడం విశేషం! ఎగ్జిట్ పోల్స్ రాకముందే వరుసగా రెండో రోజూ బుల్ ఆపరేటర్లు పట్టు బిగించారు. ప్రధానంగా బ్లూచిప్స్‌పై దృష్టిపెట్టడం ద్వారా మరోసారి మార్కెట్లను పరుగెత్తించారు. శుక్రవారం 650 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో 557 పాయింట్లు పుంజుకోవడం ద్వారా రెండు రోజుల్లో 1,200 పాయింట్లకుపైగా లాభపడింది. 2011 ఆగస్ట్ తరువాత ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి! ఇక సెన్సెక్స్ ఇంట్రాడేలో 23,573కు చేరగా, నిఫ్టీ 7,020 పాయింట్లను అధిగమించడం విశేషం! వెరసి... కొత్త చరిత్ర సృష్టిస్తూ నిఫ్టీ 7,014 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లు ముగిశాక సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు 290 సీట్ల వరకూ వచ్చే అవకాశమున్నట్లు వెల్లడికావడం గమనార్హం!! సుస్థిర ప్రభుత్వ ఆశలతోపాటు, విదేశీ మార్కెట్ల లాభాలు, డాలరుతో మారకంలో రూపాయి 60 దిగువకు బలపడటం వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలిపారు. బీఎస్ఈలో ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాలూ లాభపడటం విశేషం! ప్రధానంగా ఆయిల్, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్ 3-2.5% మధ్య బలపడ్డాయి. శుక్రవారం రూ. 1,269 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,218 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరోమోటో, ఐటీసీ, సెసాస్టెరిలైట్, ఎస్బీఐ, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, భారతీ, భెల్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ 5-2% మధ్య పురోగమించాయి. ఆటో దిగ్గజాలు టాటా మోటార్స్(4%), మారుతీ(4%), ఎంఅండ్ఎం(2%), టీవీఎస్ మోటార్(9%) కొత్త గరిష్టాలను తాకగా, అశోక్ లేలాండ్(6%) ఏడాది గరిష్టానికి చేరింది. ఇతర దిగ్గజాలలో కోల్ ఇండియా(7%), ఎల్అండ్టీ(3%), జేఎస్‌డ బ్ల్యూ స్టీల్, ఆర్ఈసీ, పీఎఫ్‌సీతోపాటు మొత్తం 189 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, సిప్లా 1.5% స్థాయిలో నష్టపోయాయి. సోమవారం విద్యుత్ రంగ షేర్లు వెలుగులో నిలిచాయి. టొరంట్ పవర్ 18% దూసుకెళ్లగా, ఏబీబీ, పవర్‌గ్రిడ్, జేపీ, రిలయన్స్ పవర్, సీమెన్స్, పీటీసీ, ఎన్టీపీసీ 6-2.5% మధ్య పుంజుకున్నాయి. మిడ్ క్యాప్స్‌లో ఐఆర్బీ ఇన్ఫ్రా, కేఎస్కే ఎనర్జీ, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్, కేఈసీ, గుజరాత్ పిపావవ్, కల్పతరు పవర్, ఎన్సీసీ, పుంజ్‌లాయిడ్, జిందాల్ సా తదితరాలు 13-7% మధ్య జంప్ చేశాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,408 లాభపడగా, 1,440 నష్టపోవడం గమనార్హం.