niet
-
నీట్లో మెరిశారు..!
సాక్షి, హైదరాబాద్: నీట్–2019లో సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ అర్హత పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల నుంచి ఈ ఏడాది దాదాపు 150 మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాలు పొందనున్నట్లు గురుకుల సొసైటీలు అంచనా వేస్తున్నాయి. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఏటా 5వేల మంది విద్యార్థులు బైపీసీ కోర్సు చదువుతున్నారు. అదేవిధంగా టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలోని బైపీసీ కోర్పులో వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు ఈ విద్యార్థులంతా నీట్–2019కు సన్నద్ధమై పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన నీట్–2019 ఫలితాలను ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు విశ్లేషిస్తున్నాయి. జాతీయ ర్యాంకులను ప్రకటించిన నేపథ్యంలో గత ఐదేళ్లలో వచ్చిన ర్యాంకులను బేరీజు వేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ఎంతమందికి ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీట్లు వస్తాయో అంచనాలు రూపొందించారు. ఈక్రమంలో దాదాపు 150 మంది గురుకుల విద్యార్థులకు సీట్లు వస్తాయని భావిస్తున్నారు. 82 మందికి ఎంబీబీఎస్ సీట్లు... నీట్–2019 పరీక్షలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు ఏడుగురు సొంతం చేసుకున్నారు. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో వీరికి జాతీ య స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు వచ్చా యి. నీట్ పరీక్ష రాసిన వారిలో 82 మందికి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని అంచనా. మొత్తం 150 మంది మంచి ర్యాంకులు సాధించగా... అందులో 82 మందికి ఎంబీబీఎస్ సీట్లు, 68 మందికి బీడీఎస్ సీట్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. గతేడాది వచ్చిన ర్యాంకులు, సీట్ల ఆధారంగా విశ్లేషించి ఈమేరకు అంచనాలు రూపొందించారు. సీఎస్ జోషి అభినందనలు... నీట్–2019 ఫలితాలపై గురుకుల సొసైటీలు అంచనా వేసి ఎంతమందికి సీట్లు వస్తాయనే అంశాన్ని తాజాగా ట్విట్టర్లో నమోదు చేసింది. ఈక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్పందించారు. విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు సైతం తెలిపారు. సంక్షేమ గురుకుల కాలేజీలు మరో ముందడుగు వేశాయని, తాజాగా విద్యార్థులు సాధించిన ర్యాంకుతో వాటి పరపతి మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీ Vs బీజేపీ
ఏలూరు సిటీ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జిల్లాకు మంజూరుకావడం ఆనందదాయకమే అయినా అది ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు కారణమైంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిట్‌ను జిల్లాకు తీసుకురావటంలో ఐక్యంగా పనిచేయాల్సిన మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది. పైకి తమ మధ్య ఏవిధమైన విభేదాలు లేవని చెబుతున్నా లోలోన ఆధిపత్య పోరు జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ ప్రాంతంలోనే నిట్‌ను ఏర్పాటు చేయాలని గట్టిగా ప్రయత్నించడంతో అది విభేదాల స్థాయికి చేరుకుంది. నర్మగర్భంగానైనా మాటల తూటాలు వదులుకునేలా పరిస్థితి మారిపోయింది. నేటికీ నిట్ ఎక్కడ పెట్టాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయానికి రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ వర్సెస్ బీజేపీ జాతీయ స్థాయి విద్యా సంస్థ నిట్ ఏర్పాటు విషయంలో మొదట్లోనే జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిట్ జాతీయ బృందం పరిశీలన సమయంలోనే టీడీపీ, బీజేపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతులు, వట్లూరులో నిట్ శాశ్వత భవనాల నిర్మాణం జరగాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రయత్నాలు చేస్తే. మరోవైపు బీజేపీ మంత్రి మాణిక్యాలరావు,నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జూన్ 8న ఏలూరులోనే నిట్ అంటూ కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమ కృషితోనే నిట్ ఏలూరుకు వచ్చిందని ఎంపీ మాగంటి బాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేశారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి మాణిక్యాలరావు నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయకుంటే మంత్రి పదవే వద్దంటూ అలకపూని మరీ తాడేపల్లిగూడేనికే నిట్ వచ్చేలా పట్టుబట్టారని తెలుస్తోంది. ఏలూరు వర్సెస్ టీపీజీ : నిట్ ఏర్పాటు చేసే క్రమంలో అనుకూల విషయాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సైతం ఏలూరులో ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాత్కాలిక తరగతులు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోనూ, వట్లూరులోని పెదచెరువు ప్రాంతంలోని 350ఎకరాలను కేటాయిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిందని ప్రచారం చేశారు కూడా. 35 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం, నిట్ ప్రాంతానికి పక్కనే జాతీయ రహదారి, ఏలూరు నగరం ఉండడం సానుకూల అంశాలుగా వారు చెప్పారు. ఇక తాడేపల్లిగూడెంలో అటవీ భూమిల్లోగానీ, విమానాశ్రయ భూముల్లో గానీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తాత్కాలిక తరగతులు వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శుక్రవారం కూడా నిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో సమీక్షించి వివరాలు సేకరించారు. చివరికి ప్రతిష్టాత్మక నిట్.. ఎవరి ప్రతిష్టను పెంచుతుందో వేచి చూడాల్సిందే. -
నిట్.. పోర్టు
ఏలూరు:రాష్ట్ర బడ్జెట్లో పొందుపర్చే అంశాలు, అంచనాలపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించే సమావేశానికి కలెక్టర్ కె.భాస్కర్ నివేదికలను సిద్ధం చేయించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి హాజరుకానున్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలపై కలెక్టరేట్ యంత్రాంగం మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కుస్తీలు పట్టి నివేదికలు సిద్ధం చేసింది. కలెక్టర్ భాస్కర్ మంగళవారం ఉదయానికే హైదరాబాద్ వెళ్లి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలెక్టర్ భేటీ అయినట్టు తెలిసింది. నిట్పైనే ప్రధాన దృష్టి జిల్లాలో నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణపై అధికార యంత్రాం గం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెదపాడు సమీపంలోని భోగాపురంలో 258 ఎకరాల పైబడి భూములు ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం హైదరాబాద్ వెళ్లిన కలెక్టర్ ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్‌కు నివేదించినట్టు సమాచారం. నరసాపురంలో పోర్టు నిర్మాణానికి 5-6 వేల ఎకరాల అటవీ భూములను సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో భూముల సేకరణకు సంబంధించి కలెక్టర్ నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తోంది. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించ తలపెట్టిన పోలవరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని సైతం కలెక్టర్ సిద్ధం చేశారు. పునరావాసంపైనా నివేదిక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం క ల్పించే వ్యవహారం ప్రహసనంగా మారింది. ఏడు ముంపు గ్రామాల పరిధిలోని ప్రజలకు పూర్తిస్థారుులో పునరావాసం సమకూరలేదు. దీనికితోడు ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, అక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని 21 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను సైతం సీఎంకు సమర్పించనున్నట్టు సమాచారం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఇటీవల రూపొందించిన ప్రతిపాదనల సమాచారంతో కలెక్టర్ నివేదిక సమర్పించనున్నారు. పుష్కరాలు.. విలీన మండలాలపై పోలీస్ ఫైల్ పుష్కరాల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, సిబ్బంది అవసరం తదితర అంశాలపై పోలీస్ విభాగం తరఫున జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి నివేదిక రూపొందించారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో పోలీస్ సిబ్బంది నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
కేంద్ర సంస్థల రాక హుళక్కేనా ?
తాడేపల్లిగూడెం : కేంద్ర ఉన్నత విద్యాసంస్థలు జిల్లాకు రానట్టేనా.. ప్రస్తుతం జిల్లా ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర బృందాలు రంగంలోకి దిగి భూముల వివరాలు సేకరించడంతో పాటు భవనాల నిర్మాణాలకు ప్లాన్లు సైతం రూపొందించేశాయి. గూడెంలో నిట్ ఏర్పాటుకు అన్నీ అనుకూలతలేనంటూ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. వచ్చే ఏడాది తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు స్థానిక విద్యాసంస్థలతో సైతం మాట్లాడేశారు. త్వరలోనే గూడెంలో నిట్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్న తరుణంలో చంద్రబాబు జిల్లాపై మరోసారి చిన్నచూపు చూపించి తన నైజాన్ని ప్రదర్శించారు. నిట్‌ను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం లేదు కాబట్టి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. కర్నూలుకు ట్రిపుల్ ఐటీ అంతలోనే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు కర్నూలు జిల్లా అనుకూలంగా ఉందంటూ స్వయంగా పేర్కొన్నారు. అక్కడి భూములను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గూడెంకు అనుకున్న ట్రిపుల్ ఐటీ కూడా తరలిపోయినట్టే. మరి జిల్లాకు ఏం ఇస్తారు అంటే.. తెలి యని పరిస్థితి. ఇంతకీ నిట్ తాడేపల్లిగూడెంలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ కొందరు జిల్లా ఉన్నతాధికారులు కేంద్ర అధికారులను ప్రశ్నిస్తే.. గూడెంలోని భూముల నైసర్గిక స్వరూపం నిట్ ప్రమాణాలకు అనుకూలంగా లేదట. ఇది విన్న జిల్లా అధికారులు సైతం షాక్ తిన్నారు. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రధానంగా చూసేవి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది? రైళ్లు, రోడ్, ఎయిర్‌వే ఉందా లేదా అనే విషయాలు మాత్రమే. అవన్నీ గూడెంకు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర అధికారుల బృందాలు పరిశీలించి స్పష్టం చేశారు. తీరా కృష్ణా జిల్లాకు తరలించేందుకు సిద్ధం కావడంతో ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి వారు నైసర్గిక స్వరూపం అంటూ చెబుతున్నారని అధికారులే తెలిపారు. అసలు విషయం ఓ సామాజిక వర్గం లాబీయింగే కారణమని తెలిసిందే. -
నిట్ కోసం ఫైట్
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :జిల్లాలో నిట్ (ఎన్ఐసి) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏలూరులోని పలు విద్యాసంస్థల విద్యార్థులు భారీఎత్తున బుధవారం ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో నిట్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నగర ప్రజలకు మరోసారి గుర్తు చేసే విధంగా నిర్వహించారు. ఇండోర్ స్టేడియం నుంచి పలు పాఠశాలల, కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు. ఈ ఆందోళననుద్దేశించి నిట్ పరిరక్షణ సమితి నాయకులు, శ్రీశ్రీ విద్యాసంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ పరంగా అభివృద్ధి సాధించిన పశ్చిమగోదావరి జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు నిట్ సహాయ పడుతుందన్నారు. నిట్‌ను కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలను మోసగించడమేనన్నారు. జిల్లాలో 15 ఎమ్మెల్యే, రెండు ఎంపీ పదవులను టీడీపీకి ప్రజలు కట్టబెట్టారని , భావితరాల వారి కోసం నిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులందరూ నిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై వత్తిడి చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ జిల్లా కమిటీ సభ్యులు, సిద్దార్థ విద్యా సంస్థల అధినేత కోనేరు సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో నిట్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. సంఘ నగర శాఖ గౌరవాధ్యక్షుడు ఎంఎల్ఎన్ శ్రీకాంత్ మాట్లాడారు. ఆందోళన అనంతరం కలెకక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాలరావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు జేఎస్ బాలాజీ, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు విజయలక్ష్మి, విజయకుమార్, ఎండీ సలీమా, ప్రగతిరాజు, జి.సత్యనారాయణ, సుబ్బరాజు, నల్లా వేణుగోపాలరావు, సంఘం మహేష్, తదితరులు నాయకత్వం వహించారు. శ్రీశ్రీ, సిద్దార్థ, చైతన్య, సూర్య న్యూజనరేషన్, భాష్యం, నారాయణ, శ్రీభారతి తదితర విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. -
గూడెంలోనే నిట్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏర్పాటుకు తాడేపల్లిగూడెంలో భూమి కేటాయించారు. ఈ విషయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి అసెంబ్లీలో జిల్లాకు నిట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కాని ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. గూడెంలో నిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆదివారం సీఎం ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్రం విడిపోయాక జాతీయ స్థారుు విద్యా సంస్థ నిట్‌ను గూడెంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 618 ఎకరాల స్థలం కేటాయించారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు పంచాయతీ పరిధిలోని విమానాశ్రయ భూముల్లో 244 ఎకరాలు, వె ఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిపాలన భవనాలు వెనుక ఉన్న ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ భూములలో 374 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ భూములను పరిశీలించడానికి రావలసిందిగా మానవవనరుల అభివృద్ధి శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహానీ రెండు రోజుల క్రితమే లేఖ రాసినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదిక అనంతరం భవనాల ప్లానులను తయారు చేస్తారు. అనంతరం టెండర్ల ప్రక్రియ ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. దేశంలో 30 నిట్లు ఉండగా గూడెంలో ఏర్పాటుతో ఆ సంఖ్య 31కు చేరనుంది. ప్రాంతీయ భిన్నత్వం , బహు సంస్కృతి అవగాహన కోసం నిట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిట్లు ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాలలో బ్యాచిలర్స్ , మాస్టర్స్ డిగ్రీలను అందిస్తున్నాయి. మంత్రి మాణిక్యం హ ర్షం గూడెంకు నిట్‌ను కేటాయించడం మంత్రి మాణిక్యాలరావు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఫోన్లో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. జిల్లాకు ప్రత్యేక హోదాను ఇస్తానని ప్రకటించిన సీఎం జిల్లాలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి అన్నారు. -
ఉద్యోగాలు
నిట్, తిరుచిరాపల్లి తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యుమానిటీస్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: http://www.nitt.edu హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేర్‌టేకర్ షిప్ బిల్డింగ్ సబ్‌మెరైన్ రిపేర్స్ సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ వర్క్స్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్:http://www.hsl.gov.i -
తాడేపల్లిగూడెంలో నిట్
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాడేపల్లిగూడెం పట్టణంలో కొలువు తీరనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రం నుంచి కేంద్రానికి తాజాగా అధికారులు నివేదిక పంపించారు. దేశంలో 36 నిట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో వరంగల్‌లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గూడెంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్రానికి చెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పట్టణానికి వస్తుందని చెబుతూ వచ్చారు. పురపాలక శాఖ మంత్రి కె.నారాయణ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రుల బృందం గూడెంలో పర్యటించి వెళ్లింది. పట్టణంలోని విమానాశ్రయ రన్‌వే సమీపంలో ఉన్న భూమిని, వెంకట్రామన్నగూడెంలో ఉద్యానవర్సిటీ వెనుక ఉన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న భూములను పరిశీలించి వెళ్లింది. ఈ మేరకు శనివారం కేంద్రానికి పంపిన జాబితాలో తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడానికి ఉన్న అనువైన పరిస్థితులు, భూముల వివరాలను పేర్కొన్నారు. నిట్ అంటే ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేనే జ్మెంట్ల విద్యాసంస్థల వ్యవస్థను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా చెబుతారు. 2007లో పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా నిట్లను నేషనల్ ఇంపార్టెన్స్‌గా పేర్కొన్నారు. నిట్‌లో సీట్లు సగం ఈ సంస్థ ఉన్న ప్రాంతానికి, మిగిలిన సగం సీట్లను దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ స్థాయిలో డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఈ విద్యాసంస్థలు స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన ప్రణాళికను తయారు చేసుకునే స్వేచ్ఛ వీటిలో ఉంటుంది.