No Response
-
తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరగాల్సిన సభను రద్దు చేశారు. ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
TSRTC: స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువైంది. చాలా కాలంగా వీఆర్ఎస్ కోసంఎదురు చూస్తున్న వేలాది మంది కార్మికులు సైతం సందిగ్ధంలో పడ్డారు. వీఆర్ఎస్ పథకంలో స్పష్టత లేకపోవడం, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలపై విధివిధానాల్లో స్పష్టత లోపించడం వల్ల వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వయోభారం దృష్ట్యా ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నప్పటికీ పదవీ విరమణ ప్రయోజనాల్లో నష్టం వాటిల్లవచ్చుననే ఆందోళన వల్ల కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 7000 మంది ఉన్నారు. ఈ ఏడాది కనీసం 2000 మంది వీఆర్ఎస్ తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ అనేక రకాల అనుమానాల దృష్ట్యా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రయోజనాలపై స్పష్టత లేదు... ‘వీఆర్ఎస్ తీసుకొని ఉన్నపళంగా రోడ్డున పడుతామేమో అనిపిస్తోంది. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు’ అని రాణిగంజ్ డిపోకు చెందిన సీనియర్ డ్రైవర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశామని, చివరకు దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురు సీనియర్ మహిళా కండక్టర్లు అభిప్రాయపడ్డారు. కనీసం 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు లేదా 55 ఏళ్ల వయసు నిండిన వాళ్లు దీనికి అర్హులు. కానీ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీఆర్ఎస్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పీఆర్సీలు పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వీటి కోసంఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే మరో 6 డీఏలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ తీసుకొంటే అటు పీఆర్సీకి నోచక, ఇటు డీఏలు దక్కక తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సదుపాయం ఉంటుందో లేదో కూడా స్పష్టత లేదు. 20 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతున్నట్లుగానే ఉంది’ అని బండ్లగూడ డిపోకు చెందిన సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. వయోభారంతో ఎదురు చూపులు.. ► ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయవలసిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, మహిళా కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవాళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. (క్లిక్: బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!) ► గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలు, కార్యాలయాల్లో సుమారు 18 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్లు నిండిన వాళ్లు లేదా, 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కనీసం7 వేల మంది ఉన్నట్లు అంచనా. (క్లిక్: ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్!) -
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు
పలమనేరు(చిత్తూరు జిల్లా): కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన, తెలుగు తమ్ముళ్లను, జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు ఆద్యంతం చెప్పిందే చెబుతూ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని నింపేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఓటమి చెందినా టీడీపీ అసలు పోటీనే చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఆపై మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ చతికిలబడింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో అక్కడి టీడీపీ క్యాడర్‌కు అర్థంకాలేదు. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు తగ్గుతున్న ఆదరణకు ఆయన ముందుగానే పసిగట్టి ఎలాగైనా కుప్పంలో మళ్లీ నిలదొక్కుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు పర్యటన సాగింది. చదవండి: టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి గత లోకల్‌బాడీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమితో చంద్రబాబు వేరే నియోజకవర్గానికి వెళతాడంటూ అక్కడి జనం చెప్పుకోవడంతో ఈ సారి జాగ్రత్త పడ్డారు. తాను కుప్పంనుంచి ఎక్కడికి వెళ్లనంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడే మెడికల్ కళాశాల పక్కన స్థలం చూశా, ఇల్లు కట్టుకుంటాను అని ప్రజలకు ప్రమాణం చేసి చెప్పాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకనే గుసగుసలు మొదలయ్యాయి. ప్రసంగాలకు నో రెస్పాన్స్ బాబు పర్యటనలో తొలిరోజు శాంతిపురం మండలంలో ఆ పార్టీ నాయకులు మినహా స్థానికులు కనిపించలేదు. అనికెర, రేగడదిన్నేపల్లి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సొంత గ్రామమైన వెంకటేపల్లె్లలో సభలు వెలవెలబోయాయి. బోయనపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమానికి జనం నుంచి స్పందన లేకుండా పోయింది. ప్రభుత్వంపై ఎన్ని రకాల ఆరోపణలు, విమర్శలు చేసినా జనం పట్టించుకోలేదు. ట్రెండ్ మార్చినా లాభం లేదే... తన రెండోరోజు పర్యటనలో కుప్పం స్థానిక సమస్యలపై మాట్లాడారు. కానీ జనం నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో అక్కడి నాయకులపై మండిపడినట్టు సమాచారం. ఇక్కడ నాయకులంతా వినాయకుల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తన మూడు రోజుల కుప్పం పర్యటలో అనుకున్నది జరగలేగదనే ఫ్రస్టేషన్, తమ్ముళ్లు పనికిరాకుండా పోయారనే అసంతృప్తి చంద్రబాబు మొహంలో కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై బాబు ఫైర్ కుప్పం: నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ కవరేజికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్ ‘సార్ ఇతను కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు శివను చూసి హెచ్చరికలు చేశారు. అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు. -
నీరసిస్తున్న ‘స్వచ్ఛ’ దీక్ష
సాక్షి, విశాఖపట్నం : దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. మొదటి మూడేళ్లలో 5, 3, 7 స్థానాల్లో నిలిచిన విశాఖ గతేడాది మాత్రం దారుణంగా చతికిలపడుతూ ఏకంగా 23వ స్థానానికి పరిమితమైపోయింది. దీనికి కారణం ప్రజలు దీనిపై స్పందించకపోవడం, అవగాహన రాహిత్యమనే చెప్పుకోవాలి. కారణమేదైనా మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరం మురిసి మెరవాలంటే ప్రజలే కీలక పాత్ర పోషించాలి్సన అవసరం ఉంది. కానీ ఆశించినంత స్పందన మాత్రం ప్రజల నుంచి రావడం లేదు. దీంతో ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన లీగ్ దశల్లో విశాఖ గతేడాదితో పోలిస్తే రెండడుగులు ముందుకు వెళ్లినా ఫైనల్లో టాప్–10లో నిలిపేందుకు ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదనే చెప్పాలి. ఈ ఏడాది కాస్తా విభిన్నంగా... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన పోటీల్లో ప్రజలు చూపించిన చొరవ ప్రస్తుతం కనిపించడం లేదు. ఈసారి విభిన్నంగా సర్వేక్షణ్ పోటీని విభజించారు. ఈసారి మూడు క్వార్టర్లుగా విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్–2020గా మార్చారు. ఏప్రిల్ నుంచి జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ప్రతి 3 నెలల్ని ఓ భాగంగా విభజించారు. అనంతరం జనవరి 4 నుంచి 31 వరకూ వార్షిక ప్రగతిపై ఢిల్లీ బృందాలు నేరుగా ఫీడ్ బ్యాక్‌ను తీసుకోనున్నాయి. చివరిగా మార్చిలో ర్యాంకులు వెల్లడించనున్నాయి. ప్రతి లీగ్‌లోనూ 2 వేల మార్కులుంటాయి. ఆ క్వార్టర్లోని ప్రతి నెలా 5వ తేదీలోపు ఆ నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించి నిర్వహించిన పనులు, ఇతరత్రా వివరాలను కచ్చితంగా పొందుపరచాలి. దీన్నే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్)గా పిలుస్తారు. ఈ ఎంఐఎస్‌లో ఆ నెలలో ఎలాంటి స్వచ్ఛత పనులు చేపట్టారన్న వివరాలను వార్డుల వారీగా నమోదు చెయ్యాలి. ఇలా పొందుపరిచిన వివరాల్ని సరిచూసేందుకు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను ఆ క్వార్టర్ చివరి నెలలో తీసుకుంటారు. దీని ప్రకారం మార్కులు కేటాయిస్తుంటారు. దీనికి తోడు ప్రతి క్వార్టర్లోనూ 1300 మార్కులకు తగ్గకుండా రావడంతో పాటు యావరేజ్ ర్యాంకులో 200 మార్కులు వస్తే 5 శాతం వెయిటేజీ ఇస్తారు. మొదటి రెండు క్వార్టర్లలోని ఎంఐఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యకపోయినా పరిగణనలోకి తీసుకుంటారు. చివరి లీగ్‌లో మాత్రం అన్నింటికీ సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యాల్సిందే. 12 అంశాలపై లీగ్ దశలో కాల్స్ రూపంలోనూ, యాప్ రూపంలోనూ సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. లీగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ డిసెంబర్ 24కల్లా వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాల్సిందే. లీగ్‌లో పర్ఫార్మెన్స్కు 25 శాతం వెయిటేజీ లభిస్తుంది. లీగ్ దశ పూర్తి కాగానే జనవరి 4 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా కీలక సర్వే జరగనుంది. మొదటి లీగ్‌లో 18 రెండో లీగ్‌లో 24 ప్రజల నుంచి వ్యాలిడేషన్ ద్వారా మార్కులు నిర్ధారించే ఈ లీగ్ దశ ఫలితాల్ని డిసెంబర్ 31న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ప్రోత్సాహం, జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికులు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా 10 లక్షల పైచిలుకు జనాభా ఉన్న కేటగిరిలో విశాఖ నగరం 19వ స్థానంలో నిలిచింది. గతేడాది టాప్–10 లో ఉన్న విజయవాడ మాత్రం 20వ స్థానానికి పరిమితమైంది. అయితే రెండో క్వార్టర్లో మాత్రం నగర ప్రజలు అంతగా స్పందించకపోవడంతో మార్కుల్లో వెనుకబడిన విశాఖ 24వ స్థానానికి పరిమితమైపోయింది. విజయవాడ మాత్రం రెండో లీగ్‌లో 2 స్థానాలు మెరుగుపరచుకొని 20లో నిలిచింది. మొత్తంగా లీగ్–1లో 3,971 నగరాలు పాల్గొనగా విశాఖ 267వ స్థానంలో నిలవగా విజయవాడ మాత్రం 284 స్థానానికి పరిమితమైంది. లీగ్–2లో మొత్తం 4,157 నగరాల్లో విజయవాడ 288 ర్యాంకు సాధించగా విశాఖ మాత్రం ఏకంగా 409 నగరానికి పడిపోయింది. పౌరుల స్పందనే ముఖ్యం.. కానీ.. లీగ్ దశలో 12 కేటగిరీల్లో జీవీఎంసీ చేసిన పనులకు తమ తరఫున మార్కులు వేసుకుంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం ఆ మార్కులకు అనుగుణంగా సిటిజన్ వ్యాలిడేషన్ని ఫోన్ కాల్స్ ద్వారా తీసుకుంటుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా జీవీఎంసీ వివరాలు అడుగుతుంది. వాటికి అనుకూల సమాధానం వస్తే వ్యాలిడేషన్‌లో ఎక్కువ మార్కులు వేస్తారు. ఫలితంగా మార్కులు పెరిగి ర్యాంకు పెరిగేది. లీగ్–1, లీగ్–2లో స్వచ్ఛభారత్ మిషన్ నుంచి వచ్చిన కాల్స్‌ని నగర ప్రజలు చాలా మంది రిసీవ్ చేసుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చాలా మార్కులను నగరం కోల్పోయింది. దీని వల్ల తొలి రెండు లీగ్స్‌లో సరైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. లీగ్–3 కూడా డిసెంబర్–31తో పూర్తయ్యింది. ఈ ర్యాంకుల్ని ఈ నెలలోనే ప్రకటించనున్నారు. ఆ లీగ్‌లోనైనా మంచి స్థానం సాధిస్తే ఫైనల్ ర్యాంక్‌కు తోడ్పడుతుంది. 4 నుంచి అసలైన ‘స్వచ్ఛ’ పరీక్ష స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్), ఎంఐఎస్ డేటా నవీకరణ ద్వారా 12 సేవాస్థాయి ధ్రువీకరణ ద్వారా ఒక్కో క్వార్టర్‌కు 2 వేల మార్కులు కేటాయిస్తారు. రెండు కేటగిరీలుగా ర్యాంకులు ఇస్తారు. ఈ నెల 4 నుంచి అసలైన పరీక్ష మొదలవ్వనుంది. ►లీగ్ ర్యాంకులు స్వచ్ఛ సర్వేక్షణ్–2020 ఫలితాల్ని నిర్దేశిస్తాయి. ఇవి వార్షిక సర్వేకు 25 శాతం వెయిటేజీ ఇస్తాయి. ►జనవరి 4 నుంచి 31 వరకు జరిగే ఈ సర్వేలో పౌరులు స్వయంగా పాల్గొనవచ్చు. ►స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్ 1969కి పౌరులు ఫోన్ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్–2020 పోర్టల్ ద్వారా గానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేయవచ్చు. ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం స్వచ్ఛ సర్వేక్షణ్–2020 నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. చెత్త ప్రోసెసింగ్ దినచర్యగా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రోసెసింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్ ప్లస్ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రజలంతా చెత్తను వేరు చేసి ఇస్తూ సిబ్బందికి సహకరించాలి. 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖను మళ్లీ టాప్‌లో నిలబెట్టేందుకు అందరం కలిసి పనిచేద్దాం. ఈ నెల 4 నుంచి వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ బృందానికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
టీడీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ.. నవ్విపోతున్న జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అమరావతికి కట్టబడి ఉండాలన్న ప్రకటనపై టీడీపీలో ఒకపక్క ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బయటపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు తెలిపారు. మరికొందరు నేతలు లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్న పళంగా పార్టీ చీలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన పార్టీ అధిష్టానం నష్ట నివారణ కోసం తమ చెప్పుచేతల్లో ఉండే కొందరు నేతలను రంగంలోకి దించింది. వారి చేత ‘మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు’ అనే నినాదంతో ర్యాలీలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకపోతే, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం కలిసి రాకపోవడంతో 30 మందితో మమ అనిపించే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా అదే చర్చ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా మూడు రాజధానుల చర్చే జరుగుతున్నది. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై మద్దతు వెల్లువెత్తుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయబోతున్నారన్న ప్రతిపాదిత ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అభివృద్ధికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకనే అన్ని వర్గాలు మూడు రాజధానుల ప్రకటన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాయి. ఎక్కడికక్కడే రౌండ్ టేబుల్ సమావేశాలు, అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ సదస్సులు నిర్వహించి తమ ఆనందాన్ని, మనోగతాన్ని, అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏరియాలోనూ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను చేయాలన్న ప్రతిపాదిత ప్రకటనపై చర్చ జరుగుతున్నది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కారి్మకులు, కర్షకులు తదితర వర్గాలన్నీ రాజకీయాలకు అతీతంగా సమాయత్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజల నాడిని గమనించి కొందరు నేతలు బయటపడుతున్నారు. రాజధానికి అనుకూలంగా మద్దతు పలుకుతున్నారు. అవసరమైతే చంద్రబాబు అజెండాను వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నారు. తప్పదని అధిష్టానం ఒత్తిడి చేస్తే పార్టీ మారడానికైనా సై అంటున్నారు. ప్రజాభిప్రాయానికి ఎవరైనా తలొగ్గక తప్పదని, మన ప్రాంత అభివృద్ధికి కట్టుబడేలా ఉండాలని అత్యధిక టీడీపీ నేతలు ప్రస్తుతం లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. దీంతో టీడీపీ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి స్పష్టమవుతోంది. చక్కదిద్దేందుకు యత్నాలు రోజురోజుకూ పార్టీలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెంది చక్కదిద్దే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాను చెప్పినట్టు వినే నేతలను రంగంలోకి దించి, వారి చేత అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయించి, అదే మాట ప్రజల్లోకి గట్టిగా వెళ్లేలా చేసి, మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న టీడీపీ శ్రేణుల మనసు మార్చే కార్యక్రమాన్ని తలపెట్టారు. కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఎత్తులను తిప్పికొడుతున్నారు. ఎన్ని జిత్తుల మారి ఎత్తులు వేసినా తమ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్దామని, భజన చేసే నాయకుల ట్రాప్‌లో పడేది లేదని చెప్పకనే చెబుతున్నారు. దానికి ఉదాహరణ శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ. మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు అనే నినాదంతో చేసిన ర్యాలీలో 30 మందికి మించి కన్పించలేదు. నిత్యం రద్దీగా ఉండే ఏడు రోడ్ల జంక్షన్లో చేపట్టిన కొవ్వుత్తుల ర్యాలీకి జనాల నుంచి స్పందన లేదంటే వారు ఎత్తుకున్న నినాదానికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను రాజధాని చేస్తే వీరికొచ్చే నష్టమేంటి? అమరావతిలో కొన్న భూముల విలువ తగ్గిపోతుందన్న భయమా? రాజకీయంగా కనుమరుగైపోతామన్న ఆందోళనా? అని ప్రజలు పెదవి విరిచిన పరిస్థితి కని్పంచింది. వీరి చేష్టలు చూస్తుంటే వెనకబడిన జిల్లాలకు నష్టం చేసేలా ఉన్నారని, నాడు రాష్ట్ర విభజనలో ఏ రకంగానైతే ద్వంద్వ నీతిని ప్రదర్శించి మోసగించారో ఇప్పుడలా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే వాపోయారు. -
తుస్సుమన్న తొలి సభ
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎన్నికల తొలి సభ తుస్సుమనిపించింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపుతుందనుకున్న మొదటి సభ టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపింది. మరో వైపు తొలి సభకే జనం లేక వెలవెలబోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ జిల్లా నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి తారకరామ స్టేడియంలో శనివారం టీడీపీ బూత్ లెవల్ కన్వీనర్లు, సేవా మిత్రలు, పార్టీ ఇతర కేడర్‌తో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభించి 3 గంటలకు ముగించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు 2 వేల మంది కూడా జనం లేకపోవడంతో సభను కొంత సమయం వాయిదా వేయమని చంద్రబాబు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన కొందరు నేతలు నగరంలో జనాన్ని తరలించేందుకు అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు చంద్రబాబు సభకు చేరుకునే సమయానికి సగం కుర్చీలు నిండాయి. దీంతో కార్యక్రమం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభించాల్సి వచ్చింది. సభా వేదికపైకి వచ్చిన చంద్రబాబు కుర్చీలు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యారు. జిల్లా నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కార్యక్రమం కావడంతో జన సమీకరణలో ఎవరికి వారు చేతులెత్తేశారు. సభ వెలవెలబోయింది. వర్ల రామయ్య, మంత్రి అమరనాథ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిపై చంద్రబాబు మండిపడినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తొలి సభలోనే జనం లేకపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో తెలుసా? అంటూ ఆయన తనదైన శైలిలో చురకలంటించారు. చప్పగా సాగిన ప్రసంగం ఎన్నికల సమర శంఖారావం పేరుతో టీడీపీ తిరుపతిలో నిర్వహించిన సభ చప్పగా సాగడంతో కేడర్ నిరుత్సాహంతో వెనుదిరిగింది. మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మోదీ, కేసీఆర్, జగన్ పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రతిసారీ ఏం తమ్ముళ్లూ మనం ఎవరికైనా భయపడతామా? అంటూ పదే పదే చెప్పడం కేడర్‌లో కొంత అసహనం కనిపించింది. ప్రతి మాటకు చివరిన ఔనా, కాదా తమ్ముళ్లూ? అంటూ బోరు కొట్టించారు. డ్రైవర్లకు మేలు చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు పదే పదే నేను నంబర్ వన్ డ్రైవర్‌గా ఉంటాను అంటూ చెప్పుకున్నారు. ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు మాటల్లో కరుకుదనం కనిపించలేదు. కచ్చితత్వం లేదు. చెప్పిందే చెప్పి.. పాత పాటనే పాడుతూ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపారు. సాధారణ సమావేశంలా సాగిందని, ఎన్నికల శంఖారావంలా లేదని ప్రతి ఒక్కరూ నిరుత్సాహంగా వెనుతిరిగారు. అసంతృప్తుల డుమ్మా ఎన్నికల్లో టికెట్లను ఆశించి భంగపాటుకు గురైన కొందరు నేతలు టీడీపీ ఎన్నికల శంఖారావానికి డుమ్మా కొట్టారు. తిరుపతిలో సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని కేడర్ మొత్తం వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు ఆమె వైపే మొగ్గుచూపారు. దీంతో చాలామంది నేతలు సభకు డుమ్మాకొట్టారు. ఆమెను వ్యతిరేకించిన నరసింహయాదవ్, పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాత్రం సభకు హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజి, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఊకా విజయ్‌కుమార్, డాక్టర్ ఆశాలత, బుల్లెట్ రమణ తదితరులు హాజరు కాలేదు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, నగరి నియోజక వర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులు, మదనపల్లె నాయకులు, పలమనేరు, పూతలపట్టు నుంచి ముఖ్యమైన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు సభకు హాజరు కాకపోవడం గమనార్హం! -
కంటి వెలుగుకు స్పందన కరువు
తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు పథకం ప్రజల నుంచి ఆదరణ కరువవుతోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజా ప్రతినిధుల అలసత్వంతో కంటి వెలుగు మసకబారుతోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో 360 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే శిబిరాలకు ప్రజలు నావ మాత్రంగా వస్తున్నారు. అయితే దీనికి కారణం శిబిరాల్లో కంటి పరీక్షలు వైద్య నిపుణులతో కాకుండా ఆయూష్, అఫ్తాల్మిక్ అసిస్టెంట్లతో చేయిస్తుండడంతో ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ పథకం అమలై వారమవుతున్నా కంటి శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఆస్పతులను అందుబాటులోకి తీసుకురాకపోవడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 9.40 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు చేసేందుకు 22 వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఒక శిబిరంంలో రోజుకు 360 మందికి కంటి పరీక్షలు (స్క్రీనింగ్) చేయాలి. అంటే జిల్లాలో 22 కంటి వెలుగు శిబిరాల్లో రోజుకు 7,920 మందికి కంటి పరీక్షలు చేయాలి. 15వ తేదీ నుంచి మంగళవారం వరకు 55,450 మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలు దారిదాపులోకి కూడా చేరుకోలేదు. ఇప్పటివరకు శిబిరాల్లో 13,795 మందికి మాత్రమే కంటి పరీక్షలు చేసినట్లు జిల్లా కంటి వెలుగు నిర్వహణ అధికారి చెప్పారు. ఆయూష్ వైద్యులతో పరీక్షలు కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాల్లో కంటి వైద్య నిపుణులు కరువయ్యారు. కంటి వైద్యులతో శిబిరాలను నిర్వహించాల్సి ఉం డగా రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయూష్ వైద్యులు, పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లతో శిబిరాలు కొనసాగిస్తున్నారు. శస్త్ర చికిత్సలకు ఆస్పపత్రులేవీ.. కంటి వెలుగు ప్రారంభమై వారమైంది. అయితే ఇప్పటివరకు శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. శిబిరాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని 1,648 మందిని శస్త్ర చికిత్సల కోసం గుర్తించారు. అయితే కంటి శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రుల వివరాలు పొందుపర్చలేదు. దీంతో కంటి పరీక్షలు చేసుకున్న వారు శస్త్ర చికిత్స కోసం రిఫర్ చీటీలను తీసుకుని ఇంటి బాట పడుతున్నారు. 5 ఆస్పత్రులు అందుబాటులో కంటి వెలుగు రోజురోజుకు ఆదరణ వస్తోంది. కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి శస్త్ర చికిత్సలు చేయించేందుకు రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సర్జన్‌ను నియమించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. కంటి శస్త్ర చికిత్సలను చేసేందుకు మొత్తం 5 ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. – మహేశ్, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రామ్ అధికారి ఆదరణ కరువు జిల్లాలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 13,795 మందికి పరీక్షలు చే శారు. వీరిలో పురుషులు 6,081, మహిళలు 7, 714 మందికి కంటి పరీక్షలు నిర్వహించచారు. ఎస్సీలు 2,618 మంది, ఎస్టీలు 1,315, బీసీలు 7,430, ఓసీలు 1,365, మైనార్టీలు 1,069 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,381 మందికి కంటి అద్దాలను అందించారు. -
ముగ జీవాల మృత్యువాత
మిర్యాలగూడ రూరల్ : పాలమూరు జిల్లా గొర్రెల మందను మృత్యు వీడడం లేదు. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు వేసవిలో మేత కోసం11 మంది యజమానులు తమకున్న 3000 గొర్రెలతో బయలుదేరారు. వారు శుక్రవారం మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ మందలోని గొర్రెలు అనారోగ్యనికి గురై 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ పశు సంవర్థకశాఖ సిబ్బంది పశు వైద్యులు చికిత్స అందింస్తున్నప్పటికీ గొర్రెల మరణాన్ని అరికట్టే పరిస్థితి లేకపోయింది. æ రెండవ రోజు శనివారం మరి 31గొర్రెలు మృతిచెందాయి. రక్త నమూనాలు, శరీరంలో భాగాల ముక్కలు షాంపిల్స్ హైదరాబాద్ వెటర్నరీ బయోజికల్ ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు రావాలంటే కనీసం 48 గంటలు పడుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాగా నల్లగొండకు పంపిన ల్యాబ్ టెస్ట్ ఫలితాల ప్రకారం విష ఆహారం, అజీర్ణ సమస్యతో పాటు చిటక రోగం, పుర్రు రోగం సోకినట్లు మిర్యాలగూడ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న వైద్యశిబిరం మిర్యాలగూడ , త్రిపురారం వెటర్నరీ వైద్య బృదం గొర్రెలకు చికిత్స అందస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు, సెలెన్ అందిస్తున్న కంట్రోలు కాకపోవడంతో ఇటు వైద్యులు, అటు గొర్రెలు మందల యజమానులు అందోళన చెందుతున్నారు. కానరాని స్పందన కాగా నాలుగు రోజులుగా గొర్రెలు నిరంతరం మరణిస్తున్నప్పటికీ అధికారులెవరూ స్పందించక పోవడం బాధాకరం. గొర్రెలనే నమ్ముకుని జీవ నం సాగిస్తూ జిల్లా దాటి వచ్చి ఇక్కడ అకస్మాత్తుగా జీవాలు మృతి చెందుతుండడంతో కాపరులు ఏమి పాలుపోక ఆందోళన చెందుతున్నారు. -
ప్లేట్ ఫిరాయింపు..
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లంటే వాహనదారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో ఈ డిజిటల్ నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. వివిధ కారణాలతో వాహనదారులు వీటిని నివినియోగించుకోవడం లేదు. కనీసం వీటిని వాహనానికి పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ద్విచక్ర వాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున వాహనాదారులు రవాణా శాఖ కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులను సంబంధిత హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల తయారీ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. ఈ నంబరు వాహనం రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులలోపే రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంది. వాహనాదారు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో డబ్బు చెల్లిస్తూ వాటిని సొంతం చేసుకుంటున్నారు వాహనాదారులు. ఈ హైసెక్యూరిటీ నంబరు పలకలను వాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఊదాహరణకు టీఎస్ 36 జెడ్ 0001 నంబరు గల వాహనాన్ని వినియోగదారు ఫాన్సీ నంబరు కావడంతో వేలల్లో డబ్బు ఖర్చు చేసి ఈ నంబరును సొంతం చేసుకుంటున్నాడు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను మాత్రం వినియోగించుకోవడం లేదు. కారణం ఏమిటంటే అతను తన వాహనంపై టీఎస్ 36 జెడ్ 1 అని ఉంటే... 1ని హైలైట్ చేస్తు రాసుకుంటారు. ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లలో ఈలాంటి అవకాశం వాహనదారుకు లభించదు. అందుకే వాహనదారులు ఈ హైసుక్యూరిటీ ప్లేట్లను విస్మరిస్తున్నారు. వాహనం నంబరుపై తన ఇష్టమైన వేరే అంకేలు గల డూప్లికేట్ నంబరు ప్లేట్లను వాడుతున్నారు. దీంతో వీరు ప్రమాదంలో భాగస్వామ్యులైతే వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాలి. వీటితో అనేక లాభాలు వాహనదారులకు ఉన్నప్పటికీ వాటిపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. దీంతో భారత ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు గదుల్లోనే మూలుగుతున్నాయి. 2013 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్లేట్లలోని లేజర్ కోడింగ్‌తో వాహనదారు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ప్లేట్లతో భారత దేశంలో గల వాహనాలన్నింటినీ ఆన్లైన్లో గుర్తించడం సాధ్యం అవుతుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాహనాన్ని తొందరగా పట్టుకోవచ్చు. వాహనదారు వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని గుర్తించడం తెలికవుతుంది. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. వాడకపోతే ఏమవుతుంది ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాహనదారులు వాడకపోతే... వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా... నిలిపివేయబడతాయి. దీంతో వాహనదారులు వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా... ఇతరుల నుంచి ఖరీదు చేయాలన్నా కష్టం అవుతుంది. రవాణా శాఖ అధికారులు వాహన ఇన్సూన్స్, ఫిట్నెస్, ట్యాక్స్ తదితర ముఖ్య సేవలు నిలిపివేస్తారు. జిల్లాలో 2013 నుంచి 46,535 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి వాహనాదారులు తీసుకుపోయిన నంబరు ప్లేట్లు 39,515 ఇంకా వాహనాదారులు వాడని ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు 7,020. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే వాడాలి ప్రతి వాహనాదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే తన వాహనానికి ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించని వాహనాలు తనిఖీల్లో అధికారులకు పట్టుబడితే సీజ్ చేస్తారు. వాహన సేవలు నిలిపి వేస్తారు. వాహనాదారులు ఖచ్చితంగా ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాల్సిందే. ఈహైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటంతో వాహనాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి -
ఏ అధికారి అయినా ఫోన్ ఎత్తితే ఒట్టు!
► ఫోన్లు ఎత్తని అధికారులు ► ఎమ్మెల్యేలు ఫోన్‌కైనా నో రెస్పాన్స్ ► మిస్డ్ కాల్‌కూ నో రిప్లై ► ప్రభుత్వ నెంబర్లు ఉన్నా అదే తీరు శ్రీకాకుళం టౌన్: పారదర్శకం పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అధికారులకు శాఖల వారీగా ఫోన్ నెంబర్లు కేటాయించారు. ఈ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శాఖల వారీగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం ఫోన్లు ఇచ్చారు. గ్రూప్ సిమ్‌లను వారికివ్వడం ద్వారా సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు గ్రూపుల్లో చేర్చారు. అర్ధరాత్రి అవసరమున్నా ఈ ఫోన్ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే జిల్లాలో కొందరు అధికారులు మాత్రం రాత్రిపూటే కాదు పగటిపూట కూడా ఫోన్ ఎత్తక పోవడంతో ప్రజల మాటెలా ఉన్నా ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు. పనులు చేయమని ఒత్తిడి చేయడం మాట అలా ఉంచితే సమాచారం కావాలన్నా సమాధానం చెప్పడానికి ఫోన్ ఎత్తడం లేదంటూ సాక్షాత్తు ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు. ఫోన్ ఎత్తే అలవాటే లేదు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజక్టు అధికారిగా పని చేస్తున్న రోణంకి కూర్మనాథ్‌కు అసలు ఫోన్ ఎత్తే అలవాటే లేదట. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 87900 08399. ఈ నెంబరుకు ఎవరు ఫోన్ చేసినా నో రిప్లైల రాక తప్పదు. సమావేశంలో ఉన్నా తర్వాత ఫోన్ చేసిమాట్లాడే అలవాటు లేదు. ఇది సాధారణ పౌరులు చెప్పే మాట కాదు.. స్వయాన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతిలు సభా ముఖంగా ఈ అంశాన్ని ఇటీవల జరిగిన విజిలెన్సు అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎదుట ప్రస్తావించారు. ఇలాంటి వారు ప్రభుత్వ శాఖల్లో కోకొల్లలుగా ఉన్నారు. పోలీసు శాఖలోనూ... శాంతి భద్రతలు పరిరక్షించే బాధ్యతల్లో ఉన్న పోలీసు శాఖకు ఈ జాడ్యం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ అప్పలనాయుడికి ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 94407 95806. ఈ నెంబరు అత్యంత కీలకం. ఈయన నెంబరుకు ఎవరు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తడం గగనమే. ఆయన బాటలోనే శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ మదుసూధనరావు కూడా ఉన్నారు. ఈయనకు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబర్ 94407 95820. ఈ నెంబరుకు ఫోన్ చేయాలంటే ముందుగా రూరల్ పోలీసుస్టేషన్లో లాండ్ లైన్ ఫోన్‌కు మాట్లాడాలి. అక్కడి నుంచి వారు సమాచారం ఇస్తే తప్ప ఫోన్ ఎత్తే అలవాటు లేదట. మున్సిపాలిటీలో కమిషనర్ టి.శ్రీనివాస్‌కు ప్రభుత్వం కేటాయించిన ఫోన్ నెంబరు 98499 05787. ఈ నెంబరుకు ఫోన్ చేస్తే పక్కనున్న వారే మాట్లాడతారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫోనైనా సరే పక్కనున్న వారు సమాధానం చెప్పిన తర్వాత సార్‌కు ఇస్తారట. మున్సిపాలిటీలో ఎంఈ వెంకటేశ్వరరావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి సురేష్‌లకు ఇదే అలవాటుగా మారిందట. ఇక అరసవ ల్లి ఈఓ శ్యామలాదేవి (90009 02338), గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ రవీంద్రనాథ్ (91001 20600)లకు ప్రభుత్వ ఫోన్ నెంబర్లు కేటాయించారు. ఈ నెంబర్లకు ఫోన్ చేసినా అదేతీరు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వం ఫోన్ నెంబరు ఇచ్చినా ఈ పరిస్థితి ఉంటే సొంత నెంబరైతే ఇంకెలా ఉంటుందో మరి. ఇలాగైతే జవాబుదారీ తనం ఎలా సాధ్యం. సామాన్యులకు న్యాయం ఎలా అని జిల్లా ప్రజలు నిట్టూరుస్తున్నారు. -
కమిషనర్ తీరుపై కన్నెర్ర
ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారం ప్రజాప్రతినిధులకు సైతం అసహనం తెప్పించింది. సోమవారం విద్యుత్ స్తంభంపై నుంచి పడి చనిపోయిన వెంకటేశ్వర్లు బంధువులు, గ్రామస్తులు ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా ... శాంతింపజేయాల్సింది పోయి కమిషనర్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఎక్కడున్నారో తెలియనీయకుండా తప్పించుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మొదలు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ వరకు కమిషనర్‌కు ఫోన్లు చేస్తున్నా నో రెస్పాన్స్. దీంతో కలెక్టర్‌కు ఫోన్‌చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించడంతో కలెక్టర్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ముక్తినూతలపాడు పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా అదే గ్రామానికి చెందిన సూదనగుంట వెంకటేశ్వర్లు(32) సోమవారం కరెంట్ పోల్ ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆవరణలోనే మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ నాయకులు కలుగజేసుకొని రూ.15 లక్షల పరిహారం, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌కు ఫోన్‌చేసి కమిషనర్ మొండి వైఖరిని వివరించారు. మరో వైపు వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జోక్యం చేసుకొని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వివరించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. మరో వైపు మంత్రితోపాటు ఎమ్మెల్యే కూడా కమిషనర్‌తో మాట్లాడేందుకు యత్నించగా ఆమె ఎక్కడున్నారో తెలియరాలేదు . కనీసం ఫోన్లు కూడా పని చేయకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడాల్సి వచ్చింది. క్యాంపులో ఉన్న జిల్లా ఉప కార్మికశాఖ అధికారి అఖిల్ విషయం తెలుసుకొని కార్మికశాఖ తరుపున తప్పక న్యాయం జరిగేలా చూస్తానంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమాదేవి ద్వారా ఆందోళన చేస్తున్నవారికి తెలియజేశారు. ఆ హామీతో సంతృప్తి చెందని ఆందోళనకారులు చర్చిసెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. పరారైన కమిషనర్‌ను పిలిపించాలంటూ ఆగ్రహించారు. ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ అక్కడకు చేరుకొని కలెక్టర్‌తో చర్చించడానికి రావాలంటూ కొంతమందిని పంపించారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తప్పకుండా కమిషనర్‌నుంచి వివరణ కోరతానని కలెక్టర్ విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ప్రభుత్వ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తానని...పర్మినెంట్ చేసే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్టు, పీఎఫ్ ఇతరత్రా మొత్తం న్యాయబద్ధంగా ఎంత రావాలో అంత మొత్తాన్ని త్వరితగతిన ఇప్పిస్తామంటూ కలెక్టర్ వివరించడంతో శాంతించి మృతదేహాన్ని చర్చిసెంటర్నుంచి తీసుకొని వెళ్లారు. మున్సిపల్ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం... వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ కాదని, హెల్పర్‌గా మాత్రమే తీసుకున్నట్లు మున్సిపల్ డీఈ గోపాల్ కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ ఆగ్రహించారు. నాన్ టెక్నికల్ కింద ఉద్యోగం ఇచ్చి టెక్నికల్ పనులు ఎందుకు చేయించుకుంటున్నారు...అతనిని ఏ విభాగం కింద తీసుకున్నారో రిపోర్టు పంపండంటూ మండిపడ్డారు. ఆరుగంటలపాటు అందుబాటులోకి రాని కమిషనర్ చర్చలు ముగిశాయని తెలుసుకొని రాత్రి 8 గంటల తరువాత ప్రత్యక్షమయ్యారు. చీమకుర్తికి వెళ్లడంతో ఫోన్ స్విచాఫ్ అయిందని చెప్పడం గమనార్హం. -
మౌన ముద్రలో కిరణ్‌కుమార్‌రెడ్డి