not removed
-
ఆత్మలకూ ఓటు హక్కు.!
సాక్షి, డీజీ పేట (ప్రకాశం): సీఎస్ పురం మండలంలోని డీజీ పేట పంచాయతీలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు 2,400 ఓట్లు ఉన్నాయి. మూడు బూత్‌లలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. మృతిచెందిన 30 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు. కోవిలంపాటి తిరుపతమ్మ, వాడా జయమ్మ, కారంపూటి హుస్సేనయ్య, దువ్వూరి రమణారెడ్డి, అగ్నిగుండాల మస్తాన్‌బీ, కసుమూరి బాదుర్లా, పావలి వెంకటేశ్వర్లు, ఇస్కపల్లి చినమాలకొండయ్య, షేక్ చిన మౌలాలి, పలగొండ్ల వెంకటేశ్వర్లు, ఇలా దాదాపు 30 మంది మృతి చెందగా, వారి ఓట్లను నేటికీ తొలగించలేదు. అదేవిధంగా షేక్ జిలానీ, ఊటుకూరి ఏసయ్య తదితరులకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే వార్డు, ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లను విడదీసి వేరువేరు చోట్ల ఓటు నమోదు చేశారు. భార్యాభర్తల ఓట్లు కూడా వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఉండటం గమనార్హం. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు ఉందో.. లేదో చూసుకోవాలంటే జాబితా మొత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మృత శిశువును తొలగించక యాతన
తీవ్ర వేదనకు గురైన మహిళ ∙ సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన కాకినాడ వైద్యం : కడుపులో చనిపోయిన బిడ్డను శస్త్రచికిత్స చేసి బయటకు తీయడంలో వైద్య సిబ్బంది చేస్తున్న జాప్యంపై రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే రాజమండ్రికి చెందిన బుంగా సంధ్యశ్రీ రెండో కాన్పు నిమిత్తం సోమవారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం సంధ్యశ్రీకి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ౖవైద్య పరీక్షల అనంతరం కడుపులో బిడ్డ చనిపోయాడు. ఇక్కడ శస్త్రచికిత్స చేసి, మృతశిశువును బయటకు తీసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించినట్లు ఆమె భర్త సునీల్ తెలిపారు. దాంతో చేసేది లేక అంబులెన్సులో మధ్యాహ్నం 1.30 గంటలకు తన భార్యను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు విభాగంలో చేర్చారు. సాయంత్రం దాకా ఎటువంటి చికిత్స చేయకపోవడంతో కడుపు నొప్పి ఎక్కువై తీవ్ర వేదనకు గురైందని, ప్రాణాపాయం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేసినా కిందస్థాయి సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేరు. కాస్త సమయం ఓపిక పట్టండంటూ వైద్యాధికారులు చెబుతున్నారని వాపోయారు. ఆస్పత్రిలో అన్ని పరికరాలు అందుబాటులో ఉండికూడా టెస్ట్‌లను ప్రైవేట్‌గా చేయించుకోమని చెబుతున్నారని ఆరోపించారు.