విరులకు లేవు పరిమితులంటూ...
‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతను ఈ చామంతికి వర్తింపజేస్తూ.. ‘కుదురు కొంచెం.. విరులు ఘనం’ అని మార్చుకోవచ్చు. సాధారణంగా ఒక చామంతి మొక్కకు ఎక్కువ అనుకుంటే 50 వరకూ పూలు పూస్తాయి. రాయవరంలో పెంకే రాజు ఇంటి వద్ద ఉన్న చామంతి పూల మొక్క మాత్రం తనకలాంటి ‘విరి పరిమితులు’ లేవు అన్నట్టు 440కి పైగా పూలు పూసింది. ఈ మొక్కకు మరో 100కు పైగా మొగ్గలు ఉన్నాయి. రాజు భార్య మంగ కుండీలో పెంచిన ఈ మొక్క ‘తానొక్కటే పెక్కు మొక్కల పెట్టు’ అన్నట్టు ‘పూలకం’ వచ్చినట్టు విరగబూసి చూసే వారికి ఆనందాశ్చర్యాల్ని పుష్కలంగా ఇస్తోంది.
– రాయవరం