55 లక్షల కొత్త జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఆగస్టులో 55.4 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. ఈ గణాంకాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ల వివరాలు లేవు. సీఓఏఐ గణాంకాల ప్రకారం...,
* ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మొత్తం జీఎస్ఎం మొబైల్ యూజర్ల సంఖ్య 74.99 కోట్లకు పెరిగింది.
* ఆగస్టులో అత్యధికంగా కొత్త మొబైల్ వినియోగదారులు ఐడియా సెల్యులర్కు లభించారు. 17.2 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 14.18 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 18.91 శాతంగా ఉంది.
* వొడాఫోన్కు 12.2 లక్షల మంది కొత్తగా వినియోగదారులయ్యారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 17.24 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 23 శాతంగా ఉంది.
* కొత్తగా లభించిన 7.69 లక్షల వినియోగదారులతో ఎయిర్టెల్ మొత్తం యూజర్ల సంఖ్య 21.05 కోట్లకు పెరిగింది. మార్కెట్ వాటా 28.07%.
* ఎయిర్సెల్కు 9.05 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 7.48 కోట్లకు పెరిగింది.
7.06 లక్షల మంది కొత్త వినియోగదారులతో యూనినార్ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.09 కోట్లకు చేరింది.
వీడియోకాన్ మొబైల్ సంస్థకు 1.96 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు.