breaking news
Oil reserves
-
చమురు అంత ఈజీ కాదు
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించి పట్టితీసుకొచ్చాక ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనెజువెలా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపుగా పడకేసింది. మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలావరకు పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవీ ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పనుల్లోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఓ రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒకరకంగా అమెరికాయే కారణం కావడం విశేషం. ఈ దేశంపై అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనెజువెలా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజువెలా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనెజువెలా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజువెలా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తోంది. అదే ఆంక్షల ఊసు లేని రోజుల్లో అంటే 1999 ఏడాదిదాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడిచమురును వెలికితీసేది. వెనెజువెలా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, పదేళ్ల శ్రమ అవసరం అవుతాయని అమెరికాలోని ‘రైస్ యూనివర్సిటీ’లో లాటిన్ అమెరికా ప్రాంత ఇంధన విభాగ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో మొనాల్డీ అంచనావేశారు.కంపెనీలు ముందుకొచ్చేనా?వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. యావత్ ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17 శాతానికి సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తిస్థాయి గుత్తాధిపత్యం సాధించేలా అన్ని చర్యలూ తీసుకునేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే. రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్కు తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీ మొత్తాలే వెచ్చించినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలాకా లమే పడుతుందని ఇంధనధరల సరళిపై అధ్యయ నం చేసే గ్యాస్బడ్డీ సంస్థలో ప్రధాన పెట్రోలియం విభాగ నిపుణుడు ప్యాట్రిక్ డీ హాన్ వ్యాఖ్యానించారు. ‘‘చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధణ ఒక అంశమైతే, రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం. తమ పెట్టుడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తేనే బడా కంపెనీలు వెనిజువెలాలో అడుగుపెడతాయి. ఆ నమ్మకం లేనంతకాలం పెట్టుబడుల వరద పారడం చాలా కష్టం’’ అని మొనాల్డీ విశ్లేషించారు. బహుశా ఈ పరిస్థితులను ఊహించే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శనివారం నాటి క్షిపణి, బాంబు దాడుల్లో వెనిజువెలా కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది. వెనెజులా నుంచి ముడిచమురు వెలికితీతను అనూహ్యవేగంగా మొదలెడితే చమురురంగంలో గల్ఫ్ దేశాలను తోసిరాజని అమెరికాయే కింగ్‌మేకర్‌గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుంది గనుక ఇప్పటికే నేలచూపులు చూస్తున్న చమురు ధరలు కనీసం మరికొన్నేళ్లపాటు చౌకగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.నాణ్యమైన చమురువెనెజువెలాలో దొరికేది హెవీ క్రూడ్‌గా పేర్కొ నే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్‌తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయా రవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటినుంచీ ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలుస్తోందంటే చమురు విక్రయాల పుణ్యమే. చట్టపరమైన చిక్కులువెనిజువెలా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ‘‘ట్రంప్ చర్యను వెనిజువెలా కచ్చితంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల ముందు సవాలు చేయవచ్చు. చమురు ఉత్పత్తి పెరుగుదలతో ప్రధానంగా నష్టపోయే రష్యానో, లేదంటే ఏ ఇతర దేశమో కూడా మదురో నిర్బంధాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆస్కారం లేకపోలేదు. -
పంతం నెగ్గించుకున్న ట్రంప్
ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు. దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్ కార్టెల్స్ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. వ్యతిరేకులతో దోస్తీ! వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్ తన హయాంలో యూఎస్ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. ఆయన హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు. దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్‌లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్‌గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. మచాడో ఫ్యాక్టర్! మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు. అమెరికా దన్ను మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్‌కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజువెలా.. టార్గెట్ ఆయిలా
డ్రగ్స్ .. వలసలపై పోరు, దేశ భద్రతకు ముప్పు మొదలైన అంశాల వల్లే వెనెజువెలాపై దాడికి పాల్పడినట్లు అమెరికా చెబుతున్నప్పటికీ నిజంగా కారణాలు అవేనా? లేక వేరే ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వెనెజువెలాలో పుష్కలంగా ఉన్న చమురు నిల్వలే టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పోరుకు తెరతీసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో ఒపెక్ (ఆయిల్ ఎగుమతి దేశాల) ఆధిపత్యానికి గండి కొట్టి, అమెరికా కొత్త ఆయిల్ కింగ్‌గా మారే ప్రయత్నం చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనెజువెలాపై అమెరికా దాడి దరిమిలా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో చోటు చేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలపై కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్అమెరికాకు ఎందుకు ఆసక్తి..ప్రపంచంలోనే అమెరికా అత్యధికంగా రోజుకు 20–22 మిలియన్ బ్యారెళ్లు (ఎంఎంబీపీడీ) ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వెనెజువెలా తయారు చేసే రకం ఆయిల్‌ని కొంత దిగుమతి చేసుకుంటోంది. అమెరికా తయారు చేసే లైట్ స్వీట్ రకం ముడిచమురు.. పెట్రోల్‌లాంటి వాటి తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. డీజిల్‌తో పాటు ఫ్యాక్టరీలు ఇతరత్రా అవసరాలకు కావాల్సిన ప్రొడక్టులను ఉత్పత్తి చేయాలంటే వెనెజువెలా సరఫరా చేసే హెవీ, సోర్ రకం క్రూడాయిల్ ముఖ్యం. పలు అమెరికన్ రిఫైనరీలు.. వెనెజువెలా హెవీ ఆయిల్‌ని ప్రాసెస్ చేయడానికి అనువుగా నిర్మితమై ఉన్నాయి.తమ దేశపు ఆయిల్‌తో పోలిస్తే వెనెజువెలా ఆయిల్తోనే అవి సమర్ధవంతంగా పని చేయగలవు. దానికి తగ్గట్లుగానే మిగతా దేశాలతో పోలిస్తే సమీపంలోనే ఉన్న వెనెజువెలా నుంచి అమెరికా రోజుకు 1.02 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఈ దాడి వల్ల అగ్రరాజ్యానికి, దాని మిత్ర దేశాలకు, ముఖ్యంగా వెనెజువెలా ఎకానమీకి కూడా ప్రయోజనాలు చేకూరవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా తదితర దేశాలకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆ దేశంలో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరలు అదుపులో ఉంటాయంటున్నారు.అపార ఆయిల్.. ఖనిజ నిల్వలుప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలాలో 303 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిక్షేపాల్లో ఇది అయిదో వంతు. అదే అమెరికా, రష్యాలో చెరి 80 బిలియన్ బ్యారెళ్లు ఉండగా.. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ల మేర నిక్షేపాలు ఉన్నాయి. అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేక వెనెజువెలా ఆయిల్ పరిశ్రమ అనేక సంవత్సరాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సరైన నాయకత్వం లేకపోవడం, అవినీతి, అమెరికా ఆంక్షలు, పరిశ్రమలోకి పెట్టుబడులు రాకపోవడం మొదలైనవి ఇందుకు కారణం.ఫలితంగా, 25 ఏళ్ల క్రితం రోజుకు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసిన వెనెజువెలా ప్రస్తుతం ఒక మిలియన్ బ్యారెళ్ల స్థాయికి పడిపోయింది. ఇలా ఉత్పత్తి చేసే ఆయిల్లో సింహభాగాన్ని (రోజుకు 6,00,000 బ్యారెళ్లు) చైనా దిగుమతి చేసుకుంటోంది. వెనెజువెలా ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం ద్వారా ఆ దేశపు ఆయిల్ రంగంలో చైనా గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. ఇక వెనెజువెలాలో ముడిచమురుతో పాటు అరుదైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజ సంపద విలువ దాదాపు 1.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.రష్యాకు చెక్..రష్యా ఆయిల్ కూడా దాదాపు వెనెజువెలా క్రూడాయిల్ తరహాలోనే ఉంటుంది. అందుకే భారత్, చైనాలాంటి దేశాలు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వెనెజువెలాలో ఉత్పత్తి పెరిగితే అది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఇప్పటిదాకా రష్యా దగ్గర కొంటున్న దేశాలు నెమ్మదిగా వెనెజువెలావైపు మళ్లుతాయి. ఫలితంగా రష్యా ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే ఉక్రెయిన్ మీద యుద్ధం చేసే సామర్థ్యాలు కూడా సన్నగిల్లుతాయి. ఆ విధంగా రష్యాని అమెరికా కట్టడి చేసినట్లవుతుంది.అదే సమయంలో అత్యధిక నిల్వలున్న వెనెజువెలాను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా క్రూడాయిల్ మార్కెట్‌పైనా ఆధిపత్యం దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో షెల్ ఆయిల్ ఉత్పత్తి బూమ్ వల్ల మార్కెట్ ఆధిపత్యం ఒపెక్ దేశాల నుంచి కొంత అమెరికాకు వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారుగా అమెరికా మారింది. రాబోయే రోజుల్లో వెనెజువెలాలోని చమురు నిక్షేపాలు, అమెరికా, దాని మిత్ర దేశాల చేతిలోకి వెళ్తే.. అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్ తీరుతెన్నులు మారిపోవచ్చు. భవిష్యత్తులో ఒపెక్, దాని మిత్ర దేశాల సామర్థ్యాలను బలహీనపర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మనపై ఎఫెక్ట్ ఏంటంటే..భారత్‌కి కూడా వెనెజువెలా నుంచి రోజుకు సుమారు 60,000 నుంచి 1,00,000 బ్యారెళ్ల (బీపీడీ) మేర సరఫరా అవుతోంది. మనం క్రూడాయిల్ దిగుమతుల్లో ఇది సుమారు 2–3 శాతం ఉంటుంది. 2024లో వెనెజువెలా నుంచి 1.76 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఒకవేళ వెనెజువెలా ఆయిల్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలైతే మధ్యప్రాచ్యదేశాల నుంచి ఖరీదైన ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయాల్సి రావచ్చు.దీనితో సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు దిగుమతుల బిల్లు భారం పెరగొచ్చని అంచనా. అటు వెనెజువెలా కోవకి చెందినది కాకపోయినప్పటికీ రష్యా నుంచి కూడా చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకునే వీలున్నా, ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ మనపై అమెరి కా ఒత్తిడి తెస్తున్న కారణంగా ఇలాంటి అవకాశాలపై కొంత సందేహాలు నెలకొన్నాయి.తాత్కాలికంగా రేట్లకు రెక్కలు..వెనెజువెలా సరఫరా చేసేది స్వల్పమే అయినా అది కూడా నిల్చిపోతే చమురు రేట్లు తాత్కాలికంగా, బ్యారెల్‌కి 3–5 డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మార్కెట్లో ఓవర్–సప్లై నెలకొనడంతో పాటు ఒపెక్ దేశాలు ఆ మేరకు అదనంగా ఉత్పత్తి పెంచితే ధరలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు. అయితే, వెనెజువెలా ఉత్పత్తి చేసే క్రూడాయిల్ రకం ప్రత్యేకమైనది కావడం వల్ల దానిపైనే ఆధారపడిన వర్గాలపై కొంత ప్రభావం పడనుంది. -
వెనిజులాపై ట్రంప్... పూర్తిస్థాయి యుద్ధం?
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్ పెట్టారు. ‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం. కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు. గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్ వైల్స్కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి. -
తదుపరి గురి వెనిజులా?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.చమురు కోసమేనా?వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్‌వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది. మాదక ద్రవ్యాల సాకుతో...ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ. మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్‌పై సుంకాలను 50 శాతం పెంచారు. అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.ఏకపక్ష దాడులుఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్
భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని పాదుర్‌లో రూ.5,700 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్పీఆర్) యూనిట్‌ను నిర్మించనున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రైవేట్ రంగ సంస్థ ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చొరవ సాంప్రదాయకంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఇంధన భద్రతలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది.వ్యూహాత్మక ముందడుగుఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఎస్పీఆర్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 5.33 ఎంఎంటీ వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిల్వల ద్వారా పూర్తి సామర్థ్యంతో 8-9 రోజుల జాతీయ ముడి చమురు డిమాండ్‌ను తీర్చవచ్చు. కొత్త స్టోరేజీ అందుబాటులోకి వస్తే మరిన్ని రోజులు ఇంధన భద్రత ఉంటుందని చెబుతున్నారు.ఇది అమలులోకి వస్తే ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్ పెరిగినా దేశ ఇంధన బఫర్కు తోడ్పడుతుంది. ఈ రిజర్వ్‌ను నిర్మించడానికి ఎంఈఐఎల్కు ఐదేళ్ల సమయం అవసరం అవుతుందని తెలిపింది. 60 సంవత్సరాల పాటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం ఈ కెపాసిటీలో ముడి చమురు నింపే ఖర్చు 1.25 బిలియన్ డాలర్లు (రూ.11,020 కోట్లు)గా అంచనా వేశారు. దాంతో ఇది భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడిగా నిలిచింది. ఈ స్టోరేజ్ యూనిట్‌ను కంపెనీ నేరుగా నిర్వహించవచ్చు లేదా ఇతర చమురు నిర్వహణ సంస్థలకు లీజుకు ఇవ్వొచ్చు.ప్రత్యేకతలు..మొదటి ప్రైవేట్ ఎస్పీఆర్: ఇంధన నిల్వల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని వైవిధ్యం చేస్తుంది.పబ్లిక్-ప్రైవేట్ సినర్జీ: జాతీయ భద్రతతో అనుసంధానించిన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా ప్రభుత్వ దృక్పథం మారడాన్ని ప్రతిబింబిస్తుంది.ఇంధన భద్రత: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ చమురు నిల్వలకు కీలకంగా మారనుంది.వ్యూహాత్మక ప్రదేశం: పదుర్ ఇప్పటికే ఎస్పీఆర్ మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఇది లాజిస్టిక్, కార్యాచరణ సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా? -
‘మా సాయంతో భారత్‌కు పాక్ చమురు’: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీటికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు భారత్‌కు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందని, అందుకు తాము పాక్‌కు సాయం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ మరోమారు భారత్- పాక్ మధ్య చిచ్పుపెట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుక్నునదని, అయితే ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారధ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. తాము పాకిస్తాన్‌తో ఒక ఒప్పందాన్ని ముగించామని, ఈ మేరకు పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయన్నారు. ఇదే పోస్ట్‌లో ట్రంప్.. అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకునే పలు దేశాల నేతలతో మాట్లాడానని పేర్కొన్నారు. కొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం అమెరికాకు ఆఫర్లు ఇస్తున్నాయని, ఇది దేశ వాణిజ్య లోటును భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.తాము వైట్ హౌస్ లో వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తానన్నారు. దక్షిణ కొరియా ప్రస్తుతం 25శాతం సుంకాలను కలిగివుందని, అయితే వారు ఆ సుంకాలను తగ్గించే ప్రతిపాదనతో ఉన్నారని, అందుకు వారు ఇచ్చే ఆఫర్ ఏమిటో వినడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, ఈ వారం చివరి నాటికి సుంకాల విషయంలో స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
కుమురం భీం జిల్లాలో ఆయిల్ నిక్షేపాలు!
సిర్పూర్(టి): కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిసరప్రాంతాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో నిపుణులు సర్వే చేస్తున్నారు. ఓఎన్జీసీఆధ్వర్యంలో చేపట్టిన ఈసర్వేలో కుమురంభీం జిల్లా పరిధిలో నికాగజ్నగర్, సిర్పూర్(టీ), దహెగాం, పెంచికల్ పేటమండలాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్లుగుర్తించారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ నిపుణుల ఆధ్వర్యంలో సర్వేపనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కేబుల్ కనెక్షన్లు వేసి అధునాతన పరికరాలతో చేస్తున్న సర్వే మొదటిదశపూర్తికావస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారంఎనిమిదినెలలపాటుపరీక్షలునిర్వహించినిక్షేపాలుకచ్చితంగా లభ్యమయ్యేప్రాంతాలనుగుర్తిస్తామనిఓఎన్జీసీఅధికారులుచెబుతున్నారు. శుక్రవారంసిర్పూర్(టీ) మండలకేంద్రంలోనిదుబ్బగూడకాలనీప్రాంతంలోసర్వేనిర్వహించడంతోపాటుఎంపికచేసినస్థలాల్లోడ్రిల్లింగ్చేసిపరీక్షలు నిర్వహించారు. అలాగేశనివారంసిర్పూర్(టీ), నవేగాం, హుడ్కిలిగ్రామాల్లోకేబుళ్లనుఅమర్చికంప్యూటర్లలో పరిశీలిస్తూ, డ్రిల్లింగ్‌చేశారు. దీనికిముందుగాకాగజ్నగర్మండలంలోనిఅనుకోడ, చుంచుపల్లి, గన్నారం, చింతకుంటగ్రామాలమీదుగాకేబుల్లైన్లువేస్తూసర్వేనిర్వహించారు. డ్రిల్లింగ్చేయగావచ్చేధ్వనితరంగాలద్వారానిక్షేపాలనుపసిగడుతున్నట్లు తెలుస్తోంది. కుమురంభీం– మంచిర్యాల– భద్రాచలంమీదుగా.. రెండవదశ సర్వేకాగజ్నగర్ మండలంలోని పెద్దవాగునుంచి కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాలజిల్లా మీదుగా భద్రాచలం జిల్లాల్లో ప్రాథమిక సర్వేలునిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 8 నెలలపాటు సర్వే చేయనున్నట్లువెల్లడించారు. నిక్షేపాలున్న స్థలాలను గుర్తించి పూర్తిస్థాయి సర్వేలుచేపడతామని తెలిపారు. కుమురంభీంజిల్లాతోపాటు మంచిర్యాల పరిసరప్రాంతాల్లోని భీమిని మండలంనందుగులగూడ గ్రామ పరిసరాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిసర్వేలు చేపడతాం కుమురం భీంజిల్లాలోనిపలుగ్రామాల్లోఓఎన్జీసీఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసంప్రాథమికసర్వేలు చేపడుతున్నాం. సర్వేల రిపోర్టు లు, డ్రిల్లింగ్‌లో వెల్లడైన ఫలితాల ఆధారంగా 8 నెలలపాటు పూర్తిస్థాయి సర్వేలు చేపడతాం. నిక్షేపాల తీరునుబట్టి స్థానికంగా వెలికితీత ప్రారం భమవుతుంది. – సత్తిబాబు, ఓఎన్జీసీ, పీఆర్వో -
ఆదర్శ దేశం
అదిగో అల్లదిగో... అల్జీరియా ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అతి పెద్ద దేశం అల్జీరియా. దీనికి ఈశాన్యంలో టునీషియా, తూర్పులో లిబియా, దక్షిణంలో మొరాకో దేశాలు ఉన్నాయి. ఉత్తర ఐరోపాకు అల్జీరియా ఎక్కువ మొత్తంలో సహజవాయువులను సరఫరా చేస్తుంది. ఆఫ్రికాలో చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో అల్జీరియా రెండవ స్థానంలో ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశం ఫ్రెంచ్ అధీనంలో ఉంది. ఆ కాలంలో ఫ్రాన్సు నుంచి ఎంతో మంది అల్జీరియాకు వచ్చి ఎన్నో నగరాల్లో స్థిరపడ్డారు. ఈ ప్రభావంతో అల్జీరియా సంస్కృతి, ఆర్థికవ్యవస్థ, సమాజంపై ఫ్రెంచ్ ప్రభావం బలంగా కనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్సుకు వ్యతిరేకంగా ఎందరో నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా రకరకాల గ్రూపులు ఒక్కటయ్యాయి. ముఖ్యంగా ‘అల్జీరియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఏర్పాటుతో అల్జీరియా చరిత్ర కీలకమైన మలుపు తిరిగింది. 1962లో ఫ్రాన్స్ నుంచి అల్జీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. వేలాది మంది అల్జీరియాను వదిలి తమ సొంతదేశం వెళ్లిపోయారు. ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో అల్జీరియా బాగా దెబ్బతిన్నది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. 1962 జూలై 1న అల్జీరియాలో జరిగిన రెఫరెండం ద్వారా కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ పరీక్షా సమయంలో అధైర్యపడకుండా, నిరాశపడకుండా ప్రజలందరూ ఐకమత్యాన్ని ప్రదర్శించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూనుకున్నారు. పట్టుదల, నిబద్ధతతో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది అల్జీరియా. అయితే జీవవైవిధ్యంలో మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు, పక్షులు, జంతువుల విషయంలో తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది. ఆధునిక అల్జీరియా సాహిత్యంపై అరబిక్, ఫ్రెంచ్ ప్రభావం బలంగా ఉంది. అల్జీరియా సంగీతం ‘రాయ్’కి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. క్రీడా రంగంలో ప్రతిభ చూపుతున్న ఆఫ్రికాలోని ముఖ్యమైన దేశాలలో అల్జీరియా ఒకటి. ఎందరో వరల్డ్ ఛాంపియన్లు, ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న క్రీడాకారులు ఈ దేశంలో ఉన్నారు. ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్‌బాల్... మొదలైనవి ఈ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆటలు. అల్జీరియాలో బహుళ పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీ కూడా తనకు తానుగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థితిలో లేదు. అందుకే పార్టీల మధ్య పొత్తు అనేది తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’, ‘వర్కర్స్ పార్టీ’, ‘నేషనల్ ర్యాలీ ఫర్ డెమోక్రసీ’, ‘ర్యాలీ ఫర్ కల్చర్ అండ్ డెమోక్రసీ’, ‘సొసైటీ ఫర్ పీస్’... మొదలైనవి అల్జీరియాలో ప్రధాన రాజకీయ పార్టీలు. టాప్ 10 1. అల్జీరియా జాతీయపతాకంలో ఎరుపు రంగు ప్రజల త్యాగాన్ని, ఆకుపచ్చ రంగు ప్రకృతిని, తెలుపు రంగు శాంతిని ప్రతిబింబిస్తాయి. 2. ప్రఖ్యాత రచయిత అల్బర్ట్ కామూ అల్జీరియాలోని కోస్తా పట్టణం మండోవిలో జన్మించారు. 3. అధికార భాష అరబిక్‌తో పాటు దేశంలో ఫ్రెంచ్ భాష ఎక్కువగా మాట్లాడతారు. స్థానిక మాండలికం ‘దర్జా’ను అరవైశాతం మంది మాట్లాడతారు. 4. సహారా ఎడారిలో కనిపించే ‘ఫెనిక్ ఫాక్స్’ అల్జీరియా జాతీయ జంతువు. 5. అతిథికి ఖర్జూరాలు, పాలు ఇచ్చి స్వాగతం పలకడం అల్జీరియాలో సంప్రదాయం. 6. అల్జీరియాలో పొడవైన నది... చెలిఫ్. 7. వ్యవసాయ ప్రాంతాలలో ‘ల టోయిజ’ పేరుతో జరిగే ఉత్సవంలో రైతులకు సహాయంగా ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తారు. 8. ఆఫ్రికా దేశాలలో అల్జీరియా అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన ఉన్న దేశం. 9. ‘అల్జీర్స్’ అనే నగరం పేరు నుంచి దేశానికి ‘అల్జీరియా’ అనే పేరు వచ్చింది. 10. అల్జీరియా తొలి అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా. అయితే రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు. -
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
-
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
రాయికల్ : ఆయిల్ నిల్వల్లో ప్రపంచాన్నే శాసిస్తున్న యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యం నెలకొంది. గత రెండుమూడు నెలల నుంచి ఆ దేశాలు ఆర్థికమాంద్యంలో కొట్టమిట్టాడుతున్నాయి. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఈ దేశాల్లో 2008 నాటి ఆర్థికమాంద్యం మళ్లీ పునరావృతం అవుతోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా, అలీన్, అజ్మాన్, రసల్ఖన స్టేట్స్‌తోపాటు ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లోని చమురు కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను కొంతకాలం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయూ కంపెనీలపై ఆధారపడిన పరిశ్రమలకు సమస్యలు చుట్టుముట్టాయి. చమురుపై ఆధారపడిన ఆయా దేశాల్లో నిర్మాణరంగం, ఫుడ్సప్లై, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, టూరిజం తదితర రంగాల్లోని పరిశ్రమలపై ఆర్థికమాంద్యం ప్రభావం అధికంగా ఉంది. చమురు ధరలు తారాస్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న సమయంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికులు ప్రస్తుతం వేతనాలు తగ్గడంతో తమ జీవన సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దుబాయ్ పెట్రోలియం వంటి పెద్ద కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం, జీతాలు తగ్గించడంతో కార్మికులు దినదినగండంగా రోజులు వెల్లదీస్తున్నారు యూఏఈలో గత కొన్నేళ్లుగా స్థిరపడ్డ ఉద్యోగులు తమకు వస్తున్న జీతాల ఆధారంగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకున్నారు. హఠాత్తుగా జీతాలు తగ్గిపోవడంతో తీసుకున్న లోన్లు ఎలా చెల్లించాలో తెలియక క్షోభకు గురవుతున్నారు. చమురు కంపెనీలతో పాటు వాటిపై ఆధారపడిన మిగతా కంపెనీలు సైతం కార్మికులకు గత రెండుమూడు నెలలుగా జీతాలివ్వకపోవడంతోపాటు, ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో కంపెనీలకు రుణాలు మంజూరు చేయకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఖర్చులను నియంత్రించి ప్రణాళికలు వేసుకుని 2016లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవాలంటే చిన్నతరహా పరిశ్రమలకు మరో ఏడాదిపాటు గడ్డు పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కాగా, చిన్నతరహా పరిశ్రమల్లో ఉన్న కార్మికులను సెలవులపై వెళ్లాల్సిందిగా అక్కడి రాజు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యూఏఈలో 8 లక్షల మందికిపైగా కార్మికులు ఉన్న ఊరులో ఉపాధి కరువై లక్షల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాలకు చెందిన ఎనిమిది లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఆర్థికమాంద్యం ఏర్పడడంతో కంపెనీలు సరైన జీతాలు ఇవ్వకపోవడంతో పాటు పనిలోంచి తొలగించడంతో చేసిన అప్పులు తీర్చలేక స్వగ్రామాలకు తిరిగి రాలేక ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు వచ్చే కార్మికులకు రాష్ట్ర ఉపాధి కల్పించాలని దుబాయ్‌లోని గల్ఫ్ తెలంగాణ సంఘం సభ్యులు జువ్వాడి శ్రీనివాసశర్మ, రాజశ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితులు బాగా లేవు ఆర్థికమాంద్యం కారణంగా యూఏఈలో గత రెండుమూడు నెలల నుంచి పరిస్థితులు బాగా లేవు. పెద్దపెద్ద కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. - రాజశ్రీనివాసరావు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి ఆర్థికమాంద్యం వల్ల తెలంగాణకు చెందిన కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చొరవచూపి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. - శ్రీనివాసశర్మ, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం ఫౌండర్ మెంబర్ ఏజెంట్లను నమ్మి రావద్దు యూఏఈ, ఖతర్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యంతో ఉద్యోగాలు ఊడుతున్నారుు. తెలంగాణ నుంచి నిరుద్యోగులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు రావద్దు. - శ్రీనివాసరావు, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
చమురు నిల్వలకు 5 వేల కోట్లు
వైజాగ్‌లోని వ్యూహాత్మక స్టోరేజీ కేంద్రం కోసం కొనుగోళ్లు... రెండు ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటాన్ని ప్రయోజనకరంగా మల్చుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. అత్యవసర పరిస్థితుల కోసం వ్యూహాత్మకంగా చమురును నిల్వ చేసుకునేందుకు రూ. 4,948 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులో ఏర్పాటవుతున్న భూగర్భ నిల్వల కేంద్రాలకు అవసరమైన చమురును కొనుగోలు చేసేందుకు ఈ నిధులు వెచ్చించనుంది. 11 రోజుల దేశీయ అవసరాలకు ఈ నిల్వలు సరిపోతాయి. మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భారతీయ వ్యూహాత్మక స్టోరేజి ప్రోగ్రాం కింద ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ఐఎస్పీఆర్ఎల్) చేపట్టబోయే నిల్వల స్కీమ్ కోసం ఈ నిధులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, బీహార్‌లో బరౌనీలో రెండు ఎరువుల ప్లాంట్లను రూ. 12,000 కోట్లతో పునరుద్ధరించే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి అవసరమైన గ్యాస్‌ను సరఫరా చేసేందుకు జగదీశ్‌పూర్-హల్దియా మధ్య గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. ఇక అటు మౌలిక రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు మరింత ఆర్థిక సహాయం చేసే విధంగా మార్గదర్శకాలకు సవరణలను క్యాబినెట్ ఆమోదించింది. భారత్ ప్రస్తుతం ఏకంగా 79 శాతం మేర చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో భవిష్యత్‌లో సరఫరా సమస్యలు ఏమైనా ఎదురైనప్పటికీ.. ఇబ్బందిపడాల్సిన అవసరం లేకుండా వ్యూహాత్మక నిల్వలు నిర్మించడం ప్రాధాన్యతాంశంగా మారింది. ఇప్పటికే వైజాగ్‌లో స్టోరేజీ కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. మంగళూరు కేంద్రం జూన్ నాటికి, పాడూర్ కేంద్రం జూలై నాటికి అందుబాటులోకి రానున్నాయి. వైజాగ్ స్టోరేజీ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఈ తరహా వ్యూహాత్మక నిల్వలు ఉన్న అమెరికా, జపాన్, చైనా వంటి దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా చేరినట్లవుతుంది. గడిచిన 35 సంవత్సరాల్లో పాశ్చాత్య దేశాలు ఇప్పటిదాకా మూడు సార్లే ఈ తరహా నిల్వలను ఉపయోగించాయి. 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో, 2005లో కత్రినా హరికేన్ వచ్చినప్పుడు, 2011లో లిబియాలో యుద్ధ సమయంలో వీటిని ఉపయోగించాయి. వైజాగ్ నిల్వల కేంద్రం.. విశాఖపట్నంలో నిర్మించిన భూగర్భ స్టోరేజీ కేంద్రాన్ని దాదాపు పది అంతస్తుల ఎత్తు, సుమారు 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది. ఇందులో చమురు కోసం కేంద్ర ఆర్థిక శాఖ తొలుత రూ. 2,399 కోట్లు కేటాయించింది. అయితే, వైజాగ్ కేంద్రం పూర్తి సామర్ధ్యం 10 మిలియన్ బ్యారెళ్లు కాగా.. 6.5- 7 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు కొనేందుకు మాత్రమే ఈ మొత్తం సరిపోతుంది. దీంతో వైజాగ్ స్టోరేజీ కేంద్రం మొత్తాన్ని భర్తీ చేసేందుకు వీలుగా సీసీఈఏ తాజాగా రూ. 4,948 కోట్లు మంజూరు చేసింది. వైజాగ్ కేంద్ర అవసరాలు తీరగా మిగిలే మొత్తంతో ఇతర స్టోరేజీ కేంద్రాల కోసం చమురును కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే వైజాగ్ కేద్రం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రెండు ఓడల మేర ముడి చమురును కొనుగోలు చేసింది. తాజాగా క్యాబినెట్ ఆమోదంతో వీటికి సంబంధించిన నిధులను చెల్లించడం సాధ్యపడనుంది. -
నాగాయలంకలో భారీ ఆయిల్ రిజర్వాయర్
కేశనపల్లిని మించిన నిక్షేపాలు - ఫలించిన మూడేళ్ల ఓఎన్జీసీ శ్రమ - రూ. 1,500 కోట్లతో డ్రిల్లింగ్కు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ఓఎన్జీసీ మూడేళ్ల శ్రమ సత్ఫలితాన్నిచ్చింది. ఇంతవరకు ఈ బేసిన్‌లోని తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి క్షేత్రంలోని చమురు నిల్వలను మించిన నిల్వలను ఆ సంస్థ గుర్తించింది. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపాన గుర్తించిన ఆ భారీ చమురు క్షేత్రంలో నిల్వలను వెలికి తీసేందుకు వచ్చే ఏడాది రూ.1,500 కోట్లతో కార్యాచరణను సిద్ధం చేస్తోంది. గత మూడేళ్లుగా ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాల కోసం ఈ బేసిన్లో వెయ్యి కోట్లకు పైనే పెట్టుబడులు పెట్టి అన్వేషణ సాగిస్తున్నా నిరుత్సాహమైన ఫలితాలను చవిచూస్తోంది. నాగాయలంక పరిసర ప్రాంతాల్లో గత మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం సంస్థ ప్రస్థానంలో పెద్ద మైలురాయిగా నిలుస్తుందంటున్నారు. ఇప్పటివరకూ కేజీ బేసిన్లో తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి స్ట్రక్చరే అతి పెద్ద చమురు క్షేత్రంగా ఉంది. ఇక్కడ సుమారు 40 చమురు బావుల నుంచి రోజుకు 2 లక్షల లీటర్ల ముడి చమురు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ లభిస్తున్నాయి. 1992 ప్రాంతంలో గుర్తించిన కేశనపల్లి స్ట్రక్చర్ కేజీ బేసిన్‌కు తలమానికంగా నిలిచింది. ఇప్పుడు కేశనపల్లిని మించి నాగాయలంక స్ట్రక్చర్‌లో రోజుకు ఐదారు లక్షల లీటర్ల ముడిచమురు ఉత్పత్తికి అవకాశం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇది రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. చమురుతో పాటు గ్యాస్ కూడా భారీగా లభిస్తుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత మూడేళ్లుగా ఓఎన్జీసీ కేజీ బేసిన్ పరిధిలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో జియో ఫిజికల్, జియో కెమికల్ సర్వేలు నిర్వహించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలో నాలుగు, తాటిపాక పరిధిలో ఒకటి, కేశవదాసుపాలెం పరిధిలో ఒకటి, నర్సాపురం పరిధిలో ఒకటి వంతున బావుల్లో మాత్రమే కొత్తగా చమురు నిక్షేపాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది. కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలో తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక తదితర ప్రాంతాల్లో చమురు లభించిన నాలుగు బావుల్లో ప్రస్తుతం ప్రొడక్షన్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో భారీ చమురు క్షేత్రాన్ని గుర్తించడంతో ఆ సంస్థ సుదీర్ఘంగా చేస్తున్న నిరీక్షణకు ఫలితం ఖాయమైంది. ఇప్పటికే నాగాయలంక ప్రాంతంలో మూడు బావుల్లో డ్రిల్లింగ్ పూర్తి కావచ్చిందని ఓఎన్జీసీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో డ్రిల్లింగ్ చేపట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. నాగాయలంక ఫీల్డ్‌లో సుమారు 30-40 బావుల్లో ఆయిల్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడ డ్రిల్లింగ్కు 5 నుంచి 6 రిగ్‌లను వినియోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. 2015లో డ్రిల్లింగ్ ప్రారంభించి2016 ఆఖరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పెరిగిన స్వాతంత్య్రేచ్ఛ
రెఫరెండం.. నేపథ్యం! స్కాట్లాండ్కు స్వాతంత్య్రాన్ని నిర్ణయించే రెఫరెండంకు దారి తీసిన పరిస్థితులు... మధ్య యుగాల్లో స్కాట్లాండ్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. క్రీశ 14వ శతాబ్దంలో ఇంగ్లండ్ రాజ్యంతో పలు ‘స్వాతంత్య్ర యుద్ధాలు’ కూడా చేసింది. 1707లో ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ రాజ్యాలు కలిసిపోయి ‘కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’గా ఏర్పడ్డాయి. 1801లో ఐర్లాండ్ రాజ్యం విలీనం అయిన తరువాత అది ‘యునెటైడ్ కింగ్డమ్(యూకే)’గా మారింది. తరువాత సంక్షేమ రంగం, పన్నుల వ్యవస్థ, నిధుల కేటాయింపు.. తదితరాల్లో బ్రిటన్ ప్రభుత్వ వివక్షతో స్కాట్లాండ్ ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. స్కాట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ 1934లో స్కాట్లాండ్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ) ఆవిర్భవించింది. ఆ పార్టీ ఒత్తిడిపై స్కాట్లాండ్ చట్టం, తద్వారా 1999 లో స్కాటిష్ పార్లమెంటు ఏర్పడ్డాయి. 2007 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి సంబంధించిన రెఫరెండం నిర్వహిస్తామంటూ ఎస్ఎన్పీ హామీ ఇచ్చింది. అప్పుడు అలెక్స్ సాల్మండ్ ఫస్ట్ మినిస్టర్‌గా మైనారిటీ ప్రభుత్వం ఏర్పడటంతో ఎస్ఎన్పీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. 2011 ఎన్నికల్లో మరోసారి అదే హామీతో ఎస్ఎన్పీ ప్రజల ముందుకు వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎస్‌ఎన్‌పీకి పూర్తి మెజారిటీ రావడంతో రెఫరెండానికి మార్గం సుగమమైంది. అనంతరం స్కాట్లాం డ్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరి, 2013లో రెఫరెండానికి రాజ ముద్ర లభించింది. విడిపోవడం ఎందుకు? బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు. యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. కలసి సాగడం ఎందుకు? విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్కు అవసరమని వాదిస్తున్నారు. నేషనల్ డెస్క్ -
తీరంలో అపార చమురు నిక్షేపాలు?
కోడూరు-పెదపట్నం మధ్య సముద్రంలో చమురు నిల్వలు! 20 సంవత్సరాలుగా తీరం వెంబడి రిలయన్స్, ఓఎన్జీసీ పరిశోధనలు మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ,అనుబంధ పరిశ్రమల వెనక మర్మమిదే! మచిలీపట్నం: సముద్ర తీరంలో అపార చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నాయా...పదేళ్లుగా ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు ఈ ప్రాంతంలో చేసిన పరిశోధనల్లో అవన్నీ ఉన్నట్లు కనుగొన్నారా... కోడూరు మండలం నుంచి మచిలీపట్నం మండలం పెదపట్నం వరకు సముద్రంలో అపార చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారా.. అనంతరమే మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీని, అనుబంధ పరిశ్రమలను లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నం పోర్టు పక్కనే ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారా.. తదితర ప్రశ్నలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కలిసిన సమయంలో మచిలీపట్నంలో లక్ష కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్లుగా పరిశోధనలు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరాన్ని కేంద్రంగా చేసుకుని గత 20 సంవత్సరాలుగా ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోడూరు- మచిలీపట్నం మధ్య సముద్రంలో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ పరిశోధనలు, ఏరియల్ సర్వేచేసే ఇంజినీర్ల కోసం ప్రతిరోజూ ఓ హెలికాఫ్టర్ మచిలీపట్నం మీదుగా తిరుగుతుండేది. సముద్రం అంతర్భాగంలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారని పలువురు ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నామని, అక్కడి నిల్వలు తరిగిపోతున్న సమయానికి ఇక్కడ ఉన్న చమురు నిల్వలను వెలికితీసే పని ప్రారంభిస్తారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితమే అభిప్రాయ సేకరణ మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన తదితర ప్రాంతాల్లో చమురు, సహజవాయువుల ఆచూకీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే ప్రజలు ఏమైనా ఇబ్బందులు పెడతారా అనే విషయంపై పది సంవత్సరాల క్రితమే కలెక్టరేట్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని పలువురు చెబుతున్నారు. అప్పుడే ఇక్కడ అపార చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించారని, ఇంతకాలం తరువాత వీటిని వెలికి తీసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని ఇంజినీర్ల వాదనగా ఉంది. లక్ష కోట్లతో మచిలీపట్నం పోర్టుకు సమీపంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ పెద్దమొత్తంలోనే చమురు, సహజవాయువు లభించే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. లక్ష కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే జిల్లాకు చెందిన ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.దీంతో పాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయి. ఇందుకోసం మన ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. -
కృష్ణా డెల్టాలో భారీగా చమురు !
రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆయిల్ నిక్షేపాలు ఓఎన్జీసీ-కెయిర్న్ ఎనర్జీ పరిశోధనలు సక్సెస్ భూగర్భంలో 4 కి.మీ. లోతులో 1,697 చ.కి.మీటర్లలో విస్తరణ కేజీ బేసిన్లోనే అత్యంత భారీ భూగర్భ క్షేత్రం దివిసీమ నుంచి గుంటూరు జిల్లా రేపల్లె వరకు చమురే బొల్లోజు రవి, సాక్షి ప్రతినిధి విజయవాడ: కృష్ణా డెల్టా ప్రాంతంలో భారీగా చమురు నిల్వలు బయటపడ్డాయి. ఓఎన్జీసీ-కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా 8 ఏళ్ల పాటు చేసిన పరిశోధన విజయవంతమైంది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన చమురు నిక్షేపంగా మారనుంది. 550 మిలియన్ బ్యారర్ల చమురు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉండొచ్చని అంచనా వేశారు. దీని విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 లక్షల కోట్లపైనే ఉంటుందని ఈ అన్వేషణలో పాలుపంచుకున్న కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. 2006 నుంచే పరిశోధనలు: మొదట్లో కృష్ణా డెల్టాలో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై పెద్దగా అంచనా ఉండేది కాదు. కేజీ బేసిన్లో భాగమైన ఈ ప్రాంతాన్ని గతంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రిలయన్స్ సంస్థ కూడా పెద్దగా ఖాతరు చేయలేదు. ఓఎన్జీసీ మాత్రమే కృష్ణా జిల్లాలోని మల్లేశ్వరం ప్రాంతంలో 16 ఆయిల్, 16 చమురు బావుల నుంచి నిక్షేపాలను వెలికి తీస్తోంది. దివిసీమలోని నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె వరకు భూగర్భంలో నిక్షేపాలపై కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎక్స్‌ఫ్లోరేషన్ లెసైన్సింగ్ పాలసీ (ఎన్ఈఎల్పీ-నెల్ప్) బిడ్డింగ్ నిర్వహించింది. ఆ బిడ్డింగ్‌ను ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. అందులో ఓఎన్జీసీ వాటా 51 శాతం కాగా... కెయిర్న్ ఎనర్జీ వాటా 49 శాతంగా ఉంది. 2006-07లో ఆ క్షేత్రంలో ఇవి కాలుమోపాయి. అప్పట్నుంచి పరిశోధనలు చేశాయి. నాగాయలంకలో ప్రయోగాత్మకంగా మూడు బావులను తవ్వారు. 2011లో ఒక బావిని, 2012లో మరో బావిని, 2013లో మూడో బావిని తవ్వారు. ఆ మూడు బావులు విజయవంతమయ్యాయి. ఈ క్షేత్రంలో గ్యాస్ కంటే కూడా చమురు నిక్షేపాలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఏకంగా 550 మిలియన్ బ్యారళ్ల ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చమురు బ్యారల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.106 డాలర్లు ఉంది. ఆ ప్రకారం చూస్తే మొత్తం ఇక్కడి నిక్షేపాల విలువ ఏకంగా రూ.3 లక్షల కోట్లు పైనే ఉంటుందని అంచనా. ప్రయోగాలు చేశారు ఇలా: ఈ ప్రయోగాలకు ముందు కృష్ణా డెల్టాలోని నాగాయలంక-రేపల్లె క్షేత్రంలో 2011 వరకు 3 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ప్రయోగాలు చేసేవారు. ఆ లోపు ఎప్పుడూ నిక్షేపాలు బయటపడలేదు. అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఓఎన్జీసీ-కెయిర్న్లు 4 కిలోమీటర్ల వరకు పరిశోధన సాగించాయి. అక్కడ భారీ ఒత్తిడితోపాటు 178 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిచోట సాధారణమైన పరికరాలు పనిచేయవు. ఈ నేపథ్యంలో శంబర్గర్ అనే అంతర్జాతీయ కంపెనీకి చెందిన డిజిటల్ టెక్నాలజీతో ప్రయోగాలు చేపట్టారు. 4 కి.మీ. లోతులో.. 1,697 చదరపు కి.మీ. విస్తరణలో ఉన్న ఈ నిక్షేప ప్రాంతాన్ని మరింత పరిశోధిస్తున్నారు.


