Old age Homes
-
కరోనాతో వయోవృద్దులకు కష్టకాలం
-
వృద్ధాశ్రమం, బాలల సంరక్షణ కేంద్రం ఒకే చోట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా బాలల సంరక్షణ కేంద్రాన్ని, వృద్ధాశ్రమాన్ని కలిపి ఏర్పాటు చేస్తామని, దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అనాథలు, బాల్యంలోనే నేరాలు చేసి రక్షణ గృహాల్లో ఉన్న చిన్నారులను, అలాగే వృద్ధాశ్రమాలకే పరిమితమైన వృద్ధులను ఒకే చోట ఉంచడం వల్ల సత్ఫలితాలు ఉంటాయన్న హైకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వాస్తవానికి వృద్ధాశ్రమాలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. రెండింటినీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతి సదుపాయాలు ఏమిటో పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది. వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి ఏమైనా అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేసేందుకు వీలుగా 14567 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు కోర్టుకు వివరించింది. వృద్ధాశ్రమాల్లో పరిస్థితులపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య ఈ నివేదికను కోర్టు ముందుంచారు. -
రిజిస్ట్రేషన్ లేని వృద్ధాశ్రమాలా?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లేదని, ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాలన్న చట్ట నిబంధనల్ని అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రిజిస్టర్ చేసినవి 89 ఉంటే రిజిస్టర్ చేయనివి 41 ఉన్నాయని తెలుసుకున్న ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రిజిస్టర్ కూడా చేసుకోని వృద్ధాశ్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని, తనిఖీలు చేయాల్సిన అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వహించకపోవడంపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నదీ కూడా వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల్లో వసతులు లేవని, అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా హిత వ్యాజ్యంగా పరిగణించింది. ఈ పిల్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహా న్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తయారు చేసిన నివేదికను ధర్మాసనానికి అందజేశారు. జంటనగరాల్లో 41 వృద్ధాశ్రమాలు కనీసం రిజిస్టర్ చేయకుండా నిర్వహిస్తున్నారని, పలు ఆశ్రమాల్లో కనీస వసతులు లేవని నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ కల్పించుకుని, లాక్డౌన్ కారణంగా అన్ని ఆశ్రమాలను అధికారులు తనిఖీలు చేయలేకపోయారని, కొన్ని చోట్ల వసతులు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 41 ఆశ్రమాలకు నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే వృద్ధాశ్రమాల్ని రద్దు చేస్తామని చెప్పామన్నారు. వాదనల అనంతరం జూలై 14 నాటికి ప్రభుత్వ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. -
పండుటాకుల పాట్లు..!
సాక్షి, హైదరాబాద్: వృద్ధాశ్రమాల నిర్వహణ కంటతడి పెట్టించేలా ఉందని, పట్టించుకో వాల్సిన ఉన్నతాధికారులను అక్కడ మూడు రోజులు బస చేయిస్తే ఎంత ఘోరంగా అవి ఉన్నాయో అనుభవంలో తెలుస్తుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో అనాగరిక పరిస్థితుల ను నగరాల్లోనే చూస్తున్నామని, నాగరికత లేదని చాలా మంది భావించే గ్రామాల్లోనే అమ్మానాన్నలను బాగా చూసుకుంటున్నారని అభిప్రాయపడింది. పండుటాకుల పట్ల ప్రేమ చూపని నేటి తరం.. రేపటి వృద్ధ తరమని మరిచిపోవద్దని హెచ్చరించింది. జంట నగరాల పరిసర ప్రాంతాల్లోని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణపై అమికస్‌క్యూరీ (ఈ కేసులో కోర్టుకు సహాయకారి)గా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ ఇచ్చిన నివేది కను పరిశీలించిన ధర్మాసనం వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని వ్యాఖ్యా నించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ ఎలా ఉందో చూడాల్సిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఓ మూడు రోజులు అ లాంటి ఆశ్రమాల్లో బస చేయమంటే పరిస్థితులు అనుభవపూర్వకంగా తెలిసివస్తాయం ది. నివేదికపై ప్రభుత్వ వాదనను తెలియ జేస్తూ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆ ఇద్దరు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగ రంలోని మమత వృద్ధాశ్రమంలో దుర్లభ పరిస్థితులపై న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మరో సారి విచారణ జరిపింది. వారికీ హక్కులు ఉన్నాయన్నది మరవద్దు.. వృద్ధాశ్రమాల్లో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో నివేదిక చూస్తే అర్ధమవుతోందని, నిరుపేదలు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేరని అనుకోవద్దని హెచ్చరించింది. వారికి రాజ్యాంగం హక్కులు కల్పించిందనే విషయాన్ని అధికారులు మరిచిపోకూడదని, చట్ట ప్రకారం.. సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు తనిఖీలు చేయాలనే బాధ్యతను నిర్వహించకపోతే వారిని ఏమనాలని ప్రశ్నించింది. ‘ఒకచోట మదర్స్ నెస్ట్ అనే వృద్ధాశ్రమంలో మూడు గదుల్లో ఏకంగా 24 మంది ఉన్నారు. గదులకు కిటికీలు ఊడిపోయాయి. మరుగుదొడ్లు కూడా లేవు. ‘ది సెకండ్ చాన్స్’లో మంచాల మధ్య నడిచే ఖాళీ కూడా లేదు. ఎప్పుడో ఉతికిన దుప్పట్లు.. దుమ్ము ధూళితో ఉన్నాయి. దాతల చేయూతతోనే ఎన్జీవోలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.25–30 వేల వరకూ చెల్లించి ఉండే కొన్ని చోట్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇంకొన్ని అంతకంటే ఎక్కువే వసూ లు చేస్తున్నాయి. అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేసినట్లుగా చెబుతున్నారు. పలుచోట్ల అయితే వృద్ధాశ్రమం రిజిస్టర్ చేసినప్పుడే తనిఖీ జరిగింది’అని నివేదికలోని విషయాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనను వెలిబుచ్చింది. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయండి... ‘జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో అధికారికంగా రిజిస్ట్రర్ చేసినవి ఎన్ని ఆ శ్రమాలున్నాయి. రిజిస్ట్రర్ చేయనివి ఎన్ని ఉన్నా యి. ఇప్పటివరకూ ఎన్నిసార్లు తనిఖీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు. వృద్ధాశ్రమాల్లోని వారి కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయా లి. హెల్ప్లైన్లకు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. వృద్ధాశ్రమాలను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీల సాయం పొందే చర్యలు తీసుకోవాలి. మేము జారీ చేసే ఉత్తర్వుల ప్రతులను అన్ని వృద్ధాశ్రమాల నిర్వాహకులకు అధికారులు అందజేయాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘పెన్షన్ రాజ్యాంగ హక్కు.. కోతకు వీల్లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో 25 శాతం కోత విధించడంపై హై కోర్టులో దాఖలయిన పిటిషన్‌ను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో కోత విధించవద్దని పిటీషనర్ కోర్టును కోరారు. పూర్తి పెన్షన్‌ను అందించేలా చూడాలన్నారు. పెన్షన్ రాజ్యాంగ హక్కని.. దీనిలో కోత విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పెన్షన్ అంశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో పూర్తి వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 17కు వాయిదా వేసింది. వృద్ధాశ్రమాల నిర్వహణపై హై కోర్టు విచారణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని న్యాయవాది వసుధ నాగరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని పిటీషనర్ కోర్టుకు విన్నవించారు. నిధులు లేని వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి 60-13 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారిని చూసుకోవడానికి సరిపడా సిబ్బంది లేరని తెలిపారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న కోర్టు రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో నేరుగా వెళ్లి పరిశీలించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. పిటీషనర్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌ను సందర్శించాలని తెలిపింది. వాస్తవిక పరిస్థితుల చూసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ కోసం కావాల్సిన నిధులను కార్పోరేట్ కంపెనీలు, ఎన్జీవోల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ(సీఎస్ఆర్) కింద సమకూర్చుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వృద్ధాశ్రమాల ఎన్ని.. వాటిలో రిజిస్టర్ అయినవి ఎన్ని, కానివి ఎన్ని ఉన్నాయో తెలపాలన్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చైల్డ్, అండ్ ఉమెన్ అధికారులును ఆదేశించించిది. తదుపరి విచారణనను ఈ నెల 23కు వాయిదా వేసింది. -
వృద్ధాశ్రమం పేరిట చిత్రహింసలు
కీసర: మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కొందరు.. మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైనవారు మరికొందరు.. పిల్లలకు దూరమైన వృద్ధులు ఇంకొందరు.. ఇలా 85 మందిని వృద్ధాశ్రమం పేరిట ఓ భవనంలో ఉంచి యజమానులు చిత్రహింసలు పెట్టేవారు. అనుమతి లేకుండానే నడుపుతున్న ఈ ఆశ్రమంలో ఇరుకు గదుల్లో అందరినీ కలిపి ఉంచి ఇబ్బందులకు గురి చేసేవారు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో సాగుతున్న ఈ ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని శిల్పానగర్ కాలనీలో రెండు చిన్న భవనాలను జాన్ రతన్‌పాల్, కె.భారతి, అరుణాచలం, భాను అద్దెకు తీసుకొని నాలుగేళ్ల క్రితం మమత వృద్ధాశ్రమం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక వికలాంగులతో పాటు మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వారి తల్లిదండ్రులు, బంధువులు.. నిర్వాహకులకు నెలకు రూ.4,000 నుంచి 15,000 వేల వరకు ఇచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించారు. అయితే వీరికి సరిపోయే వసతులు ఇక్కడ లేకపోగా మానసిక పరిస్థితి సరిగా లేని వారిని గొలుసులతో నిర్బంధిం చారు. ఎవరైనా చెప్పినట్లు వినకుంటే నిర్వాహకులు కొట్టేవారని ఆరోపణలున్నాయి. అధికారుల విచారణ... రెండ్రోజుల క్రితం ఆశ్రమం నుంచి కేకలు వినిపించాయి. పక్కనే ఉన్న మోడీ అపార్ట్‌మెంట్‌వాసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడి కాలనీవాసులు వారిని పక్కకు నెట్టి లోపలికి వెళ్లి చూడగా, గదుల్లో వృద్ధులు, మానసిక దివ్యాంగులు కనిపించారు. కొందరి శరీరంపై గాయాలుండటం గమనించి నిర్వాహకులను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి, కుషా యిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌తోపాటు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా సఖి కేంద్రం అధికారి పద్మావతి ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. ఓ భవనంలో 22 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 63 మంది పురుషులను ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. ఆశ్రమాలకు తరలింపు... మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి. రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆశ్రమంలోని వారిని శుక్రవారం ఇతర ఆశ్రమాలకు తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, మండల వైద్యాధికారి డా.సరిత వైద్య బృందంతో ఆశ్రమంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి మానసిక స్థితి బాగానే ఉండటంతో వారిని బంధువులకు అప్పగించా రు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్‌గౌడ్ తెలిపారు. -
మాకు మీరు మీకు మేము
మన పక్కనే ఉన్న మనిషిని మనకు దగ్గరగా ఉంచలేకపోతోందని టెక్నాలజీని నిందిస్తూ ఉంటాం. ఓ వీడియో కాల్ ఎక్కడో విదేశాల్లో ఉన్న మనవాళ్లను దగ్గర చేసినప్పుడు కూడా సంబరపడిపోతాం తప్ప, దాని వెనక ఉన్నదీ టెక్నాలజీనే అని గుర్తు చేసుకోం! మనం ఎంత నిందించినా,మనకు ఎంత గుర్తుకు రాకపోయినా..టెక్నాలజీ అనేది పాత అనుబంధాలను,కొత్త బంధాలనూ కలుపుతూనే ఉంటుంది. అలా వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను కలుపుతున్న ఓ కొత్త టెక్–బంధం ఢిల్లీలోని వయోవృద్ధుల జీవితాలలోవసంతాలను చిగురింపజేస్తోంది. పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత... తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఎవరు ఏ దేశంలో స్థిరపడతారో ఊహించలేం. దేశాల ఎల్లలు దాటిన పిల్లలతో పాటు పెట్టేబేడా సర్దుకుని వెళ్లడానికి పెద్దవాళ్లు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం వెలుస్తున్న సౌకర్యవంతమైన వృద్ధాశ్రమాల సంఖ్య కూడా ఏడాదికేడాదీ పెరుగుతూనే ఉంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలు, అమ్మానాన్నలకు ఏ లోటూ రాకుండా డబ్బు పంపిస్తుంటారు. ఇక్కడ వీళ్లకూ వృద్ధాశ్రమాల్లో విశాలమైన, అధునాతన సౌకర్యాలున్న గదులుంటున్నాయి. గోడలకు మంచి పెయింటింగ్‌లు కూడా ఉంటున్నాయి. కానీ ఆ గోడలతో బంధాలు బలపరచుకోలేక సతమతమవుతోంది వార్ధక్యం. ఓల్డేజ్ హోమ్‌లో భార్యాభర్త ఇద్దరూ ఉన్నంత కాలం వాళ్లు కొంతలో కొంత హాయిగానే గడుపుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరే మిగిలిన క్షణం నుంచి మొదలవుతుంది ఒంటరితనం అనే ప్రత్యక్ష నరకం. ఆ నరకాన్ని భరించలేని ఓ పెద్ద ప్రాణం భార్య పోయిన కొన్నాళ్లకే లోకాన్ని వదిలేసింది. ఆ విషాదం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే.. ‘మైత్రీయాప్’. ఈ యాప్‌ను రూపొందించినది అనన్య. ఆ వృద్ధ దంపతుల మనుమరాలు. ‘‘బాల్యానికి– వార్ధక్యానికి మధ్య వెలిసిన మెత్రీబంధమే ఈ మైత్రీయాప్’’ అంటున్నారు అనన్య. ఈ యాప్ ద్వారా... ఓల్డేజ్ హోమ్‌లలో నివసిస్తున్న వృద్ధులకు, అదే నగరంలో అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలకు మధ్య ఓ బంధం ఏర్పడుతోంది. పెద్దలకు ఒంటరితనాన్ని, పిల్లలకు ఏకాకితనాన్ని పోగొట్టేందుకు మైత్రీ యాప్‌ను సృష్టించడంలో అనన్యకు ఆమె స్నేహితులు కూడా సహకరించారు. ఐదుగురు అమ్మాయిలు న్యూఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులు అనన్య గ్రోవర్, అనుష్క శర్మ, అరీఫా, వంశిక యాదవ్, వసుధా సుధీందర్... ఈ ఐదుగురమ్మాయిల కృషి ఫలితంగా మైత్రీ యాప్ అనే ఈ కమ్యూనికేషన్ చానెల్ ఆవిర్భవించింది. వీరి లక్ష్యం... ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు జీవిస్తున్న అనేక మంది మధ్య బంధాలను కలపడం. ఒకరితో ఒకరిని అనుసంధానం చేసి అనుబంధాల వింజామరలను వీచడం. అనన్య బృందం స్వయంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కలిపి మొత్తం 140 హోమ్స్‌ను సందర్శించింది. ఈ ఏడాది మార్చిలో మొదలైన వీరి ప్రయత్నం జూన్ చివరికి ఫలించింది. ఈ యువ టెక్ ప్రెన్యూర్స్‌లు మైత్రి యాప్‌ను జూలైలో అధికారికంగా లాంచ్ చేశారు. ఇప్పుడిది దేశంలో స్థిరంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇలా న్యూఢిల్లీలోని ఓల్డేజ్ హోమ్‌లో ఉంటున్న పెద్దవాళ్లు... పదిహేను అనాథాశ్రమాలతో అనుసంధానం అయ్యారు. పెద్దవాళ్లకు మిగిలిన చిన్న కోరిక మా నానమ్మ, తాతయ్యలతో నాకు మంచి అనుబంధం ఉండేది. వాళ్ల నుంచి అంతులేని ప్రేమను అందుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నెన్నో జ్ఞాపకాలు. చదువులు, ఉద్యోగాలతో ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండేవాళ్లం. సెలవుల్లో అందరం కలిసేవాళ్లం. ఇలా ఉండగా క్యాన్సర్ వ్యాధి మా నానమ్మను తీసుకెళ్లి పోయింది. ఆమె పోయిన ఏడాదిలోపే తాతయ్య కూడా వెళ్లి పోయారు. ఆయనకు ఎటువంటి అనారోగ్యమూ లేదు. కేవలం నానమ్మ పోయిన తర్వాత ఆ ఒంటరితనాన్ని భరించలేక జీవితాన్ని చాలించారు. పెద్దవాళ్లకు ఆ వయసులో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. మా తాతయ్యలాగ ఎందరో ఉన్నారు. మా టీమ్ ఓల్డేజ్ హోమ్‌లకు వెళ్లినప్పుడు.. అక్కడ ఉండే వృద్ధులు చాలా మంది మమ్మల్ని తమ మనుమరాళ్లలా అభిమానించారు. ‘మీకు వీలయినప్పుడు మళ్లీ మళ్లీ వచ్చి కనిపిస్తూ ఉండండి తల్లీ. మా మనుమరాళ్లను చూసుకున్నట్లే సంతోషంగా ఉంది’ అనేవాళ్లు. మా మైత్రి యాప్ ఆ వృద్ధుల చిన్న కోరికను తీర్చగలుగుతుంది. ఈ యాప్ ద్వారా మేము అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్‌ని ఇవ్వగలిగాం. తాతయ్యకు ఎదురైన చేదు అనుభవం నుంచి... నేను ఎంతోమంది పెద్దవాళ్లకు ఒక ఆలంబనను అందివ్వగలిగాను.– అనన్య గ్రోవర్, టెక్‌ప్రెన్యూర్ అవ్వాతాత దొరికారు మైత్రి యాప్ ద్వారా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు అవ్వాతాతలు దొరికినట్లయింది. ఈ యాప్ ద్వారా అనుసంధానమైన ఓల్డేజ్ హోమ్ నిర్వహకులు, అనాథాశ్రమ నిర్వహకులు.. వృద్ధులను – చిన్నారులను కలవడానికి వీలుగా గెట్ టు గెదర్లు ఏర్పాటు చేస్తారు. ఇలా ఓల్డేజ్‌హోమ్‌లో వృద్ధులను కలిసిన తర్వాత స్కూలుకెళ్లిన పిల్లలు ‘నిన్న మా నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాం. వచ్చే ఆదివారం కూడా వెళ్తాం’ అని స్నేహితులతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే... వాళ్ల మనుమలు మనుమరాళ్లు దూరంగా ఉండి ఏ ఏడాదికో ఒకసారి కనిపిస్తుంటారు. ఏడాదంతా తమ మనుమల కోసం మనుమరాళ్ల కోసం ఎదురు చూస్తూ, తీరా సెలవులప్పుడు వాళ్లు రాలేకపోతే, రాలేదని నిరాశ చెందడం కంటే... ప్రతి వారాంతం తమను వెతుక్కుంటూ వచ్చే అనాథ పిల్లల చేత ‘అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య’ అని పిలిపించుకోవడంతో సంతోషాన్ని పొందుతున్నారు. తమకు ఎవరూ లేరనుకునే నిరాశలో ఉన్న చిన్నారి పిల్లలకు తమకోసం ఎదురు చూసే అవ్వా, తాతలున్నారంటే చెప్పలేని సంతోషం కలుగుతోంది. అనన్య చేసిన ఈ ప్రయోగం.. ప్రేమను పంచడానికి పేగుబంధం అక్కరలేదని చెబుతోంది. – మంజీర -
మాయమవుతున్న మానవత్వం
మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.. యాడ వున్నడో గానీ కంటికి కనరాడు.. నిలువెత్తు స్వార్థం నీడలా గొలుస్తుంటే.. చెడిపోక ఏమైతదమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ.. సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా.. అని ఓ సినీ కవి పాట రాశారు.. ఇదీ ప్రస్తుత సమాజం తీరుకు అద్దం పడుతోంది. ప్రొద్దుటూరు టౌన్ : తల్లిదండ్రులు.. కనిపించే దేవుళ్లు అంటారు. ఎందుకంటే జన్మనిచ్చి, పెద్దయ్యే వరకు అన్నీ సమకూర్చేది వారే. పిల్లలకు రెక్కలొచ్చాక తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని, వారికి జీవితాన్ని ఇచ్చిన తండ్రిని అనాథలుగా మారుస్తున్నారు. కుమారులు పట్టించుకోక, కోడళ్ల ఛీత్కారాలు తట్టుకొలేక, మనసు చంపుకుని వారి వద్ద ఉండలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. అన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఆదరణ కరువైన వృద్ధులు దయనీయ పరిస్థితిలో మగ్గుతున్నారు. ‘నాడు గోరుముద్దలు తినమంటే ఏడిపించారు.. నేడు ఇంత ముద్ద పెట్టకుండా ఏడిపిస్తున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ షెల్టరే దిక్కైన వైనం: దాదాపు 30 మంది ఇంట్లో నుంచి వచ్చి ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలవీధిలో ఉన్న నైట్ షెల్టర్‌లో ఉంటున్నారు. ఏ ఆదరణ లేని వారు ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు. వీరికి నైట్ షెల్టర్‌లో రాత్రిపూట భోజనం, బస ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం వేళ రామేశ్వరంలో ఉన్న అన్నపూర్ణ అన్నదానం సత్రం వారు భోజనం అందిస్తున్నారు. ముగ్గురు కుమారులున్నా.. నా పేరు సి.లక్ష్మీదేవి. నా భర్త మునెయ్య చనిపోయినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురు మగ పిల్లలు. వారిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. నన్ను ఒక్కరూ చేరదీయలేదు. వారు కొంత మేరకు స్థిరపడ్డారు. అయినా కనీసం నేను ఎలా ఉన్నాను అని పరామర్శించడం లేదు. ఇళ్లలో పని చేసి, ఎవరైనా అన్నం పెడితే తిని బతికీడుస్తున్నా. కొన్ని నెలల క్రితం పక్షవాతం వచ్చింది. అయినా ఏ కొడుకు పట్టించుకోలేదు. ఎంత బాధ పడ్డానో చెప్పలేను. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నాను. నెలకు రూ.1000 పైగా మందులకు ఖర్చవుతోంది. షుగర్ ఎక్కువగా ఉండటంతో ఆకలికి తట్టుకోలేక పోతున్నాను. చాలా సార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసినా రాలేదు. చివరకు కలెక్టర్ వద్దకు వెళ్లినా ఫలితం లేదు. ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు నాపేరు పామిడి అచ్చమ్మ. 80 ఏళ్లు దాటాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని వరలక్ష్మి ఆస్పత్రి వీధిలో నివాసం ఉంటున్నాను. భర్త పెద్ద సుబ్బ రాయుడు మరణించాక కొడుకు మద్యానికి బానిసయ్యాడు. ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్నాను. నేను ఉన్నానో, పోయానో అని కూడా కొడుకు ఆరా తీసే పరిస్థితిలో లేడు. వచ్చే రూ.1000 పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నాను. ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎంతో కష్టపడి పిల్లలను పెద్ద చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోక పోవడం దారుణం. మనవడు, మనవరాలినిచూడాలని ఉంది నా పేరు మాదాల సుబ్రహ్మణ్యం. వయసు 70 ఏళ్లు. భార్య, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశాను. మా దాయాదులు, బంధువులు కోటీశ్వరులు. అల్లుడు, నేను కలిసి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో బ్యాగుల దుకాణాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమయంలో నా వాటాగా రూ.10 లక్షల 52 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అల్లుడు తర్వాత నాకు ఏమీ ఇవ్వలేదు. క్రమేణ ఆరోగ్య దెబ్బతినింది. ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్మా వచ్చింది. రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి భార్య, కూతురు, అల్లుడు ప్రొద్దుటూరు విడిచి తిరుపతికి వెళ్లారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. కుటుంబ సభ్యుల ఫొటో చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాను. వారు ఎక్కడికి వెళ్లారో తెలియక బంధువులు, స్నేహితుల వద్దకు వెళితే.. వారు ప్రవర్తించే విధానం చూసి తట్టుకోలేకపోయాను. రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. తిరుపతిలో కూతురు ఇల్లు కనుక్కొని వెళితే వారు ఇంటిలోకి రానించుకోలేదు. మీరు తినేదాంట్లో ఒక ముద్ద పెట్టమని అడిగినా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భార్యతో సహా అందరూ చెప్పడంతో తిరిగి ప్రొద్దుటూరు వచ్చాను. నాకు మనువడు, మనువరాలు అంటే చచ్చేంత ప్రాణం. వారి వద్దకు వెళ్లేందుకు సాయం చేయాలని కనిపించిన వారినందరిని వేడుకుంటున్నా. -
అమ్మానాన్నా..అధైర్యపడొద్దు
గుంటూరు(పట్నంబజారు): నిండు నూరేళ్ళు.. చల్లగా ఉండాలన్న పేగు బంధానికి వెలకడుతున్నారు.. నవమాసాలు మోసిన అమ్మకు నాలుగు మెతులకు పెట్టులేకపోతున్నారు.. నీ బాగోగులపై.. మాకు భాధ్యత లేదంటున్నారు... బ్రతుకు నడక నేర్పిన తల్లితండ్రులను భారమంటున్నారు... కన్నపేగుపై కాఠిన్యంగా.. వ్యవహరిస్తున్నారు.. కష్టపడి పెంచిన నాన్నను నడిరోడ్డు పాలుచేస్తున్నారు.. ఆస్ధి కోసం ఎంతటి వేధింపులకు వెనుకాడటంలేదు.. సభ్య సమాజం తలదించుకునేలా.. జన్మనిచ్చిన వారు.. బతుకు జీవుడా.. అంటున్నా... కనికరం చూపటం లేదు. అందుకే వృధ్ధాశ్రమాలు.. అనాధ శరణాలయాలు.. కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో ఉండే ఆదాం షఫీ 146 గజాల్లో రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. భార్య హసన్బీకి పక్షవాతం రావటంతో పండుటాకుల పరిస్థితి దయనీయమంగా మారింది. ఇద్దరు కుమారులు ఉంటే.. వారిలో చిన్న కుమారుడు, కోడలు వేధించడంతో పోలీసులను ఆశ్రయించారు. అమృతలూరులో ఉండే సూర్యకుమారికి ఇద్దరు సంతానం, ఉన్న ఆస్తులను సమానంగా పంచారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులు ఇచ్చానని, పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత పెద్ద కోడలు, చిన్న కుమారుడు, పెద్ద కోడలు పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి వారు అధైర్యపడాల్సిన పని లేదని చట్టాలతో రక్షణ పొందవచ్చని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వృద్ధాశ్రమాల బాట జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2016లో 76, 2017లో 117, ప్రస్తుతం 140 వరకు ఆశ్రమాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో బిడ్డలు తమను పట్టించుకోవడం లేదంటూ 162 కేసులు నమోదయ్యాయి. అధికారంగా ఉన్న వృధ్ధాశ్రమాలతోపాటు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వృద్ధులను ఆశ్రయం కల్పిస్తున్నాయి. పండుటాకుల రక్షణగా చట్టాలు ♦ తల్లితండ్రులను ఇబ్బందులు గురి చేసినా..వేధించినా తల్లిదండ్రులు సెక్షన్ 125 సీఆర్పీసీ ప్రకారం కోర్టులో దావా వేయవచ్చు. వీటికి సంబంధించి పూర్తి న్యాయ సలహాలు అందించేందుకు న్యాయస్థానాలు అవకాశం కల్పిస్తున్నాయి. ♦ పోలీసు సహాయంతో సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్, సెక్షన్ – 4 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ♦ 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లితండ్రులు, వృద్ధు సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం పండుటాకులకు బాసటగా నిలుస్తోంది. 2011లో మన రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమం కోసం ఏపీ సీనియర్ సిటిజన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పోషించుకోలేని పరిస్థితుల్లో, సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వారికి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఫిర్యాదు చేసే విధానం.. తల్లిదండ్రులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయటమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అధికారులను కలవొచ్చు. బిడ్డల అన్యాయాన్ని నేరుగా ట్రిబ్యునల్ (ఆర్డీవో స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు నివసించే స్థలం, గతంలో ఉన్న ప్రాంతం, పిల్లలు, బంధువులు నివసించే ప్రదేశాల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కావాలనే ఉద్దేశపూర్వంగా తల్లితండ్రులను వేధిస్తే...సెక్షన్ 25 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా వి«ధించే అవకాశాలు ఉన్నాయి. పోషిస్తామని చెప్పి ఆస్తులు రాయించుకున్న తరువాత వారిని విస్మరిస్తే.. ఆ పత్రాలు, దస్తావేజులు అప్పటికప్పుడు రద్దవుతాయి. -
వేదనాభరితం వృద్ధాప్యం
సాక్షి, విజయవాడ: చాలా మంది వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తారు. ఆ వయస్సులో ఎలా గడపాలా అని మధ్య వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. వృద్ధాప్యంలో పిల్లలు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని ఆశిస్తారు. తమ ఆలనా పాలనా చూడకపోవడంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. నేటి ఆధునిక సమాజంలో పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వృద్ధాశ్రమాలకు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 283 వృద్ధాశ్రమాలు ఉన్నట్లు హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. వీటిల్లో సుమారు 8,490 మంది వరకు ఉన్నారు. ఇందులో 60 శాతం మంది మహిళలు కాగా, 40 శాతం మంది పురుషులు. విభజనానంతరం రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. తాజాగా.. అనంతపురం, గుంటూరు, విశాఖపట్నాల్లో కనీసం 100 మందికి తగ్గకుండా నూతన వృద్ధాశ్రమాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ అదీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేవలం ఒకేఒక్క వృద్ధాశ్రమం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉంది. అది వికలాంగులు, వృద్ధుల కోసం ఏర్పాటుచేశారు. ఇందులో 36మంది వృద్ధులు, 9 మంది వికలాంగులు ఉన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదైన రాష్ట్రంలోని 101 వృద్ధాశ్రమాల్లో 6,207 మంది వృద్ధులు ఉంటున్నారు. వీటిలో 90 ఆశ్రమాలకు రూ.6.83 కోట్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు కింద చెల్లిస్తోంది. మరోవైపు తమ వద్ద ఉన్న మౌలిక సదుపాయల మేరకే నిర్వాహకులు వారిని ఆశ్రమాల్లో చేర్చుకుంటుండడంతో వృద్ధాశ్రమాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ చట్టం–2017 ప్రకారం ప్రతి జిల్లాలోనూ కనీసం 150 మందికి తక్కువ లేకుండా ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. కానీ, అలా ఎక్కడాలేదు. వృద్ధులకు చెందిన ఆస్తిని కుటుంబసభ్యులు రాయించుకుని తరువాత వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఈ చట్ట ప్రకారం ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించి తిరిగి ఆస్తి పొందవచ్చు. డబ్బు కొద్దీ సౌకర్యాలు.... రాష్ట్రంలో ఉచితంగా నిర్వహించే వృద్ధాశ్రమాలు కొన్నైతే, నిర్ణీత రుసుము తీసుకుని నిర్వహించేవి మరికొన్ని. ఇంకొన్ని చోట్ల రెండు విధాలుగానూ నడుపుతున్నారు. వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి నెలకు రూ.3వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అనేక వృద్ధాశ్రమాల్లో కేవలం కామన్ రూమ్‌లు, బెడ్లతో పాటు టీవీ, పేపర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైనప్పుడు వైద్య సదుపాయాలు కల్పిస్తారు. కానీ, కొన్ని ఆశ్రమాల్లో వైఫై సౌకర్యం, వెబ్ కెమెరాలు, సరదాగా ఆడుకునే సౌకర్యం, వ్యాయామం, యోగా సెంటర్, ఫోన్, లైబ్రరీ, 24 గంటలు వైద్య సేవలు, వ్యక్తిగత రూమ్, వ్యక్తిగత సేవకులు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. అన్ని సౌకర్యాలతో కూడిన వృద్ధాశ్రమాల్లో ఒకొక్కరికి రూ.30వేలు వరకు వసూలు చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో ఎందుకు ఉండాల్సి వస్తోందంటే... - భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగా ఉండలేక.. కొడుకులు, కూతుళ్లతో సర్దుకోలేక.. - పిల్లలందరూ విదేశాలల్లో ఉంటే అటువంటి వారు వృద్ధాశ్రమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంట్లో అన్ని చేసుకోలేమని భావించి సకల సౌకర్యాలున్న వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. - భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఇంట్లో ఒంటరిగా వారిని ఉంచడం ఇష్టంలేక... - ఇంట్లో వృద్ధులు ఉంటే వారి ఛాదస్తం భరించాల్సి వస్తుందని భావించి, కొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. - మంచంలో ఉన్న వృద్ధులకు సేవలు చేయడం కష్టంగా భావించి వైద్యసదుపాయాలున్న ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. - పేద కుటుంబాల్లో వృద్ధులను భారంగా భావిస్తున్న కుటుంబసభ్యులు కొందరు ఉచిత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. - అనారోగ్యంతో శుచి, శుభ్రత తగ్గిన వృద్ధులను ఇంట్లో ఉంచుకుంటే వారి వల్ల తమ పిల్లలు అనారోగ్యం బారిన పడతారని ఇంకొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. విదేశాల్లో అలా... - విదేశాల్లో వృద్ధుల బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఆస్ట్రేలియాలో వృద్ధులకు అందించే సౌకర్యాలను బట్టి అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల వృద్ధులపై ఆర్థిక భారం తగ్గుతుంది. - అమెరికాలో వృద్ధుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. వయస్సులో ఉన్నప్పుడే వారి ఆదాయంలో ప్రభుత్వం కొంత తీసుకుని వయసు మీరిన అనంతరం వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచి అన్ని రకాల సేవలు అందిస్తుంది. - వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన ఉండే జిరియాట్రిషియన్స్ పర్యవేక్షణలో వృద్ధాశ్రమాలు పనిచేస్తాయి. - వారికి సేవచేసే సిబ్బంది తప్పనిసరిగా నర్సింగ్‌లో శిక్షణ పొంది ఉండాలి. లేకపోతే అనర్హులు. - ప్రతీ హోమ్‌కు తప్పనిసరిగా అంబులెన్స్ ఉంటుంది. - అమెరికాలో నిర్వహించే భారతీయుల ఆశ్రమాల్లో యోగా, సాయంత్రం వేళల్లో భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. - కెనడాలో వృద్ధాశ్రమాలకు పన్నులు, ఉచిత విద్యుత్ వంటి రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ వృద్ధులు తప్పనిసరిగా యూనిఫారం ధరించాలి. దీనివల్ల అందరం ఒకటేననే భావన ఉంటుంది. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇండోర్ గేమ్స్‌ను అందుబాటులో ఉంచుతారు. - స్విట్జర్ల్యాండ్లో వృద్ధులకు 50శాతం ఆరోగ్య బీమా చెల్లిస్తే సరిపోతుంది. దీనికింద అన్ని రకాల వైద్యసేవలు, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. - చాలా దేశాల్లో వృద్ధాశ్రమాల్లో ఉన్నప్పటికీ అక్కడి వారు ఓపిక ఉంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆదాయం వచ్చే పనులు చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా... మన రాష్ట్రంలో జిరియాట్రిషియన్ స్పెషలిస్టులే లేరు. - వృద్ధాశ్రమాల్లో పనిచేయడానికి ఏ విధమైన కోర్సులు పూర్తిచేయాల్సిన అవసరంలేదు. - వృద్ధులకు అనారోగ్యం వస్తే అరకొర వైద్య సేవలే దిక్కు. - మన దేశంలో ఎక్కువగా తమపని తాము చేసుకోగలిన వారికే వృద్ధాశ్రమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. - మన రాష్ట్రంలో వృద్ధాశ్రమాల్లో నివసించే వారి సేవలు ఎవరూ ఉపయోగించుకోరు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో వృద్ధులు పాల్గొనేందుకు ఆశ్రమ నిర్వాహకులు అనుమతించరు. - బీమా సౌకర్యానికి వయో పరిమితి ఉంటుంది. పదేళ్లుగా వృద్ధాశ్రమంలోనే.. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన నాకు ఇద్దరు కుమారులు. ఒకరు బ్యాంక్ ఉద్యోగం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. రెండో కుమారుడు హైదరాబాద్‌లో చిరుద్యోగి. కుమారుడిపై భారం పడకూడదని భర్తతో కలిసి పదేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నాను. ఏడాదిన్నర క్రితం ఆయన చనిపోయాడు. పిల్లలు, మనవరాళ్లతో గడపాలనే కోరిక ఉన్నప్పటికి వారికి భారం కాకూడదనే ఇక్కడే ఉంటున్నాను. – ఆర్. సీతామహాలక్ష్మీ, అమ్మ వృద్ధాశ్రమం కేసరపల్లి వృద్ధులకు ఆసరాగా హెల్పేజ్ ఇండియా మా హెల్పేజ్ ఇండియా సంస్థ వృద్ధులకు ఆసరాగా ఉంటోంది. వృద్ధులకు అన్యాయం జరిగినా తమ సంస్థ ద్వారా సహాయం పొందవచ్చు. హెల్పేజ్ ఇండియా వెబ్సైట్ ద్వారా వృద్ధులకు కావాల్సిన సమాచారం, ఫిర్యాదు చేయవచ్చు. 1800 180 1253 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సహాయం పొందవచ్చు. వృద్ధులతో ఆస్తులు రాయించుకుని వదిలివేసే కుటుంబసభ్యులపైనా, వృద్ధులను సరిగాచూడని వారిపైనా ఫిర్యాదులు చేయవచ్చు. – మహ్మద్ రజామహ్మద్ హెల్పేజ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధి రేమాండ్స్ అధినేత విజయపత్ సింఘానియా.. తాను కష్టపడి నిర్మించుకున్న ఇంటిని తన కుమారుడు తీసుకున్నాడని, అలాగే రేమాండ్‌లో తన వాటా షేర్లు ఇవ్వడంలేదంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. చివరకు తాను ఒక అద్దె ఇంట్లో జీవనం వెళ్ల దీస్తున్నానంటూ వాపోయారు. కేరళకు చెందిన కృష్ణ.. దశాబ్దం క్రితం విజయవాడ వచ్చాడు. ఇక్కడే హోటల్లో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ఉన్న ఒక్క కూతురుకు పెళ్లిచేశాడు. భార్య చనిపోయిన తరువాత తన వద్ద ఉన్న ఐదు లక్షలు కుమార్తెకిచ్చి ఆమె వద్దే ఉండేవాడు. కృష్ణకు డబ్బు సంపాదన ఆగిపోవడంతో అతన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో నగరంలోని ఒక అనాథ ఆశ్రమంలో తలదాచుకున్నాడు. విజయవాడ నగర శివార్లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆయన కుమారుడు వచ్చి మృతదేహాన్ని నగరంలోని తన ఇంటికి తీసుకెళ్లలేనని, నేరుగా కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అక్కడే కర్మకాండలు పూర్తిచేస్తానని చెప్పడంతో బాధపడటం వృద్ధాశ్రమ నిర్వాహకుల వంతైంది. -
వృద్ధాశ్రమాలు, అన్న క్యాంటీన్లు
గుంటూరు వెస్ట్ : రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు అనుబంధంగా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. ఆధునిక వసతులతో ఏర్పాటయ్యే ఈ క్యాంటీన్లలో ఎవరైనా ఆహార పదార్ధాలు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై అక్షయపాత్ర నిర్వాహకుల సూచనలు తీసుకోవాలన్నారు. జెడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సీఆర్డీఏ పరిధిలో అమలు చేయాల్సిన సంక్షేమ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి వెంటనే నెలకొల్పాలని కోరారు. వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు 60 ఏళ్లకు పైబడి ఉన్నవారి వివరాలను సేకరించాలని కోరారు. భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలపై సమీక్షించిన కలెక్టర్ పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ద్వారా వైద్యసేవలు అందిస్తున్న మాదిరి ఇతరులకు కూడా వైద్యసేవలు ఉచితంగా అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలన్నారు. 5,963 మంది విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్నట్లు సమాచారం ఉందని, వారందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందేలా చూడాలని, అవసరమైన వారికి ఉచితంగా విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. రాజధాని ప్రాంతంలో రోజుకు 5 వేల మందికి రానున్న 120 రోజుల వరకు పనులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ బాలాజీనాయక్‌కు ఆదేశించారు. రాజధానిలో కడియం తరహా నర్సరీ కడియంలోని నర్సరీ మాదిరి రాజధాని ప్రాంతంలో నర్సరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి నాగేశ్వరరావును కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. సమావేశంలో జేసీ చెరుకూరి శ్రీధర్, సీఆర్డీఏ అధికారులు చెన్నకేశవులు, ప్రభాకర్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో యూనిట్ కార్యాలయాలు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో వివిధ ప్రభుత్వశాఖలు తమ కార్యాలయాల యూనిట్లను నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం సీఆర్డీఏ పరిధిలో సంక్షేమ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, డీఆర్డీఏ, మహిళా శిశుసంక్షేమం, ఫారెస్టు, పోలీసు, డ్వామా తదితర 10 విభాగాల అధికారులు వెంటనే తమ యూనిట్ కార్యాలయాలను రాజధాని ప్రాంతాలలో నెలకొల్పాలని కోరారు. ఆయా శాఖలు చేపట్టే అభివృద్ధి పనుల నివేదికలను కరపత్రాల రూపంలో ముద్రించి సీఆర్డీఏ అధికారులకు అందజేయాలన్నారు. సమావేశంలో సీఆర్డీఏ అధికారులు చెన్నకేశవులు, ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అనురాగం
మలిసంధ్యలో కొత్త పల్లవి తరాల అంతరాన్ని కాలం తెచ్చిన మార్పని నెపం కాలం మీదకి నెట్టేస్తాం కానీ.. అది కొత్తగా తెస్తున్నదేమీ లేదు!. చక్రం తిరుగుతున్నప్పుడు అడుగున పడ్డవి పైకొస్తున్నాయి. కాకపోతే ఆధునిక హంగులు, రంగులద్దుకొని కాస్త పేర్లు వరించు కుంటున్నాయంతే!. అంటే.. గురుకులాలు హాస్టళ్లు, వానప్రస్థాశ్రమాలు ఓల్డేజ్ హోమ్స్ అయినట్టన్నమాట!. రండి.. ఒక్కసారి ఈ ఆధునిక ఆశ్రమంలోకి వెళ్దాం. - శరాది ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి అక్కడ అడుగుపెట్టగానే పచ్చని తోవ.. మూడంతస్తుల భవనంలోకి ఆహ్వానం పలికింది. లోపలికి వెళ్లగానే పేపర్ చదువుతూ ఓ డెబ్భై ఏళ్ల సీనియర్ సిటిజన్.. ‘మీ పేరు’అనగానే ‘నరసింహారెడ్డి’ అని ఠక్కున చెప్పారు. ఎన్నాళ్లయింది? అని అడుగుతుండగానే- ‘మూణ్ణెళ్లయింది. మా ఊరు కడప జిల్లా పులివెందుల దగ్గర. మొదటి నుంచి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుడిని. నాకు ముగ్గురు కొడుకులు, అమ్మాయి. పెళ్లిళ్లయి, వాళ్ల పిల్లలకూ పెళ్లిళ్లయి అమెరికాలో ఉంటున్నారు. బాధ్యతలన్నీ తీరాక ఊళ్లో ఒంటరిగా ఉండేకంటే పిల్లల దగ్గరకు వెళ్దామని నా భార్య బలవంతపెడితే వెళ్లాం. కానీ ఎవరి దగ్గరా అడ్జస్ట్ కాలేకపోయాం. క్షణం తీరికలేని ఉద్యోగాలు వాళ్లవి.. పైగా మా బాధ్యతొకటి.. వాళ్లను ఇబ్బంది పెడుతూ, మాకు ఇండువిడ్యువాలిటీ లేకుండా.. ఎందుకిలా అనిపించింది. వెంటనే ఓల్డేజ్ హోమ్‌లో చేరాలనుందని పిల్లలతో చెప్పాం. వాళ్లు షాక్ తిన్నారు. కానీ, ఒకే ఇంట్లో.. ఎవరి గదుల్లో వాళ్లు టీవీలు చూసుకుంటూ గడిపే కంటే అపరిచితులు ఆత్మీయులుగా మారే ఇలాంటి ఆశ్రమాలు బెస్ట్ కదా!. తొలుత శ్రీశైలంలోని ఓ ఆశ్రమంలో ఉన్నాం. మూడేళ్ల కిందట మా ఆవిడ భగవంతుడికి చేరువైంది. మళ్లీ కొన్నాళ్లు కొడుకుల దగ్గరున్నా. మళ్లీ అదే సమస్య. రీసెంట్గా ఇక్కడికి వచ్చా. ఇక్కడ నా తోటి వాళ్లుంటారు. నోరారా మాట్లాడుకోవచ్చు. నచ్చిన వంట చేయించుకుంటా. నచ్చిన ఛానల్ చూస్తా.. నచ్చినట్టు ఉంటా..’ అని వివరించారు నరసింహారెడ్డి. శ్రీకారం చుట్టుకుంది ‘అనురాగం’ ఇలాంటి వారి కోసమే, సరిగ్గా అలాంటి ఉద్దేశంతోనే పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావు ‘అనురాగం ఫౌండేషన్’ను స్థాపించారు. వ్యాపారం లాభసాటిగానే ఉన్నా మనసులో ఏదో వెలితి.. పదిమందికీ ఉపయోగపడే పని చేయాలనిపించేది. ఈ క్రమంలోనే సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులను చేరదీయాలనే లక్ష్యంతో ‘అనురాగా’నికి శ్రీకారం చుట్టారు ఐదేళ్ల క్రితం. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. పచ్చని చెట్ల మధ్య తొంభై పడకలు గల ఈ ఆశ్రమం ఐదు నెలల క్రితం ప్రారంభమైంది. భోజనం, బస, నేచురోపతి వైద్య సదుపాయం, జిమ్, 500 మందికి ఒకేసారి వండి వడ్డించగల వంటశాల, డైనింగ్ హాల్, స్విమ్మింగ్‌పూల్, ఫ్లోరైడ్ఫ్రీ వాటర్ కోసం వాటర్ ప్లాంట్ సౌకర్యాలున్నాయి. మధ్యలో భవంతి.. చుట్టూ గార్డెన్లో దానిమ్మ, జామ, తియ్యటి చింత, నాలుగు రకాల ఉసిరి, బత్తాయి, నారింజ, మామిడి చెట్లతో పాటు పలు ఔషధ మొక్కలు.. చందనం, ఎర్రచందనంతో పాటు కల్పతరువూ ఉన్నాయి. వృద్ధుల గుండెచప్పుడూ వింటారు.. ఈ ఆశ్రమం వైద్యాలయం కూడా!. మానవ శరీర నైజాన్ని అర్థం చేసుకొని దానికనుగుణంగా వైద్యాన్నిచ్చే నేచురోపతి ఇక్కడి వృద్ధుల శారీర రుగ్మతలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తోంది. ఇందుకు నేచురోపతి డాక్టర్ వాణిశ్రీ బాధ్యత తీసుకుంటున్నారు. ఈ సౌకర్యం ఇన్ పేషంట్స్‌గా ఉన్నవారికే కాదు అవుట్ పేషంట్స్కీ అందుబాటులో ఉంటోంది. ఆశ్రమంలోని సీనియర్ సిటిజన్స్‌కి రోజూ బీపీ చెక్ చేయడానికి ఓ నర్సూ ఉంది. ‘అనురాగా’నికే అంకితం వెంకటేశ్వరరావు.. తన స్వప్నమైన ఈ ఆశ్రమం ఇలా రూపుదిద్దుకోకముందే కన్నుమూశారు. మంచి పని అర్ధంతరంగా ఆగిపోవడం ఇష్టంలేని ఆయన స్నేహితుడి కొడుకు ప్రసాద్.. ఆశ్రమం బాధ్యతను తీసుకున్నాడు. ఆయన అమెరికాలో కార్డియాలజిస్ట్. మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులన్నిటినీ పూర్తిచేయించి నడిపే పనిని ఇక్కడే ఉండే తన బాబాయ్ చలసాని వెంకటేశ్వరరావుకి అప్పగించారు. ఆయన కుటుంబమంతా అనురాగాన్ని పంచడానికి అంకితమైంది. ‘ఆశ్రమం పెట్టాలనుకున్న వెంకటేశ్వరరావుకి, మధ్యలో బాధ్యత తీసుకున్న మా అబ్బాయ్‌కి, నడిపే ధర్మాన్ని నెరవేరుస్తున్న మాకు.. ఈ ఆశ్రమం ఒక ఆలయం. దీని నిర్వహణకు ఎవరి దగ్గరా ఫండ్స్ తీసుకోవట్లేదు. ఇక్కడ చేరే వాళ్ల నుంచి నామినల్ ఫీజు తీసుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్‌కు అత్యవసర వైద్యసేవల కోసం రావల్కోల్కి దగ్గర్లో ఉన్న మెడిసిటీ ఆసుపత్రితో అనుసంధానమయ్యాం. ఎమర్జెన్సీకి మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉన్న వ్యాన్ కూడా ఉంది’ అని చెప్పారు చలసాని వెంకటేశ్వరరావు. ఆయన పూర్వాశ్రమంలో బ్యాంక్ మేనేజర్. అందరిదీ అదే లక్ష్యం చలసాని వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఆశ్రమ నిర్వహణలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారు. కుమార్తె డాక్టర్ కృష్ణబిందు ఫిజియోథెరపిస్ట్. బాగా నడుస్తున్న ప్రాక్టీస్‌ను వదిలి తనవంతు సేవగా ‘అనురాగం’లో చేరింది. మద్రాస్‌లోని డీడీ వర్సిటీలో ప్రొఫెసర్స్‌గా పనిచేసి రిటైర్ అయిన వైద్యజంట డాక్టర్ భారతి, కృష్ణారావు.. ఆశ్రమంలోనే ఉంటూ సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ‘రిటైర్మెంట్ దాకా జీతం కోసం పనిచేశాం. ఇకపైనైనా ఆత్మసంతృప్తి కలిగే పని చేయాలనుకున్నాం. మా పిల్లలు అమెరికాలో సెటిల్డ్. ఇంట్లో ఇద్దరమే ఒంటరిగా ఉండే బదులు ఇలా నలుగురు మాతోటి వాళ్లున్న వాతావరణంలో ఉంటూ, చేతనైన సేవనందిస్తే బాగుంటుందని ఆశ్రమంలో చేరాం. రావల్కోల్ చుట్టుపక్కలున్న గ్రామాల్లోనూ వైద్యసేవలందిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ భారతి. భవిష్యత్ ప్రణాళిక.. రావల్కోల్ పరిసర ప్రాంతాల యువతకు ఉపయోగపడేలా త్వరలోనే ఇక్కడ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అనాథాశ్రమాన్నీ ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాళ్ల కోరిక నెరవేరి మరింత మందికి అనురాగం పంచాలని ఆకాంక్షిద్దాం!.