వృద్ధురాలిని పీక్కుతిన్న పిచ్చికుక్క
పక్షవాతంతో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని పిచ్చికుక్క పీక్కుతింది. ఈ హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సమ్మ (65) పక్షవాతంతో మంచం పట్టింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను వరండాలో పడుకోబెట్టారు. వరండాలో నిద్రిస్తున్న నర్సమ్మ కళ్లు, చెవి, చెంపను పిచ్చి కుక్క కొరికేసింది. వృద్ధురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.