‘వేదావతి’లో బయల్పడిన పురాతన శివలింగం
గుమ్మఘట్ట (రాయదుర్గం) : బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల పరిధిలోని రంగచేడు, బుడిమేపల్లి గ్రామాల మ«ధ్య వేదావతి హగరి నదీలో ఇసుక తవ్వుతుండగా శుక్రవారం పురాతన శివలింగం బయటపడింది. విషయం తెలుసుకున్న కలుగోడు, రంగచేడు, బుడిమేపల్లి, గుడిపల్లి, అజ్జయ్యదొడ్డి తదితర గ్రామాలవారు తరలివచ్చి శివలింగానికి పూజలు చేశారు. సుమారు 20 నుంచి 25 అడుగుల లోతు తవ్వగానే శివలింగం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శివలింగం చుట్టూ రాతికట్టడం, అందుకు దిగువన మెట్లు ఉన్నాయి. ఇక్కడ రాగి కడవలు, చెంబులు ఇతర వస్తువులు కూడా బయల్పడినట్లు వదంతులు వ్యాపించాయి.