Ops
-
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
సీపీఎస్ రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని చెప్పనుంది. ఈ మేరకు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టో కోసం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ దాదాపు గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ మొత్తం 36 అంశాలతో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. ఒకట్రెండు అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పెద్దలను సంప్రదించిన తర్వాత ఆ అంశాలను పొందుపరిచి నాలుగైదు రోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొత్త స్కీములు..కౌంటర్ పథకాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్‌ను విడుదల చేయడంతో పాటు ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 25 శాతం పెంచుతామనే హామీని కూడా మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారు. బాలింతలకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్‌కు కౌంటర్‌గా మరో పథకాన్ని ప్రకటిస్తారని, కిట్‌లోని వస్తువులతో పాటు ఆర్థిక సాయం పెంచుతారని సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్థినులందరికీ స్కూటీలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌లిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరి సంక్షేమమే లక్ష్యం..! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజా మేనిఫెస్టో పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమ, అమరవీరుల సంక్షేమ, వ్యవసాయం–రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత–ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలు, గృహ నిర్మాణం, భూపరిపాలన, పౌరసరఫరాలు, ని త్యావసరాల పంపిణీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగం, టీఎస్ఆర్టీసీ సంక్షేమం, మద్య విధానం, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, సింగరేణి కార్మికులు, కార్మికులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, గల్ఫ్ ఎన్నారైలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, క్రీడారంగం, పోలీస్–శాంతి భద్రతల వ్యవస్థ, పర్యాటక రంగం, జానపద, సినిమా–సాంస్కృతిక రంగం, ధార్మిక రంగం, పర్యావరణం, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ నేతలు రూపకల్పన చేస్తుండడం గమనార్హం. -
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
ఆర్థిక భరోసా ‘గ్యారెంటీ’
మనుషుల జీవిత కాలం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకుపైగా జీవించే వారు 2022లో 10 శాతం ఉండగా 2025 నాటికి 16 శాతానికి పెరుగుతారు. ఓపీఎస్ అనేది ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్నేళ్లూ ఇవ్వాలి. అమెరికా లాంటి దేశం కూడా పెన్షన్లపై పరిశోధన చేసి చివరకు సాధ్యం కాక ఓపీఎస్‌ను తగ్గించేసింది. సమయం, వయసు నిబంధనలను సవరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, సీపీఎస్లపై చిత్తశుద్ధితో ఆలోచించింది. ఓపీఎస్‌తో సుదీర్ఘ భవిష్యత్తులో జీతాల చెల్లింపులకు సైతం ఇబ్బందులొస్తాయి. ఇక సీపీఎస్‌ను అమలు చేస్తే వడ్డీ రేట్లు తగ్గిపోయి షేర్ మార్కె ట్లో పెట్టుబడులు సరైన రాబడి ఇవ్వ నప్పుడు ఉద్యోగులకు నష్టం వస్తుంది. అందుకే దీనిపై బాగా ఆలోచించి మధ్యేమార్గంగా జీపీఎస్‌ను తెచ్చాం. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ సర్వెంట్స్ తమ అభిమతం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యమిస్తారన్నారు. అలాంటి ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తోందన్నారు. ప్రధానంగా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. తమ ప్రభుత్వం 11వ పే రివిజన్ కమిషన్ సిఫారసులను అమలు చేసిందని, అంతకంటే ముందు ఉద్యోగులు నష్టపోకుండా మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బుధవారం శానససభలో ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ బిల్లు–2023, ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) బిల్లు–2023ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ ద్వారా ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. జీపీఎస్ అమలుతో 2040 నాటికి రూ.2,500 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుందని అంచనా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) అమలు చేస్తే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్‌ను(జీపీఎస్) తెచ్చిందన్నారు. ఒక సర్వే ప్రకారం ఓపీఎస్ కొనసాగితే రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షన్ల ఖర్చు ప్రస్తుతం ఉన్నదాని కంటే నాలుగున్నర రెట్లు పెరుగుతుందన్నారు. ఓపీఎస్ ప్రకారం పెన్షన్ 1991–92లో సున్నా నుంచి ప్రారంభమై 2022–23 నాటికి దేశవ్యాప్తంగా రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగి పెన్షన్లే కాకుండా జీతాలకూ ఇబ్బందులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్/సీపీఎస్) ప్రకారం దేశవ్యాప్తంగా 2023 నుంచి 2050కి నాటికి పెన్షన్ల చెల్లింపులు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటే అదే ఓపీఎస్ ప్రకారం అయితే రూ.18 లక్షల కోట్లవుతుందన్నారు. ‘దీనివల్ల అసలు ఓపీఎస్‌ను ఎవరైనా చేయగలరా? తాత్కాలికంగా ఒక వ్యక్తిని తృప్తి పరిచేందుకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది సాధ్యమైనా? పాలన చేసేటప్పుడు ఈరోజు పరిస్థితిని, భావి తరాల పరిస్థితిని కూడా చూసుకోవాలి. కొంతమంది మాదిరిగా ఏదో ఒకటి చేసుకోండని చెప్పి అమల్లోకి వెళ్తే ఐదేళ్లకో, పదేళ్లకో కుప్పకూలిపోతుంది. అందుకే మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నాం’ అన్నారు. ఇంకా బుగ్గన ఏమన్నారంటే.. రాబడి కంటే ఎక్కువ ఏపీ ఓన్ రెవెన్యూ 2014–15లో రూ.38,038 కోట్లుగా ఉంది. ఇది 2015–16 నాటికి రూ.44,842 కోట్లు, 2016–17లో రూ.44,374 కోట్లు, 2017–18కి రూ.53 వేల కోట్లు, 2020–21 నాటికి రూ.60,823 కోట్లకు చేరింది. ఇందులో మానవ వనరులపై ఖర్చు 2014–15లో రూ.25,094 కోట్లు కాగా ప్రస్తుతం రూ.83,604 కోట్లకు పెరిగింది. రాష్ట్రం మొత్తం రాబడిలో హెచ్ఆర్ ఖర్చులే 66 శాతంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్లకు 2014–15లో 70 శాతం ఉంటే.. 2019–20లో వంద శాతం, 2020–21 నాటికి 110 శాతం అయ్యింది. అంటే 2020–21 నాటికి మన రాష్ట్రానికి వచ్చే రాబడి కంటే ఎక్కువగా పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ సొంత రాబడిలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2020–21లో ఏపీలోనే పెన్షన్ల ఖర్చు ఎక్కువ. 2015–16లో ఏపీలో 91 శాతం ఖర్చు అవుతుంటే తెలంగాణలో 53 శాతమే ఉంది. 2020–21లో ఏపీలో 110 శాతంగా ఉంటే తెలంగాణ లో 53 శాతమే ఉంది. తెలంగాణ కంటే ఏపీలో రెట్టింపు వ్యయం అవుతోంది. కర్నాటక, తమిళనాడులోనూ మనకంటే తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓపీఎస్‌ను అమలు చేయడం సాధ్యంకాదు. 2014–15లో హెచ్ఆర్ ఖర్చు రూ.25,094 కోట్లు అయితే పెన్షన్లకు రూ.6,147 కోట్లు అయ్యింది. 2022–23లో హెచ్ఆర్ వ్యయం రూ.83,406 కోట్లుండగా పెన్షన్లు రూ.22,602 కోట్లకు చేరాయి. ఇది మరింత పెరగడం ఖాయం. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓపీఎస్‌లోకి వెళ్లమని కొందరు సలహా ఇస్తున్నారు. కానీ రాష్ట్ర భవితకోసం ఆలోచిస్తున్నాం. ఓపీఎస్‌తో ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోతుంది సీపీఎస్‌లో ప్రస్తుతం ప్రభుత్వం రూ.1,510 కోట్లు ఏటా చెల్లిస్తోంది. అదే ఓపీఎస్‌లోకి వెళ్తే ఇప్పటికిప్పుడు కట్టాల్సింది రూ.23 కోట్లే. అయినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మధ్యేమార్గంగా జీపీఎస్‌పై ఆలోచనలు చేశాం. ఓపీఎస్‌కు వెళ్తే పెన్షన్లకు 2023లో రూ.20 వేల కోట్లకు పైగా, 2025 వచ్చేసరికి రూ.22,037 కోట్లు, 2030–35 నాటికి రూ.33,546 కోట్లు, ఆ తరువాత నుంచి ఇక చేయిదాటి పోతుంది. 2004లో నియమితులైన ఉద్యోగులు 2045 నాటికి రిటైరవుతారు. అప్పుడు ఒకేసారి పెన్షన్ల భారం పెరుగుతుంది. దీన్ని ఆలోచించి జీపీఎస్‌పై కసరత్తు చేశాం. ప్రఖ్యాత కేఏ పండిట్ æసంస్థతో సంప్రదించి ఈ విధానాన్ని తెచ్చాం. పెన్షన్‌కు ప్రభుత్వానిదే బాధ్యత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 5.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఓపీఎస్ ఉద్యోగులు 2.02 లక్షల మంది, సీపీఎస్ ఉద్యోగులు 3.04 లక్షలు, పెన్షనర్లు ఓపీఎస్‌లో 3,73,770, రెగ్యులర్ పెన్షనర్లు 24,663, ఫ్యామిలీ పెన్షనర్లు 1,69,107 మంది ఉన్నారు. సీపీఎస్‌లో ఉద్యోగులకు 20 శాతం కంటే పెన్షన్ రాదు. దానికీ గ్యారెంటీ లేదు. రిటైరయ్యాక చివరి మూలవేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించాం. సీపీఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గినా, షేర్మార్కెట్లో రాబడి లేకున్నా వారికి పెన్షన్ భద్రత ఉండదు. అదే జీపీఎస్‌లో ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50% పెన్షన్‌కు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. జీవిత భాగస్వామికి 60 శాతం పెన్షన్ ఉంటుంది. దాంతోపాటు డీఆర్, ఈహెచ్ఎస్ స్కీమ్‌ను అమలు చేస్తాం. ఉదాహరణకు ఆఫీసు సబార్డినేట్ చివరి జీతంలో మూల వేతనం రూ.45,966 అయితే సీపీఎస్‌లో 20 శాతం అంటే రూ.9579 మాత్రమే పెన్షన్ వస్తుంది. దానికి గ్యారెంటీ లేదు. కానీ జీపీఎస్‌లో 50 శాతం కింద రూ.23,923 వస్తుంది. పోలీసు కానిస్టేబుల్‌కు రూ.60,485 చివరి జీతం మూల వేతనం ఉంటే సీపీఎస్ లో రూ.12,079 పెన్షన్, జీపీఎస్‌లో రూ.30,243 వస్తుంది. ఎస్జీటీ టీచర్లు చివరి జీతంలో మూల వేతనం రూ.78,352 అయితే వారికి సీపీఎస్‌లో రూ.15,647 పెన్షన్, అదే జీపీఎస్‌లో రూ.39,175 ఇస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు చివరి జీతంలో మూల వేతనం రూ.1,48,597 ఉంటే సీపీఎస్ కింద రూ.29,675, అదే జీపీఎస్ కింద రూ.74,299 వస్తుంది. దీనితో పాటు వారి ఫ్యామిలీ పెన్షన్ కింద 60 శాతం, హెల్త్ స్కీం సైతం వర్తిస్తుంది. ఏ లెక్కన చూసినా జీపీఎస్‌లో ఉద్యోగికి మేలు జరుగుతుంది. ఉద్యోగుల భద్రత కోసం ఆలోచించి భవిష్యత్తులో ఏ ఒక్కరికీ నష్టం రాకూడని తీసుకున్న నిర్ణయమిది. భారీగా ఉద్యోగాల భర్తీ 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగా భద్రత కల్పిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌ను సైతం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు చేసి 15 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాం. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.35 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాలను తెచ్చి ఉద్యోగాలిచ్చాం. మరో 2.50 లక్షల మందిపైగా వలంటీర్లుగా పని చేస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 ఉద్యోగాలను భర్తీ చేశాం. రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖలో మరో 10,143 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాం. గ్రూప్1, 2లతో పాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ నియామకాలు, 6,100 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశాం. ఉద్యోగులపై చంద్రబాబు విషం గతంలోనే ఉద్యోగులపై విషాన్ని తన మనసులో మాట పుస్తకం ద్వారా చంద్రబాబు బయటపెట్టారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో రాష్ట్రం అప్పుల వలలో చిక్కుకుపోతోందని విద్వేషాలను ప్రచురించారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో సర్ప్లస్ రెవెన్యూ ఉన్నప్పుడు రాసిన మాట. సీఎం జగన్ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకుండా ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉద్యోగులకు చేయాల్సినంత మేలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించుకోవాలి. ఊహించని రీతిలో జీతాల పెంపు చిన్న స్థాయి ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం. ఆశా వర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచడంతో 43 వేల మందికి లబ్ధి చేకూరింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం రూ.155 కోట్లు నుంచి రూ.517 కోట్లకు చేరుకుంది. గిరిజన, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ వర్కర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై రూ.415 కోట్ల భారం కాస్తా రూ.622 కోట్లకు వెళ్లింది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, సెర్ప్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేశాం. 16 వేల మంది హోంగార్డులకు రూ.18 వేల నుంచి రూ.21,300కి జీతం పెంచడం ద్వారా భారం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరిగింది. 88 వేల మంది మిడ్ డే మీల్స్ సహాయకులకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చేయడంతో రూ.200 కోట్లు అదనపు భారం పడింది. 48,770 మంది అంగన్వాడీలకు రూ.7 వేల నుంచి రూ.11,500కి, ఇందులో 55,607 మంది అంగన్వాడీ హెల్పర్స్‌కు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెంచాం. సెర్ప్‌లో పని చేసే హెచ్ఆర్ ఉద్యోగులకు 23 శాతం జీతాల పెంపుతో 4,569 మందికి లబ్ధి చేకూరింది. సూక్ష్మస్థాయిలో ఆలోచించి 108 డ్రైవర్లకు రూ.13 వేలు ఉండే జీతాన్ని రూ.28 వేలు చేశాం. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌కు రూ.15,500 నుంచి రూ.20 వేలు, 104 డ్రైవర్లుకు రూ.26 వేలకు, ఆస్పత్రుల్లోని శానిటేషన్ వర్కర్లకు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచాం. దాదాపు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు జీతాల పెంపు ద్వారా ఆర్థిక భారం రూ.2 వేల కోట్లు నుంచి రూ.3500 కోట్లుకు చేరింది. రూ.1,500 కోట్లు అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోంది. వీటికి తోడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వీక్లీ ఆఫ్‌లు తీసుకొచ్చాం. ఏజెన్సీల చేతుల్లో శ్రమ దోపిడీకి గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్‌లోకి తీసుకొచ్చి చట్టం చేసి ఒకటో తేదీన జీతంతో పాటు ఈపీఎస్, ఈఎస్ఐను కూడా కల్పిస్తున్నాం. ఉద్యోగులకు ప్రత్యేక లీవ్ బెనిఫిట్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తీసుకొచ్చాం. 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మినెంట్ శాంక్షన్డ్ పోస్టులో ఫుల్ టైం కాంట్రాక్టు విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తాం. శాంక్షన్డ్ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి. -
జీపీఎస్‌తోనే మంచి ప్రయోజనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)పై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో జీపీఎస్‌లోనూ అలాంటివే ఉన్నాయని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఓపీఎస్‌లో ఉన్న మెజారిటీ అంశాలను జీపీఎస్‌లో కొనసాగించడంపై వారిలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఈ మేరకు వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓపీఎస్, జీపీఎస్, సీపీఎస్ మధ్య లాభనష్టాలను పోలుస్తూ ఒక పట్టికను వారు విస్తతంగా షేర్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌లో కేవలం రెండు అంశాల్లో మినహా.. యథాతథంగా ఓపీఎస్ వల్ల కలిగే లాభాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెన్షన్ విషయంలో 13 కీలకాంశాల్లో ఏకంగా తొమ్మిదింటిని ప్రభుత్వం జీపీఎస్‌లో చేర్చడం పట్ల వారిలో సానుకూలత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఓపీఎస్‌లో మాదిరిగానే పెన్షన్‌కు భద్రత కల్పించడం, జీవిత భాగస్వామికి సైతం పెన్షన్ వర్తిస్తుండటంపై జీపీఎస్ మంచిదని అభిప్రాయపడుతున్నారు. సీపీఎస్‌లో అనిశ్చితి కంటే ఇదే మేలు.. సీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని.. 40 శాతం సొమ్ము యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పతే.. రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా.. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడే వస్తుండటంతో భద్రత కూడా కష్టమే. జీపీఎస్‌లోనూ సీపీఎస్‌లో చెల్లించినట్టే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా ఇస్తే.. ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏడాదికి డీఏ/డీఆర్లు ఇస్తుంది. ఒక రిటైర్ అయిన వ్యక్తి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే.. అందులో ఏకంగా రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. డీఆర్‌లతో కలుపుకుని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే.. అంటే 82 ఏళ్లకు జీపీఎస్ ద్వారా నెలకు రూ.1,10,000 పెన్షన్ తీసుకుంటారు. వాట్సాప్ గ్రూపుల్లో ఈ లెక్కలన్నీ వేసుకుంటూ జీపీఎస్‌పై ఉద్యోగులు సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు క్రమంగా పెరుగుతూ అప్పటికి రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఉద్యోగులకు జీపీఎస్ నచ్చకుంటే సీపీఎస్‌లో కొనసాగే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మళ్లీ రద్దు చేస్తే ఎలా.. ఓపీఎస్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చింది. ఓపీఎస్ ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం చెబుతున్నట్టు అప్పటికి ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తం.. ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలుపుకుని రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లు అవుతాయి. ఏదోక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీఎస్‌కు దగ్గరగా మెరుగైన పెన్షన్ భరోసా జీపీఎస్‌తో లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆ రెండింటిపై కూడా అనుకూలంగా ఉంటే.. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం జీపీఎస్ ద్వారా పూర్తి గ్యారెంటీ ఇస్తుండటంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పీఆర్సీ వర్తింపు ఉండదు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఈ రెండు మినహా ఓపీఎస్లోని అంశాలన్నీ జీపీఎస్‌లోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో చర్చల ద్వారా ఉద్యోగులు ఒకరికొకరు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విషయంలో కూడా సందిగ్ధతను తొలగించి వాటిని కూడా ఇచ్చేస్తే మొత్తం 11 అంశాలతో జీపీఎస్ మరింత సంపూర్ణంగా ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని వారిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. -
జేపీఎస్‌ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్/తొర్రూరు: జూనియర్/ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్/ఓపీఎస్) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్‌గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లడించారు. అంతకుముందు వరంగల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్ఎఫ్ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది. – జేపీఎస్‌ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్‌ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. జేపీఎస్‌ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ? ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్‌ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్ఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. సమ్మెలో ఉన్న జేపీఎస్లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్‌లు విధుల్లో చేరినట్టు పీఆర్ కమిషనరేట్‌కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్‌ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్‌ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. -
జేపీఎస్‌ల సమ్మె ఉధృతం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్/ఓపీఎస్) సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ సర్వీసు రెగ్యుల రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపిన జేపీఎస్‌లు, ఇకముందు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. వినూత్న పద్ధతుల్లో నిరసనలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తుల నుంచి వీరికి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ఓ మహిళా జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన ఉద్యోగం ఇక పర్మినెంట్ కాదనే బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్‌లు చెబుతున్నారు. ఇదిలాఉండగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన కార్యక్రమాలు వరుసగా 15వ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి, ర్యాలీ తీసి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు. కాగా 15 రోజులుగా జేపీఎస్‌లు విధులకు గైర్హాజరు అవుతుండటంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. తొమ్మిది వేల మందికిపైగా సమ్మెలోనే.. రాష్ట్రంలోని మొత్తం 12,769 పంచాయతీలకు గాను మూడువేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు (పర్మినెంట్ ఉద్యోగులు) ఉన్నారు. మిగతా 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్‌లు, వెయ్యిమంది దాకా ఓపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. గతనెల 11వ తేదీతో దాదాపు 6వేల మంది జేపీఎస్‌లు నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియపై ప్రభుత్వపరంగా ఎలాంటి కసరత్తు మొదలెట్టకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటు గత నెల 28 నుంచి సమ్మె ప్రారంభించారు. వీరితో పాటు మిగతా జేపీఎస్‌లు, ఓపీఎస్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. టర్మినేషన్ హెచ్చరికలు బేఖాతర్.. గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో అయిదారు వందల మంది జేపీఎస్‌లు తిరిగి విధుల్లో చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో పలువురు తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జేపీఎస్‌ల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేకపోవడం, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే చట్ట, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఉద్దేశంతో సమ్మె చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కీలక విధులు నిర్వర్తించే కార్యదర్శులపై ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు వ్యతిరేకతకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఏ హామీ లభించినా సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేపీఎస్‌లు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం గోదావరిలో దిగి నిరసన తెలుపుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. అనంతరం భద్రాద్రి రామయ్యకు వినతిపత్రం సమర్పించారు. – భద్రాచలం అర్బన్ అన్ని పనులకూ వారే.. గ్రామాల్లో దాదాపు అన్ని పనులు పంచాయతీ కార్యదర్శుల ద్వారానే జరుగుతుంటాయి. రోజువారీ పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత పనులన్నీ పర్యవేక్షిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు, మ్యుటేషన్ల జారీ వంటి అనేక విధులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సమ్మెతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. జేపీఎస్‌ల స్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్లు, సెర్ప్ సిబ్బంది, ఇతర గ్రామ స్థాయిల్లోని కాంట్రాక్ట్, ఇతర విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. మరోపక్క ఉద్యోగ ఆందోళనతోనే జేపీఎస్ సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. జేపీఎస్, ఓపీఎస్లు ఆత్మస్థైర్యం కోల్పోయి తీవ్రమైన చర్యలకు దిగొద్దని తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సోని ఆత్మహత్య దురదృష్టకరమని, ఆమె మొన్నటి దాకా సమ్మెలో పాల్గొని మళ్లీ ఉద్యోగంలో చేరిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ తెలిపింది. జేపీఎస్‌ల డిమాండ్లు ఇవీ.. – సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలి. – నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలి. – ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా ప్రమోట్ చేయాలి. – వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్గా పరిగణించి పర్మినెంట్ చేయాలి. -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అధికారంలోకి వస్తే పాత పింఛను విధానం’
న్యూఢిల్లీ/వడోదర: గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆప్ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇదే చేశామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వడోదరలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే హామీ ఇచ్చారు. ఉద్యోగులు డిమాండ్ల సాధనకు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
ఓపీఎస్ అమలుచేసే పార్టీలకే ఓటు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పే పార్టీలకే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులు ఓటు వేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఎఫ్‌ఓపీఎస్) తీర్మానం చేసింది. ఇందుకోసం ఐదు రాష్ట్రాల్లో చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే సీపీఎస్ రద్దుకోసం ఈనెల 26న ఢిల్లీలో ఉద్యోగుల భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. మూవ్మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో ఎన్‌ఎంఎఫ్‌ఓపీఎస్ జాతీయ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మూవ్మెంట్ జాతీయ అధ్యక్షుడు వి.కె.బాందు మాట్లాడుతూ సీపీఎస్ రద్దే లక్ష్యం గా ఉద్యోగులు పోరాటం చేయాలన్నారు. దీనిలో భాగంగా ఢిల్లీలో నిర్వహించే ర్యాలీకి అన్ని రాష్ట్రాల నుంచి సీపీఎస్ ఉద్యోగులు అధిక సం ఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మూవ్మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఒకప్పుడు రూ.75 ఉన్న సామాజిక పెన్షన్లు రోజురోజుకు పెరిగాయని, ఎన్నికలు వచ్చాయంటే భారీగా పెంచుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి చివరి బేసిక్‌లో 50 శాతం, దానికి అప్పటి డీఏ కలుపుకొని వచ్చే సామాజిక భద్రతతో కూడిన పెన్షన్ ఇపుడు రూ. 550కు పడిపోయిందన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఎస్ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నరేశ్ ఠాగూర్, కర్ణాటక నుంచి శాంతారాం, ఏపీ నుంచి రామాంజనేయులు, తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ పథకమా.. సర్కారీ జూదమా!
సాక్షి ప్రతినిధి కడప: ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం షేర్ మార్కెట్లో పెడుతోంది. షేర్ మార్కెట్ కూలితే ఇక ఉద్యోగుల పరిస్థితి అంతే సంగతులు. ఒక్క జూన్‌లోనే ప్రతి సీపీఎస్ ఉద్యోగి రూ.20–30 వేలు నష్టపోయాడు. అంటే ఉద్యోగుల డబ్బులతో సర్కారు ఆడుతున్న జూదంలో తమ ప్రమేయం లేకుండానే ఉద్యోగులు నష్టపోతున్నారన్న మాట. భవిష్యత్తులో ఈ నష్టాలు ఏ స్థాయిలో ఉంటాయోనని ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై బలవంతంగా రుద్దుతున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ఇటీవల కాలంలో ఉద్యోగులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల జీపుజాతా సీపీఎస్ విధానం 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలులో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమ దిశగా పయనిస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ సీపీఎస్‌కు వ్యతిరేకంగా సంఘటితమై ఫ్యాప్టోగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణను రూపొందించాయి. ఇందులో భాగంగా జూలై 30 నుంచి ఆగస్టు 10వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో ‘క్విట్ సీపీఎస్’ పేరుతో జీపు జాతా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో ఆగస్టు 2న పులివెందుల, రాయచోటి, రాజంపేట, కడపలలో, 3న బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా జీపు జాతా కొనసాగనుంది. ఈ జాతాలో ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టి పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. పెన్షన్ భిక్ష కాదు.. హక్కు ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా వారి పదవీ విరమణ అనంతరం మరణించే వరకు నెలనెలా పెన్ష న్ ఇవ్వాలన్నా పథకాన్ని నాటి బ్రిటీషు పాలకులే ఆరంభించారు. స్వాతంత్య్రం అనంతరం మన ప్రభుత్వాలు దానిని కొనసాగిస్తున్నాయి. 1982లో పెన్షన్ అనేది ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు...అది వారి హక్కు అంటూ సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. కానీ బ్రిటీషు పాలకుల కంటే క్రూరంగా 2004లో నాటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనికి పార్లమెంట్లో ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలపడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. 2004 సెప్టెంబరు 1 తర్వాత ఉద్యోగాలలో చేరిన వారు తమ జీతం నుంచే పదిశాతం డబ్బును ప్రభుత్వానికి పట్టిస్తే.. అంతే మొత్తం డబ్బులను ప్రభుత్వం జమచేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. ఈ డబ్బులే సదరు ఉద్యోగి పదవీ విరమణ పొందిన నాటి నుంచి తాను మరణించే వరకు పెన్షన్ రూపంలో అందుకుంటాడు తప్ప అతని సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదన్న మాట. ఐదేళ్లపాటు పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే జీవితాంతం పెన్షన్ సౌకర్యాన్ని అనుభవిస్తుండగా, 20–30 సంవత్సరాలపాటు ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహారిస్తుందన్న ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం రావడం లేదు. చక్రాయపేట మండలం కల్లూరుపల్లె తాండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దైవచిత్తం అనే ఉపా«ధ్యాయుడు 2010లో ఉద్యోగంలో చేరాడు. అప్రెంటీస్ పీరియడ్ పూర్తయిన తర్వాత 2012 నవంబరులో అతని ఉద్యోగం రెగ్యులర్ అయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)లో భాగంగా నాటి నుంచి ప్రతినెల అతని జీతంలో 10శాతం డబ్బులను ప్రభుత్వమే పట్టుకుని, అంతే మొత్తాన్ని తాను కూడా జమ చేసి ఎన్ఎస్టీఎల్ అనే ఓ షేర్ మార్కెట్ సంస్థలో పెట్టుబడి పెడుతూ వస్తోంది. 2018 మార్చి 31వ తేదీ నాటికి అతని ప్రార్న్ అకౌంటులో రూ.4,05,343 మొత్తం నిల్వ ఉంది. ఆ తర్వాతి మూడు నెలల్లో రూ.22,286 జమ అయింది. తిరిగి జూన్ 30న అతని అకౌంటును పరిశీలిస్తే అందులో రూ.4,02,907 మాత్రమే ఉంది. అంతే మార్చిలో నిల్వ ఉన్న డబ్బు కంటే జూన్‌లో కనీసం రూ.22 వేలు పెరగాల్సింది పోయి రూ.2,436 తగ్గిందన్న మాట. షేర్ మార్కెట్లోని ఒడిదుడుకుల వల్ల ఒక్క జూన్ నెలలోనే తాను దాచిపెట్టుకున్న డబ్బుల్లో రూ. 25వేల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇది దైవచిత్తం ఒక్కడికే జరిగిన నష్టం కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం ఇది. ఐక్య పోరాటమే శరణ్యం సీపీఎస్ ఉద్యోగులందరూ ఒక్కతాటిపైకి రావాలి. ఐక్య పోరాటాలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మెడలు వంచే సమయం ఆసన్నమైంది. సంఘాలకు అతీతంగా సీపీఎస్ ఉద్యోగులంతా సంఘటితమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నాగేశ్వరరావు, సీపీఎస్ జిల్లా నాయకుడు ఉద్యమాన్ని ఉ«ధృతం చేస్తాం కార్పొరేట్ శక్తులకు తలొగ్గి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సీపీఎస్‌ను అమలు చేస్తున్నాయి. సీపీఎస్‌ను రద్దుచేయాలం టూ అన్ని ఉద్యోగ సంఘాలు నడుం బిగించాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం! – లక్ష్మిరాజా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఆ ఇద్దరూ డెంగ్యూ దోమల కన్నా డేంజర్!
సాక్షి, చెన్నై: రాజకీయ అనిశ్చితి వెంటాడుతున్న తమిళనాడులో తాజాగా డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' ప్రచురించిన ఓ కార్టూన్ వివాదం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వాన్ని రక్తంతాగే దోమలుగా చిత్రిస్తూ.. 'ప్రజల రక్తం తాగడంలో డెంగ్యూ దోమలు మించిపోయిన ఇద్దరు ద్రోహులు' అంటూ మురసోలీ ఈ కార్టూన్ ప్రచురించింది. తమిళనాడులో ఇటీవల డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో ఈ అంశంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ప్రరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష డీఎంకే వ్యూహ్యాలు 'డెంగ్యూ' కన్న ప్రమాదకరమని ఇటీవల అన్నాడీఎంకే విమర్శించింది. ఈ విమర్శకు బదులుగా డీఎంకే వేసిన ఈ కార్టూన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డీఎంకే ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి లాంటిదని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అన్నాడీఎంకే మంత్రి సెల్లు రాజా విమర్శించారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ విరుచుకుపడుతూ.. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ను 'డెంగ్యూ భాస్కర్'గా అభివర్ణించారు. ఈ మేరకు డీఎంకే పత్రిక కార్టూన్ కూడా వేసింది. -
అన్నాడీఎంకే: గ్రూపుల విలీనం ఖాయం!
చెన్నయ్: ఏఐఏడీఎంకే ఐక్యంగా నిలబడుతుందని, పార్టీలో ఏ కుటుంబ (శశికళ) జోక్యం ఉండబోదని పన్నీర్‌సెల్వం తేల్చిచెప్పారు. విలీనం ఖాయమని సంకేతాలు పంపారు. ఇక ఏఐఏడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య రాజీ ఫార్ములా ఖరారు కావడంతో ఎట్టకేలకు విలీన ప్రక్రియ కొలిక్కివచ్చింది. ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చిన మేరకు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు కొందరికి మంత్రిపదవులు దక్కనున్నాయి. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై వేటు వేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీర వర్గీయుల డిమాండ్‌కూ పళనిస్వామి అంగీకరించినట్టు సమాచారం.పార్టీ ఎన్నికలు జరిగే వరకూ స్టీరింగ్ కమిటీకి పన్నీర్ సెల్వం నేతృత్వం వహించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కొద్ది కాలం పార్టీకి ఈపీఎస్, ప్రభుత్వానికి ఓపీఎస్ నాయకత్వం వహించేలా సర్ధుబాటు చేసుకున్నారు. ఏఐఏడీఎంకేలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి రాజీ కుదిరినా స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ పునరుద్ధరించే అవకాశాలు మెరుగవుతాయి.విలీనం అనంతరం పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి శశికళను తొలగించే తీర్మానం ఆమోదిస్తారని సమాచారం. మరోవైపు ఈపీఎస్, ఓపీఎస్ గ్రూపుల మధ్య సయోధ్యకు బీజేపీ చొరవ చూపిన క్రమంలో ఈ పరిణామాలు 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు ఉపకరించనున్నాయని భావిస్తున్నారు. దినకరన్ ఎమ్మెల్యేలతో మంత్రుల చర్చలు ఏఐఏడీఎంకే విలీనం ఖాయం కావడంతో, దినకరన్ మద్దతుదారులను తమవైపు తిప్పుకొనే దిశగా ఏఐఏడీఎంకే నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలో శశికళ ప్రమేయం లేకుండా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం అన్నాడీఎంకే జాయింట్ కార్యదర్శి టీటీవీ దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలతో ఆరుగురు మంత్రులు ఒక ప్రత్యేక గదిలో సుమారు అరగంటపాటు రహస్యంగా చర్చలు జరిపారు. -
పఠాన్‌కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
పంజాబ్: పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ ఎత్తున పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
భలే ఆప్స్
ఒత్తిడిని దూరం చేసే జెనీటైమ్... ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. జెనీటైమ్ కూడా వీటిల్లో ఒకట అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ అప్లికేషన్ కొంచెం వెరైటీ. ఎలా అంటే... ముందుగా చెప్పాల్సింది ఇది ఒక సెన్సర్‌తో కలిసి పనిచేస్తుందని. ఊపిరి గట్టిగా తీసుకుంటూ, వదులుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదని మనం వింటూనే ఉంటాం. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో అందడం, గుండెకొట్టుకునే వేగంలో మార్పు వంటివి దీనికి కారణాలు. కానీ టైమ్ లేదనో.. ఇంకో కారణం చేతనో ఈరకమైన వ్యాయామం చేయము. ఈ కొరతను అధిగమించేందుకు ఉపయోగపడే అప్లికేషనే ఈ జెనీటైమ్. మీ ఊపిరి తీరుతెన్నులను గుర్తించేందుకు ఈ అప్లికేషన్‌తోపాటు రెస్పిరేట్ అనే ఓ పరికరం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మొబైల్ఫోన్తోపాటు వచ్చే గేమ్స్ ఆడటమే. కొవ్వొత్తులు ఆర్పటం, చెప్పిన దిశగా గట్టిగా గాలి ఊదడం ఇవీ గేమ్స్. వీటిద్వారానే అటు ప్రాణాయామానికి ప్రాణాయామం.., ఇటు వినోదమూ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్లికేషన్‌ను, గేమ్స్‌ను తరచూ ఉపయోగించడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ ఐఫోన్‌తో మాత్రమే లభిస్తోంది. యాంగ్రీబర్డ్ స్టెల్లా.... స్మార్ట్ఫోన్లతో గేమ్స్ అడటం... అదీ యాంగ్రీబర్డ్ వంటి పాప్యులర్ గేమ్స్ ఆడటం చాలామందికి కాలక్షేపం. తాజాగా యాంగ్రీబర్డ్స్ స్టెల్లా పేరుతో మరో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 120 లెవెల్స్‌లో సాగే ఈ గేమ్‌లో స్టెల్లా దాని సహచర పక్షులతో గోల్డెన్ ఐలాండ్‌ను దుష్ట రాకుమారి ఆమె పందిపిల్లల నుంచి రక్షించాల్సి ఉంటుంది. స్టెల్లాతోపాటు దహలియా, పాపీ, విల్లో లూకాలు ఉంటాయి. ప్రతి పక్షికీ ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. స్లింగ్సాట్ ద్వారా రకరకాల విన్యాసాలు చేసేందుకు అవకాశముంటుంది. ఈ గేమ్‌లో ఉపయోగించే టెలిపాడ్ అనే అప్లికేషన్‌తో పనిచేసేందుకు కెమెరాను వాడాల్సి ఉంటుంది. కెమెరాతోపాటు, మైక్రోఫోన్‌ను కూడా ఉపయోగించేందుకు ఒకసారి రిక్వెస్ట్ వస్తుంది. చాలావరకూ యాంగ్రీబర్డ్స్ గేమ్స్ మాదిరిగానే ఇది కూడా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉచితంగానే లభిస్తుంది కానీ ఆట మధ్యలో కొన్ని ఆయుధాలు లేదా ఇతర పరికరాలను కొనాల్సి రావచ్చు. ఆటోమేషన్ కోసం మరో ఆప్... ఈమెయిల్ మొదలుకొని, వాయిస్ కాలింగ్ వరకూ స్మార్ట్‌ఫోన్‌తో మనం చేసుకునే అనేకానేక పనులను ఆటోమేట్ చేసేందుకు ఇప్పటికే అనేక అప్లికేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా చేరిన మరో అప్లికేషన్ ఆటోమేట్! పరిస్థితికి తగ్గట్టుగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ఈ అప్లికేషన్కున్న ప్రత్యేకత. ఉదాహరణకు... స్మార్ట్‌ఫోన్ లాక్‌స్క్రీన్ ప్యాటర్న్‌ను తప్పుగా తీశారనుకుందాం. ఆ వెంటనే ఈ అప్లికేషన్ ఫ్రంట్ కెమెరాతో ఎదురుగా ఉన్న వ్యక్తి ఫొటో తీసేస్తుంది. లాక్ ఓపెన్ చేసిందెవరు? అని ప్రశ్నిస్తుంది. మీరే అయితే ఫర్వాలేదుగానీ... మీ ఫోన్‌ను ఇతరులెవరైనా ఉపయోగించినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లో ఛార్ట్‌ల ఆధారంగా మీరు ఆటోమేటిక్‌గా చేయాలనుకుంటున్న పనులను నిర్ణయించుకోవచ్చు. మెయిల్ పంపడం, వైఫై సెట్టింగ్స్ మార్చుకోవడం వంటి పనులను ఈ అప్లికేషన్ ద్వారా చక్కబెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్‌కు కేవలం మనం ఏఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను వాడుతున్నామో వాటి పర్మిషన్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఈ అప్లికేషన్‌ను వాడి చూడండి మరి!. -
యాపారం
చెట్టూ పుట్టా, వ్యర్ధం, వ్యసనం, చిన్నా, పెద్దా దేన్నైనా ఎకనామిక్ ఐతో చూడటం మనిషికి ఎప్పట్నుంచో అలవాటు. ఇప్పుడా కన్ను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్స్ మీద పడింది. మొదట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్లాంటి ఇంటర్ఫేస్లతో పాటు చిన్నా చితకా ఆప్స్ ఫోన్లతో నిక్షిప్తం అయి వచ్చేవి. కాని ఇప్పుడు ఆప్స్ ఉండే ఓఎస్‌కే ఆదరణ లభిస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. 19 బిలియన్స్లకి అమ్ముడు పోయినే వాట్సాపే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఆ ఊపులో మన నగర విద్యార్థులు కూడా ఇ-కామ్ ఆప్స్ తయారీలో చొరవ చూపించి విజయవంతమయ్యారు. అందులో విజయవంతమైన ఓ ఆప్ గురించి... ‘‘..... ఖార్ఖానా బస్టాప్ వచ్చి, మాయా బజార్ హోటల్ గల్లీలో నాలుగో రైట్ నుండి మూడో లెఫ్ట్, పచ్చ రంగు గేటు, దాని మీద ఏపుగా మనీ ప్లాంట్ పెరిగి ఉంటుంది. అదే మా ఇల్లు’’ ఇలా తన అడ్రస్ చెప్పాడొకడు విదేశాల నుండి వచ్చిన తన మిత్రుడికి. ఆ అడ్రస్ ఆనవాళ్లను పట్టుకొని, ఆ మనీ ప్లాంట్ మొదళ్లని చేరుకునే సరికి ఆ విదేశీ ఆసామి వీసా కాస్తా ఆవిరైపోతుంది. ఇలా ఈ తంటాలేవి చెప్పినా అడ్రస్ని అర్థం చేసుకుని, అవతల వ్యక్తికి డెరైక్షన్‌తో కూడిన మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఆలోచనే 2011లో ఆదిత్యా పుచి అనే వ్యక్తికి వచ్చింది. అలా ఏర్పడిందే ఈ జిప్పర్ అనే ఆప్. ‘‘స్వతహాగా వైద్యులు అయిన మా నాన్నగారు పేషెంట్లకు మా క్లినిక్‌కి దారి చెబుతుండగా పడ్డ ప్రయాసల నుండి పుట్టింది ఈ జిప్పర్ ఐడియా’’ అని అంటారు 34 ఏళ్ల ఆప్ ఎంటర్ప్రెన్యూర్ ఆదిత్య. హైదరాబాద్ వాస్తవ్యులైన ఆదిత్య స్కూలింగ్ అంతా హెచ్.పి.ఎస్.లోను తరువాత ఇంజినీరింగ్‌ని సి.బి.ఐ.టి.లో పూర్తి చేశారు. 2002లో పై చదువులకు యూఎస్ వెళ్లి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసి సిలికాన్ వ్యాలీలో ఎక్స్‌పోనెన్షియల్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 7 ఏళ్లకి కంపెనీ పనుల మీద తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు ఆదిత్య. ‘‘మన దేశానికి, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇళ్లు - రోడ్ల నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉండి, ఒకసారి తిరిగి చూస్తే లే అవుట్ అంతా గుర్తుండిపోతుంది. కాని మన దేశంలో రోడ్డు వ్యవస్థ సంక్లిష్టంగా, తిరిగే దూరం తక్కువే ఉన్నా చిన్న చిన్న సందులు, మలుపుల వల్ల ఎంతో కన్ఫ్యూజన్.’’ ఇది తిరిగి భారత దేశానికి వచ్చిన ఆదిత్యా మదిలో మెదిలిన ఆలోచన. ఈ ఆలోచనతో 2011లో ఆప్ పనులు మొదలు పెట్టాడు. అప్పటికే ‘మింట్ మీడియా’ అనే ఆన్లైన్ సైట్ నడుపుతున్న అనుభవంతో ఆప్ రూపకల్పన మొదలైంది. కోటి రూపాయల బడ్జెట్‌తో తన కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులతో జిప్పర్‌ని రూపొందించి 2013 జూన్న విడుదల చేశారు. ఏం చేస్తుందీ జిప్పర్: ఈ ఆప్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కాని, ఏదైనా ప్రదేశం తాలూకు లొకేషన్‌కి ఒక జిప్పర్ కోడ్‌ని క్రియేట్ చేయొచ్చు. తరువాత మీ అడ్రస్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు, ఆ వ్యక్తికి మీ జిప్పర్ కోడ్‌ని ఎస్.ఎమ్.ఎస్. ద్వారా పంపిస్తే చాలు. సదురు వ్యక్తి కోడ్‌ని జిప్పర్లో ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న మ్యాప్ అతని ఫోన్లో ప్రత్యక్షం అవుతుంది. 108తో ఒప్పందం: ఈ ఆప్‌ని మొదలు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ‘అంబులెన్స్ సేవలకు మెరుగైన సేవలు అందించడం’ అని అంటారు ఆదిత్య. జిప్పర్, 108 జీవీకె సేవలతో గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. ‘‘ఈ రెండేళ్లలో ఎంతో కొంత సాధించామనే అనుకుంటున్నాం. 108తో ఒప్పందం ఒక పెద్ద అచీవ్మెంట్. కోటి రూపాయల బడ్జెట్‌తో మొదలై ఇపుడు లక్షల సెల్ఫోన్స్లలో మా ఆప్ తన సేవలని అందిస్తోంది. మన రాష్ట్రానికి పరిమితం అయిన జిప్పర్‌ని ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపచేసే పనిలో ఉన్నాం’’ అని అంటున్న ఆదిత్య యాపారం ఇది. - జాయ్ ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. -
పీసీతో ఇలా... చకచకా!
ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా.... జీమెయిల్ కోసం రెండు ఆప్స్... జీమెయిల్లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్టెన్షన్లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి. ఫొటోలకు రంగులు అద్దండి... స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్లైన్లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్సైట్లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్గానూ సైకోపెయింట్ లభిస్తోంది. ఫోటోల ఎడిటింగ్... ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్: Pixlr.com ఈసెల్.ఎల్వై... వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్సైట్ ఈసెల్.ఎల్వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ : www.easel.ly డెస్క్టాప్పై నోటీస్‌బోర్డు... ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్సైట్లో ఒకసారి ఫ్రీఅకౌంట్ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్టాప్పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా.