osman sagar
-
హైదరాబాద్: జంట జలాశాయాలకు భారీగా వరద
-
ట్రిపుల్ వన్ (111) జీవో రద్దు: గండిపేట రహస్యం!
హైదరాబాద్ నగర చల్లదనం ఓ పాతతరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ నగరం వేసవి విడిదిగా ఉండేదని చెబితే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. పైగా నవ్వుకోవచ్చు. గండిపేట నీళ్ల తీయదనం కూడా మన కళ్ల ముందే జ్ఞాపకాల్లోకి జారిపోతున్నది. నగరానికి పడమటి దిక్కున ఆనుకొని ఉన్న 84 గ్రామాలను వెనుకబాటుతనం నుంచి ‘విముక్తం’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం వేగంగా విస్తరిస్తూ శివారు పల్లెలనూ, పచ్చదనాలనూ ఆక్రమిస్తూ సాగుతున్నది. ఈ పరిణామంతో భూముల ధరలు పెరగడం వల్ల శివారు రైతులకూ అంతో ఇంతో ఆర్థిక లబ్ధి కలుగుతున్నది. నగరంలోని ఖరీదైన, పురోగామి పథంలో ఉన్న ప్రదేశాలకు ఈ 84 గ్రామాలు అతి చేరువలో ఉంటాయి. పాతికేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ట్రిపుల్ వన్ (111) జీవో ఆంక్షలు ఈ ప్రాంత వాసులకు శాపంగా మారాయని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ భూములున్నవారిది కూడా అదే అభిప్రాయం. కొందరు ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్ బాబులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. మరెందుకింక ఆలస్యం? ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు మొన్నటి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నది. అనంతగిరుల్లో పుట్టిన మూసీ, దాని ఉపనది ఈసీల మీద ఆనకట్టలు కట్టి ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరానికి ఆధునిక వన్నెలు తొడిగి ప్రపంచపటంలో సగర్వంగా నిలబెట్టిన నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఖాతాలోదే ఈ జంట జలాశయాల ఘనత కూడా! మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించడం, నగరవాసుల దాహార్తిని తీర్చడం అనే రెండు లక్ష్యాల సాధన కోసం సర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఈ రెండు చెరువులను తవ్వించారు. సుమారు యాభయ్యేళ్లపాటు ఈ జంట జలాశ యాలే పూర్తిగా సిటీ అవసరాలను తీర్చాయి. విస్తరణ వేగం పెరగడంతో క్రమంగా మంజీర, కృష్ణా జలాలు వచ్చి చేరాయి. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కోటి దాటిన నగర జనాభా అవసరాలను తీర్చడంలో ఈ జలాశయాల వాటా ప్రస్తుతం 15 శాతమే. అయినా గండిపేట గండిపేటే! గండిపేట నీళ్లు ఏ ప్రాంతానికి సరఫరా అవుతాయంటూ ఇప్పటికీ ఆరా తీసేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. నగర నీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నాము కనుక జంట జలాశయాల మీద ఆధారపడే అవసరం లేదనీ, కావాలంటే వాటిని కూడా గోదావరి జలాలతో నింపు తామని ప్రభుత్వం చెబుతున్నది. వందేళ్ల క్రితం నదీ ప్రవాహాల మీద నిర్మించిన తటాకాలు, ఇన్నేళ్లుగా ఆ తటాకాల చుట్టూ అల్లుకున్న ఎకోసిస్టమ్, ఏర్పడిన పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత మంతటా భూగర్భ నీటి ఊటలు... ఇటువంటి వ్యవస్థకు పైపుల ద్వారా లేదా కాల్వల ద్వారా నీటిని తరలించి నింపే రిజర్వాయర్లు సరైన ప్రత్యామ్నాయమేనా? సరే, ‘విస్తృత’ ప్రజాప్రయో జనాల కోసం పర్యావరణంతో రాజీ పడటం, బడుగుల జీవితాలను బలిచేయడం నేర్చుకున్నాము కనుక ఈ ప్రత్యామ్నా యాలతో కూడా రాజీ పడవచ్చు. నిజంగా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయా? అన్నదే ప్రశ్న. జీవో రద్దుతో ఎవరికి మేలు? ఎవరికి నష్టం? చర్చించవలసి ఉన్నది. గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉండే మొయినాబాద్ మండలంలోని సాగుయోగ్యమైన భూమిలో ఇప్పుడు స్థానిక రైతుల చేతిలో 20 శాతం భూమి మాత్రమే ఉన్నది. పలు రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ సంస్థలకు వందల ఎకరాల్లో భూములు న్నాయి. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఐఏఎస్ – ఐపీఎస్ అధికారులకు, సినీనటులకు పది నుంచి పాతికెకరాల వరకు భూములున్నాయి. శంషాబాద్ మండలంలోనూ అదే కథ. ఎనభై శాతానికి పైగా పరాధీనమైంది. తొందరపడి ఎకరా రెండెకరాలను పప్పుబెల్లాలకు అమ్ముకున్న చిన్న రైతులందరూ ఇప్పుడు దినసరి కూలీల అవతారమెత్తారు. జీవో రద్దయిన సంగతి తెలుసుకుని తమ వారసత్వ భూముల దగ్గరకెళ్లి దీనంగా చూస్తున్నారు. తాము ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటయినందుకు మౌనంగా రోదిస్తున్నారు. షాబాద్ మండలంలో రెండే గ్రామాలు జీవో పరిధిలో ఉన్నాయి. ఇందులో 40 శాతం మాత్రమే స్థానిక రైతుల చేతిలో ఉన్నది. చేవెళ్ల మండలంలో జీవో పరిధిలోకి వచ్చే తొమ్మిది గ్రామాల్లో 70 శాతం భూమి పరాధీనమైంది. అంతో ఇంతో స్థోమత గల రైతులు మాత్రమే భూముల్ని నిలబెట్టుకోగలిగారు. చిన్న రైతులందరూ అవసరాల కోసం, ప్రలోభాలకు లోనై అమ్మే సుకున్నాను. శంకర్పల్లి మండలంలో జీవో పరిధిలోని ఏడు గ్రామాల్లో రైతుల దగ్గర మిగిలింది 15 శాతం భూమి మాత్రమే! ఎకరాకు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా వెచ్చించి బడాబాబులు భూములు కొనుగోలు చేశారు. అజీజ్‌నగర్ వంటి సమీప ప్రాంతాల్లో కొంత ఎక్కువ పెట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేత ఖాయమని తెలిసి ఈ ఏడాదిలోపు కొనుగోలు చేసిన వారు మరికొంత ఎక్కువ వెలకట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేసిన ప్రకటన తర్వాత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే బడాబాబులకు సగటున ఎకరాకు ఐదు కోట్ల లాభం చేకూరినట్టు అంచనా వేస్తున్నారు. సుమారు 70 వేల ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన వారికి ఎంత ప్రయోజనం చేకూరిందో ఎవరి లెక్కలు వారు వేసు కోవచ్చు. అక్కడ మౌలిక వసతులు విస్తరించి, నగరం పెరుగు తున్నకొద్దీ బడాబాబుల భూములు బంగారు గనులవుతాయ నడంలో ఆశ్చర్యమేముంటుంది? భూములు రైతుల చేతుల్లో ఉన్నప్పుడు ఆంక్షల సంకెళ్లలో బంధించి, బడాబాబుల చేతుల్లోకి 80 శాతం బదిలీ అవగానే ‘విముక్తి’ చేయడంలోని మతలబు ఏమిటో తేలవలసి ఉన్నది. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం లక్షలాది ఎకరాల సాగు భూమినీ, ఇళ్లనూ, వాకిళ్లను సమర్పించుకొని నిర్వాసితులైన వేలాది కుటుంబాల మీద ఎన్నడూ కురవని సానుభూతి వాన జల్లు ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని నయా ‘భూ’పతుల మీద కురవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల’ రీత్యా తీసుకున్న జీవో రద్దు నిర్ణయానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి? రాబోయే తరాల భవిష్యత్తని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం సంకల్పించింది. నగర జీవనం నందనవనంగా మారితేనే అది సాధ్యమౌతుంది. ఇరవై శాతం నీటి వనరులు, మరో ఇరవై శాతం హరితహారం ఉంటేనే అది నందనోద్యానంగా విలసిల్లుతుంది. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఆ ఘనత ఉన్నది. వందలాది చెరువులు కాలనీలుగా మారిపోయాయి. తోటలు పేటలుగా మారాయి. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. ఈ మార్పు ఫలితంగా నగర ఉష్ణోగ్రతలు ఇప్పటికే సగటున రెండు డిగ్రీలు పెరిగాయని వాటర్‌మ్యాన్ రాజేందర్‌సింగ్ హెచ్చరి స్తున్నారు. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే ఈ జంగిల్ అక్కడ కూడా విస్తరిస్తుందనీ ఉష్ణోగ్రతలు, భూతాపం మరింత పెరిగి విధ్వంసకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరివాహక ప్రాంతపు నేలలు స్వభావరీత్యా డైక్ ల్యాటరేట్ కేటగిరీకి చెందినవట. భారీ వర్షాలకు కుంగిపోయే స్వభావం ఈ నేలలకు ఉన్నదంటారు. ఇటువంటి నేలల్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు చేరితే అవి త్వరగా వ్యాప్తిచెంది జలాశయాల్లోకి చేరుతాయి. ఈమేరకు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన రెండు నిపుణుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికల ఆధారంగానే సుప్రీంకోర్టు జీవోను సమర్థించింది. ఇప్పుడు మళ్లీ ఈ సమస్య సుప్రీంకోర్టుకూ, గ్రీన్ ట్రిబ్యునల్‌కూ వెళితే ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. పర్యావరణ సందేహాలకు సమాధానాలు చెబుతూ, విస్తృత ప్రజా ప్రయోజనాలను వివరిస్తూ ఒక వివరణ ఇచ్చిన తర్వాతనే ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అటువంటి వివరణ లేకపోతే జనం మదిలో అదొక గండిపేట రహస్యంగానే మిగిలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Hyderabad Floods Photos: నిండా ముంచేసిన మూసీనది (ఫొటోలు)
-
హైదరాబాద్: మూసీ నదికి పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10700 క్యూ సెక్కులు ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు. రాకపోకలు బంద్ మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మరికొన్ని గంటల్లో అల్వాల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంఠ్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశ ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సీపీ సందర్శన ఉస్మాన్ సాగర్, ఓఆర్ఆర్ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగుతోందని, పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు. పోటెత్తిన వరద మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 5,733.36 క్యూసెక్కులు వస్తుండగా 17, 809 క్యూసెక్కులు కాగా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం, రుద్రవల్లి, భూదాన్ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. -
Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. స్తంభించిన జనజీవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో 5.6, బాలానగర్‌లో 5.3, మియాపూర్, జూపార్కులలో 5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Its not a rivulet, #Waterlogging on roads due to continuous #HeavyRains near #Attapur area in #Hyderabad, Traffic interrupts. #Telangana govt alerted citizens, declared 3 days holidays to Educational Institutions.#HyderabadRains #heavyrain #Telanganarains #TelanganaFloods pic.twitter.com/Tn1MJblQLo — Surya Reddy (@jsuryareddy) July 10, 2022 జంట జలాశయాలకు వరద ప్రవాహం మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గండిపేట (ఉస్మాన్‌సాగర్) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో హిమాయత్‌సాగర్ Waves in Hyderabad @balaji25_t @Rajani_Weather#HyderabadRains pic.twitter.com/1L1TCEjNGt — karthikavsk(sharzsCAr) (@karthikavsk) July 10, 2022 నిండుకుండలా హిమాయత్‌సాగర్.. బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్ రేణుక, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
69 జీఓను రద్దు చేయాలి: పలు సంఘాల సంయుక్త ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 69 జీఓను తక్షణం రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 84 గ్రామాల పరిధిలో పట్టణీకరణ కోసం జారీచేసిన తాజా జీఓతో జంట జలాశయాలు మురుగు కాల్వల్లా మారతాయని ఆక్షేపించారు. నగర జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని, తాగునీటి అవసరం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. పట్టణీకరణ వల్ల వర్షపునీటి ప్రవాహానికి అడ్డంకులు తలెత్తి వరదల ఉద్ధృతి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బాల్‌రాజ్, తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, డబ్ల్యూఐసీసీఐ అధ్యక్షుడు లుబ్నాసర్వత్, సిటిజన్స్ ఫర్ హైదరాబాద్ ప్రతినిధి కాజల్ మహేశ్వరి, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ప్రతినిధి ఫరిహా ఫాతిమా, అనన్య సంగమేశ్వర్లున్నారు. (క్లిక్: హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్) -
సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జలాశయాల ప్రాధాన్యత తగ్గించకూడదు ‘దేశంలో, బహుశా ప్రపంచంలో కరెంట్ లేకుండా నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మాత్రమే. అంటే సున్నా శాతం కర్బన ఉద్ఘారాలతో నీటిని సరఫరా చేసే ఇంతగొప్ప జలాశయాలను గొప్పగా చూపుకోవాలి. అంతేకానీ వాటి ప్రాధాన్యతను, విలువను తగ్గించకూడదు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు వాటి నివారణకు నీటిపారుదల రంగ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వశ్వేరయ్య విభిన్న ఆలోచనలతో ముందుచూపుతో వీటికి డిజైన్ చేశారు..’అని సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడు, భారత ప్రమాణాల సంస్థ సాంకేతిక సభ్యుడు బీవీ సుబ్బారావు తెలిపారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం బీవీ సుబ్బారావు, పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం పరిమితులు లేని పట్టణీకరణ పెనుసమస్యగా మారిందని, పట్టణీకరణలో కూడా సుస్థిరమైన నీటిసరఫరా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి అంటే కాంక్రీట్ బిల్డింగ్లు కట్టి అమ్మేయడం కాదన్నారు. హుస్సేన్‌సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు. వాటి అవసరం తీరిపోయిందన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని అంశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. కోర్టుల ముందు నిలబడలేదు ‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీనదిపై ఈ రెండింటినీ నిర్మించారు. జీవో 111ను సుప్రీంకోర్టు గతంలో పూర్తిగా సమర్థించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందువల్ల జీవో 111ను ఏమీ చేయలేరు. తమకు అధికారం ఉందని ఏదైనా చేసినా కోర్టుల ఎదుట ఎంతమాత్రం నిలబడదు. రియల్ ఎస్టేట్ లాబీకి, కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగితే ప్రజలు ఈ ప్రతిష్టాత్మక అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు..’అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు. పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని అన్నారు. అసలేంటి జీవో 111 హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. అయితే రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇవీ నిబంధనలు జీఓ పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 83 గ్రామాలను చేర్చింది. ఈ జీవో పరిధిలో కాలుష్యకారకమైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు చేపట్టవద్దని నిబంధనలు పెట్టింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు. -
గండిపేట గంతే
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వరుస వర్షాలు నగరాన్ని ముంచెత్తినా.. చారిత్రక గండిపేట (ఉస్మాన్‌సాగర్) జలాశయం నీటిమట్టం ఒక్క అడుగు కూడా పెరగలేదు. హిమాయత్‌సాగర్ జలాశయంలో స్వల్పంగా రెండు అడుగుల మేర నీరుపెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదను ఈ జంటజలాశయాలకు చేర్చే ఇన్‌ఫ్లో ఛానల్స్ కబ్జాకు గురి కావడంతోనే ఈ దుస్థితి తలెత్తిందన్న విషయం సుస్పష్టమవుతోంది.ప్రధానంగా వికారాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లోని సుమారు 84 గ్రామాల పరిధిలో కురిసిన వర్షపాతాన్నిఈ రెండు జలాశయాల్లోకి చేర్చే ఆరు కాల్వలను ఫాంహౌస్‌లు, విల్లాలు, రియల్ వెంచర్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఇసుక మాఫియా ఫిల్టర్స్, ఇతర విద్యా సంస్థలు, గోడౌన్లు.. ఇలా పలు రకాలుగా అక్రమార్కులు కబ్జా చేశారు. గతంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు సర్వే చేసి సుమారు 5 వేల ఆక్రమణలను గుర్తించినప్పటికీ వీటిని తొలగించలేదు. దీంతో జలాశయాల్లోకి వరదనీరు చేరడం లేదు. గండిపేట జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకు మంగళవారం నాటికి 1754 అడుగుల మేర ఉంది. హిమాయత్‌సాగర్ జలాశయం గరిష్ట మట్టం 1763.500 అడుగులకు.. ప్రస్తుతం 1737.100 అడుగుల మేర నీటి నిల్వలుండడం గమనార్హం. గతేడాది ఈ జలాశయాలు ప్రస్తుతం కంటే అధిక నీటి నిల్వలతో కళకళలాడిన విషయం విదితమే. ప్రస్తుతం గండిపేట జలాశయం నుంచి నిత్యం నగర తాగునీటి అవసరాలకు 2 మిలియన్ లీటర్లు.. హిమాయత్‌సాగర్ నుంచి 26 మిలియన్ లీటర్ల నీటిని జలమండలి తరలించి శుద్ధి చేసి నగరంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా.. జలాశయాల్లోకి వరద నీరు తరలివచ్చే శంకర్పల్లి, వికారాబాద్, మొయినాబాద్, మోమిన్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే సుమారు 15 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయినా జలాశయాల్లోకి వరదనీరు చేరకపోవడానికి ప్రధాన కారణం ఇన్‌ఫ్లో ఛానల్స్ కబ్జా కాటుకు గురయ్యాయన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వలలతో కళకళలాడితే నగరానికి నిత్యం సుమారు 60 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించవచ్చు. ఈ నీటితో నగరంలోని పాతనగరంతో పాటు పలు శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ఎల్లంపల్లి, సాగర్‌కు జలశోభ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మహానగర దాహార్తిని తీరుస్తున్న ఎల్లంపల్లి (గోదావరి– మంచిర్యాల జిల్లా) జలాశయం పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 485.560 అడుగులు. ప్రస్తుతం 484.480 అడుగులకు చేరుకుంది. మరో జలాశయం నాగార్జునసాగర్ (కృష్ణా)కు నిలకడగా ఇన్‌ఫ్లో చేరుతుండడంతో దీని నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట మట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 567.900 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ఈ జలాశయం కూడా త్వరలో పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకుంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇన్‌ఫ్లో చా‘నిల్’
సాక్షి,హైదరాబాద్ : ఒకవైపు క్యుములోనింబస్ మేఘాలు కుమ్మే శాయి. కుండపోతకు నగరం గజగజలాడింది. మరోవైపు నగర దాహార్తిని తీర్చే జంటజలాశయాలు వెలవెలబోయాయి. నగరంలోని ఏ రోడ్డుపై చూసినా నడుంలోతు వరకు నీరే... కానీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో కనీసం ఒక్క అడుగైనా నీటిమట్టం పెరగలేదు. రహదారులన్నీ గోదారులయ్యాయి. కానీ, నీటికాల్వలన్నీ మూసుకుపోయాయి. ఇదీ సోమవారం కనిపించిన దృశ్యాలు. జూబ్లీహిల్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యన 6.7 సెం.మీ. కుంభవృష్టి కురిసింది. శేరిలింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోనూ రెండు గంటల్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల క్యుములోనింబస్ ప్రభావంతో కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది కంటే తక్కువే ఉస్మాన్‌సాగర్(గండిపేట్) గరిష్టమట్టం 1,790 అడుగులకుగాను ప్రస్తుతం 1,762.300 అడుగులమేర మాత్రమే నీటినిల్వలున్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్టమట్టం 1,763.500 అడుగులకుగాను ప్రస్తుతం 1,741 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. ఈ సీజన్లో జూన్–సెపె్టంబర్ మధ్యకాలంలో జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని చేవెళ్లలో 26 శాతం, శంకర్పల్లి మండలంలో 37 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా నీటిమట్టాలు పెరగకపోవడానికి మరో కారణమని జలమండలి అధికారులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్ రోజురోజుకూ చిన్నబోతూ... జంటజలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంటజలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. దాహార్తి తీర్చడానికి.. నిత్యం ఈ రెండు జలాశయాల నుంచి జలమండలి 113 మిలియన్ లీటర్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం జంటజలాశయాల్లో ప్రస్తుతం డెడ్‌స్టోరేజి నిల్వలున్నాయి. పానీ పరేషాన్ లేదు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న నాగార్జునసాగర్(కృష్ణా), ఎల్లంపల్లి(గోదావరి) జలాశయాల్లోకి ఇటీవల భారీగా వరదనీరు రావడంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో నిండుకుండల్లా మారాయి. నగరానికి నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశసహా జంటజలాశయాల నుంచి మొత్తంగా 2,115 మిలియన్ లీటర్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం. గ్రేటర్‌కు మరో ఏడాదివరకు పానీ పరేషాన్ ఉండబోదని భావిస్తున్నాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఉస్మాన్‌సాగర్‌కు కాళేశ్వరం నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మహానగర తాగునీటి ఇక్కట్లకు ఫుల్స్టాప్ పెట్టేలా కార్యాచరణ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ద్వారా తరలిస్తున్న గోదావరి నీటిని శామీర్‌పేట మండలం కేశవపురం రిజర్వాయర్‌కు తరలించాలని ఇప్పటికే నిర్ణయం జరిగి, అందుకు అనుగుణంగా పనులు సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా కొత్తగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ తాగునీటికి ఎలాంటి కొరత ఏర్పడకుండా చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌కు, అటు నుంచి హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్లే సంగారెడ్డి కెనాల్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు భరోసా.. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు తొలి నుంచి కీలక ఆధారంగా ఉన్నాయి. 3.90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ఉస్మాన్‌సాగర్ నుంచి 25 మిలియన్ గ్యాలన్లు, 2.96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న హిమాయాత్ సాగర్ నుంచి 15 మిలియన్ గ్యాలన్ల మేర తాగునీరు నగరానికి సరఫరా అవుతున్నాయి. అయితే, ఈ కృష్ణా బేసిన్లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రిర్వాయర్లు నిండటం గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాగు అవసరాల కోసం అక్కంపల్లి, సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి రిజర్వాయర్ల ద్వారా తరలిస్తున్న నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, నగర జనాభా రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఏమాత్రం ప్రవాహాలు తగ్గినా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ సహా సింగూరు, మంజీరా, అక్కంపల్లి రిజర్వాయర్ల ద్వారా నీళ్లందించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే కేశవపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. రూ.7,219 కోట్ల వ్యయంతో కేశవపురంలో 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించేందుకు జలమండలి అధికారులు పనులు మొదలు పెట్టారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు వచ్చే గోదావరి నీటిని 18 కి.మీ దూరంలో ఉన్న కేశవపురం రిజర్వాయర్‌కు గ్రావిటి ద్వారా తరలించాలని ప్రణాళిక రూపొందించారు. 3 వరుసల్లో 3,600 ఎంఎం డయా పైపులైన్ ద్వారా నీటిని తరలించాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌కు ఇన్లెట్, అవుట్ లెట్, స్పిల్‌వే అమర్చుతారు. ఈ పనులన్నింటినీ జలమండలి చేయనుంది. అయితే, కేశవపురంకు నీటిని తరలించేందుకు వీలుగా కొండపోచమ్మ సాగర్ వద్ద స్లూయిస్‌ను మాత్రం నీటిపారుదల శాఖ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా కొండపోచమ్మ సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ స్లూయిస్ నిర్మాణం చేసి, అటు నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా చూడాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే, పైప్‌లైన్ వ్యవస్థను పూర్తిగా జలమండలి నిర్మించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిన ఉస్మాన్‌సాగర్‌కు తరలించే నీళ్లు సర్ప్లస్ అయినప్పుడు హిమాయత్‌సాగర్‌కు వెళ్తాయని, దీనిద్వారా రెండు రిజర్వాయర్లు నిత్యం నీటితో కళకళలాడుతాయన్నది ముఖ్యమంత్రి ప్రణాళికగా ఉంది. మూడ్రోజుల్లో వెట్‌రన్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6 పంప్‌హౌస్‌ల వెట్ రన్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లిలో సమృద్ధిగా నీరు ఉన్న దృష్ట్యా ప్యాకేజీ–6లో సిద్ధంగా ఉన్న 124 మెగావాట్ల సామర్థ్యం గల 4 మోటార్లకు వెట్‌రన్ చేయాలని సూచించారు. ఈ నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించాలన్నారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో వెట్‌రన్ జరిగే అవకాశాలున్నాయి. ఇక ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 3.2 కి.మీ. లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి మిడ్‌మానేరుకు కనిష్టంగా 90 నుంచి 100 టీఎంసీల నీటిని తరలించేలా చూడాలని కోరారు. -
హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల లెక్కలూ చెప్పాలి
వాటర్‌గ్రిడ్, భక్తరామదాస నీటి వినియోగం తెలపాలి రాష్ట్రానికి కృష్ణా బోర్డు ఆదేశం అదనపు నీటి వినియోగం ఆపాలంటూ రాష్ట్రానికి మరో లేఖ హైదరాబాద్ తాగునీటికి మాత్రమే నీరు వాడాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమర్పించాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టి.. నీటి వినియోగం చేస్తున్న ప్రాజెక్టుల నీటి వాడకం వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. ‘కృష్ణాజలాలను వినియోగిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి 2014–15, 15–16 ఏడాదుల్లో నీటి వినియోగ వివరాలన్నీ ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. కేవలం అదనపు, వరద జలాలను వినియోగిస్తూ చేపట్టిన ఏఎంఆర్పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు–నగరి, ముచ్చుమర్రి వినియోగాలు మాత్రం సమర్పిస్తున్నారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లతో పాటు వాటర్‌గ్రిడ్, భక్త రామదాల, ఇతర ఎత్తిపోతల పథకాల కింది వినియోపు వివరాలను తెలంగాణ చెప్పడం లేదు. ఇక గురు రాఘవేంద్ర, శివభాష్యం సాగర్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలపలేదు. ఇప్పటికైనా తెలంగాణ హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల కింద చేస్తున్న వినియోగంతో పాటు మిగతా ప్రాజెక్టుల కింద గత మూడేళ్లుగా జరుగుతున్న వినియోగాన్ని తెలపాలి’అని లేఖలో స్పష్టం చేసింది. నీటి వాటాల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు, వాటాల ఆధారంగా తగిన నీటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ ప్రాజెక్టుల వివరాలు అత్యావశ్యకమని పేర్కొంది. అదనపు వినియోగం ఆపండి... కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాకు మించి వినియోగం చేసిందని ఏపీ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ అదనంగా 3.26 టీఎంసీలు వాడిందని బోర్డు దృష్టికి తెచ్చింది. ఇందులో సాగర్ ఎడమ కాల్వ కిందే 2.28 టీఎంసీలు వాడగా, ఏఎంఆర్పీ కింద 0.477 టీఎంసీలు వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 503 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల మట్టానికి ఎగువన 17.64 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆ నీరంతా తమకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 7.5 టీఎంసీలు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని, తెలంగాణ అదనపు వినియోగం చేయకుండా చూడాలని ఏపీ, బోర్డుకు విన్నవించింది. ఈ లేఖపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇప్పటికే అదనపు వినియోగం చేసినందున, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తప్ప, మరెలాంటి వినియోగం చేయరాదని తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాశారు. ఇదే సమయంలో రెండో విడతలో చేపట్టాల్సిన టెలీమెట్రీ పరికరాల అమరిక ప్రతిపాదనలు ఓకే చేసి, వాటికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది. -
గండిపేట గుండెకోత
అడుగంటుతున్న జలాశయం పెద్ద సంఖ్యలో చేపల మృత్యువాత మహా నగర దాహార్తిని తీర్చే జలాశయాలే దాహంతో అలమటిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నాయి. తమనే నమ్ముకున్న జీవరాశులకు సైతం భరోసా ఇవ్వలేకపోతున్నాయి. సువిశాల విస్తీర్ణంలోని గండిపేట జలాశయం తనపై ఆధారపడిన చేపలను నిర్జీవంగా ఒడ్డున పడేసిన ‘చిత్రం’.. చూసిన వారి గుండెలు తరుక్కుపోతున్నాయి. సిటీబ్యూరో:మహా నగరంలో ఎండల తీవ్రతకు జలాశయాలు అడుగంటుతున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జనం అల్లాడుతున్నారు. మండుటెండలతో చారిత్రక ఉస్మాన్ సాగర్ (గండిపేట) నీళ్లు లేక చిన్నబోయి కనిపిస్తోంది. ఈ జలాశయ గరిష్ట మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1750 అడుగులకు పడిపోయింది. నీటి మట్టం తగ్గడంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలు వేసవి తాపాన్ని తాళలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ దృశ్యం చూసిన వారిని కలచివేస్తోంది. జలాశయం దుస్థితికి కారణాలివే... ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. కానీ ఆ సంస్థ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. సమీప గ్రామాల నుంచి మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో చారిత్రక సాగరాలు కలుషితమవుతున్నాయి. జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరుతోంది. కళాశాలల యాజమాన్యాలు సొంతంగా చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల (మినీ ఎస్టీపీలు)ను నిర్మిం చుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పరిష్కారాలు... సుమారు పదివేల కి.మీ. సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాల సరిహద్దులు, జీఓ. నెం 111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ. వరకు సరిహద్దుల ను పక్కాగా గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) సాయం తీసుకోవాల్సి ఉంది.జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరువాత జలాశయాల సరిహద్దులను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలి.ఎగువ ప్రాంతాల్లో కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘిక శక్తుల ఆట కట్టించాలి.కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి కృష్ణా జలాలను నగరానికి తరలించి ఈ జలాశయాల్లో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ వేసవిలో జంట జలాశయాల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని సూచిస్తున్నారు. జంతు, చెట్ల అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని సూచిస్తున్నారు.నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్ స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జలాశయంలోకి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, రియల్ వెంచర్లను తొలగించాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో నిండుకుండల్లా జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని, దాదాపు పాతనగరం దాహార్తి సమూలంగా దూరమవుతుందని నిపుణులు తెలిపారు. -
జల ‘సిరి’ ఆవిరి
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: మండుటెండల్లోనూ నిండు కుండల్లా పరవళ్లు తొక్కిన జంట జలాశయాలు ఆవిరైపోతున్నాయి. దశాబ్దాలుగా భాగ్యనగరి గొంతు తడుపుతున్న ఈ ‘సాగర్’లు నైబారి బీడు భూములుగా మారాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం... అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు తల్లడిల్లి నీటి జాడలు అడుగంటుతున్నాయి. 1790 అడుగుల గరిష్ట మట్టం ఉన్న ఉస్మాన్‌సాగర్ ప్రస్తుతం 1753.880 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఇక్కడి నుంచి రోజుకు 15 మిలియన్ గ్యాలన్లను నగర తాగునీటి అవసరాలకు తరలించే జలమండలి... జలాశయం వట్టిపోవడంతో నీరు తోడటం నిలిపివేసింది. ఇక హిమాయత్‌సాగర్ 1763.5 అడుగుల గరిష్ట మట్టం నుంచి 1,734.41 అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయింది. దీని నుంచి గతంలో 20 ఎంజీడీల నీటిని తోడే జలమండలి ప్రస్తుతం 4.400 ఎంజీడీలకే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఇవి కూడా మరో నెలకు మాత్రమే సరిపోతాయి. వీటి చుట్టూ వెలసిన ఫామ్‌హౌస్‌లు, రియల్ఎస్టేట్ వెంచర్లు, కళాశాలలు, ఇసుక తవ్వకాలతో ఈ జలాశయాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటి దారులు క్రమంగా మూసుకుపోయి ఈ దుస్థితి తలెత్తింది. -
ఈ నీరు తాగలేం!
కలుషిత జలాలపై ఫిర్యాదుల వెల్లువ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలపై జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 1 నుంచి 9 వరకు ఈ సమస్యపై నగర వ్యాప్తంగా 261 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందులో 106 సమస్యలను అధికారులు పరిష్కరించగా.. మరో 155 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. సింగూరు, మంజీర, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. బురదతో, రంగుమారిన జలాలు సరఫరా అవుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గోదావరి పైపులైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటితో కలిసి సరఫరా అవుతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న మల్లారం నీటి శుద్ధి కేంద్రం వద్ద మొత్తం 52 ఫిల్టర్‌బెడ్స్‌కుగాను ప్రస్తుతానికి 17 ఫిల్టర్బెడ్లు మాత్రమే పని చేస్తుండడంతోఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీటిని సరఫరా చేసే పైపులైన్లకు చిల్లులు పడుతుండడంతో డ్రైనేజి నీరు, చెత్త అందులో కలిసి కలుషిత జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో నీరుఅడుగంటడంతో పాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బురద, మట్టి కలిసిన జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రాంతాలివే.. బంజారాహిల్స్: ఎన్బీటీనగర్, సింగాడికుంట, ఉదయ్ నగర్, చింతలబస్తీ, ప్రేమ్‌నగర్ సనత్‌నగర్: ఫతేనగర్, ఎస్.ఆర్.నగర్, ఎస్ఆర్టీ కాలనీ, జెక్ కాలనీ, రాజరాజేశ్వరీనగర్, సుందర్‌నగర్. కూకట్పల్లి: ఆల్విన్‌కాలనీ, బాలానగర్, మూసాపేట్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్ ముషీరాబాద్: గాంధీనగర్, జవహర్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్. చార్మినార్: అమితానగర్, పటేల్‌నగర్, హబీబ్‌నగర్, ఘన్సీబజార్, చందూలాల్ బారాదరి, రియాసత్‌నగర్, పురానాపూల్. -
111 జీవో ఉండాల్సిందే
పభుత్వానికి ఇరిగేషన్ శాఖ నివేదిక వరద నివారణ, తాగునీటి అవసరాల కోసమే జంట జలాశయాలు అవసరంలేని గ్రామాలను కూడా జీవోలో పొందుపరిచారు అనవసరంగా నాలుగు గ్రామాలను మినహాయించారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవో 111 అమలు తప్పనిసరని, దానిని రద్దు చేస్తే జంట జలాశయాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 84 గ్రామాల పరిధిలో పరిశ్రమలు, నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవోనంబర్ 111ను జారీ చేసింది. ఎగువ ప్రాంతంలోనే కాకుండా జలాశయాలకు దిగువన 10 కి.మీ. పరిధిలోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పరీవాహక ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తూరు మండలం ఈ జీవో పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇతరగ్రామాల్లో భూముల విలువలు ఆకాశాన్నంటుతున్నా, తమ ప్రాంతంలో మాత్రం ఆంక్షలతో భూములను కొనలేని, అమ్మలేని పరిస్థితి ఏర్పడినందున జీవోను సడలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీవోరద్దుకు కేసీఆర్ హామీ ... అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేస్తామని కేసీఆర్ కూడా ఎన్నికల్లో ప్రకటించారు. అయితే, ఈ జీవోపై సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పులు ఇచ్చినందున, వాటికి లోబడి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అందుకే ఇటీవల ఈ జీవో ఎత్తివేతపై జిల్లా కలెక్టర్ నుంచి నివే దిక కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాలు, వరదనీటి ప్రవాహంపై సర్వే నిర్వహించాలని నీటి పారుదల శాఖకు సూచించారు. తప్పులతడకగా జీవో నిబంధనలు... దీంతో రంగంలోకి దిగిన ఆ శాఖ జీవో జారీలో శాస్త్రీయత పాటించలేదని, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే శంకర్‌పల్లిలోని నాలుగు గ్రామాలను ఉద్దేశపూర్వకంగా జీవో పరిధి నుంచి తప్పించినట్టు గుర్తించింది. అంతేకాకుండా జాడలేని నాలుగుగ్రామాలను మాత్రం బయో కన్జర్వేషన్ జోన్లోకి తెచ్చారని, మొయినాబాద్ మండల గ్రామాలను శంషాబాద్ మండలంలో చూపారని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టేందుకే పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పరిశ్రమలు రావద్దనే ఆంక్షలు విధించారని, వీటిని సవరిస్తే నీరు కలుషితమయ్యే అవకాశముందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడింది. 1908లో హైదరాబాద్‌ను మూసీవరద ముంచెత్తినందున ఈ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారని, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని పేర్కొంది. జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే పర్యావరణవేత్తల సూచనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది.