'ఇక వయసుకు తగిన పాత్రలు'
‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘గోలియోంకీ రాస్లీలా-రామ్లీలా’ వంటి చిత్రాల్లో బరువైన పాత్రలు పోషించిన రిచా ఛద్దా, ఇకపై వయసుకు తగిన పాత్రలు పోషించాలనుకుంటున్నట్లు చెబుతోంది.
సాధారణంగా హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో తేలికపాటి పాత్రలను ఎంచుకుంటారని, తనకు మాత్రం కెరీర్ ప్రారంభంలోనే సీరియస్ పాత్రలు లభించాయని వాపోతోంది.
శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా అయిన రిచా, ఇకపై అవకాశం దొరికితే స్టెప్పులేసే పాత్రల్లో యువతను ఉర్రూతలూగించాలని ఉవ్విళ్లూరుతోంది.