Padma Shri awards
-
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
తెలుగు నేలపై విరిసిన పద్మాలు
సంగీతం.. దేవుడిచ్చిన వరం తన సంగీతంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఇటీవల ‘80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు’, ‘28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డు’అందుకున్న ఎంఎం కీరవాణి తాజాగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కీరవాణి నాలుగో ఏటనే తండ్రి వేలు పట్టుకుని సంగీతం వైపు తొలి అడుగులేశారు. ఆరేళ్లప్పుడు రాయచూరులోని దత్తప్ప అనే విద్వాంసుడి వద్ద సంగీతం అభ్యసించారు. వయోలిన్‌పై పట్టు సాధించారు. ఇంజనీర్ కావాలని శ్రమించినా సీటు రాలేదు. ఆ తర్వాత కీరవాణి‘జాలీ ఫ్రెండ్స్’అనే ఆర్కెస్ట్రా ట్రూపులో చేరి, పాటలు పాడారు. చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత వేటూరి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. వేటూరి సిఫార్సుతో కీరవాణికి ‘మనసు–మమత’సినిమాకి సంగీత దర్శకునిగా తొలి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆర్చిడ్ మొక్కలపై పరిశోధనలకు నాగేశ్వరరావుకు పద్మశ్రీ ఏలూరుకు చెందిన డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఆర్చిడ్ రకానికి చెందిన అరుదైన మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఆర్చిడ్ జినీ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ హిమాలయన్ రీజియన్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలకు గానూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్ట్స్‌లో ఇప్పటికే తన పేరును నమోదు చేసుకున్నారు. 35 రకాల నూతన ఆర్చిడ్ జాతి మొక్కలను కనుగొన్నారు. సేవామూర్తి చంద్రశేఖర్ కాకినాడ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు కాకినాడకు చెందిన సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్‌కు లభించింది. ఆయన 1943 నవంబర్ 20న సింగరాయకొండలో అప్పల నరసయ్య, రామయ్యమ్మ దంపతులకు జన్మించారు. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడ్డారు. 1985లో విమాన ప్రమాదంలో చంద్రశేఖర్ భార్య మంజరి, కుమారుడు కిరణ్, కుమార్తె శారద మృతి చెందారు. దీంతో ఇండియాకు వచ్చేసిన ఆయన 1989లో సంకురాత్రి ఫౌండేషన్‌ను స్థాపించారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి వద్ద కంటి ఆస్పత్రి, విద్యాలయం స్థాపించి సేవలు అందిస్తున్నారు. ఏటికొప్పాక కళాకారుడికి పద్మశ్రీ సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన సీవీ రాజు(చింతలపాటి వెంకటపతి రాజు)కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలు బాగా ప్రాచుర్యం పొందాయి. మొదట సీవీ రాజుది వ్యవసాయ వృత్తే అయినా... 1988లో బొమ్మల తయారీని చేపట్టారు. పిల్లల ఆట వస్తువులు, కుంకుమ భరణిలు డిజైన్ చేసి ఎగుమతి చేశారు. 2020లో మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ.. రాజుతో సంభాషించారు. మళ్లీ గత ఆదివారం కూడా రాజు తయారుచేసిన బొమ్మలను ప్రధాని ప్రశంసించారు. బొమ్మల తయారీలో నైపుణ్యానికి రాష్ట్రపతి అవార్డు రాజుకు లభించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు. హరికథా సామ్రాజ్య సార్వభౌమ.. తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు.. కోట సచ్చిదానందశాస్త్రి భాగవతార్. రామాయణ, భారత, భాగవతాలను శ్రావ్యంగా, జనరంజకంగా గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. తన సేవలకు గుర్తుగా తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం.. ప్రకాశం జిల్లా అద్దంకి. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో పౌరోహిత్యం చేస్తూనే.. స్వయంగా హరికథాగానం సాధన చేశారు. చతురోక్తులు, సరస సంభాషణలతో వీక్షకుల మనసు తనపైన లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. ఆకాశవాణిలో టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్టయ్యారు. విజయగుప్తాకు పద్మశ్రీ సాక్షి ప్రతినిధి, బాపట్ల: వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్న విజయగుప్తా అందించిన సేవలకు పద్మశ్రీ దక్కింది. విజయగుప్తా మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. నీలి విప్లవం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచిన ఘనతను సొంతం చేసుకున్నారు. విజయగుప్తా చేసిన విశిష్ట పరిశోధనలకు ఇప్పటికే దేశ,విదేశాల్లో పురస్కారాలను అందుకున్నారు. బాపట్లలో జన్మించిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివారు. పశ్చిమ బెంగాల్ మత్స్యశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. 22 దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. ఇద్దరు శాస్త్రవేత్తలకు పద్మశ్రీ శాస్త్ర విజ్ఞాన రంగంలో కేఎన్ గణేశ్, పీసీ సూద్‌కు పురస్కారాలు సాక్షి, అమరావతి: శాస్త్ర విజ్ఞాన రంగంలో చేసిన విశిష్ట కృషికి ప్రముఖ శాస్త్రవేత్త కేఎన్ గణేశ్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ప్రముఖ బయో ఆర్గానిక్స్ శాస్త్రవేత్త అయిన కేఎన్ గణేశ్ తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ చేశాక భారత్‌కు తిరిగి వచ్చి 1980లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో చేరారు. భారత్‌లో మొదటి డీఎన్ఏ సింథసిస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డీఎన్ఏ గుర్తింపులో రసాయన సూత్రాలు, డీఎన్ఏ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహించారు. అణు భౌతిక శాస్త్రంలో పీసీ సూద్‌కు.. అణు భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను పీసీ సూద్‌కు పద్మశ్రీ లభించింది. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో భౌతిక శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. న్యూక్లియర్ ఫిజిక్స్, థియోరాటికల్ ఫిజిక్స్, ఎలిమెంటరీ పార్టికల్ ఫిజిక్స్‌ల్లో పరిశోధనలు చేశారు. న్యూక్లియర్ స్ట్రక్చర్ అంశంలో 300కుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటిలో 158 పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. మృదు మధురమైన కంఠస్వరం.. వాణీజయరామ్ సొంతం ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం. ‘స్వాతి కిరణం’లోని ఈ పాటను తమిళ పొన్ను (అమ్మాయి) వాణీ జయరామ్ స్పష్టంగా తెలుగులో పాడిన తీరు అద్భుతం. ‘శంకరాభరణం’సినిమాలో ‘పలుకే బంగారమాయెనా..’అని పాడితే ‘మీ పాటే మధురమాయెనే..’అని శ్రోతలు కితాబునిచ్చారు. ‘అందెల రవమిది పదములదా..’అంటూ ‘స్వర్ణకమలం’కి పాడితే శ్రోతల మనసులు నాట్యం చేశాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన కెరీర్లో వాణీ జయరామ్ పదివేల పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ.. ఇలా దాదాపు 20 భాషల్లో పాడారు. ఎనిమిదవ ఏటనే ఆమె ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ అభ్యసించిన ఆమె చదువుని నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నైలో ఆమెకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. 1969లో జయరామ్‌ని పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్ల పాటు ముంబైలో ఉన్నారు. ఏ భాషలో పాడితే అదే ఆమె మాతృభాష అన్నట్లుగా పాడిన వాణీ జయరామ్‌కి ఎన్నో అవార్డులూ రివార్డులూ దక్కాయి. తాజాగా ఆమెను ‘పద్మ భూషణ్’వరించింది. -
మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’
సాక్షి, నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లికి చెందిన డాక్టర్ పద్మజారెడ్డికి దేశంలోనే నాలుగో అత్యున్నతమైన ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కూచిపూడి విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి భార్య అయిన పద్మజారెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. దీంతో కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్ ఆర్ట్ ఫాంను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్ రూపొందించారు. అదేవిధంగా సామాజిక అంశాలపైనా నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు చేశారు. చదవండి: పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం డాక్టర్ పద్మజారెడ్డి సాధించిన అవార్డుల్లో కొన్ని.. ► భారత ప్రభుత్వం నుంచి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ► 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా కళారత్న (హంస) అవార్డు ► శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 2005లో డాక్టరేట్ పట్టా ► 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ నాట్యవిశారద అవార్డు అందజేశారు. ► 1990లో కల్కి కళాకార్ అవార్టు ► 2001లో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డు అందుకున్నారు. ► అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్ఆర్ గోల్డ్‌మెడల్ అందుకున్నారు. ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2014లో అవార్డు పొందారు. ► యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుంచి అవార్డు ► తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి ది డ్యాన్సింగ్ క్వీన్ అవార్డు ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైఫ్‌టైమ్ ఆచీవ్మెంట్తో అవార్డుతో సత్కరించింది. ► 1979లో సర్ శ్రీనగర్ సంసద్ నృత్యవిహార్ అవార్డు అందజేశారు. ► 2007లో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ విద్వాన్ మంత్‌తో సన్మానించింది. ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ఢిల్లీ) జనరల్ అసెంబ్లీ మెంబర్‌గా 2017 వరకు ఉన్నారు. ► 2012లో నేషనల్ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా వ్యవహరించారు. -
‘పద్మ శ్రీ’మొగులయ్య.. 12 మెట్ల కిన్నెర.. తెలంగాణలో ఒక్కరే!
‘ఆడా లేడు మియాసావ్.. ఈడా లేడు మియాసావ్.. పానిగంటి గుట్టలమీద పావురాల గుండున్నదీ.. రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..’ అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ పాటతో మరింత ఫేమస్ కిన్నెర కళ అంతరించిపోతుండటంతో మొగులయ్య దానికి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు. ఈయన కళను గుర్తించి ఎంతోమంది ఆయనకు బాసటగా నిలిచారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగ మొగులయ్యను ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో ఎందరో ఆప్తులుగా మారి అండగా నిలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మొగులయ్య మరింత ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కష్టాల్లోనూ కిన్నెరను వదలలేదు మొగులయ్య పూర్వీకులు తాతలు, ముత్తాతల కాలం నుంచి కిన్నెర వాయిస్తూనే జీవనోపాధి పొందారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. సుమారు 500 ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్న కిన్నెర మొదట ఏడు మెట్లు మాత్రమే ఉండేది. మొగులయ్య ప్రత్యేక శ్రద్ధతో తర్వాత 12 మెట్ల కిన్నెరగా తీర్చిదిద్ది.. ఆ వాయిద్యంతో మరిన్ని రాగాలను పలికిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్యకు సెంటు భూమి లేదు. కిన్నెరనే ఆయన జీవనాధారం. అనారోగ్యంతో భార్య, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిగా మరణించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఏనాడూ కిన్నెరను విడిచిపెట్టలేదు. పొట్టకూటి కోసం వరంగల్, మహారాష్ట్రలో మట్టిపని చేస్తూ కాలం ఎల్లదీశాడు. పన్నెండేళ్ల ప్రాయంలో కిన్నెర పట్టుకున్న మొగులయ్య వృద్ధాప్యం వచ్చినా.. తన కళను బతికించేందుకు తపిస్తూనే ఉన్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయ పురాతన వాయిద్యం కిన్నెరను మొగులయ్య జీవనోపాధిగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కళను నేర్చుకునేవారు కరువయ్యారు. కిన్నెర తయారీ సైతం ఎవరూ చేయడం లేదు. అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన కిన్నెరను 12 మెట్లుగా అభివృద్ధి చేసిన ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్య ఒక్కరే. -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
పంచ పద్మాలు
కథానాయిక మూళిక్కళ్ పంకజాక్షి: పై పెదవి మీద తోలుబొమ్మను ఉంచుకుని, రామాయణ మహాభారత కథలను నాలిక మీద ఆడిస్తున్న ఏకైక కళాకారిణి కేరళకు చెందిన మూళిక్కళ్ పంకజాక్షి. తల్లిదండ్రులు నేర్పిన ‘నూక్కు విద్య పవక్కలి’ (తోలు బొమ్మలాట)ని ఆమె తన పన్నెండవ ఏట నుంచే కాపాడుకుంటూ వస్తున్నారు. కేరళలోని మోనిపల్లె తాలూకా కొట్టాయం వారిది. భర్త శివరామ పాణిక్కర్ కూడా కళాకారుడే. మధుర స్వరంతో శివరామ పాడుతూ, వాద్యాలను ఉపయోగించటం వల్లే తన కథకు మరింత అందం చేకూరి, తాను అందరికీ పరిచితురాలినయ్యాను అంటారు పంకజాక్షి. ఐదు వందల సంవత్సరాల నాటì ఈ విద్యను, ఈ శతాబ్దంలో నేటికీ సజీవంగా ఉంచిన ఏకైక వ్యక్తి పంకజాక్షి. ఆమెను ఈ విద్య నేర్చుకోమని తల్లిదండ్రులు ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు. మొదట్లో తన ఇంటిముందరే కాళ్లను బారచాచి, పైకి చూస్తూ, చిన్న చిన్న కొబ్బరి కాయ పిందెలను పైపెదవి మీద గంటలుగంటలు బ్యాలెన్స్ చేసేది. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్న సమయాలలో సాధన చేసిన పంకజాక్షి, వివాహం వల్ల కాని, పిల్లల వల్ల కాని ఎన్నడూ ఎటువంటి ఆటంకం కలగలేదని అంటారు. ఆమె మనుమరాలు కె. ఎస్. రంజని కూడా ఈ కళను కొనసాగిస్తున్నారు. పంకజాక్షి ఆరు సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఈ విద్యను ప్రదర్శించటం లేదు. ఆసక్తి ఉన్నవారికి తన ఇంటి దగ్గర ఈ విద్యను నేర్పుతున్న పంకజాక్షికి పద్మశ్రీ అవార్డు లభించింది. సంఘసేవిక ఉషా చౌమర్: మరుగుదొడ్లను పరిశుభ్ర పరిచే పని చేస్తున్న రోజుల్లో ఉషా చౌమర్‌కి, ఆ పని చేసి ఇంటికి వచ్చాక వాంతులు అయ్యేవి. ఏమీ తినాలనిపించేది కాదు. తనమీద తనకే అసహ్యం వేసేది. 1993లో తోటీ పనిని నిషేధించినా, కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ తోటీ పనివారు ఉన్నారు. రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో ఒక సామాన్య దళిత తోటీ కుటుంబంలో పుట్టిన ఉషా తన ఏడవ ఏట నుంచే తల్లికి సహాయంగా చీపురు పట్టారు. పది సంవత్సరాల వయసులో గృహిణిగా ఆల్వార్ జిల్లా చేరుకున్నారు. భర్తకు సహాయంగా ఇదే పనిలో జీవితం కొనసాగింది. డా. బిందేశ్వర్ పాఠక్ అనే సంఘ సంస్కర్త ఉషా నివసించే కాలనీకి రావటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆయన ‘నయీ దిశ’ పేరుతో స్థాపించిన సంస్థ ద్వారా ఉషా అప్పడాలు, నూడుల్స్, పచ్చళ్లు తయారుచేసి అమ్మకాలు ప్రారంభించారు. అలా తను కొత్త జీవితంలోకి వచ్చి తనలాంటి వారి జీవితాలలో వెలుగురేఖలు ప్రసరింప చేశారు. ఆంగ్లవిద్యను కూడా అభ్యసించిన ఉష.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ఆయనకు రాఖీ కట్టిన తరువాత సామాజికవేత్తగా కూడా మారారు. అమెరికా, పారిస్, దక్షిణాఫ్రికా వంటి పలు దేశాలలో పర్యటిస్తూ, ఎంతోమందిని తోటీ పని నుంచి బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థకు అధ్యక్షురాలిగా ఉంటున్న ఉష తన సేవలకుగాను ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. సౌభాగ్యవతి ట్రినిటీ సయూవూ: ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయలో ములీ అనే చిన్న గ్రామంలో జన్మించిన ట్రినిటీ సయూవూ ఉపాధ్యాయురాలిగా విద్యార్థులను చక్కదిద్దేవారు. అంతటితో తృప్తి చెందకుండా, నలుగురికీ ఉపయోగపడే పని కూడా మరేదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. పసుపు సాగును ఒక ఉద్యమంగా ప్రారంభించారు. లకడాంగ్ అనే పసుపు రకాన్ని పండించటం వల్ల మూడు రెట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలుసుకున్నారు. ట్రినిటీ సయూవూ ఈ విషయాన్ని మేఘాలయాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 800 మందికి తెలియబరిచారు. ప్రతిరోజూ స్కూల్ అయిపోగానే, సాయంకాలం వేళ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే మహిళలను కలుసుకుని, ఈ బంగారు సుగంధ ద్రవ్యం (పసుపు) పంట పండించటం వల్ల వచ్చే అదనపు రాబడి గురించి వారికి ఆసక్తి కలిగేలా వివరించేవారు. అధిక ఆదాయం వచ్చేలా, పసుపు కొమ్ములను స్వయంగా మిల్లులో పట్టించి, పసుపును కవర్లలో ప్యాకింగ్ చేసి, అమ్ముతున్నారు. సేంద్రియ పద్ధతిలో ఈ సాగు జరుగుతోంది. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను తెలియచేస్తూ, తాము తయారు చేసిన పసుపును దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేసి, సంపన్నులవుతున్నారు ఆమె నుంచి స్ఫూర్తిని పొందినవారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించిన ట్రినిటీ సయూవూను పద్మశ్రీ పురస్కారం వరించి వచ్చింది. ధాన్యలక్ష్మి రహీబాయ్ సోమా: సంకర విత్తనాల కంటె దేశీ విత్తనాల వల్లే సేంద్రియ వ్యవసాయం సాధ్యమని భావించారు మహారాష్ట్రలోని కొంభల్నే గ్రామానికి చెందిన రహీబాయ్ సోమా. ఆలోచనలను ఆచరణలో పెడితేనే ఏ వ్యక్తయినా ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆమె నమ్ముతారు. ఏడుగురు సభ్యులున్న రహీబాయ్ సోమా కుటుంబం ఉపాధికోసం ఔరంగాబాద్ జిల్లా ఆకోలే తాలూకాకు చేరుకున్నాక, కొత్త జీవితం ప్రారంభించారు. వర్షాకాలంలో వ్యవసాయం చేస్తూ, మిగతా సమయంలో పం^è దార ఫ్యాక్టరీలో రోజు కూలీలుగా పనిచేసేవారు కుటుంబంలోని వాళ్లంతా. అయితే ఆ జీవితం రహీబాయ్ సోమాకు నచ్చలేదు. వారి కున్న ఏడు ఎకరాలలో మూడు ఎకరాల మీద శ్రద్ధ పెట్టారు రహీబాయ్ సోమా. భూమి సారవంతంగా ఉంటేనే మంచి పంట దిగుబడి వస్తుందని ఆమెకు బాగా తెలుసు. నేలను తడిగా ఉంచటం కోసం తన పొలంలో వ్యవసాయ చెరువును అంటే జలకుండాన్ని తవ్వించి, కూరగాయలు పండించటం ప్రారంభించారు. ఆమెలోని పట్టుదలను గమనించిన మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ రూరల్ ఏరియాస్ వారు ఆమెకు సహకరించారు. దానితో రహీబాయ్ సోమా కోళ్లఫారం, మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. పంటలు చక్కగా పండించటం కోసం దేశీ విత్తనాలను సంరక్షించటం కోసం విత్తనాల బ్యాంకును నెలకొల్పి, సీడ్ మదర్‌గా గుర్తింపు పొందారు. దాచిన విత్తనాలను పొరుగు రైతులకు ఇస్తూ, వారు కూడా ఫలితం పొందేందుకు సహకరిస్తున్న రహీబాయ్ సోమాను పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వచ్చింది. వనమాలి తులసి గౌడ: కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడకు ఏడుపదులు పైబడ్డా నేటికీ హుషారుగానే కనిపిస్తారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. పుట్టిన రెండేళ్లకే తండ్రిని పోగొట్టుకున్నారు. కుటుంబాన్ని నడపటం కష్టంగా ఉండటంతో, తులసి గౌడకు బాల్యంలోనే వివాహం చేశారు ఆమె తల్లి. ఆమెను అక్కడ కూడా దురదృష్టం వెంటాడింది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. అయినా ౖ«§ð ర్యాన్ని కోల్పోలేదు తులసి గౌడ. ఒంటరితనాన్ని దూరం చే సుకోవటం కోసం, మొక్కలకు చేరువైంది. ఆమెలోని ఉత్సాహాన్ని చూసి, అటవీశాఖ వారు ఆమెకు వనమాలి ఉద్యోగం ఇచ్చారు. మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంటూ, అంకిత భావంతో పనిచేశారు తులసి. మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసి సంరక్షించటమే కాకుండా, ఆ మొక్కలోని గుణాలు, మొక్క పేరుకు సంబంధించిన జ్ఞానం పెంచుకున్నారు. ఎవరు వచ్చి, ఏ మొక్క గురించి ప్రశ్నించినా తడుముకోకుండా, విసుగు లేకుండా, ఆనందంగా ఆ వివరాలు చెబుతారు తులసి గౌడ. టేకు మొక్కలతో తన ప్రయాణం ప్రారంభించిన తులసి గౌడ, పనస వంటి అనేక పెద్ద పెద్ద మొక్కలు కూడా నాటి, అవి పెరిగి, ఫలాలనిస్తుంటే, తనకు మనుమలు పుట్టినంత ఆనందిస్తారు. పర్యావరణానికి అందించిన సేవలకు గాను ఆమెకు ఉన్న పురస్కారాలకు వన్నె తెచ్చేలా పద్మశ్రీ పురస్కారం వచ్చి చేరింది. - డా. వైజయంతి పురాణపండ -
కళారంగంలో వికసించిన పద్మాలు యడ్ల, దళవాయి
రాజాం/ధర్మవరం రూరల్: రాష్ట్రంలోని శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు కళాకారులను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావును, తోలు బొమ్మ కళాకారుడు దళవాయి చలపతిరావును ఈ పురస్కారాలు వరించాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావు తన 14వ ఏట నాటక జీవితాన్ని ప్రారంభించారు. ఆయన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రక పాత్రకు పెట్టింది పేరు. కృష్ణుడి పాత్రలోనూ ఒదిగి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దేశవ్యాప్తంగా తెలుగు పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చి ప్రతిభ చాటుకున్నారు. 1950లో జన్మించిన గోపాలరావు మందరాడలో ప్రాథమిక విద్యను, శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాలలో 1967లో పీయూసీ పూర్తి చేశారు. ప్రెసిడెంట్ పట్టయ్య, పూలరంగడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పల్లెపడుచు మొదలైన సాంఘిక నాటకాల్లో హీరోగా మెప్పించారు. దేశం కోసం, పావలా, ఆగండి–కొంచెం ఆలోచించండి వంటి సాంఘిక నాటికలు కూడా ప్రదర్శించారు. శ్రీ బాలభారతి కళా నాట్యమండలి స్థాపించి అనేక కళాపరిషత్‌లు నిర్వహించారు. వర్ధమాన , ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు. 2010లో సత్యహరిశ్చంద్ర పద్యనాటకాన్ని వెండి తెరకు ఎక్కించారు. రంగస్థల కళాకారులతో రూపొందించిన ఈ సినిమా 2013లో రిలీజై విమర్శకుల మన్ననలు పొందింది. ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు సాక్షి, అమరావతి: పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు సాధించిన తెలుగువారిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. పద్మభూషణ్‌కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కళా రంగం నుంచి పద్మశ్రీకి ఎంపికైన యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులు భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తోలుబొమ్మ కళాకారునికి అరుదైన గౌరవం అంతరించిపోతున్న తోలుబొమ్మల కళను బతికిస్తున్న దళవాయి చలపతి అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన వారు. ఆయన పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వారు తోలుబొమ్మలతో గ్రామ గ్రామానా ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవారు. వారసత్వంగా ఈ కళలోకి ప్రవేశించిన దళవాయి చలపతి ఈ కళలో దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా చాటారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి రాష్ట్రపతి అవార్డుతో పాటు మరెన్నో జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అంతరించిపోతున్న తోలు బొమ్మలాటను కాపాడేందుకు దళవాయి చలపతి చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. -
బాలీవుడ్ పద్మాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మాలు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, టీవీ టైకూన్ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. శనివారం సాయంత్రం పద్మ అవార్డుల జాబితా వెలువడగానే ఈ నలుగురికీ ప్రశంసల వర్షం మొదలైంది. కంగ్రాట్స్ కరణ్ ఇండస్ట్రీకి పరిచయమై.. ఓ పేరు సంపాదించాలని.. ఓ మార్క్ సృష్టించాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. కానీ దర్శకుడు కరణ్ జోహార్ బాలీవుడ్ పరిచయమే ఓ ల్యాండ్‌మార్క్. ఆయన బ్యానర్లో పరిచయం కావడం ఆర్టిస్టులకు ఓ హాల్‌మార్క్. షారుక్ ఖాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కరణ్ జోహార్. రొమాంటిక్ డ్రామాలో ఆ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి స్టార్ కిడ్స్ను కరణ్ ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు. నిర్మాత యశ్ జోహార్, హీరూ జోహార్ దంపతులకు జన్మించారు కరణ్. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే తిరిగారు, పెరిగారాయన. చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం ఆయన మీద ఉంది. షారుక్ ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు కరణ్. ఆ తర్వాత దర్శకుడిగా ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ ఆల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలు తెరకెక్కించారు. కరణ్ జోహార్‌కి స్క్రిప్ట్‌ని కమర్షియలైజ్ చేయడం తెలుసు. ఆడియన్స్ పల్స్ తెలుసు. అందుకే దర్శకుడిగా ఫ్లాప్ చూడలేదాయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు కరణŠ . ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ పేరు కరణ్. 47 ఏళ్ల కరణ్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా (యష్, రూహీ) ఇద్దరు పిల్లలున్నారు. శభాష్ సమీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘ఏ జిల్లా ఏ జిల్లా... ఓ పిల్లా నీదీ ఏ జిల్లా’ పాట విన్న శ్రోతలకు ఆ పాట పాడిన గాయకుడి గొంతు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గొంతు రెగ్యులర్‌గా లేదు. విభిన్నంగా అనిపించింది. కానీ పాడుతుంటే వినాలనుంది. శభాష్.. గొంతు బాగుందన్నారు. ఆ గాయకుడి జిల్లా ఏంటి? అని వాకబు చేశారు. అతని పేరు అద్నాన్ సమీ అని తెలిసింది. లండన్‌లో పుట్టి పెరిగారు అద్నాన్ సమీ. అఫ్ఘాన్ మూలాలున్న తండ్రి, జమ్మూ కశ్మీర్ మూలాలున్న తల్లికి జన్మించారు ఆయన. తొమ్మిదేళ్లకే పియానో వాయించడం మొదలుపెట్టారు సమీ. హాలిడేలో ఇండియాను సందర్శించినప్పుడు క్లాసికల్ మ్యూజిక్‌పై ఆసక్తి ఏర్పరుచుకొని నేర్చుకున్నాడు అద్నాన్. తన చురుకుతనాన్ని గమనించి సంగీతంలోనే కొనసాగమని ప్రముఖ గాయని ఆశా భోంస్లే సూచించారు. అప్పటి నుంచి సంగీతంలో మరింత శ్రద్ధపెట్టారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్‌లో పట్టు సాధించారు. ‘నౌషద్ మ్యూజిక్’ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు అద్నానే. అద్నాన్ తొలి కంపోజిషన్ 1986లో ‘రన్ ఫర్ లైఫ్’ సాంగ్ సూపర్ హిట్ అయింది. 1995లో ‘సర్గం’ అనే పాకిస్థానీ సినిమాకు సంగీతం అందించారు. అందులో నటించారు కూడా. అది బ్లాక్‌బస్టరే. ‘కబీతో నజర్ మిలావో’ అనే ప్రేమ పాటల్ని ఆశా భోంస్లేతో కలసి ఆల్బమ్‌గా చేశారు. శ్రోతల్ని ఉర్రూతలూగించింది. 2001 నుంచి బాలీవుడ్ సినిమాలకు పాడటం, కంపోజ్ చేయడం మొదలుపెట్టారు అద్నాన్ సమీ. 2004లో ‘శంకర్ దాదా’తో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంతా సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), కళ్లూ కళ్ళూ ప్లస్ (100ç% లవ్), ఓ ప్రియా ప్రియా (ఇష్క్), ఓ మధు ఓ మధు (జులాయి) వంటి పాపులర్ పాటలు పాడారాయన. సక్సెస్ఫుల్ క్వీన్ బాలీవుడ్లో కంగనా ఫైర్ బ్రాండ్. అనుకున్నది అనుకున్నట్లే చెబుతుంది. ఏవరేమనుకుంటే ఏంటి? అంటుంది. ఎవరు చిన్నబుచ్చుకున్నా, తన అభిప్రాయాలను వెలిబుచ్చడంలో ఎప్పుడూ సంకోచించదు కంగనా. డాక్టర్ అవ్వాలని ఇంట్లో అన్నారు. యాక్టర్ అవుతాను అంది కంగనా. ఇంట్లో వద్దన్నారు. నా ఆశను వదలనంది కంగనా. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది కంగనా. వచ్చిన అవకాశాలను మెట్లుగా చేసుకుని సూపర్ స్టార్‌గా ఎదిగింది. ‘గ్యాంగ్‌స్టర్’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది కంగనా. 2007లో ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ చిత్రం తనకు కావాల్సిన గుర్తింపుని ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే మధుర్ బండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా. ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగులోనూ పరిచయమైంది. ‘క్వీన్, తను వెడ్స్ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్’ సినిమాకు మాటల రచయితగా, సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ప్రస్తుతం కంగనా చేతిలో ఉన్న రెండూ లేడీ ఓరియంటెడ్ సినిమాలే. ఫోర్బ్స్ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె. ఆమె ఫ్యాషన్ సెన్స్ విచిత్రంగానూ, స్టయిల్ స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. ఆమె స్టెట్మెంట్లు ఎక్కువ శాతం కాంట్రవర్శీలకు దారి తీసిన సందర్భాలున్నాయి. ఈ కాంట్రవర్శీ క్వీన్‌కి తిరుగులేదు. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. టెలివిజన్ స్టార్ నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నది. టెన్షన్స్‌తో కూడుకున్నది. కూడికలు, తీసివేతలతో కూడుకున్నది. మనుషుల్ని డీల్ చేయాలి. టెన్షన్‌ను హ్యాండిల్ చేయాలి. అందులో రాణించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్ నిర్మాణంలో రాణిగా వెలుగుతున్నారు ఏక్తా కపూర్. సీరియల్స్, సినిమాలు, వెబ్ షోలు ఇలా ఎడతెరిపి లేకుండా కంటెంట్‌ని బుల్లితెరపై కురిపిస్తూ టెలివిజన్ క్వీన్‌గా ఉన్నారు ఏక్తా. బాలీవుడ్ నటుడు జితేంద్ర, శోభా కపూర్ కుమార్తె ఏక్తా కపూర్. 15 ఏళ్లకే దర్శకుడు కైలాష్ సురేంద్రనాథ్ దగ్గర చేరింది ఏక్తా. 1994లో తండ్రి ఇచ్చిన కొంత డబ్బును, తన ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ స్థాపించింది ఏక్తా. సీరియల్స్ మీద సీరియల్స్. ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి దిగింది. బాలాజీ టెలీ ఫిలింస్ ద్వారా దాదాపు 130 సీరియల్స్‌ను నిర్మించింది. అందులో కొన్ని సీరియల్స్ పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆమె నిర్మించినవాటిలో ‘హమ్ పాంచ్, కహానీ ఘర్ ఘర్ కీ, జోధా అక్బర్, నాగినీ, కుంకుమ్ భాగ్య, కుందలీ’ వంటి పాపులర్ టీవీ సీరియల్స్ కొన్ని. సినిమాలు స్టయిల్ వేరు, సీరియల్స్ స్టయిల్ వేరు. సీరియల్స్‌లో ఎప్పటికప్పుడు సరుకు తయారవుతూనే ఉండాలి. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ టెలివిజన్ అంటారు. 2017లో ఎల్టీ బాలాజీ డిజిటల్ యాప్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు సుమారు 40 షోలు అందించింది. ‘హమ్ పాంచ్’ సీరియల్ ద్వారా విద్యా బాలన్‌ను పరిచయం చేసింది ఏక్తా. టెలివిజన్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా ఎదిగింది ఏక్తా. 44 ఏళ్ల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి తల్లయ్యారు. – గౌతమ్ మల్లాది -
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ పద్మ విభూషణ్-7, పద్మభూషణ్-16, పద్మ శ్రీ- 118 ఇలా మొత్తంగా 141 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలు దక్కించుకున్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ.. సాంఘిక, ప్రజా వ్యవహారాలు, విజ్ఞానశాస్త్రం మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, ఔషధం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవా తదితర రంగాలలో ఈ అవార్డులు లభిస్తాయి. పద్మ విభూషణ్ అసాధారణమైన, ప్రత్యేకమైన సేవకు ప్రదానం చేస్తారు. పద్మభూషణ్ పండిత శ్రీకి, ఏ రంగంలో అయినా ప్రత్యేకమైన సేవ చేసిన వారికీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డులు ప్రకటించబడతాయి. బీజేపీ అగ్ర నేతలైన అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్.. మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్‌లకు ప్రజా వ్యవహారాలకు సంబంధించిన రంగంలో ఈ పురస్కారాలు దక్కాయి. విజయ సారథి శ్రీభాష్యం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. మరో నలుగురు తెలుగు వారిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి.. చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయం), కరీంనగర్ జిల్లా వాసి, ప్రముఖ సంస్కృత పండితులు, కవి, విమర్శకులు విజయసారథి శ్రీభాష్యం (విద్య). ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం), దలవాయి చలపతిరావు( కళారంగం). అదేవిధంగా ఈ ఏడాది వాణిజ్యం, పరిశ్రమలు విభాగంలో ఇద్దరికి పద్మభూషన్ పురస్కారాలు లభించాయి. అందులో ఆనంద్ మహీంద్రా (మహారాష్ట్ర), వేణు శ్రీనివాసన్ (తమిళనాడు). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రాష్ట్రపతిని ఆశీర్వదించిన పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క
-
‘పద్మశ్రీ’ హారిక
-
‘పద్మశ్రీ’ హారిక
అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్లుగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తోన్న ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కెరీర్లో మరో కలికితురాయి చేరింది. గ్రాండ్‌మాస్టర్ హారికకు కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. 70వ గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో శుక్రవారం కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మందికి ఈ అవార్డులు రాగా... ఉత్తరాఖండ్‌కు చెందిన పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్‌కు ‘పద్మభూషణ్’ దక్కింది. మిగతా ఎనిమిది మందిని ‘పద్మశ్రీ’ వరించింది. న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచంలో తమ ప్రతిభాపాటవాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా... క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్ 1984లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్ బజరంగ్ పూనియా... 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు గౌతమ్ గంభీర్... భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి... ‘ట్రిపుల్ ఒలింపియన్’ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్... భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్లకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడంలో 36 ఏళ్ల శరత్ కమల్ కీలకపాత్ర వహించాడు. 2016 కబడ్డీ ప్రపంచకప్ భారత్‌కు దక్కడంలో అజయ్ ఠాకూర్ ముఖ్యపాత్ర పోషించాడు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన సునీల్ చెత్రి జాతీయ పోటీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంచెలంచెలుగా... ఆరేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న హారిక ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు అంతర్జాతీయ చెస్‌లో మేటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–10 బాలికల విభాగంలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది. ఈ దశలో క్రీడా ప్రేమికులైన హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది. అనంతరం ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో రజత, కాంస్యాలు సాధించింది. 2006లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–18 విభాగంలో స్వర్ణం... 2008 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది. 28 ఏళ్ల హారిక ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న జిబ్రాల్టర్ అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటోంది. హారికకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆమె తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్రీడా పద్మాలు వీరే.. పద్మ భూషణ్: బచేంద్రీ పాల్ (ఉత్తరాఖండ్–పర్వతారోహణ) పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్–చెస్); బజరంగ్ పూనియా (హరియాణా–రెజ్లింగ్); సునీల్ చెత్రి (తెలంగాణ–ఫుట్‌బాల్) గంభీర్ (ఢిల్లీ–క్రికెట్); ఆచంట శరత్ కమల్ (తమిళనాడు–టేబుల్ టెన్నిస్); బొంబేలా దేవి (మణిపూర్–ఆర్చరీ); ప్రశాంతి సింగ్ (ఉత్తరప్రదేశ్–బాస్కెట్‌బాల్); అజయ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్–కబడ్డీ) -
విరబూసిన తెలుగు పద్మాలు
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఆరుగురు ఎంపిక ఏపీ నుంచి ఇద్దరికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు ఆరు, ఏపీకి రెండు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), బీవీఆర్ మోహన్‌రెడ్డి(వర్తకం, వాణిజ్యం), త్రిపురనేని హనుమాన్ చౌదరి(సివిల్ సర్వీస్), డాక్టర్ ఎక్కా యాదగిరిరావు(కళలు–శిల్పకళ), డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వహీద్, చంద్రకాంత్ పితావ(సైన్స్, ఇంజనీరింగ్) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి చింతకింది మల్లేశం(సైన్స్, ఇంజనీరింగ్), వి.కోటేశ్వరమ్మ ఎంపికయ్యారు. వీరిలో హనుమాన్ చౌదరి ఏపీకి, చింతకింది మల్లేశం తెలంగాణకు చెందినవారు. కేంద్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అచ్చు తప్పుల వల్ల హనుమాన్ చౌదరి తెలంగాణ, మల్లేశం ఏపీకి చెందిన వారని పొరపాటున వచ్చిందని సీఎం కార్యాలయం ఈ మేరకు తెలిపింది. విషయాన్ని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. వారంతా తమ రంగాల్లో విశేష ప్రతిభ చూపి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చేనేత ఆణిముత్యం.. మల్లేశం సాక్షి, యాదాద్రి: టై అండ్ డై చేనేత పరిశ్ర మలో కార్మికుల కష్టాలను తీర్చేం దుకు ఆసుయంత్రం రూపొందించిన చిం తకింది మల్లేశం స్వస్థలం యాదాద్రి భువ నగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట. 1972 మే 10న లక్ష్మి, లక్ష్మీనారాయణ దంపతుల కు జన్మించిన ఈయన పదో తరగతి వరకు చదివారు. తనకు పద్మశ్రీ రావడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. అవార్డును మహి ళా చేనేత కార్మికులకు అంకితం చేస్తున్నట్టు తెలి పారు. ‘‘నేను చేనేత కార్మికుడిగా పని చేస్తున్న ప్పుడు మా అమ్మ పట్టుచీరల తయారీకి ఆసుపై చిటికీ పోసేది. ఈ సమయంలో కొన్ని వందలసార్లు చెయ్యి వెనక్కి ముందుకు ఆడిస్తూ చిటికీ పోయ డం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఎంతో బాధపడేది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎలాగైనా ఈ కష్టాన్ని దూరం చేయాలన్న ఆలోచన కలిగింది. మా అమ్మలాంటి ఎందరో మహిళలు ఇబ్బందిని దూరం చేయాలన్న ఆలోచనతోనే ఆలోచించి రేయింబవళ్లు కష్టపడి ఆసుయంత్రాన్ని తయారు చేశా’’ అని ఆయన వివరించారు. యంత్రాన్ని తయారు చేసేందుకు ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు అంకితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత శిల్ప కళకు మొట్టమొదటిసారి సముచితమైన గౌరవం లభించింది. పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డును తెలంగాణ అమర వీరులకు అంకితం ఇస్తున్నాను. ఆధునిక శిల్ప రీతులకు పునాదులు వేసిన ఉస్మాన్ సిద్ధిఖి నా గురువు. ఆయన స్ఫూర్తితోనే నా శిల్పాల్లో భావరూపకల్పన కొనసాగించాను. నేను చెక్కిన మొట్టమొదటి శిల్పం ‘మిథుల’జాతీయ అవార్డులను అందుకుంది. ఆ తర్వాత శివరాంపల్లి పోలీసు అకాడమీలో ప్రతిష్టించిన శిల్పంలో పోలీసుల ‘దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు’ప్రతీకగా పద్మాన్ని, అభయహస్తాన్ని, ఉదయించే సూర్యుణ్ణి, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గదతో రూపొందించాను. ఆ తర్వాత లాల్‌దర్వాజ కూడలిలో ఏర్పాటు చేసిన నెహ్రూ శిల్పం, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల జ్ఞాపకార్ధం చెక్కిన స్థూపం నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పేరు: డాక్టర్ ఎక్కా యాదగిరిరావు స్వస్థలం: అలియాబాద్, హైదరాబాద్ పుట్టిన తేదీ: 21 జూలై, 1938 భార్య: శ్యామలాదేవి(చనిపోయారు) కొడుకులు: సంజయ్, విజయ్, కూతురు: సంధ్య ప్రస్తుత నివాసం: శారదానగర్, గుడి మల్కాపూర్ విద్యార్హత: ఫైన్ఆర్ట్స్లో డిప్లొమా మార్పే పురస్కారం తెచ్చింది.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన హనుమాన్ చౌదరి చిన్నతనంలోనే కమ్యునిజం భావాలకు ఆకర్షితులయ్యా రు. ఇది సరైన మార్గం కాదని ఆ తర్వాత దేశభక్తి మార్గంలో పయనించారు. దేవుని కంటే దేశాన్ని ప్రేమించాలని నమ్మారు. టెక్నాలజీలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తనకు పద్మశ్రీ పురస్కారం లభిచేందుకు దోహదపడిందని త్రిపురనేని చెప్పారు. తనకు అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పేరు: త్రిపురనేని హనుమాన్‌చౌదరి పుట్టిన తేదీ: 18 అక్టోబర్ 1931 స్వస్థలం: కృష్ణా జిల్లా అంగళూరు ప్రస్తుత నివాసం: సికింద్రాబాద్ ఖార్జానా, పీ అండ్ టీ కాలనీ భార్యపేరు: త్రిపురనేని మణి సంతానం: ప్రభాకర్ చౌదరి, మహీధర్ చౌదరి రచించిన పుస్తకాలు:20, వ్యాసాలు: 200 విద్యా ప్రదాతకు పద్మశ్రీ లబ్బీపేట (విజయవాడ): కృష్ణాజిల్లా గోసాలకు చెందిన కోనేరు వెంకయ్య, కోనేరు మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5వ తేదీన కోటేశ్వరమ్మ జన్మించారు. ఆంధ్రా వర్సిటీలో ఎంఏ తెలుగు, నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. 1955లో 20 మంది విద్యార్థులతో విజయవాడ బందరు రోడ్డు ఆలిండియా రేడియే స్టేషన్ ఎదుట బాలల పాఠశాల (మాంటిస్సోరి) ఏర్పాటు చేశారు. 1972లో మాంటిస్సోరి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల ప్రారంభించిన కోటేశ్వరమ్మ వెనుతిరిగి చూడలేదు. ఈమె భర్త వేగే వెంకట కృష్ణారావు, కుమార్తెలు డాక్టర్ ఎ.శశిబాల, షీలారంజని. కేంద్రం పద్మ పురస్కారం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అమె చెప్పారు. అణు పరికరాల్లో అందెవేసిన చేయి దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లకు అవసరమయ్యే కీలక పరికరాల తయారీలో చంద్రకాంత్ పితావా విశేష సేవలు అందించారు. గతంలో ముంబైలోని బాబా అటా మిక్ పరిశోధన కేంద్రం(బార్క్)లోని ఎలక్టాన్రిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి డైరెక్ట ర్గా పనిచేశారు. రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ ఈసీఐఎల్, బార్క్‌లో సేవలందిస్తున్నారు. తనకు పద్మశ్రీ రావడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. వాణిజ్య పద్మం బీవీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. భారత ఐటీ సేవల సంస్థల్లో టాప్–15లో సైయంట్ ఒకటి. ఫార్చూన్ 100 కంపెనీల కు కీలక ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీని ఈ స్థాయికి చేర్చడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 38 కేంద్రాల్లో 14,000 పైచిలుకు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. టర్నోవర్ రూ.3,500 కోట్లు. ప్రతిష్టాత్మక సంస్థ నాస్కాం చైర్మన్‌గానూ ఆయన పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ గౌరవ కాన్సుల్‌గా ఉన్నారు. జర్మనీ నుంచి భారత్‌లో ఈ గౌరవం దక్కిన రెండో భారతీయుడు మోహన్‌రెడ్డి కావడం విశేషం. హైదరాబాద్ ఏంజెల్స్ వ్యవస్థాపకులు కూడా ఈయనే. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి–హబ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ లీడర్షిప్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు మోహన్‌రెడ్డి. దేశంలో ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి పరిశ్రమ ఏర్పాటుకు అందించిన సేవలకు గుర్తింపు గా ప్రభుత్వం తనను పద్మ అవార్డుకు ఎంపిక చేసిందని ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థిరమైన అంతర్జాతీయ కంపెనీగా సైయంట్‌ను తీర్చిదిద్దిన తొలి తరం పారిశ్రామికవేత్తకు గుర్తింపు అని అన్నారు. యునానీ వైద్యానికి గౌరవం హైదరాబాద్‌లో వందల ఏళ్లుగా ప్రాచూర్యంలో ఉన్న యునానీ వైద్యానికి ఈ ఏడాది సముచితమైన గౌరవం లభించిందని యునానీ వైద్య రంగంలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహెద్ అన్నారు. తనకు పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పేరు: డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహేద్ పుట్టిన తేదీ: 22 ఫిబ్రవరి 1955 విద్యాభ్యాసం: 1978లో ఉస్మానియా నుంచి యూనానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు పూర్తి క్లీనికల్ రీసెర్చ్ చేసిన కేంద్రాలు: యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్, ఎయిమ్స్, కెమ్ మెడికల్ కాలేజీ హోదా: మాజీ డైరెక్టర్ సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్(హైదరాబాద్) సమర్పించిన పరిశోధన పత్రాలు: 33 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం. 64 సదస్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘వనజీవి’కి వందనం సాక్షి, ఖమ్మం: చిన్నతనంలో మాస్టారు ‘మొక్కల పెంపకం.. లాభాలు’ గురించి చెప్పారు. అదే ఆయనలో కోటికి పైగా మొక్కలు నాటిన సంకల్పానికి బీజం వేసిం ది. ఆయన అడుగు పెట్టిన చోటల్లా హరితవనమే అయింది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పలు ప్రాంతా లు తిరుగుతూ మొక్కలు నాటించడమే ఆయన ధ్యేయం. ‘వృక్షో రక్షతి.. రక్షితః’ అనే బోర్డులు తలకు పెట్టుకొని, చేత పట్టుకొని తాను మొక్కలు నాటుతూ ప్రచా రం చేస్తారు. ఇలా ఆయన 43 ఏళ్లుగా నాటిన మొక్కలు ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలో కోటికి పైగా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా పద్మశ్రీ(సామాజిక సేవ విభాగం) కూడా ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయనే ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపెల్లి రామయ్య. 75 ఏళ్ల వయసులోనూ భార్య జానకమ్మతో కలసి ఆయన హరితయజ్ఞం చేస్తూనే ఉన్నారు. రామయ్య స్వగ్రామం ముత్తగూడెం. పంట పొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో చిన్నప్పుడే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. రామయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ముత్తగూడెం పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం’ పాఠం రామయ్యను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పట్నుంచే మొక్కల నాటడాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వన రక్షణపై ఆయన ఇప్పటికి వెయ్యికి పైగా వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కారు. -
వైద్యులు గోఖలే, గోపీచంద్‌లకు పద్మశ్రీ!
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ మన్నం గోపీచంద్‌లకు కేంద్రప్రభుత్వం 2016 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు డాక్టర్ గోఖలేకి సమాచారం అందింది. వీరిద్దరు కార్డియో థోరాసిక్ సర్జన్లు(సీటీఎస్) కావడం విశేషం. కృష్ణాజిల్లాకు చెందిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే గుంటూరు వైద్యకళాశాలలో 1976లో వైద్యవిద్యను అభ్యసించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహించిన మొదటి వైద్య నిపుణుడు. నవ్యాంధ్రప్రదేశ్‌లో సైతం గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పేదరోగులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో 125 గుండె ఆపరేషన్లు చేసిన ఆయన త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ మన్నం గోపీచంద్ 1975లో గుంటూరు వైద్య కళాశాలలో ైవె ద్యవిద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్లో గుండె వైద్యనిపుణుడిగా పనిచేస్తున్నారు.