ఆర్టీసీ కార్మికులకు 4.9% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికులకు 4.9% డీఏ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి డీఏ బకాయిలను ఈ నెల జీతంతో, పెండింగ్‌లోని మూడున్నర నెలల బకాయిలను మార్చి జీతం తో కలిపి చెల్లించనున్నారు. ఈ నిర్ణయంపై ఏపీఎస్, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్లు, తెలంగాణ మజ్దూర్ ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్, కె.రాజిరెడ్డి, అశ్వత్థామరెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు ఆ కాలానికి స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా వర్తింపజేయాలని ఆర్టీసీ ఈయూ ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.