కల్లంత.. థ్రిల్లింత
దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కల్లు రుచి చూసి థ్రిల్ ఫీలయ్యారు. కొందరు ఆకు దోనెలో పోయించుకుని ‘సిప్’ చేస్తే.. ఇంకొందరు ఫ్యాషనబుల్‌గా గ్లాసుల్లో తీసుకుని టేస్ట్ చేశారు. తారామతి బారాదరిలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ నిర్వహించిన ఆర్ట్‌క్యాంప్ సోమవారం ముగిసింది. ఈ ప్రదర్శనలోని చిత్రాలను తిలకించేందుకు వచ్చిన మెట్రోపొలిస్ ప్రతినిధులు.. ఇక్కడ అందుబాటులో ఉంచిన ఈత, తాటి కల్లు రుచులను ఆస్వాదించారు.
- ఫొటో: సృజన్ పున్నా