శబరిమలలో భవన్‌కు కేరళ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ కేరళ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేరళ విద్యా మంత్రి పీకే అబ్దుల్ రబ్ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కేరళ టూరిజం, ప్రొహిబిషన్ విధానం, వరి, కొబ్బరి పంటలు, అక్షరాస్యత, కేరళలో ఈ-లిటరసీ విధానంపై చర్చించారు. కేరళలో అమలు చేస్తున్న పంచాయతీ వ్యవస్థ బాగుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేరళ విద్యా మంత్రికి సీఎం మెమొంటో బహూకరించారు. సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్, హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వేణుగోపాలాచారి, ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ, తెలుగు ప్రాంత మలయాళీ అసోసియేషన్ అధ్యక్షుడు లిబీ బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు.