poor patients
-
CM Jagan: జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, కర్నూల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకునే క్రమంలో.. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు ఆయన్ని కలిశారు. వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడారు. అయితే.. వాళ్లలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తూనే ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నలుగురికి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజనని ఆదేశించారు. ఆర్థిక సహాయంతో పాటు మెరుగైన వైద్య సహాయం అంద చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నలుగురు బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు ► కర్నూలు పట్టణం నరసింహారెడ్డి నగర్ కు చెందిన ఎస్.వెంకటేశ్వర గౌడ్, ఉషారాణి దంపతుల 7 నెలల కుమారుడు నివాన్ష్ స్పైనల్ మస్కులార్ డిజార్డర్ (ఎస్ఎమ్ఏ)తో బాధపడుతున్నాడని, వ్యాధి నివారణ కొరకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్థిక సాయం నిమిత్తం లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన టి.వెంకట రాముడు నాలుగు సంవత్సరాల నుంచి బ్రైన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్నాడని అతని కుమారుడు టి.హరికృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యల్ని విన్నవించుకోగా.. తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ వారికి లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన బి.రామ్ ప్రసాద్ ఆరు సంవత్సరాల నుంచి వెన్నపూస సమస్యతో బాధపడుతున్నాడు. అతని అన్న బి.కౌలుట్ల.. తన సమస్యను విన్నవించుకోగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ అతనికి లక్ష రూపాయలు చెక్ అంద చేశారు. ► తుగ్గలి మండలం, చెన్నంపల్లి గ్రామ నివాసి తన తండ్రి ఓ.వెంకటేశ్వర రెడ్డికి డయాలసిస్ చేయించడంతో పాటు అత్యవసరంగా కిడ్నీ అవసరం కావడంతో తన తల్లి కిడ్నీ ఇచ్చి 24వ తేదిన సర్జరీ చేయగా.. జులై 19వ తేది హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారని, అందుకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని మంజూరు చేసి సహాయం చేయాలని ఓ.జనార్ధన్ రెడ్డి.. సీఎం జదన్ ఎదుట సమస్యను విన్నవించుకోగా తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు చెక్కును కలెక్టర్ అందచేశారు. ఆర్థిక సహాయం అందచేసిన సందర్భంగా నలుగురు బాధితుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదీ చదవండి: సీమ నీటి కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్ -
నిరుపేదకు వైద్య నైవేద్యం
వ్యాధికి చికిత్స చేయడం సహజంగా జరిగేదే. వ్యాధి రాకుండా ‘అవగాహన వైద్యం’ అందించాలని తపన పడేవారు మాత్రం శ్రుతి లాంటి కొందరు వైద్యులు మాత్రమే. ‘‘వ్యాధుల బారిన పడినవారు డాక్టర్ల దగ్గరకు వస్తారు. కాని అలా రాలేని వారి దగ్గరకు, రావాలని తెలియని వారి దగ్గరకు వైద్యమే తరలివెళ్లాలి’’ అంటారు శ్రుతి. ఎంబీబీఎస్ పట్టా చేతికి అందగానే కోట్ల రూపాయల సంపాదనకు దాన్నొక మార్గంగా భావించడం సహజమైన ఈ రోజుల్లో... వైద్య విద్య అభ్యసించడానికి మాత్రమే కాదు, ఇప్పటికీ తన సొంత డబ్బునే వెచ్చిస్తూ... నిరుపేద రోగులకు ఆసరాగా నిలుస్తున్నారు యువ వైద్యురాలు. చిన్నతనంలో తానెదుర్కొన్న చేదు అనుభవాలే ప్రేరణగా... పల్లెలు, పేదల సేవ దిశగా మార్గ దర్శకత్వం చేస్తూ, నవతరం వైద్యులలో నిరుపేద రోగుల సేవా భావనకు కలిగిస్తూ అందిస్తున్నారు ‘యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకురాలు డాక్టర్ కె.ఎస్.ఎల్. శ్రుతి. ఇలా ఎంతోమంది వైద్యులకు సామాజిక స్పృహను కలిగిస్తున్న శ్రుతికి స్ఫూర్తిని ఇచ్చిన వారెవరన్న విషయమై ‘సాక్షి’ ఆమెతో సంభాషించారు. ఆ రెండు సంఘటనలు! ‘‘నాకు శ్రుతి అని పేరు పెట్టిన మా పిన్ని హేమ.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయింది. మా తాత లక్ష్మణరావు అల్సర్‌తో చనిపోయారు. జబ్బులపై సరైన అవగాహన ఉండి, సకాలంలో వైద్యం అంది ఉంటే వారిద్దరూ జీవించేవారు. ఎవరైనా చనిపోతే వారులేని లోటు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. చిన్నతనంలో నేను చూసిన తాత, పిన్ని మరణాలు నన్ను తీరని వేదనకు గురి చేశాయి. వైద్య వృత్తిని చేపట్టే విధంగా నన్ను ప్రేరేపించాయి. వారి మరణం కారణంగా బాల్యంలో నేను అనుభవించిన మానసిక క్షోభ మరెవరూ అనుభవించకూడదని భావించాను. జబ్బులు, వాటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వైద్య వృత్తినే ఓ ఆయుధంగా ఎంచుకున్నా. ఆ క్రమంలోనే మేము కొందరం 2012లో యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశాం. అప్పట్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పాకెట్ మనీ కోసం ఇంటి నుంచి పంపిన డబ్బులను హెల్త్ క్యాంపులకు ఖర్చు చేసేవాళ్లం. తర్వాత కొంతకాలానికే మాకు మరో 300 మంది సభ్యులు జత కలిశారు. ఎంతో కొంత ఇచ్చేయాలని ‘ఊరు నుంచి చాలా తీసుకున్నాం. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం..’ శ్రీమంతుడు సినిమాలో ఓ డైలాగ్. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు గొప్ప సందేశం కూడా. ఇదే స్ఫూర్తితో బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాం. ఇల్లిల్లూ తిరిగి అక్కడ 2,500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించాం. చికిత్సలు చేసి జబ్బుల బారి నుంచి విముక్తి కల్పించాం. ఇలా ఇప్పటి వరకు విజయవాడ, సమీప గ్రామాల్లో వందకుపైగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి 15 వేల మందికిపైగా స్కీనింగ్ నిర్వహించాం. 2,000 మందికిపైగా జబ్బులు ఉన్నట్లు గుర్తించి, వారిని సమీప ఆస్పత్రులకు రిఫర్ చేశాం. సర్జరీలు, చికిత్సల తర్వాత కూడా రెగ్యులర్ చెకప్‌లు చేయిస్తున్నాం. చిన్నపనులే పెద్దమనసుతో.. శ్రుతి సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సొంతూరు మచిలిపట్నమే అయినప్పటికీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. తండ్రి శేఖర్ బిజినెస్‌మ్యాన్. తల్లి జయలలిత సాధారణ గృహిణి. టెన్త్ వరకు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలులో చదివి రంగారెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత బాచుపల్లిలోని చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. ఆ తర్వాత ఎంసెట్‌లో ర్యాంకు రావడంతో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్లో చేరారు. పలు అంశాల్లో గోల్డ్‌మెడల్స్ కూడా సాధించారు. ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ‘పెద్దపనులు అందరం చేయలేం కానీ చిన్న పనులు పెద్ద మనసుతో చేయగలం’ అని మదర్‌థెరిసా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు శృతి. పుట్టిన మచిలీపట్నానికీ, పెరిగిన హైదరాబాద్‌కూ, చదివిన విజయవాడకే కాకుండా రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో పేదలకు వైద్యపరంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం గుర్తించిన ‘హైరిస్క్’ బస్తీల్లోని నిరుపేదలకు సేవలందించాలన్న సంకల్పంతో ఉన్నారు. – శ్రీశైలం నోముల, ‘సాక్షి’ ప్రతినిధి, హైదరాబాద్ -
ఉన్నవి ఇవ్వరు.. లేనివి కొనరు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు పడకేశాయి. ప్రభుత్వం కొత్త మందులు కొనకపోగా.. స్టోర్‌లో ఉన్న మందులూ ఇవ్వడంలేదు. మరోవైపు రూ.కోట్లాది విలువై న మందులు కాలం చెల్లి వృథాగా మారుతున్నా పట్టించు కోవడంలేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులనుంచి డబ్బులిస్తామన్నా మందులు సరఫరా చేయడంలేదు. తాజాగా అత్యంత ప్రధానమైన 170 రకాల మందులను ఆఫ్‌లైన్ చేయడంతో సమస్య తీవ్రమైంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా మందులకు నిధుల వినియోగం తగ్గించేందుకు సర్కారు తీసుకుంటున్న చర్య లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ మందుల కోసం అల్లాడుతున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా పేదరోగుల మందుల పంపిణీ వ్యవస్థ దారుణంగా తయారైంది. కాలం చెల్లిన రూ.20 కోట్ల మందులు ఇటీవల ఏ ఆస్పత్రికి మందులు కావాలన్నా ఆన్లైన్లో ఇండెంట్ (కావాల్సిన సరుకు) పెట్టాల్సి ఉంటుంది. ఇందులో అనుమతి లభించాకే సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రేటు కాంట్రాక్టు ప్రకారం 270 రకాలకు పైగా మందులు ఆన్లైన్లో ఉంటాయి. అయితే ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు... ఆన్లైన్లో ఉన్న మందులో 170 రకాల మందులను ఆఫ్‌లైన్‌లో పెట్టారు. అంటే ఆ మందులు ఆన్లైన్లో కనిపించకుండా బ్లాక్ చేసేశారు. మరోవైపు జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లలో మందులున్నా ఇవ్వకపోవడంతో అవి ఎక్స్పైరీ అయిపోయాయి. వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. శస్త్రచికిత్సల సమయంలో వాడే ఇంజక్షన్లు, ఎక్స్‌రే ఫిల్ములు... ఆఖరుకు నీటిలో వేసే క్లోరిన్ టాబ్లెట్స్ కూడా ఎక్స్పైరీ అయ్యాయంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. డబ్బులిస్తామన్నా కొనడం లేదు ఆఫ్‌లైన్ మందులు ఏ ఆస్పత్రికి ఇవ్వలేమని, వాళ్లకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఎప్పుడో అయిపోయిందని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రధానంగా బోధనాసుపత్రుల్లో తీవ్రమైన పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని బోధనాసుపత్రులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో డబ్బుంది. ఆ డబ్బులిస్తాం మాకు కావాల్సిన మందులివ్వండని లేఖలు రాసినా స్పందించడంలేదు. తాజాగా విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రిలో మందులు లేక, రోగులు అల్లాడుతూంటే ఆస్పత్రి సూపరింటెండెంట్ తమ వద్ద రూ.3 కోట్ల నిధులున్నాయని, తమకు కావాల్సిన మందులు కొనుగోలు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. మీ దగ్గర డబ్బులుంటే మా దగ్గర మందులుండాలి కదా అన్న సమాధానం రావడంతో ఆయన అవాక్కయ్యారు. చేతులెత్తేసిన ఈ–ఔషధి, కోల్డ్‌చైన్ నిర్వాహకులు రాష్ట్రంలో గత ఏడాదిన్నర క్రితం ఈ–ఔషధి విధానం అమల్లోకి తెచ్చారు. పూర్తిగా ఆన్లైన్ ద్వారా మందుల పంపకం చేస్తారు. ఈ విధానాన్ని నిర్వహణకోసం ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చారు. దీంతో పాటు కోల్డ్ చైన్ (కొన్ని ఇంజక్షన్లు, మందులు, వ్యాక్సిన్లు) కూలింగ్‌లో ఉంచాలి. ఈ నిర్వహణను మరో సంస్థకు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో ఆ రెండూ సంస్థలు చేతులెత్తేశాయి. ఈ–ఔషధిలో భాగంగా ఆన్‌లైన్‌లోకి వెళితే అసలు సర్వర్లే పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక కోల్డ్‌చైన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాక్సిన్లు, కొన్ని రకాల ఇంజక్షన్లు పాడైపోతున్నాయని సీడీఎస్‌లలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌లు చెబుతున్నారు. ఉన్న మందులన్నీ ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి కుదరదు ప్రస్తుతం మందుల కొనుగోలుకు సంబంధించిన టెండరు ప్రాసెస్‌లో ఉంది. కాబట్టి ఉన్నవన్నీ వాడేయకుండా 170 రకాల మందులు ఆఫ్‌లైన్ పెట్టాం. ఒకవేళ బోధనాసుపత్రుల దగ్గర డబ్బులున్నా మా దగ్గర సరుకుండాలి కదా. ఉన్నవాటిని కొద్ది కొద్దిగా సర్దుతాం. ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి కుదరదు. టెండరు పూర్తయి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఆఫ్‌లైన్ నిబంధన తీసేస్తాం. –గుప్తా, జనరల్ మేనేజర్, ఏపీఎంఎస్ఐడీసీ మాకు కావాల్సిన మందులు కనిపించడం లేదు మూడవ త్రైమాసికానికి సంబంధించి 22 రకాల మందులు లేవు. ఆన్లైన్లో చూస్తే ఆ మందులే కనిపించడం లేదని గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ 2017 అక్టోబర్ 10న వైద్య విద్యా సంచాలకులకు లేఖ రాశారు. తమకు కావాల్సిన మందులతో పాటు శస్త్రచికిత్సలకు అవసరమైనవి కూడా ఆన్లైన్లో తీసుకోవాలంటే ఆ జాబితానే కనిపించడం లేదని, అత్యవసర మందులు లేకపోవడంతో ఇన్‌పేషెంట్లతో పాటు ఔట్పేషెంట్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించాలని వైద్యవిద్యా సంచాలకులను కోరినా ఇప్పటికీ స్పందన లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
గాల్లో దీపం.. గ్రామీణ వైద్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు వైద్యుల కొరతతో అలంకారప్రాయంగా మిగిలాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తే సుమారు వంద ఆస్పత్రుల్లో వైద్యులు లేరని తేలింది. జాతీయ ఆరోగ్య మిషన్ మన రాష్ట్రానికి ఏటా రూ.1,100 కోట్ల వరకు నిధులిస్తున్నా కూడా.. ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదు. అయితే కార్పొరేటీకరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదని తెలిసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏలూరు, విజయనగరం, ప్రొద్దుటూరు ఆస్పత్రులను కూడా ప్రైవేటుకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈవిధంగా ప్రతీ సేవను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న రాష్ట్ర సర్కార్.. ఈ క్రమంలోనే వైద్యుల నియామకంపై తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై గ్రామీణ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నియామకానికి ససేమిరా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో వేలాది వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పీజీ డిప్లొమా చదివిన వారు ఉంటే సరిపోతుంది. అదే బోధనాస్పత్రుల్లో అయితే పీజీ వైద్యులు కావాలి. కానీ పీజీ డిప్లొమా చదివిన వారిని రెగ్యులర్‌గా నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. కాంట్రాక్టు పద్ధతికి మొగ్గుచూపుతుండటంతో వైద్యులు వెనుకడుగు వేస్తున్నారు. నేరుగా నియమిస్తామని కొన్నిరోజులు, ఏపీపీఎస్సీకి సూచించామని మరికొన్ని రోజులు చెప్పిన సర్కారు ఇప్పటివరకూ ఒక్క వైద్యుడినీ నియమించలేకపోయింది. పేదలకు వైద్య సేవలు అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే కొత్తగా వైద్యుల్ని నియమించడం లేదని వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. ప్రసవానికి నరకయాతన గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవం చేయడం సామాజిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ప్రసూతి వైద్యురాలు, చిన్నపిల్లల వైద్యులు, మత్తు వైద్యులు ప్రతి కేంద్రంలోనూ ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 190 సామాజిక ఆరోగ్య కేంద్రాలుంటే వందకుపైగా ఆస్పత్రులు వైద్యుల కొరత ఎదుర్కొంటున్నాయి. శస్త్రచికిత్స అవసరమైతే కాన్పు చేయకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీలో ‘రిఫరల్’ దందా!
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూలీ పని చేసే నారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న ధీమాతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిర్వాహకులు ఆస్పత్రిలో చేర్చుకున్నా సాధారణ చికిత్స చేసి.. వైద్యం మాత్రం మొదలుపెట్టలేదు. ఒక రోజు గడిచాక ఇదేమిటని నిలదీస్తే.. స్పెషలిస్ట్ డాక్టర్ రావాలని, మెల్లగా నయం చేస్తామని, కావాలంటే మరో ఆస్పత్రికి వెళ్లిపోవచ్చని సలహా ఇచ్చారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. గోదావరిఖనికి చెందిన రాజేందర్ చిరు వ్యాపారి. కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారో గ్యానికి గురికావడంతో కరీంనగర్లో ఆరోగ్యశ్రీ సదుపాయమున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులైనా నిపుణులు రావడం లేదు. వైద్యం మొదలుకాలేదు. ఇదేమిటని నిలదీస్తే తగిన సదుపాయాలు లేవంటూ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగు ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరుకు పెద్దసంఖ్యలో ఆస్పత్రులు ఆరోగ్య శ్రీలో ఉన్నా.. చాలా వాటిలో సరైన వైద్య సౌకర్యాలుగానీ, వైద్య నిపుణులుగానీ ఉం డడం లేదు. వాటిల్లో చేరిన రోగులకు తగిన వైద్యం అందడం లేదు. సదుపాయాలు, నిపుణులు లేకున్నా.. ఈ ఆస్పత్రులు ఆరో గ్యశ్రీలో రిజిస్టర్ చేసుకుంటున్నాయి. రోగు లను చేర్చుకుని, కొంత కాలయాపన చేసి.. చివరికి కేస్ షీట్లతో సహా కార్పొరేట్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నాయి. తద్వారా కార్పొ రేట్ ఆస్పత్రుల నుంచి కమీషన్లు పొందు తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల తీరు వల్ల కొన్నిసార్లు రోగుల పరిస్థితి విషమిస్తోంది. కచ్చితమైన ఆదాయం మరి! రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద ఏటా సగటున రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు సహా మొత్తం 949 రకాల చికిత్సలను ఉచితంగా అంది స్తున్నారు. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నారు. వారికి వైద్యం అందించిన ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతోంది. అయితే చాలా ఆస్పత్రులకు వచ్చే రోగుల కంటే ఆరోగ్యశ్రీ కింద చేరే వారి సంఖ్యే ఎక్కువ. పూర్తిస్థాయి వైద్యం అందించేవి తక్కువే తమ వద్ద ఆ రోగి చికిత్సకు అవసరమైన సదు పాయాలు లేవంటూ తమతో ఒప్పంద మున్న కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాయి. అత్యవసర కేసులు వచ్చినా చేర్చుకుని.. కొంత సేపటి తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులకు పంపు తున్నాయి. చికిత్స అనంతరం ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే సొమ్ము లోంచి పది, 15 శాతం కమీషన్‌గా తీసుకుని... మిగతా సొమ్మును చికిత్స చేసిన ఆస్పత్రికి అందజేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఎంత ఎక్కువ మంది రోగులను రిఫర్ చేస్తే కమీషన్ అంత ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఒప్పందాల కిందే.. తఇటీవల అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సాదా సీదా సౌకర్యాలతో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ విభాగాలు నెలకొల్పి చికిత్స అందిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేరుగా రోగులు రావడం కష్టమని భావించి.. అదే పనిగా ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రోగులను ఆకర్షించి కార్పొరేట్లకు తరలిస్తున్నాయి. పేదలను ఆదుకునే బృహత్తర లక్ష్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట ఉమ్మడి ఏపీ పరిధిలోని మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి... 2008 ఏప్రిల్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. మొదట్లో 163 రకాల చికిత్సలు అందించేవారు. తర్వాత పెంచు కుంటూ వెళ్లారు. ప్రస్తుతం 949 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు ఆరోగ్యశ్రీ సేవల జాబితాలో ఆస్పత్రులను చేర్చేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించింది. కానీ అవన్నీ కాగి తాలకే పరిమితమవుతున్నాయి. ఆస్పత్రులకు ప్రధానంగా అవసరమైన ప్రత్యేక వైద్యులు, పరీక్ష కేంద్రాలు, కనీస పారిశుధ్యం వంటివి లేకున్నా అధికారులు ఆరోగ్యశ్రీలో చోటు కల్పిస్తున్నారు. పరిమితికి మంచి పడకల సంఖ్య ఉన్నా, వీల్‌చైర్ తీసుకెళ్లే దారి లేకున్నా, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ ఏర్పాటు చేయకున్నా అనుమతులు ఇస్తుండడం గమ నార్హం. అంతేకాదు రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లోనూ తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టే అక్రమాల పుట్ట! ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు, అర్హతలేని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో చేర్చడంలో అధికారుల పాత్ర కీలకంగా ఉంది. కొందరు అధికారులు సొంత లాభమే చూసుకుని.. కనీస వసతులు, ప్రమాణాలు కూడా దిక్కులేని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో చేరేందుకు సహకరిస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా పెరుగుతున్నా.. వాసి మాత్రం ఉండడం లేదు. దీంతో అలాంటి ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న పేదలు తగిన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. దీనిపై ఇటీవల ఫిర్యాదులు కూడా పెరిగాయి. పేద రోగులకు వైద్యం అందడంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు వ్యవహారం ఇలా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రెగ్యులర్ పర్యవేక్షణాధికారి లేకపోవడం గమనార్హం. నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌గా పనిచేసే అధికారికే ట్రస్టు బాధ్యతలను అదనంగా అప్పగించారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వహణ అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు.. ఏడాది కేసులు ఖర్చు (రూ.) 2014–15 1,96,866 519,40,87,639 2015–16 2,60,543 684,67,77,428 2016–17 2,77,199 714,57,77,428 2017–18 1,83,108 459,67,79,239 (2017 అక్టోబర్ 31 వరకు) -
ఎవరి నిర్లక్ష్యమిది!
సర్కారీ ఆసుపత్రుల అధ్వాన్న స్థితిగతుల గురించి, అక్కడ పేద రోగులకు ఎదుర వుతున్న సమస్యల గురించి... అవి ప్రాణాపాయానికి దారితీస్తున్న తీరు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఉన్నతశ్రేణి ఆసుపత్రిగా పేరున్న సరోజినీదేవి కంటి ఆస్పత్రి సైతం అందుకు భిన్నంగా లేదని మరోసారి రుజువైంది. కంటి శుక్లాలకు చికిత్స చేయించుకుందామని వెళ్లిన 13మందికి ఇన్ఫెక్షన్ సోకగా... వారిలో ఏడుగురికి ఏకంగా చూపే కరువైందని బుధవారం వెల్లడైన వైనం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ మాదిరి ఘటన చోటు చేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఇదే ఆసుపత్రిలో ఆరేళ్లక్రితం కంటి శుక్లాల ఆపరేషన్లు జరిగిన ఏడుగురు కంటిచూపు కోల్పోయారు. తాజా ఉదంతంలో తమ తప్పేమీ లేదని, శస్త్ర చికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించిన సెలైన్ బాటిళ్లలో క్లెబ్సియల్లా బాక్టీరియా ఉండటమే ఇందుకు కారణమని వైద్యులు సంజాయిషీ ఇస్తున్నారు. అటు వాటిని ఉత్పత్తి చేసిన సంస్థ, ఆ బాటిళ్లను కొనుగోలు చేసి ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సైతం ఇలాగే చెబుతున్నాయి. అసలు ఇప్పుడు వెల్లడైన 13 కేసుల్లోనే ఇలా జరిగిందా...లేక అదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఇతరుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు తలెత్తాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఈ ఆసుపత్రికి వచ్చేవారిలో సాధారణంగా ఎక్కువమంది మారుమూల గ్రామాలనుంచి వచ్చే నిరుపేదలు, దిగువ మధ్య తరగతివారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికెళ్లాక సమస్యలేమైనా తలెత్తితే మళ్లీ హైదరాబాద్ నగరం రావడమన్నది వారికి కష్టం. లోపం తలెత్తితే తాము మందులు సరిగా వాడనందువల్ల జరిగిందనుకుంటారు. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉంటారు. ఇటు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేసే అరకొర వివరాలు ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఏమేరకు ఉపయోగపడతాయో చెప్పలేం. సరోజినీదేవి కంటి ఆసుపత్రి దేశంలోనే పేరెన్నికగన్నది. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ కంటి వైద్యంలో అగ్రశ్రేణి సంస్థ. ఆ రంగంలో నిష్ణాతులుగా ఖ్యాతి పొందిన డాక్టర్ శివారెడ్డి వంటివారు దానికి నేతృత్వంవహించారు. అక్కడ ఏటా వేల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అలాంటిచోట ఈ మాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం ఆ సంస్థకు మాత్రమే కాదు... ప్రభుత్వానికి కూడా తలవంపులు తెచ్చేదే. ఇప్పుడు ఇన్ఫెక్షన్కు కారణమైన క్లెబ్సియెల్లా బాక్టీరియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నట్టు సెలైన్ బాటిళ్ల ద్వారానే సోకిందా లేక ఇతరేతర మార్గాల ద్వారా రోగులకు సోకిందా అన్నది స్పష్టంగా చెప్పలేమని నిపుణులంటున్న మాట. దేనికీ లొంగని ‘సూపర్‌బగ్’గా గుర్తించిన ఈ బాక్టీరియా దాదాపు అన్ని ఆసుపత్రులలోనూ ఉంటుందని, దీనివల్ల రోగులకు కంటి ఇన్ఫెక్షన్లే కాక ఊపిరితిత్తులు, మెదడు తదితర భాగాలకు కూడా ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని వారంటున్నారు. ఈ బాక్టీరియాపై సాధారణ యాంటీబయా టిక్స్ కూడా పనిచేయవని చెబుతున్నారు. ఇప్పుడు వెల్లడైన ఉదంతంతోపాటే తమ తప్పేమీలేదని వెను వెంటనే ప్రకటించుకున్న ఆసుపత్రి బాధ్యులు ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లక్రితం ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్సలో ఉపయోగించే ఉపకరణాలను తగిన రీతిలో పరిశుభ్రం చేయకపోవడంవల్ల ముగ్గురికి ఇన్ఫెక్షన్ సోకి చూపు కోల్పోయారని ఒక విచారణలో తేల్చారు. అందుకు కారకుడని తేల్చిన వార్డ్ బాయ్ క్షయరోగి అని కూడా అనంతరకాలంలో బయటపడింది. ఒక ఆసుపత్రిలో ఈ పరిస్థితి తలెత్తడమే ఆశ్చర్యకరంకాగా ఆ తదనంతరమైనా అలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారన్నది ప్రస్తుత ఉదంతం నేపథ్యంలో సమీక్షించు కోవాలి. ఆసుపత్రి ప్రాంగణంతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహించే గదుల్లో గోడలు, ఫ్లోరింగ్ మొదలుకొని ట్రాలీలు, మైక్రోస్కోప్ లువంటి ఇతరత్రా ఉపకరణాలు సైతం లోపరహితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక సీసాలోని ద్రావణాన్ని పలుమార్లు తీయడం, వేర్వేరు రోగులకు ఉపయోగించడం లాంటి అలవాట్లవల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు. వీటన్నిటి విషయంలో ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూసే నిరంతర నిఘా వ్యవస్థ మన దగ్గర లేదు. ఫిర్యాదు లొచ్చిన సందర్భాల్లోనే తనిఖీలుంటున్నాయి తప్ప ఎప్పటికప్పుడు దాన్ని చూసేవారు ఉండటం లేదు. సరోజినీదేవి ఆసుపత్రి ఉదంతం వెల్లడయ్యాక గురువారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిపిన తనిఖీలో 29,000 కల్తీ సెలైన్ బాటిళ్లు, కల్తీ ఇంజక్షన్లు బయటపడ్డాయి. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే ఔషధాల్లో నాణ్యత సరిగా ఉండటం లేదన్న ఫిర్యాదులు ఈనాటివి కాదు. అడిగేవారు లేరన్న ధైర్యంతోనే ఇలా జరుగుతున్నదని నిపుణులంటున్నారు. సగటున భారత్‌లో లభించే ఏడు ఔషధాల్లో ఒకటి కల్తీదేనని రెండు అంతర్జాతీయ జర్నల్స్ వెల్లడిం చాయి. మార్కెట్లో చలామణిలో ఉన్న ఔషధాల్లో 4.5 శాతం నాసిరకమైనవని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఆమధ్య తెలియజేసింది. ఇందులో సింహభాగం ప్రభుత్వాసు పత్రులకు చేరుతున్నాయన్న విషయంలో ఎవరికీ అనుమానం అక్కరలేదు. ఎందుకంటే ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందులైనా, ఇతర ఉపకరణాలైనా కొనుగోలు చేసే బాధ్యతను చూసే సంస్థల్లో వైద్యులకు లేదా ఆసుపత్రుల సూప రింటెండెంట్లకు చోటుండటం లేదు. ఆ సంస్థల్లో ఇంజనీర్ల పెత్తనం నడుస్తున్నదని చెబుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణా అంతే. కాంట్రాక్టుకిచ్చి చేతులు దులుపు కుంటున్నారు. ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్థ పరిస్థితులే రోగుల ప్రాణాలు తీస్తు న్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులు కలగజేస్తున్నాయి. ఎలుకలు కొరికి, చీమలు కుట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎవరూ మరిచిపోలేదు. సరోజినీ దేవి ఆసుపత్రి ఉదంతంతోనైనా ప్రభుత్వాలు మేల్కొని దీన్నంతటినీ సరిచేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. -
మీ బడ్జెట్ లేదు... మందులకు రాకండి
సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో మందులు ఇచ్చేందుకు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు మళ్లీ ఆపదొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మందులు లేక నానా అవస్థలు పడుతున్నారు. అత్యవసర మందులకూ దిక్కులేకుండా పోయింది. మరోవైపు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలతో అల్లాడుతున్నా మందులిచ్చే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందులున్నా రిక్తహస్తాలతో... రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో మందులు ఉన్నాయి. కానీ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ తీసుకుని వస్తే మాత్రం ‘మీకు కేటాయించిన బడ్జెట్ మొదటి క్వార్టర్, రెండో క్వార్టర్లో అయిపోయిం ది. అదనంగా బడ్జెట్ తెచ్చుకోండి ఇస్తాం. ఇలా పదే పదే ఇక్కడకు రాకండి’ అని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సీడీఎస్‌లకు వచ్చిన వారు రిక్తహస్తాలతో వెనుదిరిగి పోతున్నారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆదేశాల మేరకే బడ్జెట్ ఇస్తామని సీడీఎస్‌లలో ఫార్మసిస్ట్‌లు నిక్కచ్చిగా చెబుతున్నారు. వాస్తవానికి అత్యవసర మందుల కొనుగోలుకు బోధనాసుపత్రులకు 20 శాతం, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 15 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10 శాతం ఇస్తారు. ఈ నిధులు ఎప్పుడో అయిపోయాయి. మిగతా మందులకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఇచ్చే మందుల మీదే ఆధారపడాలి. కానీ అక్కడ మీ బడ్జెట్ అయిపోయిందని చెబుతున్నారు. ఇలాగైతే సరఫరా చేయలేం ఓవైపు బంగారు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెబుతూనే మందులు పంపిణీ చేసిన సరఫరాదార్లకు ఆరు నెలలైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో వచ్చే త్రైమాసికంలో తాము మందులు సరఫరా చేయలేమని చెబుతున్నారు. అసలే వర్షాకాలంలో మందుల నిల్వలు ఉంచుకోవాల్సిన తరుణంలో ఇలాంటి పరిస్థితి ఊహించలేం. దీనిపై టీఎస్ఎంఎస్ఐడీసీ దృష్టి సారించాల్సి ఉంది. మందులు లేక ఇబ్బందులు పడుతున్నాం.. ‘సార్...మాకు ఇచ్చే 15 శాతం కొనుగోళ్ల డబ్బు కూడా మీకే చెక్కు రూపంలో ఇస్తాం. మేము స్థానికంగా కొంటే ఎక్కువ రేటు చెబుతారు. అది కూడా మీరే కొనివ్వండి. మా రోగులకు మందుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ నాలుగు రోజుల కిందట నాంపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.. టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డెరైక్టర్ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రి పరిస్థితే ఇలా ఉంటే జిల్లాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. -
‘ఐసీయూ’లో ఆస్పత్రులు
తక్షణ వైద్య సదుపాయం లేక అల్లాడుతున్న రోగులు వెంటిలేటర్లు అందించాలని ప్రభుత్వానికి వైద్యవిద్యా శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యానికి గురై విషమ స్థితిలో ఉన్న రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరుస్తారు. రాష్ట్రంలో మాత్రం జబ్బుపడ్డ వారు కాకుండా ఆస్పత్రులే వసతులు లేక ఐసీయూకి తరలించే స్థితికి చేరుకున్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా వెంటిలేటర్ల కొరతతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూల కోసం కేంద్రం నిధులు తీసుకొచ్చైనా ఏర్పాట్లు చేయాలని వైద్యవిద్యాశాఖ సంచాలకులు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. 2014-15కి కేంద్రం ఇప్పటికే రూ.46 కోట్లు కేటాయించిందని, అదనపు నిధుల కింద కనీసం మరో రూ.20 కోట్లు ఇవ్వాలని కోరారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల పరిస్థితి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో దారుణంగా ఉందని నివేదించారు. చావుబతుకుల్లో 20 శాతం రోగులు చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న సుమారు 20 శాతం మంది పేద రోగులకు తక్షణం వైద్యం చేయాలంటే ఐసీయూలు పనిచేయాల్సిన అవసరముందని వైద్యవిద్యాశాఖ లేఖలో పేర్కొంది. గుండె జబ్బులు, కిడ్నీ బాధితులు, తీవ్ర జ్వరాలు, ప్రమాద బాధితులు వీరిలో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు, రెండు జిల్లా ఆస్పత్రులతో కలిపి 13 ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేర్‌కు సంబంధించిన వైద్య పరికరాలు అందచేయాలని కోరింది. దీనికి కనీసం రూ.20 కోట్లు పైనే అవుతుందని అంచనా వేశారు. ఒక్కో ఆస్పత్రికి మల్టీచానల్ మానిటర్లు 3, ఐసీయూ పడకలు 30, ఇన్ఫ్యూజన్ పంపులు 60, వెంటిలేటర్లు 5 చొప్పున ఏర్పాటు చేయాలని సూచించింది. ఈఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకూ బోధనాసుపత్రులకు బడ్జెట్లో 45 శాతం నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
పేద రోగులపై చిత్తశుద్ధి ఉందా?
కర్నూలు(హాస్పిటల్) : పేద రోగుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జూనియర్ వైద్యులతో చర్చలు జరపాలని జూడాల సంఘం నేతలు నాగరాజు, ఆదిత్య, వినయ్, మౌనిక, వంశీవిహార్ తదితరులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏడవ రోజు హౌస్సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్ స్పెషలిస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి 107 జీవోతో శవయాత్ర నిర్వహించారు. ఈ శవయాత్ర గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, సర్జరీ విభాగం, సెంట్రల్ ల్యాబ్ మీదుగా క్యాజువాలిటీ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జూడా నేతలు మాట్లాడుతూ వైద్య వృత్తి పట్ల ఎంతో ఆసక్తితో వస్తే, ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. మూడు నెలలుగా తమ సమస్యను విన్నవిస్తున్నా పరిష్కరించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు హైకోర్టు స్పష్టంగా చెబుతున్నా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవడం లేదని పేర్కొన్నారు. -
సమస్యలు తీరేనా?
జిల్లాలోని పేద రోగులకు అనంతపురం సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారు ఈ ఆస్పత్రినే నమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది మంది ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. సిబ్బంది, పడకల కొరత, కరెటు కష్టాలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. చాలా సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశాల్లో చర్చించడం మినహా శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన జరిగే సమావేశంలోనైనా తగిన పరిష్కారం లభిస్తుందేమోనని ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ సమావేశం కోసం పది అంశాలతో అజెండా సిద్ధం చేశారు. కనీసం మూడింటిని నెరవేర్చినా కాస్త ఊరట లభిస్తుందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. కలగా 124 జీఓ నాలుగేళ్ల క్రితం 124 జీఓ విడుదలైంది. అప్పటి నుంచి జీఓ ఆచరణ అంగులం కూడా ముందుకు కదల్లేదు. ఆస్పత్రిలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు జీఓ అమలుతో తీరుతాయని యాజమాన్యం గొంతెత్తి చెబుతున్నా...పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అమలు జరిగితే సిబ్బంది కొరత తీరి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులోని 510 పోస్టుల్లో 134 స్టాఫ్‌నర్సు పోస్టులుకాగా, మిగితావి పారామెడికల్ పోస్టులు. ఈ పోస్టుల భర్తీ జరిగితే పేద ప్రజలకు వైద్యం ఆలస్యం కాదు. అటువంటిది ఈ జీఓ కలగానే మిగులుతోంది. కరెంటు కష్టాలు.. ఇటీవల ఆస్పత్రిని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్యలతో రోగులు అల్లాడిపోతున్నారు. వెంటిలేటర్లపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అంతా ఇంతా కాదు. కరెంటు తరచూ షార్ట సర్క్యూట్ గురికావడంతో ఏకంగా ఆర్థో ఓటీ థియేటర్‌నే మూసేశారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కాలిపోయింది. ఫలితంగా గైనిక్, చిన్నపిల్లల విభాగం, రేడియాలజీ విభాగంలో కరెంటు లేకుండా పోయింది. కరెంటు సరఫరాకి ఆటంకం కల్గకుండా శాశ్వత పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారు. షాట్ సర్క్యూట్‌తో రోగులు ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు. దీనిని ఏవిధంగా గట్టెక్కుతారో చూడాలి. మరమ్మతుకి నోచుకోని టాయిలెట్స్ ఆస్పత్రిలోని నాలుగు వార్డులలో టాయిలెట్స్ మరమ్మతుకు నోచుకోవడం లేదు. 23 మరుగుదొడ్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. దీంతో వాటికి తాళం వేశారు. రోగులు, వారి సహాయకులు సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రికి అధిక సంఖ్యలో పేద వారే వస్తుంటారు. అటువంటిది వారికి కనీస సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. స్వచ్చభారత్ పేరిటి అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ, ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. 500 పడకలు 700 రోగులు ఆస్పత్రిని ప్రధానంగా పీడిస్తున్న సమస్యల్లో పడకల కొరత ఒకటి. 500 పడకల సామర్థ్యం కల్గిన ఆస్పత్రిలో 700 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. వీరికి అడ్మిషన్ ఇస్తున్నారు కానీ మంచాలు మాత్రం చూపడం లేదు. దీంతో చాలా మంది రోగులు కటిక నేలపై పడుకున్న సందర్భాలు కోకొల్లలు. బాలింతలు, గర్భిణీలు నేలపై పడుకుని నానా అవస్థలు పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తే తప్ప రోగుల కష్టాలు తీరవని చెబుతున్నారు. వైద్య సేవల్లో జాప్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్ బాట పడుతున్నారు. ఏదిఏమైనా ఈ హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా...ఆస్పత్రి మెరుగుపడుతుందో లేదో వేచి చూద్దాం. నిద్రమత్తులో ఏపీఎంఎస్‌ఐడీ అధికారులు ఆస్పత్రిలో ఏ పనులు చేయాలన్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులే చేయాలి. అటువంటిది వీరు ఏమాత్రం ముందడుగు వేయడం లేదు. కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన అనేక సందర్భాలున్నా స్పందించడం లేదు. ఊరు బయట తమ కార్యాలయం ఉందని తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఆస్పత్రిని డీఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అలాంటిది ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరి కింది స్థాయి సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం పక్కన ఉన్న టీ కొట్టులో మాత్రం దర్శనమిస్తుంటారు. కరెంటు కాలిపోతోందంటే అటువైపు తొంగి చూడని అధికారులు పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు వస్తున్నారు. ఈ శాఖ నిద్రమత్తులో ఉందని వీరిని మేలుకొలిపేలా జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
ఇక ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’
పథకం పరిధిలోకి 1,038 జబ్బులు సాక్షి, హైదరాబాద్: పేద రోగుల జీవితానికి భరోసానిచ్చిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం పేరు మారింది. దీన్ని ‘డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవ’గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇకపై డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆరోగ్యశ్రీ బోర్డును పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ 26 లక్షల మంది పేద రోగులకు పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు.ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న వైఎస్సార్ ప్రారంభించారు. పథకంలో మరో 100 జబ్బులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 938 జబ్బులకు సేవలందుతున్నాయి. పథకం డాక్టర్ నందమూరి తారకరామావు ఆరోగ్యసేవగా మారిన నేపథ్యంలో మరో 100 జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్యసేవలు అందుతారుు. రూ.2.50 లక్షలకు పెంపు: ఆరోగ్యశ్రీ పథకంలో రూ.2 లక్షల వరకు చికిత్స కవరేజీ ఉంది. ఇకపై 1038 జబ్బులకు వర్తించేలా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షలువర్తింప చేస్తామని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. -
‘ఉచిత’ దోపిడీ!
► ఎస్వీ ఆయుర్వేదిక్‌లో ఇంటిదొంగల దందా ► వైద్యుల టేబుల్ వద్దే మందుల అమ్మకాలు ► కమీషన్లకే పరిమితమైన వైద్యాధికారులు ► నిరుపేద రోగులకు తీరని అన్యాయం ► దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట ► చోద్యం చూస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల, కొందరు ఇంటిదొంగ ల పనితీరు కారణంగా అభాసుపాలవుతోంది. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. దీంతో వైద్యం కోసం వస్తున్న నిరుపేద రోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. వీటిని అరికట్టాల్సిన వైద్యాధికారులు వివిధ ఆయుర్వేద కంపెనీలు కట్టబెట్టే లక్షల కమీషన్లలో జోగుతుండగా, టీటీడీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. రూ. కోట్ల బడ్జెట్ కల్గి ఉన్నతాశయంతో వెంకన్న నిధులతో నడుస్తున్న సంస్థ ప్రతిష్ట కొందరు చీడపురుగుల కారణంగా దిగజారుతోంది. ► వైద్యం కోసం ఇటీవల వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వెంకటమ్మ ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి వస్తే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒకరు మాటామాటా కలుపుతూ ‘గంగమ్మ గుడి దగ్గర మంచి ఆయుర్వేద వైద్యం చేస్తారు. రూ.60 వేలు తీసుకుంటారు. 3 నెలల పాటు 15 రోజులకోసారి రావాలి. వచ్చిన ప్రతి సారీ రూ.20 వేలు కడితే సరిపోతుంది’ అని సలహా ఇచ్చారు. దాంతో ఆమె అక్కడకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా సమయానికి దూరపు బంధువు వచ్చి ఆపాడు. కోట్ల రూపాయల వేంకటేశ్వరస్వామి డబ్బుతో ఉచితంగా వైద్యం అందిస్తుంటే దళారీల మాటలు నమ్మకండి అని చెప్పడంతో ఆమె విరమించుకుని ఇక్కడేవైద్యం పొందారు. ► కౌమారబృత్యంలో మరో డాక్టర్ బయట మందుల దుకాణదారులతో కుమ్మక్కై తమ విభాగానికి వచ్చే రోగులకు ఆస్పత్రిలో లేని మందులే రాస్తున్నారు. సహజంగా మందులను వైద్యులు చిన్న చిన్న స్లిప్‌లలో రాసిస్తారు. వాటిని తీసుకెళ్తే ఆస్పత్రి ఫార్మసీలో మందులు ఇస్తారు. ఈ డాక్టరు మాత్రం స్లిప్పుల్లో ‘కాల్..మీ..’ అని రాసి అడ్రస్ చెప్పి మరీ బయటకు పంపుతారు. ► ప్రసూతి విభాగంలో ఉన్న ఒక డాక్టర్ బయట స్కానింగ్ కేంద్రాలతో కుమ్మక్కై అవసరం లేకున్నా వేలల్లో టెస్టులు రాసి రోగులను దోపిడీ గురిచేస్తున్నారు. ► పిల్లల విభాగంలో ఇద్దరు డాక్టర్లు బంగారం కలిపే కొన్ని రకాల ఖరీదైన మందులను రోగులకు ఆస్పత్రిలోని తమ సీట్ల వద్దే అంటగట్టి వేలల్లో డబ్బు గుంజుతున్నారు. ► ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు తరచూ ఆస్పత్రిలో రౌండ్స్‌లో ఉండాల్సి ఉండగా అందుకు విరుద్దంగా తమకు అనుకూలమైన కంపెనీలకు పెద్దస్థాయిలో ఆర్డర్లు పెట్టి లక్షల్లో కమీషన్లు పొందుతూ కాలం గడిపేస్తున్నారు. ► రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన జనరేటర్ వైర్లను ఎలుకలు కొరికితే పట్టించుకోకుండా నెలల పొడవునా మూలన పడేశారు. ► ఇంకొందరు వైద్యులు అటెండర్లకు నెలానెలా రూ.3 వేలు అప్పజెప్పి రోగులను తమవద్దకు (బయట ఉన్న క్లినిక్‌లకు) పంపేలా ఏర్పాట్లు చేసుకుని మూడు ప్రిస్క్రిప్షన్లు.. ఆరు వేలుగా వ్యాపారం సాగిస్తున్నారు. మా దృష్టికి రాలేదు.. బంగారం కలిపై మందులను మేము తెప్పించడం లేదు. అలాంటి మందులను వైద్యులు వారి టేబుల్స్ దగ్గరే విక్రయిస్తున్నారనే విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. మేమెతే అసవసరంగా టెస్టులు రాయడం లేదు. ఇక కాల్మీ అని రాసి పంపే స్లిప్‌లకు సంబంధించి అలా రాయవద్దని హెచ్చరికలు చేస్తున్నాం. -డాక్టర్ పార్వతి, సూపరింటెండెంట్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి -
ప్రభుత్వాస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు: టి.రాజయ్య
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. తెలంగాణ పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జన విజ్ఞాన వేదిక తొలి రాష్ట్రస్థాయి మహాసభల్లో ఆయన మాట్లాడారు. కొందరు ప్రభుత్వ వైద్యులు రోగులతో సరిగా మాట్లాడకుండానే మందులను రాస్తుం టారని, అందుకనే ప్రజలు నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారని అన్నారు. మురికివాడలు, తండాలు, ఏజెన్సీల్లో ఉండే ప్రజలు రాత్రివేళల్లో దోమలు, పగటిపూట ఈగలతో ఇబ్బందులు పడుతుంటారని పేర్కొన్నారు. వీటి కారణంగానే విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. పరిసరాల పరిశుభ్రత, నివారణచర్యలపై ప్రజ ల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటిల్లో పారామెడికల్, అంగన్వాడీ, వార్డు మెంబర్లు, సర్పంచులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఎలాంటి రోగం వచ్చి నా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సలు చేయించాలని ప్రజలను కోరారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం అనే అంశాలపై సదస్సును నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటివి ప్రతిచోటా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
వైద్యసమాచారంఇంటర్నెట్‌లో!
సాక్షి, ముంబై: పేదలు, దారిద్య్రరేఖకు దిగువనున్న రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎప్పుడు వైద్యం అందజేస్తారనే వివరాలు త్వరలో ఇంటర్నెట్లో లభించనున్నాయి. వెబ్సైట్లో వివరాల ప్రకారం పేదలు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యం, ఇతర పరీక్షలు ఉచితంగా లేదా రాయితీ ధరలకు చేయించుకోవచ్చు. ముంబై, ఇతర ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వాటిలో పేదల కోసం కొన్ని పడకలు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ వారికి వైద్యం ఉచి తంగా లభించినా కొన్ని వైద్యపరమైన పరీక్షలు రాయితీ ధరకు నిర్వహించాలని కూడా సూచిం చింది. అదేవిధంగా ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లోనూ పేదలకు వైద్యం ఉచితం గా అందజేస్తున్నారు. ఏ ఆస్పత్రిలో, ఎలాంటి వ్యాధులకు, ఏరోజు ఉచితంగా వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయో పేదలు, అర్హులకు తెలియడం లేదు. దీంతో వాటి వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదలకు ఈ వివరాలు ఇంటర్నెట్లో లభిం చేందుకు ‘ఆన్లైన్ రియల్‌టైం సిస్టం’ అనే పద్ధతిని అవలంభించాలని అన్ని ధర్మాదాయ ఆస్పత్రులకు ప్రభుత్వం సూచించింది. కొన్ని ప్రైవేటు ధర్మాదాయ ఆస్పత్రులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం అనేక ప్రైవేటు ఆస్పత్రులకు తక్కువ ధరలకు స్థలం అందజేయడం, వైద్య పరికరాలు, పన్ను, భవన నిర్మాణ సామగ్రిలో రాయితీ లు కల్పించింది. బదులుగా పేదలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలకు ఉచితంగా లేదా రాయితీలతో చికిత్సలు చేయాలని ఆదేశించింది. అయితే చాలా మంది ఈ విషయంపై అవగాహన ఉండడం లేదు. అందుకే ఏ ఆస్పత్రిలో పేదలకు ఎన్ని పడకలు కేటాయించారు? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ ఏ రోగానికి వైద్యం ఉచితంగా లభిస్తుంది ? తదితర వివరాలు లబ్ధిదారులందరికీ ఇంటర్నెట్ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు పేదలకు కేటాయించిన పడకలను అక్రమంగా ఇతరులకు కేటాయించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇటు రోగి నుంచి, అటు ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్నెట్లో సమాచారం ఉంచడం వల్ల ఇలాంటి అక్రమాలకు కొంతమేరకైనా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆస్పత్రుల వివరాలు కూడా బయటపడతాయని చెప్పారు.