pop singer actor
-
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
అత్యాచారం చేశాడు.. పిచ్చిదాన్నైపోయా!
లేడీ గాగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న సింగర్. హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్ సింగర్ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో.. తన గతానికి సంబంధించి కొన్ని చేదు విషయాల్ని బయటపెట్టి కంటతడి పెట్టుకుంది. పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ భయానక అనుభవాన్ని పంచుకుంటూ లేడీ గాగా ఏడ్చేసింది. అయితే గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడింది. ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మధనపడ్డానని చెప్పిన లేడీ గాగా.. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా అభివర్ణించింది. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. యాపిట్ టీవీ ఫ్లస్ ఫ్లాట్ ఫామ్ వారి ‘ది మీ యూ కాంట్ సీ’ డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్ అయ్యింది. కాగా, గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా. -
అభిమానం అంటే అంతే మరి!
తమ అభిమాన నటీనటులను అనుకరిస్తూ ఫ్యాన్స్ చేసే విచిత్రాలు అన్నీఇన్నీ కావు. ఒక్కోసారి వారి చేష్టలు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇటీవల చైనాలోని షాంఘై నగరంలో జరిగింది. వివరాళ్లోకెళ్తే.. మొదటి చిత్రంలో పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫొటోకి పోజిచ్చిన వ్యక్తి పేరు.. లు హాన్. చైనాలో పాపులర్ పాప్‌సింగర్ కమ్ యాక్టర్. గత శుక్రవారం ఆయన షాంఘైలోని ఒక పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫొటో దిగి దానిని తన వెబినార్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇక అంతే అప్పటి నుంచి ఆ పోస్ట్‌బాక్స్ ఉండే ప్రాంతం షాంఘైలో టూరిస్ట్‌స్పాట్‌గా మారిపోయింది. తమ అభిమాన నటుడు ఫొటో దిగిన ఆ పోస్ట్‌బాక్స్ వద్ద ఫొటో తీసుకునేందుకు మహిళా అభిమానులు క్యూ కట్టారు. సుమారు 300 మీటర్ల మేర అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి మరి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అభిమానం అంటే ఇలాగే ఉంటుందేమో!