అభిమానం అంటే అంతే మరి! | Among fans click photo with post box thier favourite actor takes snap with post box | Sakshi
Sakshi News home page

అభిమానం అంటే అంతే మరి!

Published Tue, Apr 12 2016 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

అభిమానం అంటే అంతే మరి!

అభిమానం అంటే అంతే మరి!

తమ అభిమాన నటీనటులను అనుకరిస్తూ ఫ్యాన్స్ చేసే విచిత్రాలు అన్నీఇన్నీ కావు. ఒక్కోసారి వారి చేష్టలు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇటీవల చైనాలోని షాంఘై నగరంలో జరిగింది. వివరాళ్లోకెళ్తే.. మొదటి చిత్రంలో పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫొటోకి పోజిచ్చిన వ్యక్తి పేరు.. లు హాన్. చైనాలో పాపులర్ పాప్‌సింగర్ కమ్ యాక్టర్. గత శుక్రవారం ఆయన షాంఘైలోని ఒక పోస్ట్‌బాక్స్ పక్కన నిలబడి ఫొటో దిగి దానిని తన వెబినార్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
 
ఇక అంతే  అప్పటి నుంచి ఆ పోస్ట్‌బాక్స్ ఉండే ప్రాంతం షాంఘైలో టూరిస్ట్‌స్పాట్‌గా మారిపోయింది. తమ అభిమాన నటుడు ఫొటో దిగిన ఆ పోస్ట్‌బాక్స్ వద్ద ఫొటో తీసుకునేందుకు మహిళా అభిమానులు క్యూ కట్టారు. సుమారు 300 మీటర్ల మేర అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి మరి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అభిమానం అంటే ఇలాగే ఉంటుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement