prayers of Christians
-
కరుణామయుని కోవెలలో..
సాక్షి, మెదక్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ చర్చి బిషప్ సాల్మన్‌రాజ్ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య నెలకొంది. దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్‌రావు ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్‌రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ముందు భక్తుల రద్దీ -
పాక్ చర్చిలపై తాలిబాన్ పంజా
లాహోర్‌లో ఆత్మాహుతి దాడులు 15 మంది మృతి, 80 మందికి గాయాలు ఇద్దరు తీవ్రవాదుల్ని తగలబెట్టిన స్థానికులు లాహోర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. సెలవు దినమైన ఆదివారం లాహోర్‌లోని రెండు చర్చిలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించిన స్థానికులు వారిని చితకబాది సజీవదహనం చేశారు. లాహోర్‌లో క్రైస్తవులు అధికంగా నివసించే యుహానాబాద్లోని చర్చిలపై ఈ దాడులు జరిగాయి. యుహానాబాద్లోని రెండు చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. దాంతో బాంబర్లు గేట్ల వద్దే తమను తాము పేల్చేసుకున్నారు. ఇద్దరు భద్రతా సిబ్బంది, ఓ బాలుడు, బాలికసహా 15 మంది మృతిచెందారు. జనం చర్చిల నుంచి బయటకు పరుగెత్తడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మాహుతి బాంబర్లను గేట్ల వద్దే ఆపేయడంతో చర్చిల్లోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. బాంబర్లతోపాటు వచ్చిన ఇద్దరిని స్థానికులు ఉగ్రవాదులుగా గుర్తించి చితకబాదారు. తర్వాత నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఉగ్రవాదులవిగా భావిస్తున్న వాహనాలకు సైతం నిప్పుపెట్టారు. చర్చిలపై దాడిని ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దాడులు జరిగిన యుహానాబాద్లో 10 లక్షల మంది క్రైస్తవులు నివసిస్తున్నారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని పాక్‌లోని తెహ్రికే తాలిబాన్ అనుబంధ సంస్థ జమాతుల్ అహరర్ ప్రకటించింది. అఫ్ఘాన్‌లో 54 మంది మిలిటెంట్ల హతం కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ మూకలపై సైన్యం దాడులు ముమ్మరం చేసింది. గడిచిన 24 గంటల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తం 54 మంది తీవ్రవాదులు హతమయ్యారని ఆర్మీ ప్రకటించింది.