privataisation
-
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ చేపట్టిన మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక పాత బకాయిలు మొత్తం చెల్లించి సంస్థను పరిరక్షిస్తామని చెప్పారు. సింగరేణి సంస్థలో గతంలో 72వేల మంది కార్మికులు ఉండగా.. ఇప్పుడు 42వేలకు తగ్గారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తన కూతురు కవితను యూనియన్ నాయకురాలిని చేసి సంస్థను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణికి వేల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్న సీఎం.. కార్మికులకు ఐటీ రీయింబర్స్మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఓపెన్‌కాస్ట్‌లను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇయాల 17 ఓపెన్‌కాస్ట్‌లకు అనుమతి తీసుకున్నాడన్నారు. సింగరేణి నుంచి రూ.25వేల కోట్ల అప్పు ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. సంస్థను దివాలా తీయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో బాండ్లు కుదువపెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ఉచిత యూరియా, విత్తనాలు, ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నందుకు.. ప్రజలను దారి మళ్లించేందుకు పీఎం మోదీ తనకు దోస్త్ అని సీఎం ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. చేయి గు ర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఏ పార్టీలోకి పో యారో ప్రజలకు తెల్వదా అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఏనాడైనా తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారా.. అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర లేపుతున్నాడన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఉచిత వైద్యం, విద్య, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో రిటైర్డ్ డీజీపీ క్రిష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి, రాకేష్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు కన్నం యుగేందర్, ఉదయ్‌ప్రతాప్, సునీల్‌రెడ్డి, పాపయ్య , రాజుగౌడ్, ఎరుకల గణపతి, మునీందర్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధికి ఊతం.. ప్రైవేటు వినియోగం
ముంబై: దేశీయ వృద్ధికి ప్రైవేటు వినియోగం ఊతం ఇస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. ఆయా అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) గ్రామీణాభివృద్ధి, తయారీ రంగాల పునరుద్ధరణకు ఊతం ఇస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్బీఐ అభిప్రాయాలగా పరిగణించకూడని ఈ ఆర్టికల్ ‘‘ప్రస్తుత ఎకానమీ పరిస్థితి’’ పేరుతో సెంట్రల్ బ్యాంక్ బులిటెన్‌లో ప్రచురితమైంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. నివేదిక పేర్కొన్న మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! ► అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గాయి. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణల్లో మెరుగుదల నమోదయ్యింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది. ► ఇక దేశీయంగా చూస్తే 2023 మే తొలి భాగంలో ఆర్థిక సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రెవెన్యూ వసూళ్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ 5 శాతం దిగువకు వచ్చింది. కార్పొరేట్ ఆదాయాలు ఆదాయాలకు మించి నమోదయ్యాయి. ► బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు కూడా ఆదాయాల విషయంలో మంచి పనితీరును కనబరిచాయి. రుణ వృద్ధి పెరిగింది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్‌కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్‌కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు
చెన్నై: జాతీయ రవాణా సాధనమైన రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. భద్రత, సౌకర్యం విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినదే కావాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రాజెక్టులను అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. తమిళనాడులోని పెరంబుదూర్‌లో శనివారం నిర్వహించిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్(బీఆర్‌ఎంఎస్) 20వ అఖిలభారత సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అతిపెద్ద సంస్థ అయిన రైల్వేలను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూపకల్పనలో ఐసీఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. రైల్వేశాఖలో నియామకాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 1.40 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర
సాక్షి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో 135 శాతం లాభాలతో ఉన్న సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులు ప్రైవేటుకు అమ్మాలని ప్రధాని మోదీ చూస్తున్నారని తెలిపారు. బీఎస్ఎన్ఎల్, రైళ్లు, విమానాలు, బ్యాం కులు.. ఇలా అన్నీ కేంద్రం అమ్మే స్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలసి కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి సభల్లో మాట్లాడారు. పావలా వడ్డీ ఈ నెలాఖరులో జమ చేస్తామని చెప్పారు. వైద్యానికి పెద్దపీట రాష్ట్రంలో గడిచిన 60 ఏళ్లలో మూడు వైద్య కళాశాలలు మాత్రమే మంజూరు కాగా.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వైద్యానికి పెద్దపీట వేశారని మంత్రి హరీశ్ చెప్పారు. ఒకనాడు మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, నేడు రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 340 పడకల జిల్లా ఆస్పత్రిని నిర్మించి అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని, త్వరలోనే శుభవార్త వింటారని అన్నారు. టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ వెం కటేశ్ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే లు,జెడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సెగలు
-
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిసెంబర్ 16, 17వ తేదీన సమ్మెను చేపట్టనున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సుమారు తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొంటారు. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అలర్ట్ చేశాయి. చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. సమ్మెను విరమించండి..! రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలతో ఆయా బ్యాంకులు సమ్మెను విరమించాలని ఉద్యోగులను కోరాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా.. ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమయ్యాయి. రెండు రోజులపాటు..! 2021-22 బడ్జెట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త! -
రూ. 1.75 లక్షల కోట్లు టార్గెట్..! ప్రైవేటుపరం కానున్న 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు..!
పలు ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగంగా చేపట్టనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా కన్పిస్తోంది. అందుకోసం రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 26 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ రూ.1.75 లక్షల కోట్లే లక్ష్యంగా..! ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సుమారు రూ.1. 75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా కేంద్రం బ్యాంకులపై తీసుకువస్తోన్న బిల్లుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటుగా 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లుతో ద్వారా విస్తృతమైన పెన్షన్ కవరేజీని ప్రోత్సహించడానికి పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయడానికి వీలు కల్గుతుందని గత బడ్జెట్ సెషన్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. చదవండి: 81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
TSRTC: లాభాల్లోకి రాకుంటే ప్రై‘వేటే’
సాక్షి, హైదరాబాద్: ‘మరో మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకుంటే ప్రైవేట్‌పరం చేస్తాం, తర్వాత మీ ఇష్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించినా పరిస్థితిలో మార్పు చూపకపోవటం ఏంటంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..’ అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతా కలిసి గట్టెక్కించాలి ‘రాష్ట్రంలో 97 డిపోలుంటే అన్నీ నష్టాల్లో ఉన్నాయంటే అధికారుల పనితీరులో ఎక్కడో లోపం ఉందని స్పష్టమవుతోంది. పరిస్థితి మారకుంటే ప్రభుత్వం ఎంతకాలం నిధులు కేటాయిస్తూ పోతుందనేది సీఎం ఆవేదన. అందుకే ఉన్నతాధికారులు మొదలు డిపో మేనేజర్ వరకు అందరి పనితీరు మారాల్సి ఉంది. సంస్థను గట్టెక్కించే విధంగా వ్యవహరించాలి. అందుకే డిపో స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించాం. మరో రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తాం. నేనో వైపు, ఎండీ సజ్జనార్ మరోవైపు పర్యటనలు జరిపి లోపాలు గుర్తించి దిద్దుబాటుకు దిగుతాం. ఒక బస్సు రోజుకు ఇన్ని కి.మీ.లు తిరగాలి అని గతంలో నిర్ధారించారు. దాన్ని గుడ్డిగా పాటిస్తున్న అధికారులు ప్రయాణికులు లేకున్నా తిప్పుతున్నారు. ఇది ఎంత దుబారాకు దారి తీస్తుంది. అలాగే ఒకే డిపోలో ఒకే ప్రాంతానికి ఒకే సారి రెండుమూడు బస్సులు బయలుదేరుతున్నాయి. దీనివల్ల ఏ బస్సులోనూ సరైన ఆక్యుపెన్సీ ఉండటం లేదు. ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దాల్సి ఉంది. రెండు మూడు నెలల్లోనే సంస్థను లాభాల్లోకి తేవాలి. లేకుంటే ఆర్టీసీని ప్రభుత్వం భరించడం కష్టం అనేది సీఎం ఉద్దేశం..’ అని బాజిరెడ్డి తెలిపారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్ కొత్తగా భర్తీ లేదు .. బస్సుల్లేవు ‘ఆర్టీసీలో ఇప్పట్లో ఇక కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదని, కొత్త బస్సులు కొనబోమని, కొత్త నిర్మాణాలు చేపట్టబోమని కూడా సీఎం చెప్పారు. అందువల్ల ఉన్న బస్సులనే ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటాం. మరీ అవసరమైతేనే కొత్త బస్సుల కోసం ఆలోచిస్తాం..’ అని చెప్పారు. సీఎం ఆగ్రహంపై చర్చ రెండేళ్ల కిందట కార్మిక సంఘాలు ఉధృతంగా సమ్మె నిర్వహించిన సమయంలోనూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం హెచ్చరించారు. ఆ సమయంలోనే ఆర్టీసీ ఏకంగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్య 3,100కు చేరింది. తాజాగా అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించటం సంస్థలో తీవ్ర చర్చకు దారి తీసింది. -
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
-
విశాఖ ఉక్కును విక్రయించవద్దు
సాక్షి, న్యూఢిల్లీ/గాజువాక: విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించాలన్న ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉక్కుకార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన శుక్రవారం కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏళ్లతరబడి పోరాటం, 32 మంది ఆత్మబలిదానం తర్వాత 1966లో విశాఖ ఉక్కు ఏర్పాటై ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని చెప్పారు. పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని పేర్కొన్నారు. 35 వేలమంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహానగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించి లక్షలాదిమంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని, అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని చెప్పారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే విశాఖ ఉక్కు ఏటా రూ.300 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోందన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే తిరిగి లాభాలబాట పడుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, పోరాట కమిటీ నేతలు సీపీఎం నాయకుడు సీహెచ్.నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, జి.గణపతిరెడ్డి, బోగాది సన్యాసిరావు, ఎం.అంబేద్కర్, పి.దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను బీజేపీ నాయకులు కోరారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ల సారథ్యంలో గాజువాక నాయకులు వారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. -
కేంద్రం చర్యతో ప్రైవేటు పరం కానున్న మరో సంస్థ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశకు మరో అడుగు ముందుకు పడింది. చమురు, గ్యాస్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదనలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా నోట్‌ను రూపొందించింది. ఈ ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే భారత రెండో అతిపెద్ద చమురు రంగ సంస్థ బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేయడానికి దారులు సుగమం కానుంది. తాజా పరిణామం ప్రకారం .. అంతకుముందే బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేసే దానిలో భాగంగా అస్సాంలోని నూమాలీగడ్ రిఫైనరీ నుంచి బీపీసీఎల్ వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదాతో బీపీసీఎల్‌లోని 52.98 శాతం వాటాను పూర్తిగా ప్రైవేటుపరం కానుంది . బీపీసీఎల్ కంపెనీను సొంతం చేసుకొవడానికి ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ వేదాంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్డీలపై అభిప్రాయాలను సేకరించిన తరువాత కేంద్ర మంత్రి వర్గ అనుమతి కోరనుంది. ప్రస్తుతం, పెట్రోలియం శుద్ధిలో 49 శాతం ఎఫ్‌డిఐలకు మాత్రమే అనుమతి ఉంది. చదవండి: ‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై! -
లాభదాయక సంస్థలనూ అమ్మేస్తే ఎలా?
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రవేశపెడుతూ జీవిత బీమా సంస్థలో ఐపీఓ చేపట్ట డానికి వీలుగా ఎల్ఐసీ చట్టానికి 27 సవరణలు ప్రతిపాదించారు. అలాగే బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచుతూ కేంద్ర కేబి నెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసీని లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపం సలహాదారులు డెలాయిట్ కంపెనీ, ఎస్బీఐ కాప్స్ కంపెనీలను నియమించింది. ఎల్ఐసీ నిజవిలువను మదింపు చేయడానికి మిల్లిమాన్ కంపెనీని నియమించింది. ఇందులో వాటాలు అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.(చదవండి: వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...) మన దేశ బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఐఆర్డీఏ చట్టం 1999 ద్వారా బీమా రంగంలోకి 26 శాతం విదేశీ ఈక్విటీని అనుమతించారు. తదనంతరం 2015లో ఈ పరిమితిని 49 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని 74 శాతానికి పెంచడం తోపాటు బీమా సంస్థలలో విదేశీ యాజమాన్యాన్ని అనుమ తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఎక్కువగా అనుమతిస్తే అవి దేశీయ పొదు పుపై నియంత్రణ సాధిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవాలను బట్టి చూస్తే విదేశీ పెట్టుబడులు, దేశీయ పొదుపునకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపిత మైంది. ఇప్పటికే లిస్టింగ్ అయిన ప్రైవేటు బీమా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చూస్తే, దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం అవి పెట్టిన పెట్టుబడులు నామ మాత్రమే. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం మొదలైన నిర్ణయాలు భారతదేశంలోని ప్రజల విలువైన పొదుపును విదేశీ శక్తుల చేతికి అప్పగించడమే.ఎల్ఐసీలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించడం సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేసే మొదటి అడుగు. ప్రజల చిన్న మొత్తాల పొదుపును ప్రీమియంల రూపంలో సమీకరించి, తద్వారా దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో దీన్ని పార్లమెంటు చట్టం ద్వారా 1956లో ఏర్పరిచారు. ‘ప్రజల సొమ్ము, ప్రజా సంక్షే మానికి’ అనే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు విజయ వంతంగా ఎల్ఐసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోంది. లిస్టింగ్ వల్ల పారదర్శకత మెరుగుపడుతుందనే ప్రభుత్వ వాదన అసంబద్ధం. ఎల్ఐసీ ప్రతి నెలా రెగ్యులేటర్ ఐఆర్‌డీఏకు తన పనితీరు నివేదికలను సమర్పిస్తుంది. అలాగే పార్లమెంటు పరిశీలన కోసం తన జమా ఖర్చులు, అకౌంటు పుస్తకాలను ఉంచుతుంది. ఇంత పారదర్శకంగా ఈ సంస్థ పనిచేస్తున్నప్పుడు ఇంకేం పారదర్శకత కావాలి? ‘సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్’ నిర్వహించిన ట్రాన్స్పరెన్సీ ఆడిట్లో గ్రేడ్–ఎ (97 శాతం) సాధించింది. పైగా సంస్థ నిరర్థక ఆస్తులు కేవలం 0.33 శాతం మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు నిధులను పెట్టుబడులుగా పెట్టగల ఈ సంస్థకు నిధుల కోసం మార్కెట్‌ను ఆశ్ర యించాల్సిన పరిస్థితి లేదు. 2020 మార్చి 31 నాటికి రూ 30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో సంస్థ వాటా 25 శాతంపైనే. 440 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కలిగి (ఐక్యరాజ్యసమితి జాబి తాలో ఉన్న 75 శాతం దేశాల జీడీపీ కంటే ఎక్కువ), ఆర్జించిన ఆదాయ పరంగా ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో స్థానం పొందిన ఎల్ఐసీకి మార్కెట్ నుండి నిధుల అవసరం ఉందనేది హాస్యాస్పదం. లిస్టింగ్ చేయటం వలన పాలసీదారులకు లాభం కలుగుతుందనే వాదనలు పూర్తిగా అర్థరహితం. 1956 నుండీ పాలసీదారుల నిధులను పరిపూర్ణంగా సంరక్షిస్తూ వారికి మంచి బోనస్ అందిస్తోంది. 98.27 శాతం క్లెయి మ్‌లను పరిష్కరించడం ద్వారా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2.15 కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా పేరొందింది. ఐఆర్డీఏ వార్షిక నివేదిక 2018–19 ప్రకారం 99.57% డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. పెట్టు బడులు ఉపసంహరించి అందులో 10% షేర్లు పాలసీ దారులకు ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. కానీ ప్రభుత్వం చేస్తున్న సవరణలు పాలసీదారుల ప్రయో జనా లకు గండికొట్టేలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి, బలహీన వర్గాలకు చౌకగా బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడి, లాభరహితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమాను విస్తరించే లక్ష్యం కూడా వీగిపోతుంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి అతిపెద్ద బీమా కంపెనీని కూడా అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలో ట్విన్ టవర్లు తీవ్రవాద దాడిలో కూలిపోతే ప్రభుత్వ సాయం ఉంటేనే క్లెయిములు చెల్లిస్తామని అక్కడి బీమా కంపెనీలు తెగేసి చెప్పాయి. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ల లోని లిస్టింగ్ కంపెనీలే. దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అన్ని నిబంధనలు సడలించి పాలసీదారుల క్లెయిములను ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం కోరకుండానే ఎల్ఐసీ పరి ష్కరించింది. గత 20 సంవత్సరాలుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ 71 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. తన 2,547 కార్యాలయాలను (52.1%) యాభై వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెల కొల్పింది. దీనికి భిన్నంగా ప్రైవేట్ బీమా కంపెనీల 77.1% కార్యాలయాలు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐపీఓ ప్రయత్నాలను, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు బిల్లుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పటికే ఎల్ఐసీలోని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లతో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 450 మంది పార్ల మెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ పత్రాలతో పాటే ఎల్ఐసీ చట్ట సవరణలను ఆమోదించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంస్థలోని దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్ల సంఘాలు ఎల్ఐసీ పరిరక్షణే ధ్యేయంగా మార్చి 18న సమ్మెకు పిలుపు నిచ్చాయి. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు, మొబైల్ : 94417 97900 -
ఆ 3 ఆర్డినెన్స్‌లు వ్యవసాయానికి దండగే
న్యూఢిల్లీ : పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో రైతన్నలు నిరసన బాట పట్టారు. 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో గిట్టుబాటు ధరలకి సంబంధించిన మూడు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్‌లతో వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్ కార్పోరేటీకరణ చేస్తోందని మండిపడుతున్నారు. అవి చట్టరూపం దాలిస్తే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల మొదటి రోజైన సోమవారం దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌లపై నిరసన గళాన్ని వినిపించాలని అఖిల భారత రైతు సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్ పిలుపునిచ్చారు. ఏమిటీ ఆర్డినెన్స్‌లు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో నిత్యావసర సరుకుల(సవరణ) ఆర్డినెన్స్, రైతుల(సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద ఆర్డినెన్స్, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లతో రైతులు పండించే పంటలకు ఎక్కువ ధర వస్తుందని, రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకునే వీలు ఉంటుందని కేంద్రం చెబుతోంది. కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధమవుతుందని, రైతులే పారిశ్రామికవేత్తలుగా మారవచ్చునని అంటోంది. అయితే రైతులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించకుండా వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం కాదని వీఎం సింగ్ చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత అన్నది మన దేశంలో చెరుకు రైతుల విషయంలో ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందని గుర్తు చేశారు. అసంఘటిత రంగంలో ఉండే రైతాంగానికి ఈ ఆర్డినెన్స్‌లు మేలు చేయవన్నారు. వ్యవసాయానికి మృత్యుఘంటికలు : కాంగ్రెస్ ఆర్డినెన్స్‌లపై పోరుబాట పట్టిన రైతన్నలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆ ఆర్డినెన్స్‌లు రైతు వ్యతిరేకమని ఆరోపించింది. కార్పోరేట్ రంగాన్ని మోదీ సర్కార్ పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ çసూర్జేవాలా ధ్వజమెత్తారు. -
సింగపూర్, లండన్లలో... ఎయిరిండియా రోడ్‌షోలు...
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల ఆసక్తిని అంచనా వేసేందుకు ఇటీవలే సింగపూర్, లండన్‌లో రోడ్‌షోలు నిర్వహించింది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదనపై దీని ప్రభావం ఉండబోదని, ముందస్తుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారమే విక్రయ ప్రక్రియ ప్రణాళిక కొనసాగుతుందని అధికారి పేర్కొన్నారు. ‘సింగపూర్, లండన్లలో నిర్వహించిన రోడ్‌షోలకు పెద్దగా స్పందన కనిపించలేదు. కొందరు ఇన్వెస్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో .. ఎయిరిండియా కొనుగోలుపై ఇన్వెస్టర్ల ఆసక్తి.. ఆలోచనలో పడేసేదిగా ఉంది‘ అని తెలిపారు. విదేశా ల్లోని రోడ్‌షోల్లో వచ్చిన స్పందన బట్టి చూస్తే.. ఎయిరిండియా వేలంలో పెద్ద స్థాయిలో బిడ్లు రాకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్ ప్రకారం విక్రయ ప్రక్రియ .. అయితే, దేశీయంగా ముంబైలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఇన్వెస్టర్ల నుంచి కాస్త ఆశావహ స్పందన కనిపించిందని మరో అధికారి చెప్పారు. ఇదే ఊతంతో.. ఎయిరిండియా విక్రయానికి సంబంధించి తుది బిడ్డింగ్ డాక్యుమెంట్లను ఖరారు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం పండుగ సీజన్ తర్వాత జనవరిలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ)ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అధికారి తెలిపారు. అప్పుడైతే విదేశీ ఇన్వెస్టర్లు కూడా కాస్త పెద్ద సంఖ్యలో పాల్గొనవచ్చని భావిస్తున్నట్లు వివరించారు. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ఎఫ్‌డీఐ అడ్డంకులు.. ఎయిరిండియా కొనుగోలు ప్రక్రియలో విదేశీ ఎయిర్‌లైన్స్ పాల్గొనడానికి లేకుండా నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారతీయ విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయడానికి లేదు. ఒకవేళ కొనదల్చుకున్న పక్షంలో ఏదైనా భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి బిడ్ చేయాల్సి ఉంటుంది. సదరు భారతీయ భాగస్వామ్య సంస్థ 51 శాతం, విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. కానీ ఎయిరిండియా విషయంలో భారత సంస్థలతో జట్టు కట్టే ఆలోచనేదీ విదేశీ ఎయిర్‌లైన్స్‌కు లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రతిబంధకంగా ఉన్న ఈ నిబంధనను సడలించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎయిరిండియాను కొనుగోలు చేసే విదేశీ ఇన్వెస్టర్లకు కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో యాజమాన్య హక్కులు దక్కేలా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలకూ ప్రాధాన్యం లభించేలా నిబంధనను సవరించే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. గత నెల నవంబర్‌లో విమానయాన శాఖ, పరిశ్రమలు.. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఇది చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి గతంలో ఒకసారి ప్రయత్నించినప్పటికీ.. ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువవడంతో సదరు ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2007–08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనమైన తర్వాత నుంచి ఎయిరిండియా నష్టాల్లో కొనసాగుతోంది. 2018–19లో ఎయిరిండియా నష్టాలు సుమారు రూ. 8,556 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణభారం రూ. 58,351 కోట్ల మేర ఉంది. కంపెనీని గట్టెక్కించడానికి 2011–12 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ. 30,520 కోట్ల దాకా సమకూర్చింది. -
బ్యాంకుల సమ్మె సంపూర్ణం
జిల్లావ్యాప్తంగా మూతపడ్డ బ్యాంకులు – రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలకు బ్రేక్ – ఏటీఎంల దగ్గర బారులు తీరిన కస్టమర్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ వంటి చర్యలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. సుమారు ఐదున్నర వేల మంది పైచిలుకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన 520 శాఖలు మూతపడ్డాయి. బ్యాంకర్ల అంచనా ప్రకారం జిల్లా అంతటా రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) పిలుపు మేరకు స్పందించిన అన్ని బ్యాంకులూ శుక్రవారం మూతపడ్డాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ,ఎస్ బ్యాంకులు మినహా మిగతా ప్రభుత్వ రంగ, గ్రామీణ, సహకార రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, మదనపల్లి పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా బ్యాంకింగ్ రంగంలో నిర్హేతుక సంస్కరణలు అమలు చేసేందకుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, వీటిని సంఘటితంగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఎస్బీఐలో ఎస్బీహెచ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్లను విలీనం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలకు బ్రేక్... బ్యాంకుల సమ్మె కారణంగా జిల్లాలో రూ.1500 కోట్ల ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. విదేశీ మారకద్రవ్యం, జీతభత్యాల చెల్లింపులు, ట్రెజరీ బిల్లులు, ఆదాయపన్నుల చెల్లింపులన్నీ స్తంభించాయి. తిరుపతి, చిత్తూరు, తిరుచానూరు, మదనపల్లి, పలమనేరు పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పలు ఏటీఎంల్లో నగదు నిండుకొంది. విత్‌డ్రాయల్స్ లేక కస్టమర్లు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరారు.