తల్లీ కూతురు అదృశ్యం
విజయవాడ: బంధువుల ఇంటికి వెళ్లడం కోసం ఆటో ఎక్కిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద జరిగింది. ఆదివారం సాయంత్రం రహీమున్నిసా(24) తన నాలుగేళ్ల కూతురితో కలసి బయల్దేరింది. ఆమె బంధువలు ఇంటికి చేరలేదన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆటో ఉయ్యూరు చేరుకున్న తర్వాత ఆటోలో ఒక్కదాన్నే ఉన్నానని, తనకు భయంగా ఉందని ఫోన్ చేసి చెప్పినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి రహీమున్నిసా ఫోన్ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపారు.