పెరుగుతున్న వార్తాపత్రికలు
దేశంలో లక్షకు పైగా రిజిస్టర్డ్ పబ్లికేషన్స్
న్యూఢిల్లీ: దేశంలో ఇంగ్లిష్, ప్రాంతీయ వార్తా పత్రిక సంఖ్య పెరుగుతోంది. 2013 మార్చి నాటికి రిజిస్టర్ అయిన పత్రికలు 94,067 కాగా,ఈ ఏడాది మార్చి నాటికి అవి 1,05,443కి పెరిగాయి. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఇన్ ఇండియా (ఆర్ఎన్ఐ) గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఇదే సరళి ఉంది. వార్తాపత్రికలపై ఇటీవల లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు.
ఆర్ఎన్ఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,130 రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(14,394) ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 5,575గా ఉండే పత్రికలు.. ఈ ఏడాది మార్చినాటికి 6,215 అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో 203 రిజిస్టర్డ్ పబ్లికేషన్స్ ఉన్నాయి.