Registration fees
-
’బాబు’ ష్యూరిటీ.. ప్రజలపై బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు (Kurasala Kannababu) మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా రూ.13000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు.కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..‘‘రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా? ఒక వస్తువుకు ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగే తనను తాను మార్కెటింగ్ చేసుకునేలా సంపద సృష్టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దానిని నమ్మిన ప్రజలు ఈ రోజు అవస్థలకు గురవుతున్నారు. స్థిరాస్థి విలువలను అడ్డగోలుగా పెంచడం, భూములు, నిర్మాణాలు, చివరికి తాత్కలిక నివాసం ఉండే షెడ్లు, పూరిళ్ళను కూడా ఈ చార్జీల పెంపు కిందకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబుకు తనకు కావాల్సిన వారికి అనుకూలంగా ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు.చంద్రబాబు, ఆయన బినామీల చేతుల్లో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వున్నాయి. ఈ చార్జీల పెంపుదల నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. రాష్ట్రమంతా పెంచిన చార్జీలు ఇక్కడ మాత్రం పెరగవు. అంటే తన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు కల్పించారు. అమరావతిలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే, కొనుగోళ్ళు ఇబ్బంది కలుగుతాయని అక్కడ మార్కెటింగ్ పెరిగేందుకు వీలుగా, భూములను అమ్ముకుని తన బినామీలు లాభం పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చారు. చాలా చిత్రంగా లేయర్లు, గ్రిడ్స్ పేరుతో తమకు అనుకూలమైన ప్రాంతంలో చార్జీలను పెంచడం, మినహాయించడం పై నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్ మెంట్ కొనుగోలుచేస్తే లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీలును చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు.అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు:గత ఎనిమిది నెలల పాలన చూస్తూ చంద్రబాబు అసమర్థత, వైఫల్యం కనిపిస్తోంది. నీతిఅయోగ్ పై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ మాట్లాడారు. అభివృద్ది ద్వారా సంపద సృష్టిస్తాం, దానితో సంక్షేమం చేస్తానంటూ ఒక కొత్త వాదనను వినిపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ’పూర్ టు రిచ్’ అనే ఒక నినాదం ఇచ్చారు. పేదలన కుబేరులను చేస్తానంటూ మభ్యపెట్టారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయి? వాగ్దానాల అమలు ఏదీ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికారాన్ని వినియోగించుకుని కేసులు నమోదు చేస్తున్నారు.చివరికి సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైన కూడా కేసులు నమోదు చేసి తమ నిరంకుశత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికలకు మందు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదు అంటూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మా పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు అవసరం అవుతాయని. మేం అమలు చేస్తున్న పథకాలకే ఏడాదికి రూ.70వేల కోట్లు ఖర్చు అవుతోంది, ఇంతకు మించి ఇచ్చే సామర్థ్యం ఈ రాష్ట్ర ఖజానాకు లేదు అని చాలా క్లియర్ గా వాస్తవాలను వెల్లడించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పి, తరువాత ప్రజలను మోసం చేయలేను అని కూడా చెప్పారు. కానీ ప్రజలు దీనిని అర్థం చేసుకోలేదు. నిజం కంటే అబద్దం అందంగా కనిపించింది. చంద్రబాబు అబద్దాలను నమ్మారు. నడిచి వచ్చే అబద్దంగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.8 నెలల్లో తెచ్చిన అప్పులను ఎలా ఖర్చు చేశారు?అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేంద్రం ద్వారా సాయం అందించామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటివరకు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన నిధులు మొత్తం రూ.4.19 లక్షల కోట్లు. నెలకు దాదాపు రూ.50 వేల కోట్లు. ఈ నిధులు ఏం చేశారు? ఏ పథకం కింద ప్రజలకు ఎంత సొమ్ము అందించారు? వీటికి సంబంధించిన లెక్కలు వెల్లడించండి.ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఒకవైపు అభివద్ధి లేదు, మరోవైపు సంక్షేమం కనిపించడం లేదు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. చివరికి జగన్ సీఎంగా ఉండగా వాట్సాప్ లో గవర్నెన్స్ ను తీసుకువచ్చారు. పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికేట్ లను ఇంటింటికీ తీసుకువెళ్ళి అందించారు. దానిని కాపీ చేసి నేడు లోకేష్ వాట్సప్ గవర్నెన్స్ ను తానే కనిపెట్టినట్లు, ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.ఇదీ చదవండి: అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి జగన్ పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ. 2022లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతోంది, అప్పుల ఊబిలోకి వెడుతోందంటూ గుండెలు బాదుకున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ మేం ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పుడు హామీలను అమలు చేయడం కుదరదంటున్న మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తే హామీలను అమలు చేయడానికి సిద్దమవుతారు?కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించాలిజగన్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యతలు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏమిటీ? ఏ రంగాన్ని తమ ప్రయారిటీలో పెట్టారో వెల్లడించాలి. దావోస్ వెళ్ళడమే అద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఎంఓయు చేసుకోకుండా రాష్ట్రానికి తిరిగి వచ్చి, దావోస్‌లో ఎంఓయులు గొప్పకాదు అంటూ మాట మార్చేశారు. జగన్ ఆర్థిక విధ్వంసం సష్టించారు, అప్పుల పాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్ గారు మళ్లీ అధికారంలోకి రారు అని రాసివ్వమని అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు.పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కేసులతో భయపెట్టి పారిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏ ధైర్యంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు? ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నామనే భ్రమతో చంద్రబాబు, లోకేష్ లు చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ దెబ్బతిన్నది. తమ రాజకీయం కోసం ఏపీ ఇమేజ్ ను దెబ్బతీయడం వల్ల కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పరిశ్రమ పెడదామని భూముల కోసం సర్వే చేస్తుంటేనే గద్దాల వారిపై పడి వేధిస్తున్నారు. లోకేష్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రెడ్ బుక్‌ను అమలు చేస్తామని చెప్పారు. దావోస్ కు వెళ్ళి వేధింపులు కొనసాగిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మా చేతుల్లో ఉన్నాయని చెబుతుంటే, ఐఎఎస్, ఐపీఎస్ లపై తప్పుడు కేసులు పెట్టి పాలనను దిగాజారుస్తుంటే ఏ నమ్మకంతో పెట్టుబడులు పెడతారు?కాకినాడ బియ్యం నివేదికపైనా ఒత్తిళ్ళు సిగ్గుచేటు:కాకినాడ పోర్ట్‌లో బియ్యం మాఫియాకు సంబంధించి వాస్తవంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా తాము చెప్పిన వారి పేర్లను ఇరికించి, వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఒక ఐపీఎస్ అధికారిని బెదరించిన ఘటనపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తప్పుడు పనులు చేయను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సదరు ఐపీఎస్ అధికారి తెగించి చెప్పడంతో ఆయనతో సెలవు పెట్టించారు.ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక మిగిలిన అధికారులు ఎలా నిస్పక్షపాతంగా పనిచేయగలరు? ఐఎఎస్, ఐపీఎస్ లు తమ ఉద్యోగాలనే వదులుకునే స్థాయిలో వారితో తప్పులు చేయించాలనే విధంగా పాలన సాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలా? ఈ రాష్ట్రంలో లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రజలు జీవించాలని, అధికార యంత్రాంగం పనిచేయాలని నిర్ధేశిస్తున్నారు.చంద్రబాబుకు ఉపయోగపడే వాటికే ప్రాధాన్యతచంద్రబాబుకు తన బినామీల ప్రయోజనాల కోసం అమరావతి, తన సంపాధనకు ఏటీఎంగా ఉన్న పోలవరం, స్పెషల్ ప్యాకేజీ కోసం విశాఖ ఉక్కు. ఇవే చంద్రబాబు ప్రాధన్యతలు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో చూశాం. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు చెబితే జ్యుడీషియల్ క్యాపిటల్ వల్ల ఏం వస్తుందీ, నాలుగు జిరాక్స్ షాప్ వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.మరి ఈరోజు హైకోర్ట్ బెంచ్ పెడితే ఏం వస్తుందో చంద్రబాబు చెప్పాలి? జగన్ గారు చేస్తే అది తప్పు, చంద్రబాబు చేస్తే చాలా గొప్ప కార్యక్రమం. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నారంటే దానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలే కారణం అంటూ కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడించడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ ను జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించారంటే దీనిపై ఎవరూ నోరు విప్పరు.విద్యా వ్యవస్థ నివేదికలను వక్రీకరిస్తున్నారు:ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడిందీ అంటే దానికి కారణం వైఎస్ జగన్. కానీ మొన్న అసర్ నివేదికలో జగన్ గారి హయాంలో విద్యారంగ స్థాయి పడిపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హాయాంలో ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడ్డాయో తేల్చుకునేందుకు ఏ గ్రామానికైనా వెళ్ళి పరిశీలించేందుకు సిద్దం. జగన్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మారుస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 2023 డిసెంబర్ 1వ తేదీన కేంద్రం ఇచ్చిన నివేదికలో స్వచ్చా విద్యాలయం ఇనిషియేటీవ్ కింద ఏపీలో ప్రతి పాఠశాలకు రక్షిత మంచినీటి వసతిని కల్పించారని చాలా స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొంది.దీనిలో బాలురకు 83.55శాతం, బాలికలకు 96.9 శాతం ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదిక తప్పేనని చెబుతారా? వైయస్ జగన్ గారి ప్రభుత్వం జరిగిన ప్రగతిపై కేంద్ర నివేదికలను కూడా వక్రీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మంచిని కూడా అంగీకరించ లేకపోతున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు కూడా భారీ ఎత్తున తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కురసాల కన్నబాబు ఆక్షేపించారు. -
మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజులను మెడికల్ కౌన్సిల్ భారీగా పెంచింది. వైద్య విద్య పూర్తి చేసినవారు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే డాక్టర్‌గా పనిచేసేందుకు అర్హులు. అలాంటి వివిధ రకాల రిజిస్ట్రేషన్ల ఫీజులను సవరించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే సవరించిన ఫీజులు అమలులోకి వస్తాయని కౌన్సిల్ వెల్లడించింది. అయితే 65 ఏళ్లు దాటినవారు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తమ మెడికల్ పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏడాది కాలానికి రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజుకు జీఎస్టీ వసూలు విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఒకవేళ ఉండేట్లయితే 18 శాతం జీఎస్టీని అభ్యర్థులు చెల్లించాలి. కాగా, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పటివరకు రూ. వెయ్యి ఉండగా, దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 2 వేలకు పెంచింది. అలాగే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారికి ప్రొవిజనల్ ఫీజును రూ. వెయ్యి నుంచి ఏకంగా రూ.5 వేలకు పెంచింది. డూప్లికేట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్‌ను రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంచారు. ఇక ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచారు. ఇతర దేశాల్లో చదివి వచ్చిన వారి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. డూప్లికేట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. కాగా, ఫీజుల పెంపును హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండగాని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.కిరణ్‌కుమార్, బాలరాజు నాయుడు, సన్నీ దావిస్, మహ్మద్ జహంగీర్ ఒక ప్రకటనలో ఖండించారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని వారు కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
భూముల ధరలకు రెక్కలు.. ఎకరా కనిష్ట ధర రూ.75 వేలు
మూడు రకాల భూములు, ఆస్తులకు ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ధరలు పెంచాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కేటగిరీల వారీగా ధరలను నిర్ధారించింది. రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇటు మధ్య తరగతి ప్రజానీకానికి భారం పడకుండా ప్రభుత్వ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అప్లోడ్ చేస్తుండగా, వ్యవసాయ భూముల వివరాలను ధరణి పోర్టల్ సాంకేతిక బృందం అప్లోడ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న6 శాతం నుంచి 7.5 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఫీజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు ప్రభుత్వ ధరల సవరణ ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ భూమి కనిష్ట ధర ఎకరం రూ.75 వేలుగా నిర్ధారించారు. సవరించిన ధరలు ఈనెల 20వ తేదీ నుంచి లేదా ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు (జనాభా ప్రాతిపదికన), కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ -1, హెచ్ఎండీఏ-2, జీహెచ్ఎంసీలను యూనిట్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ధరలను ఖరారు చేసింది. వ్యవసాయ భూములను ఐదు కేటగిరీలుగా విభజించింది. వ్యవసాయ భూముల విషయంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)ని గ్రామీణ ప్రాంతాల్లో కలపగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ల పరిధిలో ప్రత్యేక ధరలను నిర్ణయించింది. మూడు రకాలు.. పలు శ్లాబులు వ్యవసాయ భూముల విషయానికి వస్తే ప్రస్తుతం ఎకరాకు కనిష్టంగా రూ.10 వేలు ఉన్న బుక్ వాల్యూను రూ.75 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇదే కనిష్ట ధరగా నిర్ధారణ కానుంది. ఆ తర్వాత శ్లాబులను 30, 40, 50 శాతంగా పెంచారు. ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకున్నారు. లక్షలోపు, లక్షకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు, హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీలతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. లక్షలోపు జనాభా ఉన్న పంచాయతీలకు కనిష్ట ధర చదరపు అడుగుకు రూ.1,000గా ప్రతిపాదించారు. ఖాళీ స్థలాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట ధర చదరపు గజానికి రూ.200, మండల కేంద్రాలు, 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.300, 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.400, వీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో రూ.500, హెచ్ఎండీఏ -1లో రూ.1,500 హెచ్ఎండీఏ-2లో రూ.800, జీహెచ్ఎంసీలో రూ.3 వేలుగా కనిష్ట ధరను నిర్ధారించారు. అన్ని రకాల ప్రాంతాల్లోనూ గరిష్ట ధరను 3- 4 శ్లాబులుగా విభజించారు. ఈ విభజన మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (కమర్షియల్)లో అత్యధికంగా ప్రస్తుతం గజం రూ.65 వేలుగా ఉన్న గరిష్ట ధర పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత రూ.74,500 (30 శాతం) కానుంది. రాష్ట్రంలో చదరపు గజానికి ఇదే అత్యధిక ప్రభుత్వ ధర కానుండడం గమనార్హం. సవరణ కమిటీల ఆమోదం భూముల విలువల సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విలువల సవరణ కమిటీలు శనివారం సమావేశమయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్లు హాజరయ్యారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని భూముల సవరణ ప్రతిపాదనలు కమిటీలు పరిశీలించి వాటికి ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎప్పుడైనా సవరించిన విలువలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రిజిస్ట్రేషన్ల శాఖ చెపుతుండగా, ఈనెల 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ వాయిదా పడితే ఆగస్టు 1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి రావడం ఖాయమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఖాయం! భూముల విలువల సవరణతో పాటు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు కూడా ఖాయమేనని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇందుకు అంగీకరించారని, ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచుతూ నేడో, రేపో ఉత్తర్వులు వస్తాయని సమాచారం. -
ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: దేశీయంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బ్యాటరీ ఆధారిత వాహనాలకు (బీవోవీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ, రెన్యువల్‌కి సంబంధించిన ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునివ్వాలని ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. సాధారణ ప్రజలు, పరిశ్రమవర్గాలు దీనిపై 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. -
రాయితీలతో ‘ఎలక్ట్రిక్’ సవారీ!
సాక్షి, హైదరాబాద్: రోడ్లపైకి విపరీతంగా వచ్చి చేరుతున్న వాహనాలతో చుట్టుముడుతున్న కాలుష్యానికి కళ్లెం వేసే క్రమంలో ఎక్కువ సంఖ్యలో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించటంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పించేందుకు బ్యాటరీ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ఈ–వాహనాలు కొంటే ప్రత్యేక తాయిలాలు ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపొందిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం ఈ మేరకు ప్రకటించ డంతో ఇప్పుడు పాలసీ రూపొందించే బాధ్య తను పరిశ్రమల శాఖ చేపట్టింది. రవాణాశాఖ తో కలసి కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నవి 10 వేలే... రాష్ట్రంలో ప్రస్తుతం నామమాత్రంగానే ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆ సంఖ్య కూడా ఇటీవలి కాలంలోనే పెరిగింది. గత రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రాష్ట్రంలో దాదాపు 23 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని రకాల మోడళ్లు కలుపుకొని 10 వేల వరకు బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను భారీగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్‌లలో రాయితీలు ఇవ్వడం ద్వారా ఈ వాహనాలు కొనేందుకు కొనుగోలుదారులను ప్రోత్సహించనుంది. పెట్టుబడిదారులకూ ఆఫర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిని ఆకట్టుకొనేలా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల తయారీ, బ్యాటరీల తయారీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. ఇలా వివిధ రకాల సంస్థలను ప్రోత్సహించనుంది. నిర్ధారిత కాలానికి, ముందుగా పెట్టుబడి పెట్టే నిర్ధారిత సంఖ్యలోని సంస్థలకు 20 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ డిస్కౌంట్ 25 శాతం, ఎస్జీఎస్టీలో రీయింబర్స్మెంట్ సౌకర్యం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు తదితరాలు అందించనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి కొంత స్థలాన్ని కూడా కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రంగంలో లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, రెండున్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అంచనా. రాయితీలు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర పెద్ద వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలుత దీన్ని నిర్ధారిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. ముందుగా కొనే 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల కార్లు, ఇతర పెద్ద వాహనాలకు దీన్ని వర్తింపచేయాలనుకుంటోంది. ఆ తర్వాత కొనే వాహనాలకు ఆ పన్నును పరిమిత మొత్తంలో వేయాలా లేక రాయితీని కొనసాగించాలా అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మారుమూల పల్లెటూళ్లలోనూ ఆటోరిక్షాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆ కేటగిరీలో కూడా ఢిల్లీ తరహాలో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించనుంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో నూరు శాతం రాయితీలను తొలి 20 వేల ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్ విషయంలోనూ ఇదే తరహా పరిమితులు వర్తించనున్నాయి. -
అన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో విద్యార్థులకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్ ద్వారా సీట్లు లభించిన విద్యార్థులు ఇకపై ఫీజులను చలానా రూపంలో బ్యాంకుల చుట్టూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపడుతోంది. చలానా విధానాన్ని ఈ సారి పూర్తిగా తొలగించి రిజిస్ట్రేషన్ నుంచి మొ దలుకొని ట్యూషన్ ఫీజు వరకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాం కింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇబ్బందులకు చెల్లు చీటీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లు పొందే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. సీట్లు కేటాయించే సమయంలో కనీస ఫీజున్న కాలేజీల్లో మినహా మిగతా కాలేజీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు అదనపు ఫీజులను చలానా జనరేట్ చేసుకొని బ్యాంకులకు వెళ్లి చెల్లించాల్సి వచ్చేది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ రాని ఓసీ విద్యార్థులైతే మొత్తం ఫీజులను ఇలాగే చెల్లించేవారు. అలా మొదటి విడతలో సీటు వచ్చి ఫీజు చెల్లించిన విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎక్కువ ఫీజు ఉన్న మరో కాలేజీలో సీటు వస్తే అదనపు ఫీజును మళ్లీ బ్యాం కులకు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు రెండో విడతలో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీటు వస్తే.. ముందుగా చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అన్ని కౌన్సెలింగ్‌లు, ప్రవేశాలు పూర్తయ్యే వరకు ఆగాల్సి వస్తోంది. అంతేకాదు ఆ మిగతా మొత్తాన్ని తీసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను తొలగించడంతోపాటు అదనపు మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు విద్యార్థులు ఎవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఎక్కువ ఫీజున్న కాలేజీల్లో సీట్లు వస్తే అదనపు ఫీజును ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెండు, మూడు విడతల్లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీల్లో సీటు వస్తే మొదటి విడతలో చెల్లించిన ఫీజులో రెండు, మూడు విడతల్లో సీటు వచ్చిన కాలేజీ ఫీజు పోగా మిగతా మొత్తాన్ని ఆ విద్యార్థి ఆన్లైన్లో చెల్లించిన అకౌంట్‌కే తిరిగి వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా విద్యార్థులు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. -
మద్యం దుకాణాలకు తగ్గిన దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలోని 239 మద్యం దుకాణాలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ ఫీజు రూపేణా రూ.22.80 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కానీ గతసారితో పోల్చితే ఆదాయం పెరిగినా దరఖాస్తుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. గతంలో 6,267 దరఖాస్తులు వచ్చాయి. రెండేళ్ల కాలపరిమితితో అనుమతి కోసం మద్యం దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు గురువారం సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగిసింది. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో మూడు గంటల పాటు గడువు పొడిగించారు. ఎట్టకేలకు 5,323 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటి పరిశీలన కూడా గురువారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. రాత్రి 10 గంటల సమయానికి 3,783 దరఖాస్తులకు ఎంట్రీపాస్ లభించింది. మిగిలిన 1,540 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలకు టెండర్లు వేయవద్దంటూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కొంతమంది ఎక్సైజ్ అధికారులు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేలం ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండలంలో లాటరీ ద్వారా వేలం పాట నిర్వహించనున్నారు. -
గిరిరాజ్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్ : గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల ఏడు నుంచి జూన్ ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 విద్యా సం వత్సరంలో బీకాం, బీఎస్సీ, బీఏలో ప్రవే శం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కళాశాలలో 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఇందుకోసం ఇంటర్ హాల్‌టికెట్ తప్పనిసరిగా జేతచేయూల్సి ఉంటుందన్నారు. అనంత రం www.ggcnzb.infoలో ఆన్లైన్ దరఖా స్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు
-
భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విధివిధానాలను ఖరారు చేసింది. 125 గజాలలోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 125 - 250 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 50 శాతం రాయితీ... 250 - 500 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 75 శాతం రాయతీ... 500 నుంచి ఆపై బడిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి భూమిని క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రోజు సాయంత్రం భూముల క్రమబద్దీకరణపై ఉత్తర్వులు జారీ చేసి అవకాశం ఉందని సమాచారం. -
రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో ఒకవైపు ఉద్యమాలు నడుస్తుండగా, సందట్లో సడేమియాలా ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచింది. కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ రకాల సేవలకు సంబంధించి సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం ఈనెల 26న గెజిట్‌లో ప్రచురించనుంది. ఇవి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్ అగర్వాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రక్త సంబంధీకులకు దానంగా రాసిచ్చే స్థిరాస్తి సెటిల్మెంట్ సహా వివిధ రకాల ఫీజులు పెరిగాయి. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), దస్తావేజు నకళ్ల (సర్టిఫైడ్ కాపీ) ఫీజులు కూడా పెరిగాయి. ప్రస్తుతం రూ.50 ఉన్న సర్టిఫైడ్ కాపీ (సీసీ) ఫీజును ప్రభుత్వం (నాలుగు రెట్లు) రూ. 200కు పెంచింది. ఈసీ (ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ) ఫీజు ప్రస్తుతం రూ. వంద ఉంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం రెండు రకాల ఫీజులు నిర్ణయించింది. 30 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే ఈసీ కోసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. భూమి, ఇళ్లు, ఇంటి స్థలం కొనదలచినవారు తప్పకుండా వాటికి సంబంధించిన ఈసీ, నకళ్లు(సీసీ) తీసుకోవాల్సిందే. సవరణ మరీ భారం: రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు లాంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే(రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే, ఫలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల(రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా రిజిస్ట్రేషన్ తర్వాత దానిని రద్దు (క్యాన్సిలేషన్) చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం అమాంతం పది రెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ. 100 రుసుం ఉండగా వెయ్యికి పెంచింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సవరణ, ఒప్పుదల, రద్దు తలకు మించిన భారమే. అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ హక్కులు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, విల్ ఎంక్వయిరీ, సీల్డ్ కవర్ డిపాజిట్ ఫీజులను రూ.100 నుంచి రూ. వెయ్యికి పెంచింది. సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించిన ఫీజును రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెంచింది. హక్కుదారు కదలలేని పరిస్థితుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం పెట్టించుకునేందుకు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంది. దీనినే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. దీనికి ప్రస్తుత రుసుం రూ. 500 కాగా, దీనిని రెట్టింపు చేసింది. సర్టిఫైడ్ కాపీలు (నకళ్ల) కోసం ప్రస్తుతం రూ. 50 చెల్లిస్తుంటే, ఇకపై రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇవి మరీ భారం: రక్త సంబంధీకులకు స్థిరాస్తి దానంగా కట్టబెడుతూ, సెటిల్మెంటు రాయించేందుకు ప్రస్తుతం రూ. వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఇకపై దీనికోసం స్థిరాస్తి విలువలో 0.5 శాతం (కనిష్టంగా రూ. వెయ్యి గరిష్టంగా రూ. పది వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా కనిష్ట విలువ ఉండదు. అందువల్ల ఈ ఫీజు రూ. వెయ్యి నుంచి రూ. పది వేలకు పెరిగినట్లేనని సబ్ రిజిస్ట్రార్లే చెబుతున్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు రూ. 2 వేలు ఫీజు ఉండగా, ప్రభుత్వం రూ.20 వేలకు పెంచింది. అభివృద్ధి ఒప్పంద ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20 వేలు అని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఒప్పందాలు చేసుకునే స్థిరాస్తి విలువ ఎక్కడైనా కోట్లలోనే ఉంటుంది. అందువల్ల ఈ ఫీజు రెండు వేల నుంచి రూ. 20వేలకు పెరిగినట్లేనని, ఇది బిల్డర్లకు, స్థల యజమానులకు భారమేనని, ఈ ప్రభావం ఇళ్ల కొనుగోలుదారులపైనే పడుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. టైటిల్ డీడ్ల డిపాజిట్ (రుణాలు కావాల్సిన వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు) ఫీజు ప్రస్తుతం ఆస్తి విలువలో 0.1 శాతం గరిష్టంగా రూ వెయ్యి ఉండగా, ప్రభుత్వం దీనిని గరిష్టంగా రూ.10 వేలకు పెంచింది. టైటిల్డీడ్ల విడుదల ఫీజును మాత్రం రూ. వెయ్యికి తగ్గించింది. హక్కు విడుదల దస్తావేజు ఫీజు రూ. వెయ్యి నుంచి రూ. 10వేలకు పెరిగినట్లే. అమ్మకం, డిక్రీ రుసుముల విలువలో 0.5 శాతం యథాతథంగా ఉంటుంది. తనఖా దస్తావేజు రుసుం ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. దొంగదెబ్బ రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడం దొంగదెబ్బ తీయడమేనని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందే అంటున్నారు. గత ఏడాది జూలై 25న ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి పెంపు చాలా ఎక్కువగా ఉందని, ఇది అన్యాయమంటూ మంత్రి తోట నరసింహం వ్యతిరేకించడంతో ప్రభుత్వం పెంపుదలను నిలిపివేసింది. ఇప్పుడు మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం సాగుతోంది. తెలంగాణలో దీనికి వ్యతిరేకంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడం అన్యాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘కర్ణాటకలో స్టాంపు డ్యూటీనే ఒక శాతం ఉంది. ఇక్కడ భారీగా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం అన్యాయం. రిజిస్ట్రేషన్ ఫీజు అంటే సర్వీసు చార్జీనే. ఏ శాఖలోనైనా సర్వీస్ చార్జీ మొత్తం ఆ శాఖ సిబ్బంది జీత భత్యాలకు మించి ఉండరాదని సుప్రీంకోర్టు గతంలో రూలింగ్ ఇచ్చింది. మా శాఖలో సర్వీస్ చార్జి రూపేణా రూ.40 కోట్లుపైగా రాబడి వస్తోంది. జీత భత్యాల కింద ఇచ్చేది రూ. 15 కోట్లు కూడా లేదు’ అని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు.