rishiteswari suicide
-
'తల్లిదండ్రుల వైఖరి మారాలి'
గుంటూరు : విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ వైఖరి మారాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యావ్యవస్థ, కాలేజీ యాజమాన్యాల తీరుపై మంత్రులు గుంటూరు పట్టణంలో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యాల కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టలేమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రత్తిపాటి అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతో పాటు కాలేజీ యాజమాన్యాలూ కారణమేనన్నారు. ఒత్తిడిలేని విద్యావ్యవస్థ కోసం అందరూ ప్రయత్నించాలని మంత్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడంపై విద్యాసంస్థలు దృష్టిపెట్టాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థపై దృష్టిసారించిందన్నారు. -
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
'నా కూతురు కేసును సీబీఐకి ఇవ్వండి'
గుంటూరు: తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను, అర్బన్ ఎస్పీని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు డైరీలో రాసినందున అతడ్ని కూడా విచారించాలని కోరారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు కేసును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ఇవన్నీ పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని కూడా మురళీకృష్ణ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
రిషితేశ్వరిది ప్రభుత్వ హత్య
* అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యురాలు రోజా మండిపాటు * ప్రతిపక్షం శవరాజకీయాలు చేస్తోందని టీడీపీ ఎదురుదాడి సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరిది ప్రభుత్వ హత్యేనని శాసనసభలో బుధవారం విపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు నిప్పులు చెరిగారు. ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో విద్యార్థులు ఆత్మహత్యలను పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్సీపీ సభ్యులు రోజా, ఉప్పులేటి కల్పన, భూమా అఖిలప్రియ, గిడ్డి ఈశ్వరి, చరితారెడ్డి, కళావతి అడిగిన ప్రశ్నపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థులను విచారించ లేదని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చెప్పగా, 87 మంది విద్యార్థులను విచారించిందని హోం మంత్రి చినరాజప్ప, 177 మందిని విచారించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పొంతనలేని వివరాలు చెప్పారు. ప్రశ్న అడిగిన రోజాకు ఈ అంశంపై మొదట మాట్లాడే అవకాశం లభించింది. ర్యాగింగ్, లైంగిక వేధింపుల వల్లే రిషితేశ్వరి చనిపోయిందని చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని విమర్శించారు. రిషితేశ్వరి చావుకు ప్రిన్సిపల్ బాబురావే కారణమని బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. అయినా ప్రిన్సిపల్‌ను ప్రభుత్వ పెద్దలు రక్షిస్తున్నారని అన్నారు. ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత మంత్రులకు యూనివర్సిటీని సందర్శించే సమయం లేకుండా పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా యూనివర్సిటీకి రాలేదన్నారు. మంత్రి గంటా అవమానకరంగా మాట్లాడుతున్నారని, ప్రిన్సిపల్ తప్పున్నట్టుగా కమిటీ చెప్పలేదనడాన్ని రోజా తప్పుబట్టారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మంది విద్యార్థులు చనిపోతే, అందులో 11 మంది నారాయణ కాలేజీల్లోనే మరణించారని చెప్పారు.ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. విపక్షం శవ రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడికి దిగారు. ప్రిన్సిపల్ పాత్ర తేలితే చర్యలు: హోం మంత్రి రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ పాత్ర ఉందని తేలితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ర్యాగింగ్ కమిటీలు లేకపోవడం వాస్తవమే: గంటా విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు లేని మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ర్యాగింగ్ అనే పదాన్ని ఉచ్ఛరించడానికైనా భయపడేలా చర్యలు ఉంటాయన్నారు. మంత్రి గంటా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మ ఘోషించేలా అధికార పక్ష సభ్యులు శాసనసభలో వ్యవహరించారని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే రోజా.. ఇతర సభ్యులు గౌరు చరిత, గిడ్డి ఈశ్వరితో కలిసి బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించడం దారుణమన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కేసు నుంచి తప్పించే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. ప్రిన్సిపల్‌ను కేసు నుంచి తప్పిస్తే తమకు అన్యాయం చేసినట్లేనని రిషితేశ్వరి తండ్రి ఆవేదన చెందుతుంటే... ప్రభుత్వాన్ని అభినందించారని మంత్రి గంటా సభలో నిస్సిగ్గుగా చెప్పుకోవడం దారుణమన్నారు. వియ్యంకుడైన మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్థినుల ఆత్మహత్యలపై మంత్రి గంటా నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. -
'రిషితేశ్వరి' నిందితులకు బెయిల్ నిరాకరణ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది. -
ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబర్..
-
ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి
-
ర్యాగింగ్, లైంగిక వేధింపులే చంపేశాయి
* రిషితేశ్వరి ఆత్మహత్యపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక * ప్రిన్సిపల్ అండతోనే వర్సిటీలో అరాచకాలు, మద్యం * ప్రిన్సిపల్ ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు * అతడిని నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేయాలి * విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విశాఖపట్నంలో మీడియాకు వెల్లడించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది. రిషితేశ్వరి అమాయకురాలని స్పష్టం చేసింది. ప్రిన్సిపాల్ బాబూరావుపై నిందితుడిగా కేసు నమోదు చేయాలని సూచించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, విచారణ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని సూచించింది. మళ్లీ ర్యాగింగ్ జరగకుండా ఉండేలా రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం కన్నా గట్టి చట్టం తీసుకురావాలని నివేదికలో సూచించింది. నాగార్జున వర్సిటీలో ఏ నిబంధనలూ పాటించడం లేదని పేర్కొంది. మహిళా హాస్టల్‌కు పర్మనెంట్ వార్డెన్‌ను నియమించాలని సూచించింది. ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా ఉదయలక్ష్మి నియామకం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మిని నియమించారు. అలాగే ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబర్.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో వర్సిటీల్లోని పరిస్థితులపై అధ్యయనం చేసి వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఏపీలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో లేదా మరెక్కడైనా ర్యాగింగ్ లేదా వేధింపులు చోటుచేసుకున్నా టోల్ ఫ్రీ నంబరు 1800-425-5314కు ఫోన్ చేయాలని మంత్రి గంటా సూచించారు. తద్వారా పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. కమిటీ చేసిన ఇతర ప్రధాన సూచనలు * వర్సిటీ భద్రతపై ఆర్నెల్లకోసారి సమీక్షించాలి. * క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న విద్యార్థులను వర్సిటీలోకి అనుమతించవద్దు. * ఫ్రెషర్స్ డేలను క్యాంపస్‌లోనే నిర్వహించాలి. * క్యాంపస్‌లో మద్యపానం, ధూమపానం నిషేధించాలి. * ర్యాగింగ్ నిరోధ చట్టాన్ని పక్కాగా అమలుచేయాలి. * ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు సైకాలజిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలి. * అన్ని వర్సిటీల్లో పూర్తి వీసీలను నియమించాలి. * ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్తులో మరెలాంటి కోర్సులు చదవకుండా శాశ్వతంగా డీబార్ చేయాలి. * యూనివర్సిటీల్లో పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలి * హాస్టళ్లు, మెస్‌లు, లైబ్రరీల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. -
'రిషితేశ్వరి' నిందితుల బెయిల్ విచారణ వాయిదా
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రుషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ విచారణ ఆగస్టు 10 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా కోర్టు జడ్జి శుక్రవారం ప్రకటించారు. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. అంతకుముందు మృతురాలు తండ్రి ఎం. మురళీకృష్ణ తనను కూడా రికార్డు పరంగా ప్రతివాది తరపున సీనియర్ న్యాయవాది వైకే బుధవారం పిటిషన్ దాఖలు చేయగా అది గురువారం విచారణకు వచ్చింది. అయితే బాధితులు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అందుకు అనుమతించాలనే న్యాయసూత్రాన్ని న్యాయవాది వైకే తన వాదన ద్వారా జడ్జికి విన్నవించారు. వైకే వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి గోపీచంద్ బెయిల్ పిటీషన్లో రెండవ ప్రతివాదిగా మురళీకృష్ణను చేర్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎట్టకేలకు ఫిర్యాదు
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచిపోయినా.. రాష్ట్రమంతా దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగినా స్పందించని నాగార్జున యూనివర్సిటీ వీసీ.. వైఎస్ఆర్సీపీ కమిటీ పర్యటనతో ఎట్టకేలకు కదిలారు. ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారకుడని ఆరోపణలు వస్తున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాదాపు గంటన్నరకు పైగా వీసీ సాంబశివరావు,రిజిస్ర్టార్ రాజశేఖరలతో నిజనిర్ధారణ కమిటీ సమావేశమైంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు యూనివర్సిటీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హాస్టల్‌ను తనిఖీచేసి విద్యార్థులతో పాటు వార్డెన్‌తో మాట్లాడారు. అక్కడ ఉన్న వసతులపై కూడా చర్చించారు. ఇప్పటికి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచినా బాబూరావు మీద అసలు కేసు కూడా పెట్టలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడంతో.. అక్కడే కమిటీ సభ్యుల సమక్షంలోనే తాగి తందనాలాడుతున్న బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ వీసీ ఫిర్యాదు రాసి పెదకాకాని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అందించారు. -
మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా
నాగార్జున వర్సిటీ వీసీని నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు నిజనిర్ధారణ కమిటీ నిలదీతతో స్పందించిన వీసీ ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు వర్సిటీ కమిటీ చైర్మన్ మా చెవిలో కాలిఫ్లవర్ పెట్టారు రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టేశారు రూం గురించిన గొడవతో ఆమె ఆత్మహత్య చేసుకుందట తీవ్రంగా మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టి పారేయడానికి యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆ కమిటీ చైర్మన్ తమ చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు. రిషితేశ్వరి రూంలో సౌకర్యాలు బాగున్నాయని, ఎదురుగా ఉన్న సీనియర్ల రూంలో సౌకర్యాలు అంత సరిగా లేవని.. తాము ఈ రూంలోకి వస్తామని వాళ్లు గొడవ చేయడంతో.. మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని రోజా మండిపడ్డారు. మీ కూతురే ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఫిర్యాదు చేస్తారా, లేక ఇలాగే వదిలేస్తారా అని తాము ప్రశ్నించామన్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని ప్రిన్సిపాల్ గురించి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారా అని తాము నిలదీయడంతో.. అప్పుడు తెల్లకాగితం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని రోజా చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్లక్ష్యం వల్ల, ఇతర మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు పోయాయి. ర్యాగింగ్ భూతం టీడీపీ ప్రభుత్వంలో రెక్కలు విప్పుకొని పిల్లల ప్రాణాలు హరిస్తోంది. ఇది కేవలం నాగార్జున వర్సిటీకి మాత్రమే పరిమితం కాదని మొన్నే చెప్పాం. నిన్న వట్టిచెరుకూరులో సునీత అనే మరో విద్యార్థిని ర్యాగింగ్ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుంది. కాలేజిలోనే ఒక పెట్రోలింగ్ వాహనం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎవరైనా ర్యాగింగ్ గురించి ఓరల్ గా చెప్పినా కూడా చర్య తీసుకోవాలని కోరాం. బాబూరావును ఎ1గా ప్రకటించి వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ, విద్యార్థి, మహిళా విభాగాలు రిషితేశ్వరికి న్యాయం జరగాలని ఇక్కడకు వచ్చాయి. ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని తెలిసింది. వీసీతో మాట్లాడితే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం కేసును నీరుగార్చాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసింది. ఎన్ని ప్రాణాలు పోతున్నా. వీసీ మాత్రం ఆయనకు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగితే, పోలీసులే చూసుకుంటారన్నారు. లెక్చరర్లను కూడా లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రిన్సిపాల్ బాబూరావు హాయ్ ల్యాండ్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదంటారు వీసీ. అసలు ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాంపౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లినందుకు కేసు పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. డేవిడ్ రాజు లాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు గట్టిగా అడుగుతున్నారని ఆయన్ను ఇక్కడినుంచి తరిమేసిన విషయం నిజం కాదా అని అడుగుతున్నాము. డేవిడ్ రాజును తరిమేయడానికి, పిల్లల్ని అరెస్టు చేయించడానికి హక్కులున్నాయి గానీ.. ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసే హక్కు లేదా అని అడుగుతున్నాం. రిషితేశ్వరి మరణానికి ప్రిన్సిపాలే ప్రత్యక్షంగా కారణం. -
’ర్యాగింగ్ బాద్యులపై చర్యలేవి ?'
-
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
-
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావు విద్యార్థులతో కలిసి తాగారని, ఒక రకంగా ఆయనవల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని నాగార్జున యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం నాడు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఆడపిల్లలకు రక్షణ లేదని ఉన్నతాధికారులకు ఇంతకుముందు ఫ్యాకల్టీ అంతా కలిసి ఫిర్యాదు చేశాం. కానీ, మా ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నట్లు మాకైతే ఎప్పుడూ కనిపించలేదు. ఫ్రెషర్స్ డే పార్టీలో జరిగిన అవమానాల గురించి కూడా డైరీలో రాసుకుంది కదా.. దాంట్లో చాలా ఉన్నాయి. ఫ్రెషర్స్ డే పార్టీకి ఒక్క ప్రిన్సిపాల్ బాబూరావు మాత్రమే వెళ్లారు. వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్లలేదు మిగిలిన ఫ్యాకల్టీ కూడా వెళ్లి ఉంటే విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేసేవాళ్లు కారు ప్రిన్సిపాల్ తానొక్కరే వెళ్లాలని అనుకోవడం వల్లే ఇలా జరిగింది. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది.. అక్కడ చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు రోజూ యూనివర్సిటీకి ఆయన ఎలా వచ్చేవారు, ఆరోజు పార్టీకి ఎలా వెళ్లారు? ఆరోజు వేసుకున్న డ్రస్ ఎలా ఉంది, అసలు ఎందుకు తాగాల్సి వచ్చింది? రోజూ తాగి వస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నా.. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు విద్యార్థులతో కలిసి తాగడం ఎందుకు? ఆయన మద్యం తాగి వస్తున్నారని మేం లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాం. చివరిదశలో.. 2014 మార్చిలో గవర్నర్‌కు కూడా మెయిల్ పంపించాం. అప్పట్లో ప్రిన్సిపాల్ చెక్ పవర్ తీసేశారు. కానీ తర్వాత మళ్లీ ఆ చెక్ పవర్ ఇచ్చేశారు కులం ముసుగులోనే ప్రిన్సిపాల్ ఇలా ఇదంతా చేస్తున్నారు ఆయన మాట వినడంలేదని నన్ను ఆయన హెచ్చరించారు. మాట వినకపోతే దెబ్బతింటావని అన్నారు అనధికారికంగా తనకు నచ్చినచోట ఫ్రెషర్స్ డే పార్టీ చేయడమే రిషితేశ్వరి మరణానికి ఒక రకంగా కారణమైంది. విద్యార్థులు తాగి విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. ప్రిన్సిపాల్ చేసే అసభ్య కార్యకలాపాలు యూనివర్సిటీలో అయితే వెంటనే తెలిసిపోతాయి కాబట్టి, దాచేందుకే వేదిక మార్చారు ఆ విషయాన్ని ఫ్యాకల్టీ ఎవరికీ కనీసం తెలియజెప్పలేదు కూడా. చాలామంది పిల్లలు ప్రిన్సిపాల్ ప్రవర్తన గురించి మా దగ్గర బాధపడి, ఏడ్చారు. ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడతారని చెప్పారు. డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనక నుంచి చేతులు వేస్తారని బాధపడ్డారు. -
రిషితేశ్వరి మృతిపై 10న తుది నివేదిక
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి విశాఖపట్నం: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి నివేదిక సిద్ధం కానున్నట్లు రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక సిద్ధమైందని తెలిపారు. ఏయూలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ విషయాలను వివరించారు. రిషితేశ్వరి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఘటనపై గంటన్నర పాటు చర్చించినట్లు తెలిపారు. రిషితేశ్వరి తల్లిదండ్రుల్లో ఎంతో బాధ్యత కనిపించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు వివరించారు. కళాశాలల ప్రవేశ సమయంలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ర్యాగింగ్‌కు పాల్పడబోననే అఫిడవిట్‌ను తీసుకోనున్నట్లు వివరించారు. -
రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షలు, స్థలం
-
రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షలు, స్థలం
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో చదువుతూ సీనియర్ల ర్యాగింగ్, ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఆ కుటుంబానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం కూడా ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, ప్రిన్సిపల్ సహా ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మంత్రివర్గం నుంచి ఇలా తాయిలాలు ఇస్తూ నిర్ణయం వెలువడటం గమనార్హం. -
సీఎం క్యాంప్ అఫీసు ముందు విద్యార్ధుల అందోళన
-
రిషితేశ్వరికి న్యాయం చేయాలంటూ అందోళన