నైపుణ్యంతోనే ప్రమాదాల నివారణ
- అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి
- ప్రమాద రహిత రీజియన్‌గా మారుద్దాం
- ఆర్ఎం బ్రహ్మానంద రెడ్డి
అనంతపురం న్యూసిటీ: నైపుణ్యంతోనే ప్రమాదాలు నివారించవచ్చని అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి అన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన 12 మంది ఉత్తమ డ్రైవర్లకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపరాదన్నారు.
మీ కుటుంబంతో పాటు 50 మంది ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని మరువరాదన్నారు. ఆర్ఎం బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రమాద రహిత రీజియన్‌గా తీర్చిద్దిడంలో ప్రతి ఒ క్కరూ ముందుకురావాలన్నారు. విధులకు వెళ్లే వారికి రూట్ మ్యాప్‌ను అందజేయనున్నామన్నారు. వారం రోజుల పాటు డ్రైవర్లకు పలు అంశాల్లో శిక్షణనిస్తామన్నారు. డెప్యూటీ సీటీఎం జితేంద్ర రెడ్డి, సీఎంఈ జగదీష్, అసిస్టెంట్ మేనేజర్ గౌడ్, ఎస్ఎం శ్రీనివాసులు, కంట్రోలర్లు పాల్గొన్నారు.
ఉత్తమ డ్రైవర్లు...
రెహ్మాన్ (అనంతపురం), నిజాం(గుత్తి), గోపాల్ (గుంతక ల్లు), గోవిందు (కణ్యాలదుర్గం), శేఖర్ (రాయదురగం) రాజు(తాడిపత్రి), ముత్తూజ(ఉరవకొండ), మల్లేశ్ (ధర్మవరం), నాయక్ (హిందూపురం), ఆంజనేయులు (కదిరి), ఖాన్ (పట్టపర్తి), నాయక్ (మడకశిర)