కత్తితో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సిర్పూర్(టి) మండలకేంద్రంలోని జైభీంనగర్ కాలనీ దారుణం చోటుచే సుకుంది. రఘనాథ్(40) అనే వ్యక్తి తన భార్యపై కత్తితో దాడికి దిగాడు. అనంతరం ఇంటి వెనకాల దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన భార్య రుక్మాబాయి(34)ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.