Sachin Siwatch
-
World Boxing Championships: ప్రిక్వార్టర్స్‌లో సచిన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్ సివాచ్ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్ కుమార్ (92 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. తొలి రౌండ్ బౌట్లో ప్రపంచ మాజీ యూత్ చాంపియన్ సచిన్ 5–0తో సెర్గీ నొవాక్ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్ 0–5తో రేయస్ (స్పెయిన్) చేతిలో... గోవింద్ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్ (జార్జియా) చేతిలో ఓడిపోయారు. -
బాక్సర్ సచిన్‌కు రజతం
బ్యాంకాక్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకైక రజతం గెల్చుకుంది. ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో సచిన్ 0–5తో సమందర్ ఖోల్మురోడోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఓ రజతం, ఐదు కాంస్యాలతో సరిపెట్టుకుంది. వరుసగా రెండో ఎడిషన్‌లో కూడా భారత్‌కు స్వర్ణం దక్కలేదు. అంకిత్ కుమార్ (60 కేజీలు), నవీన్ బూరా (69 కేజీలు), హర్ష్ప్రీత్ సరావత్ (+91 కేజీలు), మొహమ్మద్ ఖాన్ (56 కేజీలు), సచిన్ (75 కేజీలు) తమ విభాగాల్లో జరిగిన సెమీస్‌లో పరాజయం పాలై కాంస్యాలు సాధించారు.