బ్యాంకాక్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకైక రజతం గెల్చుకుంది. ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో సచిన్ 0–5తో సమందర్ ఖోల్మురోడోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఓ రజతం, ఐదు కాంస్యాలతో సరిపెట్టుకుంది. వరుసగా రెండో ఎడిషన్‌లో కూడా భారత్‌కు స్వర్ణం దక్కలేదు. అంకిత్ కుమార్ (60 కేజీలు), నవీన్ బూరా (69 కేజీలు), హర్ష్‌ప్రీత్ సరావత్ (+91 కేజీలు), మొహమ్మద్ ఖాన్ (56 కేజీలు), సచిన్ (75 కేజీలు) తమ విభాగాల్లో జరిగిన సెమీస్‌లో పరాజయం పాలై కాంస్యాలు సాధించారు.
బాక్సర్ సచిన్‌కు రజతం
Published Sat, Jul 8 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement