రాష్ట్రాన్ని ఏ శక్తి విడదీయలేదు: లగడపాటి
విజయనగరం: రాష్ట్రాన్ని ఏ శక్తి విడదీయలేదు అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా ఉండను అని లగడపాటి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు విషయంలో అసెంబ్లీలో జరిగిందే పార్లమెంటులోనూ జరుగుతుంది ఆయన జోస్యం చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఫిబ్రవరి 9న సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో లక్ష మందితో 5 కి.మీ.సమైక్య రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని లగడపాటి తెలిపారు. ఫిబ్రవరి 9న నిర్వహించే సమైక్య రన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని లగడపాటి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.