క్యాబ్ ఎక్కితే విమానం మోతే
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్ర యాణికులపై భారీగా భారం పడనుంది. ప్ర యాణికులను చేరవేసే ప్రీపెయిడ్ క్యాబ్స్ చా ర్జీలు పెరిగాయి. ఇవి వెంటనే అమల్లోకి రానున్నాయి. పోలీసులు, ఎయిర్పోర్ట్ అథారిటీ సం యుక్తంగా నిర్వహించే ప్రీపెయిడ్ బూత్‌ల ద్వా రా ఈ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తారు. చార్జీల పెంపుతో పాటు ప్రీపెయిడ్ బూత్‌ల నిర్వహణ పేరుతో మరో రూ.30 మేర భారం మోపుతూ రవాణాశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది.
ట్యాక్సీలు ఈ నిబంధనలు పాటించాలి
ట్యాక్సీ 8 ఏళ్లకు మించినదై ఉండరాదు
వాహన సామర్థ్యం 1000 సీసీ, అంత కంటే ఎక్కువ ఉండవచ్చు
ట్యాక్సీలను ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ పోలీసులు నిర్ధేశించిన చోటనే నిలపాలి
లగేజీ బ్యాగులపైన రూ.20 చొప్పున చార్జీ
డ్రైవర్లు ప్రయాణికులను గమ్యానికి చేర్చాక విధిగా వారి సంతకం తీసుకోవాలి. దాన్ని ప్రీపెయిడ్ కౌంటర్లో అందజేయాలి
ట్యాక్సీడ్రైవర్లు తెల్లటి యూనిఫామ్ ధరించాలి. ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరి
డాష్‌బోర్డుపై లెసైన్స్, పర్మిట్, ట్యాక్సీ డ్రైవర్ గుర్తింపు కార్డు విధిగా ఉండాలి
ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేసేందుకు వాహనం నలువైపులా బీఎస్ఎన్ఎల్ టోల్‌ఫ్రీ నెంబర్ 1074 రాయాలి
‘ప్రీపెయిడ్ ట్యాక్సీ’ బోర్డును రాత్రి వేళల్లోనూ కనిపించేలా ఏర్పాటు చేయాలి.